అపొస్తలుల కార్యములు 3 : 1 (TEV)
పగలు మూడు గంటలకు ప్రార్థనకాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్లుచుండగా,
అపొస్తలుల కార్యములు 3 : 2 (TEV)
పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక మనుష్యుడు మోసికొనిపోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్లువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి.
అపొస్తలుల కార్యములు 3 : 3 (TEV)
పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింప బోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా
అపొస్తలుల కార్యములు 3 : 4 (TEV)
పేతురును యోహానును వానిని తేరి చూచిమాతట్టు చూడుమనిరి.
అపొస్తలుల కార్యములు 3 : 5 (TEV)
వాడు వారియొద్ద ఏమైన దొరుకునని కనిపెట్టుచు వారియందు లక్ష్యముంచెను.
అపొస్తలుల కార్యములు 3 : 6 (TEV)
అంతట పేతురువెండి బంగారములు నాయొద్ద లేవు గాని నాకు కలిగినదే నీ కిచ్చుచున్నాను; నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి
అపొస్తలుల కార్యములు 3 : 7 (TEV)
వాని కుడిచెయ్యి పట్టుకొని లేవనెత్తెను; వెంటనే వాని పాదములును చీలమండలును బలము పొందెను.
అపొస్తలుల కార్యములు 3 : 8 (TEV)
వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను; నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితోకూడ దేవాలయములోనికి వెళ్లెను.
అపొస్తలుల కార్యములు 3 : 9 (TEV)
వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరు చూచి
అపొస్తలుల కార్యములు 3 : 10 (TEV)
శృంగారమను దేవా లయపు ద్వారమునొద్ద భిక్షముకొరకు కూర్చుండినవాడు వీడే అని గుర్తెరిగి,వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి.
అపొస్తలుల కార్యములు 3 : 11 (TEV)
వాడు పేతురును యోహానును పట్టుకొని యుండగా, ప్రజలందరు విస్మయమొంది సొలొమోనుదను మంటపములో ఉన్న వారియొద్దకు గుంపుగా పరుగెత్తివచ్చిరి.
అపొస్తలుల కార్యములు 3 : 12 (TEV)
పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెనుఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై యెందుకు ఆశ్చర్యపడుచున్నారు? మాసొంతశక్తి చేతనైనను భక్తిచేతనైనను నడవను వీనికి బలమిచ్చి నట్టుగా మీరెందుకు మాతట్టు తేరి చూచుచున్నారు?
అపొస్తలుల కార్యములు 3 : 13 (TEV)
అబ్రాహాము ఇస్సాకు యాకోబు అనువారి దేవుడు, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచియున్నాడు; మీరాయనను అప్పగించితిరి, పిలాతు ఆయనను విడుదల చే¸
అపొస్తలుల కార్యములు 3 : 14 (TEV)
మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి, నర హంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగి తిరి.
అపొస్తలుల కార్యములు 3 : 15 (TEV)
మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలోనుండి లేపెను; అందుకు మేము సాక్షులము.
అపొస్తలుల కార్యములు 3 : 16 (TEV)
ఆయన నామమందలి విశ్వాసముమూలముగా ఆయన నామమే మీరు చూచి యెరిగియున్న వీనిని బలపరచెను; ఆయనవలన కలిగిన విశ్వాసమే మీ అందరియెదుట వీనికి ఈ పూర్ణస్వస్థత కలుగజేసెను.
అపొస్తలుల కార్యములు 3 : 17 (TEV)
సహోదరులారా, మీరును మీ అధికారులును తెలియక చేసితిరని నాకు తెలియును.
అపొస్తలుల కార్యములు 3 : 18 (TEV)
అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తలనోట ముందుగా ప్రచురపరచిన విషయ ములను ఈలాగు నెరవేర్చెను.
అపొస్తలుల కార్యములు 3 : 19 (TEV)
ప్రభువు సముఖము నుండి విశ్రాంతికాలములు వచ్చునట్లును
అపొస్తలుల కార్యములు 3 : 20 (TEV)
మీకొరకు నియమించిన క్రీస్తుయేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారుమనస్సు నొంది తిరుగుడి.
అపొస్తలుల కార్యములు 3 : 21 (TEV)
అన్నిటికి కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆదినుండి తన పరిశుద్ధ ప్రవక్తలనోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసియై యుండుట ఆవశ్యకము.
అపొస్తలుల కార్యములు 3 : 22 (TEV)
మోషే యిట్లనెనుప్రభువైన దేవుడు నావంటి యొక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీకొరకు పుట్టించును; ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట విన వలెను.
అపొస్తలుల కార్యములు 3 : 23 (TEV)
ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండ సర్వనాశనమగుననెను.
అపొస్తలుల కార్యములు 3 : 24 (TEV)
మరియు సమూయేలు మొదలుకొని యెందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరు ఈ దినమునుగూర్చి ప్రకటించిరి.
అపొస్తలుల కార్యములు 3 : 25 (TEV)
ఆ ప్రవక్తలకును, దేవుడు అబ్రాహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నియు ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును, మీరు వారసులై యున్నారు.
అపొస్తలుల కార్యములు 3 : 26 (TEV)
దేవుడు తన సేవకుని పుట్టించి, మీలో ప్రతివానిని వాని దుష్టత్వమునుండి మళ్లించుటవలన మిమ్ము నాశీర్వదించుటకు ఆయనను మొదట మీయొద్దకు పంపెనని చెప్పెను.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26

BG:

Opacity:

Color:


Size:


Font: