యోహాను సువార్త 18 : 1 (TEV)
యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతోకూడకెద్రోను వాగు దాటి పోయెను. అక్కడ ఒక తోట యుండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతోకూడ వెళ్లెను.
యోహాను సువార్త 18 : 2 (TEV)
యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్లు చుండువాడు గనుక, ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసియుండెను.
యోహాను సువార్త 18 : 3 (TEV)
కావున యూదా సైనికులను, ప్రధానయాజకులు పరిసయ్యులు పంపిన బంట్రౌతులను వెంటబెట్టుకొని, దివిటీలతోను దీపములతోను ఆయుధముల తోను అక్కడికివచ్చెను.
యోహాను సువార్త 18 : 4 (TEV)
యేసు తనకు సంభవింపబోవున వన్నియు ఎరిగినవాడై వారియొద్దకు వెళ్లిమీరెవని వెదకుచున్నారని వారిని అడిగెను.
యోహాను సువార్త 18 : 5 (TEV)
వారునజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా యేసుఆయనను నేనే అని వారితో చెప్పెను; ఆయనను అప్పగించిన యూదాయు వారియొద్ద నిలుచుండెను.
యోహాను సువార్త 18 : 6 (TEV)
ఆయననేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేలమీద పడిరి.
యోహాను సువార్త 18 : 7 (TEV)
మరల ఆయనమీరు ఎవనిని వెదకుచున్నారని వారిని అడిగెను. అందుకు వారునజరేయుడైన యేసునని చెప్పగా
యోహాను సువార్త 18 : 8 (TEV)
యేసు వారితోనేనే ఆయనని మీతో చెప్పితిని గనుక మీరు నన్ను వెదకుచున్నయెడల వీరిని పోనియ్యుడని చెప్పెను.
యోహాను సువార్త 18 : 9 (TEV)
నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు చెప్పెను.
యోహాను సువార్త 18 : 10 (TEV)
సీమోను పేతురునొద్ద కత్తియుండినందున అతడు దానిని దూసి, ప్రధానయాజకుని దాసుని కొట్టి అతని కుడిచెవి తెగ నరికెను.
యోహాను సువార్త 18 : 11 (TEV)
ఆ దాసునిపేరు మల్కు. యేసుకత్తి ఒరలో ఉంచుము; తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను.
యోహాను సువార్త 18 : 12 (TEV)
అంతట సైనికులును సహస్రాధిపతియు, యూదుల బంట్రౌతులును యేసును పట్టుకొని ఆయనను బంధించి, మొదట అన్నయొద్దకు ఆయనను తీసికొనిపోయిరి.
యోహాను సువార్త 18 : 13 (TEV)
అతడు ఆ సంవత్సరము ప్రధానయాజకుడైన కయపకు మామ.
యోహాను సువార్త 18 : 14 (TEV)
కయపఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు.
యోహాను సువార్త 18 : 15 (TEV)
సీమోను పేతురును మరియొక శిష్యుడును యేసు వెంబడి పోవుచుండిరి. ఆ శిష్యుడు ప్రధానయాజకునికి నెళవైనవాడు గనుక అతడు ప్రధానయాజకుని యింటి ముంగిటిలోనికి యేసుతో కూడ వెళ్లెను.
యోహాను సువార్త 18 : 16 (TEV)
పేతురు ద్వారము నొద్ద బయట నిలుచుండెను గనుక ప్రధానయాజకునికి నెళవైన ఆ శిష్యుడు బయటికి వచ్చి ద్వారపాలకురాలితో మాటలాడి పేతురును లోపలికి తోడుకొనిపోయెను.
యోహాను సువార్త 18 : 17 (TEV)
ద్వారమునొద్ద కావలియున్న యొక చిన్నది పేతురుతో నీవును ఈ మనుష్యుని శిష్యులలో ఒకడవు కావా? అని చెప్పగా అతడుకాననెను.
యోహాను సువార్త 18 : 18 (TEV)
అప్పుడు చలివేయు చున్నందున దాసులును బంట్రౌతులును మంటవేసి చలికాచుకొనుచు నిలుచుండగా పేతురును వారితో నిలువబడి చలికాచుకొనుచుండెను.
యోహాను సువార్త 18 : 19 (TEV)
ప్రధానయాజకుడు ఆయన శిష్యులనుగూర్చియు ఆయన బోధను గూర్చియు యేసును అడుగగా
యోహాను సువార్త 18 : 20 (TEV)
యేసు నేను బాహాటముగా లోకము ఎదుట మాటలాడితిని; యూదులందరు కూడివచ్చు సమాజమందిరములలోను దేవాలయము లోను ఎల్లప్పుడును బోధించితిని; రహస్యముగా నేనేమియు మాటలాడలేదు.
యోహాను సువార్త 18 : 21 (TEV)
నీవు నన్ను అడుగనేల? నేను వారికేమి బోధించినది విన్నవారిని అడుగుము; ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదురని అతనితో అనెను.
యోహాను సువార్త 18 : 22 (TEV)
ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచియున్న బంట్రౌతులలొఒకడుప్రధానయాజకునికి ఈలాగు ఉత్తరమిచ్చు చున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను.
యోహాను సువార్త 18 : 23 (TEV)
అందుకు యేసునేను కాని మాట ఆడిన యెడల ఆ కాని మాట ఏదో చెప్పుము; మంచిమాట ఆడిన యెడల నన్నేల కొట్టుచున్నావనెను.
యోహాను సువార్త 18 : 24 (TEV)
అంతట అన్న, యేసును బంధింపబడియున్నట్టుగానే ప్రధానయాజకుడైన కయప యొద్దకు పంపెను.
యోహాను సువార్త 18 : 25 (TEV)
సీమోను పేతురు నిలువబడి చలి కాచుకొనుచుండగా వారతని చూచినీవును ఆయన శిష్యులలో ఒకడవుకావా? అని చెప్పగా అతడునేను కాను, నేనెరుగననెను.
యోహాను సువార్త 18 : 26 (TEV)
పేతురు ఎవని చెవి తెగనరికెనో వాని బంధువును ప్రధాన యాజకుని దాసులలో ఒకడునునీవు తోటలో అతనితొ కూడ ఉండగా నేను చూడలేదా? అని చెప్పినందుకు
యోహాను సువార్త 18 : 27 (TEV)
పేతురు నేనెరుగనని మరియొకసారి చెప్పెను; వెంటనే కోడి కూసెను.
యోహాను సువార్త 18 : 28 (TEV)
వారు కయపయొద్దనుండి అధికారమందిరమునకు యేసును తీసికొనిపోయిరి. అప్పుడు ఉదయమాయెను గనుక వారు మైలపడకుండ పస్కాను భుజింపవలెనని అధికారమందిరములోనికి వెళ్లలేదు.
యోహాను సువార్త 18 : 29 (TEV)
కావున పిలాతు బయట ఉన్నవారియొద్దకు వచ్చిఈ మనుష్యునిమీద మీరు ఏ నేరము మోపుచున్నారనెను.
యోహాను సువార్త 18 : 30 (TEV)
అందుకు వారువీడు దుర్మార్గుడు కానియెడల వీనిని నీకు అప్పగించియుండ మని అతనితో చెప్పిరి.
యోహాను సువార్త 18 : 31 (TEV)
పిలాతుమీరతని తీసికొనిపోయి మీ ధర్మశాస్త్రముచొప్పున అతనికి తీర్పుతీర్చుడనగా
యోహాను సువార్త 18 : 32 (TEV)
యూదులుఎవనికిని మరణశిక్ష విధించుటకు మాకు అధి కారములేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టిమరణము పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరెను.
యోహాను సువార్త 18 : 33 (TEV)
పలాతు తిరిగి అధికారమందిరములో ప్రవేశించి యేసును పిలిపించి యూదుల రాజువు నీవేనా? అని ఆయన నడుగగా
యోహాను సువార్త 18 : 34 (TEV)
యేసునీ అంతట నీవే యీ మాట అను చున్నావా? లేక యితరులు నీతో నన్ను గూర్చి చెప్పిరా? అని అడిగెను.
యోహాను సువార్త 18 : 35 (TEV)
అందుకు పిలాతునేను యూదుడనా యేమి? నీ స్వజనమును ప్రధానయాజకులును నిన్ను నాకు అప్పగించిరిగదా; నీవేమి చేసితివని అడుగగా
యోహాను సువార్త 18 : 36 (TEV)
యేసు నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు; నా రాజ్యము ఈ లోకసంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహసంబంధమైనది కాదనెను.
యోహాను సువార్త 18 : 37 (TEV)
అందుకు పిలాతునీవు రాజువా? అని ఆయనను అడుగగా యేసునీవన్నట్టు నేను రాజునే; సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని; సత్యసం
యోహాను సువార్త 18 : 38 (TEV)
అందుకు పిలాతుసత్యమనగా ఏమిటి? అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్లి అతనియందు ఏ దోషమును నాకు కనబడలేదు;
యోహాను సువార్త 18 : 39 (TEV)
అయినను పస్కాపండుగలో నేనొకని మీకు విడుదల చేయువాడుక కలదు గదా; నేను యూదుల రాజును విడుదల చేయుట మీకిష్టమా? అని వారినడిగెను.
యోహాను సువార్త 18 : 40 (TEV)
అయితే వారువీనిని వద్దు, బరబ్బను విడుదలచేయుమని మరల కేకలువేసిరి. ఈ బరబ్బ బందిపోటుదొంగ.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40

BG:

Opacity:

Color:


Size:


Font: