లూకా సువార్త 19 : 1 (TEV)
ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవే శించి
లూకా సువార్త 19 : 2 (TEV)
దానిగుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు
లూకా సువార్త 19 : 3 (TEV)
యేసు ఎవరోయని చూడగోరెనుగాని, పొట్టి వాడైనందున జనులు గుంపుకూడి యుండుట వలన చూడ లేకపోయెను.
లూకా సువార్త 19 : 4 (TEV)
అప్పుడు యేసు ఆ త్రోవను రానై యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి, ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను.
లూకా సువార్త 19 : 5 (TEV)
యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, కన్నులెత్తి చూచిజక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ యింట నుండవలసియున్నదని అతనితో చెప్పగా
లూకా సువార్త 19 : 6 (TEV)
అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను.
లూకా సువార్త 19 : 7 (TEV)
అందరు అది చూచి ఈయన పాపియైన మనుష్యునియొద్ద బసచేయ వెళ్లెనని చాల సణుగుకొనిరి.
లూకా సువార్త 19 : 8 (TEV)
జక్కయ్య నిలువబడిఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను; నేనెవనియొద్ద నైనను అన్యాయముగా దేనినైనను తీసికొనినయెడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పెను.
లూకా సువార్త 19 : 9 (TEV)
అందుకు యేసుఇతడును అబ్రాహాము కుమారుడే; ఎందుకనగా నేడు ఈ యింటికి రక్షణ వచ్చియున్నది.
లూకా సువార్త 19 : 10 (TEV)
నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను.
లూకా సువార్త 19 : 11 (TEV)
వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూష లేమునకు సమీపమున ఉండుటవలనను, దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుటవలనను, ఆయన మరియొక ఉపమానము చెప్పెను. ఏమనగా,
లూకా సువార్త 19 : 12 (TEV)
రాజ కుమారుడొక రాజ్యము సంపాదించుకొని మరల రావలె నని దూరదేశమునకు ప్రయాణమై
లూకా సువార్త 19 : 13 (TEV)
తన దాసులను పది మందిని పిలిచి వారికి పది మినాల నిచ్చి నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పెను.
లూకా సువార్త 19 : 14 (TEV)
అయితే అతని పట్టణ స్థులతని ద్వేషించిఇతడు మమ్ము నేలుట మా కిష్టము లేదని అతని వెనుక రాయబారము పంపిరి.
లూకా సువార్త 19 : 15 (TEV)
అతడా రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు, ప్రతివాడును వ్యాపారమువలన ఏమేమి సంపాదించెనో తెలిసికొనుటకై తాను సొమి్మచ్చిన దాసులను తనయొద్దకు పిలువుమని ఆజ్ఞాపించెను.
లూకా సువార్త 19 : 16 (TEV)
మొదటివాడాయన యెదుటికి వచ్చి అయ్యా, నీ మినావలన పది మినాలు లభించెనని చెప్పగా
లూకా సువార్త 19 : 17 (TEV)
అతడు భళా, మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక పది పట్టణముల మీద అధికారివై యుండుమని వానితో చెప్పెను.
లూకా సువార్త 19 : 18 (TEV)
అంతట రెండవవాడు వచ్చి అయ్యా, నీ మినావలన అయిదు మినాలు లభించెననగా
లూకా సువార్త 19 : 19 (TEV)
అతడు నీవును అయిదు పట్టణములమీద ఉండుమని అతనితో చెప్పెను.
లూకా సువార్త 19 : 20 (TEV)
అంతట మరియొకడు వచ్చి అయ్యా, యిదిగో నీ మినా;
లూకా సువార్త 19 : 21 (TEV)
నీవు పెట్టనిదానిని ఎత్తికొనువాడవును, విత్తనిదానిని కోయు వాడవునైన కఠినుడవు గనుక, నీకు భయ పడి దీనిని రుమా లున కట్టి ఉంచితినని చెప్పెను.
లూకా సువార్త 19 : 22 (TEV)
అందుకతడు చడ్డ దాసుడా, నీ నోటి మాటనుబట్టియే నీకు తీర్పు తీర్చుదును; నేను పెట్టనిదానిని ఎత్తు వాడను, విత్తనిదానిని కోయు వాడనునైన కఠినుడనని నీకు తెలిసియుండగా
లూకా సువార్త 19 : 23 (TEV)
నీవెందుకు నా సొమ్ము సాహుకారులయొద్ద నుంచలేదు? అట్లు చేసి యుండినయెడల నేను వచ్చి వడ్డితో దానిని తీసికొందునే అని వానితో చెప్పి
లూకా సువార్త 19 : 24 (TEV)
వీనియొద్దనుండి ఆ మినా తీసివేసి పది మినాలు గలవాని కియ్యుడని దగ్గర నిలిచినవారితో చెప్పెను.
లూకా సువార్త 19 : 25 (TEV)
వారు అయ్యా, వానికి పది మినాలు కలవే అనిరి.
లూకా సువార్త 19 : 26 (TEV)
అందుకతడుకలిగిన ప్రతివానికిని ఇయ్య బడును, లేనివానియొద్దనుండి వానికి కలిగినదియు తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను.
లూకా సువార్త 19 : 27 (TEV)
మరియు నేను తమ్మును ఏలు టకు ఇష్టములేని నా శత్రువులను ఇక్కడికి తీసికొనివచ్చి నాయెదుట సంహరించుడని చెప్పెను.
లూకా సువార్త 19 : 28 (TEV)
యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ల వలెనని ముందు సాగిపోయెను.
లూకా సువార్త 19 : 29 (TEV)
ఆయన ఒలీవలకొండదగ్గరనున్న బేత్పగే బేతనియ అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు, తన శిష్యుల నిద్దరిని పిలిచి
లూకా సువార్త 19 : 30 (TEV)
మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడియున్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును; దానిమీద ఏ మనుష్యుడును ఎన్నడు కూర్చుండలేదు
లూకా సువార్త 19 : 31 (TEV)
ఎవరైననుమీరెందుకు దీని విప్పు చున్నారని మిమ్ము నడిగినయెడల ఇది ప్రభువునకు కావలసియున్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను.
లూకా సువార్త 19 : 32 (TEV)
పంపబడిన వారు వెళ్లి, ఆయన తమతో చెప్పినట్టే కనుగొని
లూకా సువార్త 19 : 33 (TEV)
ఆ గాడిదపిల్లను విప్పుచుండగా దాని యజమానులుమీరు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారి నడిగిరి.
లూకా సువార్త 19 : 34 (TEV)
అందుకు వారు ఇది ప్రభువునకు కావలసియున్నదనిరి.
లూకా సువార్త 19 : 35 (TEV)
తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి, ఆ గాడిదపిల్ల మీద తమ బట్టలువేసి, యేసును దానిమీద ఎక్కించి,
లూకా సువార్త 19 : 36 (TEV)
ఆయన వెళ్లుచుండగా తమ బట్టలు దారిపొడుగున పరచిరి.
లూకా సువార్త 19 : 37 (TEV)
ఒలీవలకొండనుండి దిగుచోటికి ఆయన సమీపించు చున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు
లూకా సువార్త 19 : 38 (TEV)
ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటినిగూర్చి మహా శ
లూకా సువార్త 19 : 39 (TEV)
ఆ సమూ హములో ఉన్న కొందరు పరిసయ్యులుబోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా
లూకా సువార్త 19 : 40 (TEV)
ఆయన వారిని చూచివీరు ఊరకుండినయెడల ఈ రాళ్లు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాననెను.
లూకా సువార్త 19 : 41 (TEV)
ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై యేడ్చి
లూకా సువార్త 19 : 42 (TEV)
నీవును ఈ నీ దినమందైనను సమాధానసంబంధమైన సంగతులను తెలిసికొనినయెడల నీకెంతో మేలు; గాని యిప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడియున్నవి.
లూకా సువార్త 19 : 43 (TEV)
(ప్రభువు) నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టు గట్టు కట్టి ముట్టడివేసి, అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి, నీలోనున్న నీ పిల్లలతో కూడ నిన్ను నేల కలిపి
లూకా సువార్త 19 : 44 (TEV)
నీలో రాతిమీద రాయి నిలిచియుండ నియ్యని దినములు వచ్చునని చెప్పెను.
లూకా సువార్త 19 : 45 (TEV)
ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో విక్ర యము చేయువారితో నా మందిరము ప్రార్థన మందిరము అని వ్రాయబడియున్నది.
లూకా సువార్త 19 : 46 (TEV)
అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరని చెప్పి వారిని వెళ్లగొట్ట నారంభించెను.
లూకా సువార్త 19 : 47 (TEV)
ఆయన ప్రతిదినమును దేవాలయములో బోధించు చున్నప్పుడు, ప్రధానయాజకులును శాస్త్రులును ప్రజలలో ప్రధానులును ఆయనను నాశనముచేయ జూచుచుండిరి గాని
లూకా సువార్త 19 : 48 (TEV)
ప్రజలందరు ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని యుండిరి గనుక ఏమి చేయవలెనో వారికి తోచలేదు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48

BG:

Opacity:

Color:


Size:


Font: