లూకా సువార్త 23 : 1 (TEV)
అంతట వారందరును లేచి ఆయనను పిలాతునొద్దకు తీసికొనిపోయి
లూకా సువార్త 23 : 2 (TEV)
ఇతడు మా జనమును తిరుగబడ ప్రేరేపించుచు, కైసరునకు పన్నియ్యవద్దనియు, తానే క్రీస్తను ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయనమీద నేరము మోపసాగిరి.
లూకా సువార్త 23 : 3 (TEV)
పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయనను అడుగగా ఆయననీ వన్నట్టే అని అతనితో చెప్పెను.
లూకా సువార్త 23 : 4 (TEV)
పిలాతు ప్రధాన యాజకులతోను జనసమూహములతోనుఈ మనుష్యుని యందు నాకు ఏ నేరమును కనబడలేద నెను.
లూకా సువార్త 23 : 5 (TEV)
అయితే వారుఇతడు గలిలయదేశము మొద లుకొని ఇంతవరకును యూదయదేశమందంతట ఉపదేశించుచు ప్రజలను రేపు చున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి.
లూకా సువార్త 23 : 6 (TEV)
పిలాతు ఈ మాట వినిఈ మనుష్యుడు గలిలయుడా అని అడిగి
లూకా సువార్త 23 : 7 (TEV)
ఆయన హేరోదు అధికారము క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలిసికొని హేరోదునొద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను.
లూకా సువార్త 23 : 8 (TEV)
హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయననుగూర్చి చాల సంగతులు విన్నందున ఆయన ఏదైనను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి, బహుకాలమునుండి ఆయనను చూడగో రెను.
లూకా సువార్త 23 : 9 (TEV)
ఆయనను చూచినప్పుడు చాల ప్రశ్నలువేసినను ఆయన అతనికి ఉత్తరమేమియు ఇయ్యలేదు.
లూకా సువార్త 23 : 10 (TEV)
ప్రధానయాజకులును శాస్త్రులును నిలువబడి ఆయనమీద తీక్షణముగా నేరము మోపిరి.
లూకా సువార్త 23 : 11 (TEV)
హేరోదు తన సైనికులతో కలిసి, ఆయనను తృణీకరించి అపహసించి, ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతునొద్దకు మరల పంపెను.
లూకా సువార్త 23 : 12 (TEV)
అంతకు ముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులై యుండి ఆ దినముననే యొకనికొకడు మిత్రులైరి.
లూకా సువార్త 23 : 13 (TEV)
అంతట పిలాతు ప్రధానయాజకులను అధికారులను ప్రజలను పిలిపించి
లూకా సువార్త 23 : 14 (TEV)
ప్రజలు తిరుగబడునట్లు చేయు చున్నాడని మీరీమనుష్యుని నాయొద్దకు తెచ్చి తిరే. ఇదిగో నేను మీయెదుట ఇతనిని విమర్శింపగా మీ రితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడ
లూకా సువార్త 23 : 15 (TEV)
హేరోదునకు కూడ కనబడలేదు.హేరోదు అతని మాయొద్దకు తిరిగి పంపెను గదా; ఇదిగో మరణ మునకు తగినదేదియు ఇతడు చేయలేదు.
లూకా సువార్త 23 : 16 (TEV)
కాబట్టి నేనితనిని
లూకా సువార్త 23 : 17 (TEV)
శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా
లూకా సువార్త 23 : 18 (TEV)
వారందరు వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయుమని ఏకగ్రీవముగా కేకలువేసిరి.
లూకా సువార్త 23 : 19 (TEV)
వీడు పట్టణములో జరిగించిన యొక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినవాడు.
లూకా సువార్త 23 : 20 (TEV)
పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాటలాడినను.
లూకా సువార్త 23 : 21 (TEV)
వారు వీనిని సిలువవేయుము సిలువవేయుము అని కేకలు వేసిరి.
లూకా సువార్త 23 : 22 (TEV)
మూడవ మారు అతడుఎందుకు? ఇతడు ఏ దుష్కార్యము చేసెను? ఇతనియందు మరణమునకు తగిన నేరమేమియు నాకు అగపడలేదు గనుక ఇతని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పెను.
లూకా సువార్త 23 : 23 (TEV)
అయితే వారొకే పట్టుగా పెద్ద కేకలువేసి, వీనిని సిలువవేయుమని అడుగగా వారి కేకలే గెలిచెను.
లూకా సువార్త 23 : 24 (TEV)
కాగా వారడిగినట్టే జరుగవలెనని పిలాతు తీర్పుతీర్చి
లూకా సువార్త 23 : 25 (TEV)
అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్త మును చెరసాలలో వేయబడియుండినవానిని వారడిగినట్టు వారికి విడుదలచేసి, యేసును వారికిష్టము వచ్చినట్టు చేయుటకు అప్పగించెను.
లూకా సువార్త 23 : 26 (TEV)
వారాయనను తీసికొనిపోవుచుండగా పల్లెటూరినుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకని పట్టుకొని, యేసువెంట సిలువను మోయుటకు అతనిమీద దానిని పెట్టిరి.
లూకా సువార్త 23 : 27 (TEV)
గొప్ప జనసమూహమును, ఆయననుగూర్చి రొమ్ముకొట్టు కొనుచు దుఃఖించుచున్న చాలమంది స్త్రీలును ఆయనను వెంబడించిరి.
లూకా సువార్త 23 : 28 (TEV)
యేసు వారివైపు తిరిగియెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకుడి; మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి.
లూకా సువార్త 23 : 29 (TEV)
ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములును పాలియ్యని స్తనములును ధన్యములైనవని చెప్పుదినములు వచ్చుచున్నవి.
లూకా సువార్త 23 : 30 (TEV)
అప్పుడుమామీద పడుడని పర్వతములతోను, మమ్ము కప్పుడని కొండలతోను జనులు చెప్పసాగుదురు.
లూకా సువార్త 23 : 31 (TEV)
వారు పచ్చిమ్రానుకే యీలాగు చేసినయెడల ఎండినదానికేమి చేయుదురో అని చెప్పెను.
లూకా సువార్త 23 : 32 (TEV)
మరి యిద్దరు ఆయనతోకూడ చంపబడుటకు తేబడిరి; వారు నేరము చేసినవారు.
లూకా సువార్త 23 : 33 (TEV)
వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్థులను ఆయనతో కూడ సిలువవేసిరి.
లూకా సువార్త 23 : 34 (TEV)
యేసు తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లువేసిరి.
లూకా సువార్త 23 : 35 (TEV)
ప్రజలు నిలువబడి చూచు చుండిరి; అధికారులునువీడు ఇతరులను రక్షించెను; వీడు దేవుడేర్పరచుకొనిన క్రీస్తు అయిన యెడల తన్నుతానురక్షించుకొనునని అపహసించిరి.
లూకా సువార్త 23 : 36 (TEV)
అంతట సైనికులు ఆయనయొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి
లూకా సువార్త 23 : 37 (TEV)
నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి.
లూకా సువార్త 23 : 38 (TEV)
ఇతడు యూదుల రాజని పైవిలాసముకూడ ఆయనకు పైగా వ్రాయబడెను.
లూకా సువార్త 23 : 39 (TEV)
వ్రేలాడవేయబడిన ఆ నేరస్థులలో ఒకడు ఆయనను దూషించుచునీవు క్రీస్తువు గదా? నిన్ను నీవు రక్షించు కొనుము, మమ్మునుకూడ రక్షించుమని చెప్పెను.
లూకా సువార్త 23 : 40 (TEV)
అయితే రెండవవాడు వానిని గద్దించినీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా?
లూకా సువార్త 23 : 41 (TEV)
మనకైతే యిది న్యాయమే; మనము చేసినవాటికి తగిన ఫలము పొందు చున్నాము గాని యీయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి
లూకా సువార్త 23 : 42 (TEV)
ఆయనను చూచి యేసూ, నీవు నీ రాజ్యము లోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమనెను.
లూకా సువార్త 23 : 43 (TEV)
అందు కాయన వానితోనేడు నీవు నాతోకూడ పర దైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నా ననెను.
లూకా సువార్త 23 : 44 (TEV)
అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటిమీద చీకటి కమ్మెను;
లూకా సువార్త 23 : 45 (TEV)
సూర్యుడు అదృశ్యుడాయెను; గర్భా లయపు తెర నడిమికి చినిగెను.
లూకా సువార్త 23 : 46 (TEV)
అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి--తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను.
లూకా సువార్త 23 : 47 (TEV)
శతాధిపతి జరిగినది చూచిఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై యుండెనని చెప్పి దేవుని మహిమపరచెను.
లూకా సువార్త 23 : 48 (TEV)
చూచుటకై కూడివచ్చిన ప్రజలందరు జరిగిన కార్యములు చూచి, రొమ్ము కొట్టు కొనుచు తిరిగి వెళ్లిరి.
లూకా సువార్త 23 : 49 (TEV)
ఆయనకు నెళవైనవారందరును, గలిలయనుండి ఆయనను వెంబ డించిన స్త్రీలును దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి.
లూకా సువార్త 23 : 50 (TEV)
అరిమతయియ అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను.
లూకా సువార్త 23 : 51 (TEV)
అతడు సజ్జనుడును నీతిమంతుడునై యుండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యముకొరకు కనిపెట్టు చుండినవాడు.
లూకా సువార్త 23 : 52 (TEV)
అతడు పిలాతునొద్దకు వెళ్లి, యేసు దేహము (తనకిమ్మని) అడుగుకొని
లూకా సువార్త 23 : 53 (TEV)
దానిని క్రిందికి దించి, సన్నపు నారబట్టతో చుట్టి, తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును అంతకు మునుపెప్పుడును ఉంచబడలేదు.
లూకా సువార్త 23 : 54 (TEV)
ఆ దినము సిద్ధపరచు దినము; విశ్రాంతి దినారంభము కావచ్చెను.
లూకా సువార్త 23 : 55 (TEV)
అప్పుడు గలిలయనుండి ఆయనతో కూడ వచ్చిన స్త్రీలు వెంట వెళ్లి ఆ సమాధిని, ఆయన దేహము ఏలాగుంచబడెనో చూచి
లూకా సువార్త 23 : 56 (TEV)
తిరిగి వెళ్లి, సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరచి, ఆజ్ఞచొప్పున విశ్రాంతిదినమున తీరికగా ఉండిరి.
❮
❯