లూకా సువార్త 24 : 1 (TEV)
ఆదివారమున తెల్లవారుచుండగా (ఆ స్త్రీలు) తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యములను తీసికొని సమాధి యొద్దకు వచ్చి
లూకా సువార్త 24 : 2 (TEV)
సమాధిముందర ఉండిన రాయి దొరలింప బడియుండుట చూచి లోపలికి వెళ్లిరి గాని
లూకా సువార్త 24 : 3 (TEV)
ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు.
లూకా సువార్త 24 : 4 (TEV)
ఇందునుగూర్చి వారికేమియు తోచకయుండగా, ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన యిద్దరు మనుష్యులు వారియొద్ద నిలువబడిరి.
లూకా సువార్త 24 : 5 (TEV)
వారు భయపడి ముఖములను నేల మోపి యుండగా వీరుసజీవుడైన వానిని మీ రెందుకు మృతులలో వెదకుచున్నారు?
లూకా సువార్త 24 : 6 (TEV)
ఆయన ఇక్కడలేడు, ఆయన లేచియున్నాడు; ఆయన ఇంక గలిలయలో ఉండి నప్పుడు
లూకా సువార్త 24 : 7 (TEV)
మనుష్యకుమారుడు పాపిష్ఠులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి, సిలువవేయబడి, మూడవ దినమందు లేవవలసియున్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసికొనుడని వారితో
లూకా సువార్త 24 : 8 (TEV)
అప్పుడు వారాయన మాటలు జ్ఞాపకము చేసికొని
లూకా సువార్త 24 : 9 (TEV)
సమాధి యొద్దనుండి తిరిగి వెళ్లి యీ సంగతులన్నియు పదునొకండుగురు శిష్యులకును తక్కినవారికందరికిని తెలియజేసిరి.
లూకా సువార్త 24 : 10 (TEV)
ఈ సంగతులు అపొస్తలులతో చెప్పిన వారెవరనగామగ్దలేనే మరియయు యోహన్నయు యాకోబు తల్లియైన మరియయు వారితో కూడ ఉన్న యితర స్త్రీలును.
లూకా సువార్త 24 : 11 (TEV)
అయితే వారి మాటలు వీరి దృష్టికి వెఱ్ఱిమాటలుగా కనబడెను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు.
లూకా సువార్త 24 : 12 (TEV)
అయితే పేతురు లేచి, సమాధి యొద్దకు పరుగెత్తికొనిపోయి వంగిచూడగా, నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగినదానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్లెను.
లూకా సువార్త 24 : 13 (TEV)
ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేము నకు ఆమడదూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామ మునకు వెళ్లుచు
లూకా సువార్త 24 : 14 (TEV)
జరిగిన ఈ సంగతులన్ని టినిగూర్చి యొక రితో నొకరు సంభాషించుచుండిరి.
లూకా సువార్త 24 : 15 (TEV)
వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా, యేసు తానే దగ్గరకువచ్చి వారితోకూడ నడిచెను;
లూకా సువార్త 24 : 16 (TEV)
అయితే వారాయనను గుర్తు పట్టలేకుండ వారి కన్నులు మూయబడెను.
లూకా సువార్త 24 : 17 (TEV)
ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న యీ మాట లేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి.
లూకా సువార్త 24 : 18 (TEV)
వారిలో క్లెయొపా అనువాడుయెరూషలేములో బస చేయుచుండి, యీ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొకడవే యెరుగవా? అని ఆయనను అడిగెను.
లూకా సువార్త 24 : 19 (TEV)
ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారునజరేయుడైన యేసును గూర్చిన సంగతులే; ఆయన దేవునియెదుటను ప్రజలందరియెదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్తయై యుండెను.
లూకా సువార్త 24 : 20 (TEV)
మన ప్రధాన యాజకులును అధికారులును ఆయనను ఏలాగు మరణశిక్షకు అప్పగించి, సిలువవేయించిరో నీకు తెలియదా?
లూకా సువార్త 24 : 21 (TEV)
ఇశ్రాయేలును విమోచింపబోవువాడు ఈయనే అని మేము నిరీక్షించి యుంటిమి; ఇదిగాక యీ సంగతులు జరిగి నేటికి మూడు దినములాయెను.
లూకా సువార్త 24 : 22 (TEV)
అయితే మాలో కొందరు స్త్రీలు తెల్ల వారగానే సమాధియొద్దకు వెళ్లి, ఆయన దేహమును కానక వచ్చి
లూకా సువార్త 24 : 23 (TEV)
కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రదికియున్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి.
లూకా సువార్త 24 : 24 (TEV)
మాతోకూడ ఉన్నవారిలో కొందరు సమాధియొద్దకు వెళ్లి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి గాని, ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి.
లూకా సువార్త 24 : 25 (TEV)
అందు కాయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటిని నమ్మని మందమతులారా,
లూకా సువార్త 24 : 26 (TEV)
క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి
లూకా సువార్త 24 : 27 (TEV)
మోషేయు సమస్త ప్రవక్తలును మొదలు కొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను.
లూకా సువార్త 24 : 28 (TEV)
ఇంతలో తాము వెళ్లుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన యింక కొంతదూరము వెళ్లునట్లు అగపడగా
లూకా సువార్త 24 : 29 (TEV)
వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు గ్రుంకినది, మాతోకూడ ఉండుమని చెప్పి, ఆయనను బలవంతముచేసిరి గనుక ఆయన వారితో కూడ ఉండుటకు లోపలికి వెళ్లెను.
లూకా సువార్త 24 : 30 (TEV)
ఆయన వారితో కూడ భోజనమునకు కూర్చున్నప్పుడు, ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాని విరిచి వారికి పంచి పెట్టగా
లూకా సువార్త 24 : 31 (TEV)
వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి; అంతట ఆయన వారికి అదృశ్యుడాయెను.
లూకా సువార్త 24 : 32 (TEV)
అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచు చున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని యొకనితో ఒకడు చెప్పుకొనిరి.
లూకా సువార్త 24 : 33 (TEV)
ఆ గడియలోనే వారు లేచి, యెరూషలేమునకు తిరిగి వెళ్లగా, పదు నొకొండుగురు శిష్యులును వారితో కూడ ఉన్నవారును కూడివచ్చి
లూకా సువార్త 24 : 34 (TEV)
ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కన బడెనని చెప్పుకొనుచుండిరి. వారిది విని
లూకా సువార్త 24 : 35 (TEV)
త్రోవలో జరిగిన సంగతులును, ఆయన రొట్టె విరుచుటవలన తమ కేలాగు తెలియబడెనో అదియు తెలియజేసిరి.
లూకా సువార్త 24 : 36 (TEV)
వారు ఈలాగు మాటలాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి--మీకు సమాధానమవుగాకని వారితో అనెను.
లూకా సువార్త 24 : 37 (TEV)
అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై, భూతము తమకు కనబడెనని తలంచిరి.
లూకా సువార్త 24 : 38 (TEV)
అప్పుడాయనమీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృద యములలో సందేహములు పుట్టనేల?
లూకా సువార్త 24 : 39 (TEV)
నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి; నన్ను పట్టి చూడుడి, నా కున్నట్టుగా మీరు చూచుచున్న యెముకలును మాంస మును భూతమున కుండవని చెప్పి
లూకా సువార్త 24 : 40 (TEV)
తన చేతులను పాదము లను వారికి చూపెను.
లూకా సువార్త 24 : 41 (TEV)
అయితే వారు సంతోషముచేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయనఇక్కడ మీయొద్ద ఏమైన ఆహారము కలదా అని వారినడిగెను.
లూకా సువార్త 24 : 42 (TEV)
వారు కాల్చిన చేప ముక్కను ఆయన కిచ్చిరి.
లూకా సువార్త 24 : 43 (TEV)
ఆయన దానిని తీసికొని వారియెదుట భుజించెను.
లూకా సువార్త 24 : 44 (TEV)
అంతట ఆయనమోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడిన వన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మా
లూకా సువార్త 24 : 45 (TEV)
అప్పుడు వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సును తెరచి
లూకా సువార్త 24 : 46 (TEV)
క్రీస్తు శ్రమపడి మూడవ దిన మున మృతులలోనుండి లేచుననియు
లూకా సువార్త 24 : 47 (TEV)
యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయనపేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది.
లూకా సువార్త 24 : 48 (TEV)
ఈ సంగతులకు మీరే సాక్షులు
లూకా సువార్త 24 : 49 (TEV)
ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీమీదికి పంపు చున్నాను; మీరు పైనుండి శక్తి పొందువరకు పట్టణములో నిలిచి యుండుడని వారితో చెప్పెను.
లూకా సువార్త 24 : 50 (TEV)
ఆయన బేతనియవరకు వారిని తీసికొనిపోయి చేతు లెత్తి వారిని ఆశీర్వదించెను.
లూకా సువార్త 24 : 51 (TEV)
వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలోనుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను.
లూకా సువార్త 24 : 52 (TEV)
వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్లి
లూకా సువార్త 24 : 53 (TEV)
యెడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి.
❮
❯