అపొస్తలుల కార్యములు 4 : 1 (TEV)
వారు ప్రజలతో మాటలాడుచుండగా, యాజకులును దేవాలయపు అధిపతియు సద్దూకయ్యులును
అపొస్తలుల కార్యములు 4 : 2 (TEV)
వారు ప్రజ లకు బోధించుటయు, యేసునుబట్టి మృతులలోనుండి పునరు త్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారిమీదికివచ్చి
అపొస్తలుల కార్యములు 4 : 3 (TEV)
వారిని బలాత్కారముగా పట్టుకొని, సాయంకాలమైనందున మరునాటివరకు వారిని కావలిలో ఉంచిరి.
అపొస్తలుల కార్యములు 4 : 4 (TEV)
వాక్యము వినినవారిలో అనేకులు నమి్మరి. వారిలో పురుషుల సంఖ్య యించుమించు అయిదువేలు ఆయెను.
అపొస్తలుల కార్యములు 4 : 5 (TEV)
మరునాడు వారి అధికారులును పెద్దలును శాస్త్రులును యెరూషలేములో కూడుకొనిరి.
అపొస్తలుల కార్యములు 4 : 6 (TEV)
ప్రధాన యాజకుడైన అన్నయు కయపయు, యోహానును అలెక్సంద్రును ప్రధానయాజకుని బంధువులందరు వారితో కూడ ఉండిరి.
అపొస్తలుల కార్యములు 4 : 7 (TEV)
వారు పేతురును యోహానును మధ్యను నిలువబెట్టి మీరు ఏ బలముచేత ఏ నామమునుబట్టి దీనిని చేసితిరని అడుగగా
అపొస్తలుల కార్యములు 4 : 8 (TEV)
పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై యిట్లనెనుప్రజల అధికారులారా, పెద్దలారా,
అపొస్తలుల కార్యములు 4 : 9 (TEV)
ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమునుగూర్చి వాడు దేనివలన స్వస్థత పొందెనని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక
అపొస్తలుల కార్యములు 4 : 10 (TEV)
మీరందరును ఇశ్రాయేలు ప్రజలందరును తెలిసికొనవలసిన దేమనగా, మీరు సిలువవేసినట్టియు, మృతులలోనుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థతపొంది మీ యెదుట నిలుచుచున్నాడు.
అపొస్తలుల కార్యములు 4 : 11 (TEV)
ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే; ఆ రాయి మూలకు తలరాయి ఆయెను.
అపొస్తలుల కార్యములు 4 : 12 (TEV)
మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను.
అపొస్తలుల కార్యములు 4 : 13 (TEV)
వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, వారు యేసుతోకూడ ఉండినవారని గుర్తెరిగిరి.
అపొస్తలుల కార్యములు 4 : 14 (TEV)
స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడ నిలిచియుండుట చూచి యేమియు ఎదురు చెప్పలేకపోయిరి.
అపొస్తలుల కార్యములు 4 : 15 (TEV)
అప్పుడు సభ వెలుపలికి పొండని వారి కాజ్ఞాపించి తమలోతాము ఆలోచన చేసి
అపొస్తలుల కార్యములు 4 : 16 (TEV)
ఈ మనుష్యులను మనమేమి చేయుదము? వారిచేత ప్రసిద్ధమైన సూచకక్రియ చేయ బడియున్నదని యెరూషలేములో కాపురమున్న వారి కందరికి స్పష్టమే, అది జరుగలేదని చెప్పజ
అపొస్తలుల కార్యములు 4 : 17 (TEV)
అయినను ఇది ప్రజలలో ఇంక వ్యాపింపకుండుటకైఇకమీదట ఈ నామమునుబట్టి యే మనుష్యులతోనైనను మాటలాడ కూడదని మనము వారిని బెదరుపెట్టవలెనని చెప్పుకొనిరి.
అపొస్తలుల కార్యములు 4 : 18 (TEV)
అప్పుడు వారిని పిలిపించిమీరు యేసు నామమునుబట్టి యెంతమాత్రమును మాటలాడకూడదు, బోధింపనుకూడదని వారికాజ్ఞాపించిరి.
అపొస్తలుల కార్యములు 4 : 19 (TEV)
అందుకుపేతురును యోహానును వారినిచూచి దేవుని మాట వినుటకంటె మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి;
అపొస్తలుల కార్యములు 4 : 20 (TEV)
మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యుండలేమని వారికి ఉత్తరమిచ్చిరి;
అపొస్తలుల కార్యములు 4 : 21 (TEV)
ప్రజలందరు జరిగిన దానినిగూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి, వీరిని శిక్షించు విధమేమియు కనుగొన లేక వీరిని గట్టిగా బెదరించి విడుదలచేసిరి.
అపొస్తలుల కార్యములు 4 : 22 (TEV)
స్వస్థ పరచుట అను ఆ సూచకక్రియ యెవని విషయములో చేయబడెనో వాడు నలువది ఏండ్లకంటె ఎక్కువ వయస్సు గలవాడు.
అపొస్తలుల కార్యములు 4 : 23 (TEV)
వారు విడుదల నొంది తమ స్వజనులయొద్దకు వచ్చి, ప్రధానయాజకులును పెద్దలును తమతో చెప్పిన మాటల నన్నిటిని వారికి తెలిపిరి.
అపొస్తలుల కార్యములు 4 : 24 (TEV)
వారు విని, యేక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొఱపెట్టిరి. నాథా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసినవాడవు.
అపొస్తలుల కార్యములు 4 : 25 (TEV)
అన్యజనులు ఏల అల్లరి చేసిరి? ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి?
అపొస్తలుల కార్యములు 4 : 26 (TEV)
ప్రభువుమీదను ఆయన క్రీస్తుమీదను3 భూరాజులు లేచిరి, అధికారులును ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి.
అపొస్తలుల కార్యములు 4 : 27 (TEV)
ఏవి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో,
అపొస్తలుల కార్యములు 4 : 28 (TEV)
వాటి నన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి.
అపొస్తలుల కార్యములు 4 : 29 (TEV)
ప్రభువా, ఈ సమయమునందు వారి బెదరింపులు చూచి
అపొస్తలుల కార్యములు 4 : 30 (TEV)
రోగులను స్వస్థపరచుటకును, నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయు టకును నీ చెయ్యి చాచియుండగా, నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్ర హించుము.
అపొస్తలుల కార్యములు 4 : 31 (TEV)
వారు ప్రార్థనచేయగానే వారు కూడి యున్న చోటు కంపించెను; అప్పుడు వారందరు పరి శుద్ధాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి.
అపొస్తలుల కార్యములు 4 : 32 (TEV)
విశ్వసించినవారందరును ఏకహృదయమును ఏకాత్మయు గలవారై యుండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు; వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను.
అపొస్తలుల కార్యములు 4 : 33 (TEV)
ఇదియుగాక అపొస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరియందు అధికముగా ఉండెను.
అపొస్తలుల కార్యములు 4 : 34 (TEV)
భూములైనను ఇండ్లయినను కలిగినవారందరు వాటిని అమి్మ, అమి్మన వాటి వెలతెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టుచు వచ్చిరి.
అపొస్తలుల కార్యములు 4 : 35 (TEV)
వారు ప్రతివానికి వానివాని అక్కరకొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువలేకపోయెను.
అపొస్తలుల కార్యములు 4 : 36 (TEV)
కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒక డుండెను. ఇతనికి అపొస్తలులు, హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టియుండిరి. ఇతడు భూమిగలవాడై యుండి దానిని అమి్మ
అపొస్తలుల కార్యములు 4 : 37 (TEV)
దాని వెలతెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టెను.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37

BG:

Opacity:

Color:


Size:


Font: