లూకా సువార్త 9 : 1 (TEV)
ఆయన తన పండ్రెండుమంది (శిష్యులను) పిలిచి, సమస్తమైన దయ్యములమీద శక్తిని అధికారమును, రోగ ములు స్వస్థపరచు వరమును వారికనుగ్రహించి
లూకా సువార్త 9 : 2 (TEV)
దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారి నంపెను.
లూకా సువార్త 9 : 3 (TEV)
మరియు ఆయనమీరు ప్రయాణము కొరకు చేతికఱ్ఱనైనను జాలెనైనను రొట్టెనైనను వెండినైనను మరి దేనినైనను తీసికొని పోవద్దు; రెండు అంగీలు ఉంచు కొనవద్దు.
లూకా సువార్త 9 : 4 (TEV)
మీరు ఏ యింట ప్రవేశింతురో ఆ యింటనే బసచేసి అక్కడనుండి బయలుదేరుడి.
లూకా సువార్త 9 : 5 (TEV)
మిమ్మును ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణములోనుండి బయలుదేరునప్పుడు వారిమీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదధూళి దులిపివేయుడని వారితో చెప్పెను.
లూకా సువార్త 9 : 6 (TEV)
వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు, (రోగులను) స్వస్థ పరచుచు గ్రామములలో సంచారము చేసిరి.
లూకా సువార్త 9 : 7 (TEV)
చతుర్థాధిపతియైన హేరోదు జరిగిన కార్యము లన్నిటిని గూర్చి విని, యెటుతోచక యుండెను. ఏలయనగా కొందరుయోహాను మృతులలోనుండి లేచెననియు,
లూకా సువార్త 9 : 8 (TEV)
కొందరుఏలీయా కనబడెననియు; కొందరుపూర్వ కాలపు ప్రవక్తయొకడు లేచెననియు చెప్పుకొనుచుండిరి.
లూకా సువార్త 9 : 9 (TEV)
అప్పుడు హేరోదునేను యోహానును తల గొట్టించితిని గదా; యెవనిగూర్చి యిట్టి సంగతులు వినుచున్నానో అతడెవడో అని చెప్పి ఆయనను చూడగోరెను.
లూకా సువార్త 9 : 10 (TEV)
అపొస్తలులు తిరిగి వచ్చి, తాము చేసినవన్నియు ఆయనకు తెలియజేయగా, ఆయన వారిని వెంట బెట్టుకొని బేత్సయిదా అను ఊరికి ఏకాంతముగా వెళ్లెను.
లూకా సువార్త 9 : 11 (TEV)
జన సమూహములు అది తెలిసికొని ఆయనను వెంబడింపగా, ఆయన వారిని చేర్చుకొని, దేవుని రాజ్యమునుగూర్చి వారితో మాటలాడుచు, స్వస్థత కావలసినవారిని స్వస్థ పరచెను.
లూకా సువార్త 9 : 12 (TEV)
ప్రొద్దు గ్రుంక నారంభించినప్పుడు పండ్రెండుగురు శిష్యులు వచ్చి మనమీ అరణ్యములో ఉన్నాము గనుక చుట్టుపట్లనున్న గ్రామములకును పల్లె లకును వెళ్లి బస చూచుకొని, ఆహారము సంపాదించు కొనునట్లు జనసమూహ మును పంపివేయుమని ఆయనతో చెప్పిరి.
లూకా సువార్త 9 : 13 (TEV)
ఆయనమీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారుమనయొద్ద అయిదు రొట్టెలును రెండు చేపలును తప్ప మరేమియు లేదు; మేము వెళ్లి యీ ప్రజలందరికొరకు భోజనపదార్థములను కొని తెత్తుమా అని చెప్పిరి.
లూకా సువార్త 9 : 14 (TEV)
వచ్చినవారు ఇంచుమించు అయిదువేల మంది పురుషులు. ఆయనవారిని ఏబదేసిమంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా,
లూకా సువార్త 9 : 15 (TEV)
వారాలాగు చేసి అందరిని కూర్చుండబెట్టిరి.
లూకా సువార్త 9 : 16 (TEV)
అంతట ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను ఎత్తికొని, ఆకాశము వైపు కన్ను లెత్తి వాటిని ఆశీర్వదించి, విరిచి, జనసమూహము నకు వడ్డించుటకై శిష్యులకిచ్చెను.
లూకా సువార్త 9 : 17 (TEV)
వారందరుతిని తృప్తి పొం దిన తరువాత మిగిలిన ముక్కలు పండ్రెండు గంపెళ్లెత్తిరి.
లూకా సువార్త 9 : 18 (TEV)
ఒకప్పుడాయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయనయొద్ద ఉండిరి. నేనెవడనని జనసమూహములు చెప్పుకొనుచున్నారని ఆయన వారి నడుగగా
లూకా సువార్త 9 : 19 (TEV)
వారుబాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరుఏలీయాయనియు, కొందరుపూర్వకాలపు ప్రవక్త యొకడు లేచెననియు చెప్పు కొనుచున్నారనిరి.
లూకా సువార్త 9 : 20 (TEV)
అందుకాయనమీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారని వారినడుగగా పేతురునీవు దేవుని క్రీస్తువనెను.
లూకా సువార్త 9 : 21 (TEV)
ఆయన ఇది ఎవనితోను చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి
లూకా సువార్త 9 : 22 (TEV)
మనుష్యకుమారుడు బహు శ్రమలు పొంది, పెద్దల చేతను ప్రధాన యాజకులచేతను శాస్త్రులచేతను విసర్జింపబడి, చంపబడి, మూడవ దినమున లేచుట అగత్య మని చెప్పెను.
లూకా సువార్త 9 : 23 (TEV)
మరియు ఆయన అందరితో ఇట్లనెను ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను.
లూకా సువార్త 9 : 24 (TEV)
తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పొగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించు కొనును.
లూకా సువార్త 9 : 25 (TEV)
ఒకడు లోకమంతయు సంపాదించి, తన్ను తాను పోగొట్టు కొనినయెడల, లేక నష్టపరచుకొనినయెడల వానికేమి ప్రయోజనము?
లూకా సువార్త 9 : 26 (TEV)
నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు, తనకును తన తండ్రికిని పరిశుద్ద దూతలకును కలిగియున్న మహిమతో వచ్చునప్పుడు సిగ్గుపడును.
లూకా సువార్త 9 : 27 (TEV)
ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచువరకు మరణము రుచిచూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నాననెను.
లూకా సువార్త 9 : 28 (TEV)
ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి యెని మిది దినములైన తరువాత, ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని, ప్రార్థనచేయుటకు ఒక కొండ యెక్కెను.
లూకా సువార్త 9 : 29 (TEV)
ఆయన ప్రార్థించు చుండగా ఆయన ముఖరూపము మారెను; ఆయన వస్త్రములు తెల్లనివై ధగధగ మెరిసెను.
లూకా సువార్త 9 : 30 (TEV)
మరియు ఇద్దరు పురుషులు ఆయ నతో మాటలాడుచుండిరి, వారు మోషే ఏలీయా అను వారు.
లూకా సువార్త 9 : 31 (TEV)
వారు మహిమతో అగపడి, ఆయన యెరూష లేములో నెరవేర్చబోవు నిర్గమమునుగూర్చి మాటలాడు చుండిరి.
లూకా సువార్త 9 : 32 (TEV)
పేతురును అతనితో కూడ ఉన్నవారును నిద్ర మత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు, ఆయన మహిమను ఆయనతో కూడ నిలిచియున్న యిద్దరు పురు షులను చూచిరి.
లూకా సువార్త 9 : 33 (TEV)
(ఆ యిద్దరు పురుషులు) ఆయనయొద్ద నుండి వెళ్లిపోవుచుండగా పేతురు యేసుతోఏలిన వాడా, మనమిక్కడ ఉండుట మంచిది, నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలీయాకు ఒకటియు మూడు పర్ణ శాలలు మేముకట్టుదుమని, తాను చెప్పినది తానెరుగకయే చెప్పెను.
లూకా సువార్త 9 : 34 (TEV)
అతడీలాగు మాటలాడుచుండగా మేఘ మొకటి వచ్చి వారిని కమ్మెను; వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి.
లూకా సువార్త 9 : 35 (TEV)
మరియు ఈయన నే నేర్పరచుకొనిన నా కుమారుడు,ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను.
లూకా సువార్త 9 : 36 (TEV)
ఆ శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రమే అగపడెను. తాము చూచిన వాటిలో ఒకటియు ఆ దినములలో ఎవరికిని తెలియ జేయక వారు ఊరకుండిరి.
లూకా సువార్త 9 : 37 (TEV)
మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహు జనసమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను.
లూకా సువార్త 9 : 38 (TEV)
ఇదిగో ఆ జనసమూహములో ఒకడు బోధకుడా, నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను. వాడు నా కొక్కడే కుమారుడు.
లూకా సువార్త 9 : 39 (TEV)
ఇదిగో ఒక దయ్యము2 వాని పట్టును, పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును; నురుగు కారునట్లు అది వానిని విలవిలలాడిం చుచు గాయపరచుచు వానిని వదలి వదల కుండును.
లూకా సువార్త 9 : 40 (TEV)
దానిని వెళ్లగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని గాని వారిచేత కాలేదని మొఱ్ఱపెట్టుకొనెను.
లూకా సువార్త 9 : 41 (TEV)
అందుకు యేసు విశ్వాసములేని మూర్ఖతరము వారలారా, నేనెంతకాలము మీతో కూడ ఉండి మిమ్మును సహింతును? నీ కుమారుని ఇక్కడికి తీసికొని రమ్మని చెప్పెను.
లూకా సువార్త 9 : 42 (TEV)
వాడు వచ్చు చుండగా ఆ దయ్యము వానిని పడద్రోసి, విలవిలలాడిం చెను; యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థ పరచి వాని తండ్రి కప్పగించెను.
లూకా సువార్త 9 : 43 (TEV)
గనుక అందరు దేవుని మహాత్మ్యమును చూచి ఆశ్చర్యపడిరి.
లూకా సువార్త 9 : 44 (TEV)
ఆయన చేసిన కార్యములన్నిటిని చూచి అందరు ఆశ్చర్య పడుచుండగా ఆయనఈ మాటలు మీ చెవులలో నాటనియ్యుడి. మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోవుచున్నాడని తన శిష్యులతో చెప్పెను.
లూకా సువార్త 9 : 45 (TEV)
అయితే వారామాట గ్రహింప కుండునట్లు అది వారికి మరుగుచేయబడెను గనుక వారు దానిని తెలిసికొనలేదు; మరియు ఆ మాటనుగూర్చి వారు ఆయనను అడుగ వెరచిరి.
లూకా సువార్త 9 : 46 (TEV)
తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా
లూకా సువార్త 9 : 47 (TEV)
యేసు వారి హృదయాలోచన ఎరిగి, ఒక చిన్న బిడ్డను తీసికొని తనయొద్ద నిలువబెట్టి.
లూకా సువార్త 9 : 48 (TEV)
ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చు కొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవానిని చేర్చుకొనును, మీ అందరిలో ఎవడు అత్యల్పుడై యుండునో వాడే గొప్ప వాడని వారితో
లూకా సువార్త 9 : 49 (TEV)
యోహానుఏలినవాడా, యెవడో యొకడు నీ పేరట దయ్యములను వెళ్లగొట్టగా మేము చూచితివిు; వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంక పరచితిమని చెప్పెను.
లూకా సువార్త 9 : 50 (TEV)
అందుకు యేసుమీరు వాని నాటంకపరచకుడి? మీకు విరోధి కాని వాడు మీ పక్షమున నున్నవాడే అని అతనితో చెప్పెను.
లూకా సువార్త 9 : 51 (TEV)
ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణ మగుచున్నప్పుడు
లూకా సువార్త 9 : 52 (TEV)
ఆయన యెరూషలేమునకు వెళ్లుటకు మనస్సు స్థిరపరచుకొని, తనకంటె ముందుగా దూతలను పంపెను. వారు వెళ్లి ఆయనకు బస సిద్ధము చేయవలె నని సమరయుల యొక గ్రామములో ప్రవేశించిరి గాని
లూకా సువార్త 9 : 53 (TEV)
ఆయన యెరూషలే మునకు వెళ్ల నభిముఖుడైనందున వా రాయనను చేర్చుకొనలేదు.
లూకా సువార్త 9 : 54 (TEV)
శిష్యులైన యాకోబును యోహానును అది చూచిప్రభువా, ఆకాశమునుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేమాజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా,
లూకా సువార్త 9 : 55 (TEV)
ఆయన వారితట్టు తిరిగి వారిని గద్దించెను.
లూకా సువార్త 9 : 56 (TEV)
అంతట వారు మరియొక గ్రామమునకు వెళ్లిరి.
లూకా సువార్త 9 : 57 (TEV)
వారు మార్గమున వెళ్లుచుండగా ఒకడునీ వెక్కడికి వెళ్లినను నీ వెంట వచ్చెదనని ఆయనతో చెప్పెను.
లూకా సువార్త 9 : 58 (TEV)
అందుకు యేసునక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చు కొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను.
లూకా సువార్త 9 : 59 (TEV)
ఆయన మరియొకనితోనా వెంటరమ్మని చెప్పెను. అతడు నేను వెళ్లి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెల విమ్మని మనవి చేసెను
లూకా సువార్త 9 : 60 (TEV)
అందుకాయనమృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము; నీవు వెళ్లి దేవుని రాజ్య మును ప్రకటించుమని వానితో చెప్పెను.
లూకా సువార్త 9 : 61 (TEV)
మరియొకడు ప్రభువా, నీ వెంట వచ్చెదను గాని నా యింట నున్న వారియొద్ద సెలవు తీసికొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా
లూకా సువార్త 9 : 62 (TEV)
యేసునాగటిమీద చెయ్యిపెట్టి వెనుకతట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడుకాడని వానితో చెప్పెను.
❮
❯