లూకా సువార్త 20 : 1 (TEV)
ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయములో ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటించుచున్నప్పుడు ప్రధానయాజకులును శాస్త్రులును పెద్దలతోకూడ ఆయన మీదికివచ్చి
లూకా సువార్త 20 : 2 (TEV)
నీవు ఏ అధికారమువలన ఈ కార్యము చేయుచున్నావో, యీ అధికారము నీ కెవడు ఇచ్చెనో మాతో చెప్పుమని ఆయనను అడిగిరి.
లూకా సువార్త 20 : 3 (TEV)
అందుకాయననేనును మిమ్మును ఒక మాట అడుగుదును, అది నాతో చెప్పుడి.
లూకా సువార్త 20 : 4 (TEV)
యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా మనుష్యులనుండి కలిగినదా? అని వారి నడుగగా
లూకా సువార్త 20 : 5 (TEV)
వారు మనము పరలోకమునుండి కలిగినదని చెప్పినయెడల--ఆలా గైతే మీ రెందుకతని నమ్మలేదని ఆయన మనలను అడుగును.
లూకా సువార్త 20 : 6 (TEV)
మనుష్యులవలన కలిగినదని చెప్పినయెడల ప్రజలందరు మనలను రాళ్లతో కొట్టుదురు; ఏలయనగా యోహాను ప్రవక్త అని అందరును రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని
లూకా సువార్త 20 : 7 (TEV)
అది ఎక్కడనుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరమిచ్చిరి.
లూకా సువార్త 20 : 8 (TEV)
అందుకు యేసుఏ అధికారమువలన ఈ కార్యములు చేయుచున్నానో నేను మీతో చెప్పననివారి తోననెను.
లూకా సువార్త 20 : 9 (TEV)
అంతట ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్ప సాగెను ఒక మనుష్యుడు ద్రాక్షతోట నాటించి, కాపులకు గుత్తకిచ్చి, దేశాంతరముపోయి బహుకాల ముండెను.
లూకా సువార్త 20 : 10 (TEV)
పంటకాలమందు అతడు ఆ ద్రాక్షతోట పంటలో తన భాగమిమ్మని ఆ కాపులయొద్ద కొక దాసుని పంపగా ఆ కాపులు వానిని కొట్టి వట్టిచేతులతో పంపి వేసిరి.
లూకా సువార్త 20 : 11 (TEV)
మరల అతడు మరియొక దాసుని పంపగా వారు వానిని కొట్టి అవమానపరచి, వట్టిచేతులతో పంపివేసిరి.
లూకా సువార్త 20 : 12 (TEV)
మరల నతడు మూడవవాని పంపగా వారు వానిని గాయ పరచి వెలుపలికి త్రోసివేసిరి.
లూకా సువార్త 20 : 13 (TEV)
అప్పుడా ద్రాక్షతోట యజమానుడునేనేమి చేతును? నా ప్రియకుమారుని పంపుదును; ఒక వేళ వారు అతని సన్మానించెద రను కొనెను.
లూకా సువార్త 20 : 14 (TEV)
అయినను ఆ కాపులు అతనిని చూచిఇతడు వారసుడు; ఈ స్వాస్థ్యము మనదగునట్లు ఇతని చంపుదము రండని యొకరితో నొకరు ఆలోచించుకొని
లూకా సువార్త 20 : 15 (TEV)
అతనిని ద్రాక్షతోట వెలుపలికి త్రోసివేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్షతోట యజమానుడు వారికేమి చేయును?
లూకా సువార్త 20 : 16 (TEV)
అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్షతోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా వారు విని అట్లు కాకపోవును గాకనిరి.
లూకా సువార్త 20 : 17 (TEV)
ఆయన వారిని చూచి ఆలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను అని వ్రాయబడిన మాట ఏమిటి?
లూకా సువార్త 20 : 18 (TEV)
ఈ రాతిమీద పడు ప్రతివాడును తునకలై పోవును; గాని అది ఎవనిమీద పడునో వానిని నలిచేయుననెను.
లూకా సువార్త 20 : 19 (TEV)
ప్రధానయాజకులును శాస్త్రులును తమ్మునుగూర్చి ఈ ఉపమానము ఆయన చెప్పెనని గ్రహించి, ఆ గడియలోనే ఆయనను బలాత్కారముగా పట్టుకొన సమయము చూచిరి గాని జనులకు భయపడిరి.
లూకా సువార్త 20 : 20 (TEV)
వారాయనను కనిపెట్టుచు, అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటలయందు తప్పు పట్టవలెనని, తాము నీతిమంతులని అనిపించుకొను వేగుల వారిని ఆయనయొద్దకు పంపిరి.
లూకా సువార్త 20 : 21 (TEV)
వారు వచ్చిబోధకుడా, నీవు న్యాయముగా మాటలాడుచును బోధించుచు నున్నావు; నీ వెవని యందును మోమోటము లేక సత్యము గానే దేవుని మార్గమును బోధించుచున్నావని యెరుగు దుము.
లూకా సువార్త 20 : 22 (TEV)
మనము కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయన నడిగిరి.
లూకా సువార్త 20 : 23 (TEV)
ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగిఒక దేనారము నాకు చూపుడి.
లూకా సువార్త 20 : 24 (TEV)
దీనిమీది రూపమును పైవ్రాతయు ఎవనివని అడుగగా వారు కైసరు వనిరి.
లూకా సువార్త 20 : 25 (TEV)
అందుకాయనఆలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను.
లూకా సువార్త 20 : 26 (TEV)
వారు ప్రజలయెదుట ఈ మాటలో తప్పు పట్ట నేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఊరకుండిరి.
లూకా సువార్త 20 : 27 (TEV)
పునరుత్థానము లేదని చెప్పెడి సద్దూకయ్యులు కొందరు ఆయనయొద్దకు వచ్చి ఆయనను ఇట్లడిగిరి.
లూకా సువార్త 20 : 28 (TEV)
బోధకుడా, భార్య బ్రదికియుండగా ఒకని సహోదరుడు సంతానము లేక చనిపోయినయెడల, అతని సహోదరు డతని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతానము కలుగజేయ వలె
లూకా సువార్త 20 : 29 (TEV)
యేడుగురు సహోదరు లుండిరి. మొదటివాడొక స్త్రీని పెండ్లి చేసికొని సంతానము లేక చనిపోయెను.
లూకా సువార్త 20 : 30 (TEV)
రెండవవాడును మూడవవాడును ఆమెను పెండ్లిచేసికొనిరి.
లూకా సువార్త 20 : 31 (TEV)
ఆ ప్రకారమే యేడుగురును ఆమెను పెండ్లాడి సంతానములేకయే చని పోయిరి. పిమ్మట ఆ స్త్రీయు చనిపోయెను.
లూకా సువార్త 20 : 32 (TEV)
కాబట్టి పునరుత్థానమందు ఆమె వారిలో ఎవనికి భార్యగా ఉండును?
లూకా సువార్త 20 : 33 (TEV)
ఆ యేడుగురికిని ఆమె భార్యగా ఉండెను గదా అనిరి.
లూకా సువార్త 20 : 34 (TEV)
అందుకు యేసుఈ లోకపు జనులు పెండ్లిచేసికొందురు,పెండ్లికియ్యబడుదురు గాని
లూకా సువార్త 20 : 35 (TEV)
పరమును మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులని యెంచ బడినవారు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్య బడరు.
లూకా సువార్త 20 : 36 (TEV)
వారు పునరుత్థానములో పాలివారైయుండి,3 దేవదూత సమా నులును దేవుని కుమారులునై యుందురు గనుక వారికను చావనేరరు.
లూకా సువార్త 20 : 37 (TEV)
పొదనుగురించిన భాగములోప్రభువు అబ్రాహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పుచు,
లూకా సువార్త 20 : 38 (TEV)
మృతులు లేతురని మోషే సూచించెను; ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడు; ఆయన దృష్టికి అందరును జీవించు చున్నారని వారికి ఉత్తరమిచ్చెను.
లూకా సువార్త 20 : 39 (TEV)
తరువాత వారాయ నను మరేమియు అడుగ తెగింపలేదు గనుక శాస్త్రులలో కొందరు బోధకుడా,
లూకా సువార్త 20 : 40 (TEV)
నీవు యుక్తముగా చెప్పితివనిరి.
లూకా సువార్త 20 : 41 (TEV)
ఆయన వారితోక్రీస్తు దావీదు కుమారుడని జను లేలాగు చెప్పుచున్నారు
లూకా సువార్త 20 : 42 (TEV)
నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచువరకు నీవు నాకుడిపార్శ్వమున కూర్చుండు మని
లూకా సువార్త 20 : 43 (TEV)
ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. అని కీర్తనల గ్రంథములో దావీదే చెప్పియున్నాడు.
లూకా సువార్త 20 : 44 (TEV)
దావీదు ఆయనను ప్రభువని చెప్పినయెడల ఆయన ఏలాగు అతని కుమారుడగునని చెప్పెను.
లూకా సువార్త 20 : 45 (TEV)
ప్రజలందరు వినుచుండగా ఆయన ఇట్లనెనుశాస్త్రులను గూర్చి జాగ్రత్తపడుడి. వారు నిలువుటంగీలు ధరించు కొని తిరుగగోరుచు
లూకా సువార్త 20 : 46 (TEV)
సంతవీధులలో వందనములను, సమాజమందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్ర స్థానములను కోరుదురు.
లూకా సువార్త 20 : 47 (TEV)
వారు విధవరాండ్ర యిండ్లను దిగమింగుచు, మాయవేషముగా దీర్ఘప్రార్థనలు చేయుదురు. వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పెను.
❮
❯