లూకా సువార్త 21 : 1 (TEV)
కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను.
లూకా సువార్త 21 : 2 (TEV)
ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయుచుండగా చూచి
లూకా సువార్త 21 : 3 (TEV)
ఈ బీద విధవరాలు అందరికంటె ఎక్కువ వేసెనని మీతో నిజముగా చెప్పుచున్నాను.
లూకా సువార్త 21 : 4 (TEV)
వారందరు తమకు కలిగిన సమృద్ధిలోనుండి కానుకలు వేసిరిగాని యీమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసెనని వారితో చెప్పెను.
లూకా సువార్త 21 : 5 (TEV)
కొందరుఇది అందమైన రాళ్లతోను అర్పితముల తోను శృంగారింపబడియున్నదని దేవాలయమును గూర్చి, మాటలాడుచుండగా
లూకా సువార్త 21 : 6 (TEV)
ఆయన ఈ కట్టడములు మీరు చూచుచున్నారే, వాటిలో రాతిమీద రాయి యుండ కుండ అవి పడద్రోయబడు దినములు వచ్చు చున్నవని చెప్పెను.
లూకా సువార్త 21 : 7 (TEV)
అప్పుడు వారుబోధకుడా, ఆలాగైతే ఇవి యెప్పుడు జరుగును? ఇవి జరుగబోవు నని సూచన ఏమని ఆయన నడుగగా
లూకా సువార్త 21 : 8 (TEV)
ఆయన మీరు మోసపోకుండ చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చినేనే ఆయనననియు, కాలము సమీపించెననియు చెప్పుదురు; మీరు వారి వెంబడిపోకుడి.
లూకా సువార్త 21 : 9 (TEV)
మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినినప్పుడు జడియకుడి; ఇవి మొదట జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదని చెప్పెను.
లూకా సువార్త 21 : 10 (TEV)
మరియు ఆయన వారితో ఇట్లనెనుజనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును;
లూకా సువార్త 21 : 11 (TEV)
అక్క డక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్లును కరవు లును తటస్థించును, ఆకాశమునుండి మహా భయోత్పాత ములును గొప్ప సూచనలును పుట్టును.
లూకా సువార్త 21 : 12 (TEV)
ఇవన్నియు జరుగక మునుపు వారు మిమ్మును బలాత్కారముగా పట్టి, నా నామము నిమిత్తము మిమ్మును రాజులయొద్దకును అధి పతుల యొద్దకును తీసికొనిపోయి, సమాజమందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు.
లూకా సువార్త 21 : 13 (TEV)
ఇది సాక్ష్యా ర్థమై మీకు సంభవించును.
లూకా సువార్త 21 : 14 (TEV)
కాబట్టి మేమేమి సమాధా నము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనస్సులో నిశ్చయించుకొనుడి.
లూకా సువార్త 21 : 15 (TEV)
మీ విరోధు లందరు ఎదురాడుటకును, కాదనుటకును వీలుకాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును.
లూకా సువార్త 21 : 16 (TEV)
తలిదండ్రులచేతను సహోదరులచేతను బంధువులచేతను స్నేహితులచేతను మీరు అప్పగింపబడుదురు; వారు మీలో కొందరిని చంపింతురు;
లూకా సువార్త 21 : 17 (TEV)
నా నామము నిమిత్తము మీరు మనుష్యులందరిచేత ద్వేషింపబడుదురు.
లూకా సువార్త 21 : 18 (TEV)
గాని మీ తల వెండ్రుకలలో ఒకటైనను నశింపదు.
లూకా సువార్త 21 : 19 (TEV)
మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు.
లూకా సువార్త 21 : 20 (TEV)
యెరూషలేము దండ్లచేత చుట్టబడుట మీరు చూచు నప్పుడు దాని నాశనము సమీపమైయున్నదని తెలిసి కొనుడి.
లూకా సువార్త 21 : 21 (TEV)
అప్పుడు యూదయలో ఉండువారు కొండ లకు పారిపోవలెను; దాని మధ్యనుండువారు వెలుపలికి పోవలెను; పల్లెటూళ్లలోనివారు దానిలో ప్రవేశింప కూడదు.
లూకా సువార్త 21 : 22 (TEV)
లేఖనములలో వ్రాయబడిన వన్నియు నెర వేరుటకై అవి ప్రతి దండన దినములు.
లూకా సువార్త 21 : 23 (TEV)
ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ. భూమిమీద మిక్కిలి యిబ్బందియు ఈ ప్రజలమీద కోపమును వచ్చును.
లూకా సువార్త 21 : 24 (TEV)
వారు కత్తివాత కూలుదురు; చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు; అన్యజనముల కాలములు సంపూర్ణమగువరకు యెరూష లేము అన్యజనములచేత త్రొక్కబడును.
లూకా సువార్త 21 : 25 (TEV)
మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలును, భూమిమీద సముద్రతరంగముల ఘోషవలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును.
లూకా సువార్త 21 : 26 (TEV)
ఆకాశమందలి శక్తులు కదిలింప బడును గనుక లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి, మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యముచెడి కూలుదురు.
లూకా సువార్త 21 : 27 (TEV)
అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు.
లూకా సువార్త 21 : 28 (TEV)
ఇవి జరుగ నారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తికొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను.
లూకా సువార్త 21 : 29 (TEV)
మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను అంజూరపు వృక్షమును సమస్త వృక్ష ములను చూడుడి.
లూకా సువార్త 21 : 30 (TEV)
అవి చిగిరించుటచూచి వసంత కాలమప్పుడే సమీపమాయె నని మీ అంతట మీరు తెలిసి కొందురు గదా?
లూకా సువార్త 21 : 31 (TEV)
అటువలె మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయెనని తెలిసికొనుడి.
లూకా సువార్త 21 : 32 (TEV)
అవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
లూకా సువార్త 21 : 33 (TEV)
ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలేమాత్రమును గతింపవు.
లూకా సువార్త 21 : 34 (TEV)
మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి.
లూకా సువార్త 21 : 35 (TEV)
ఆ దినము భూమియందంతట నివసించు వారందరిమీదికి అకస్మాత్తుగా వచ్చును.
లూకా సువార్త 21 : 36 (TEV)
కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించు కొని, మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడును ప్రార్థనచేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను.
లూకా సువార్త 21 : 37 (TEV)
ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవలకొండకు వెళ్లుచు కాలము గడుపుచుండెను.
లూకా సువార్త 21 : 38 (TEV)
ప్రజలందరు ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయనయొద్దకు పెందలకడ వచ్చుచుండిరి.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38

BG:

Opacity:

Color:


Size:


Font: