అపొస్తలుల కార్యములు 6 : 1 (TEV)
ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయులమీద గ్రీకుభాష మాట్లాడు యూదులు సణుగసాగిరి.
అపొస్తలుల కార్యములు 6 : 2 (TEV)
అప్పుడు పండ్రెండుగురు అపొస్తలులు తమయొద్దకు శిష్యుల సమూహమును పిలిచిమేము దేవుని వాక్యము బోధించుట మాని, ఆహారము పంచిపెట్టుట యుక్తముకాదు.
అపొస్తలుల కార్యములు 6 : 3 (TEV)
కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచిపేరు పొందిన యేడుగురు మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము;
అపొస్తలుల కార్యములు 6 : 4 (TEV)
అయితే మేము ప్రార్థనయందును వాక్యపరిచర్యయందును ఎడతెగక యుందుమని చెప్పిరి.
అపొస్తలుల కార్యములు 6 : 5 (TEV)
ఈ మాట జనసమూహమంతటికి ఇష్టమైనందున వారు, విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనినవాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రొకొరు, నీకా నోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మతప్రవిష్టుడును అంతియొకయవాడును అగు నీకొలాసు అను వారిని ఏర్ప రచుకొని
అపొస్తలుల కార్యములు 6 : 6 (TEV)
వారిని అపొస్తలులయెదుట నిలువబెట్టిరి; వీరు ప్రార్థనచేసి వారిమీద చేతులుంచిరి.
అపొస్తలుల కార్యములు 6 : 7 (TEV)
దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూష లేములో బహుగా విస్తరించెను; మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి.
అపొస్తలుల కార్యములు 6 : 8 (TEV)
స్తెఫను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను.
అపొస్తలుల కార్యములు 6 : 9 (TEV)
అప్పుడు లిబెర్తీనులదనబడిన సమాజము లోను, కురేనీయుల సమాజములోను, అలెక్సంద్రియుల సమాజములోను, కిలికియనుండియు ఆసియనుండియు వచ్చినవారిలోను, కొందరు వచ్చి స్తెఫన
అపొస్తలుల కార్యములు 6 : 10 (TEV)
మాటలాడుటయందు అతడు అగపరచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి.
అపొస్తలుల కార్యములు 6 : 11 (TEV)
అప్పుడు వారువీడు మోషేమీదను దేవునిమీదను దూషణవాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుష్యులను కుదుర్చుకొని
అపొస్తలుల కార్యములు 6 : 12 (TEV)
ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతనిమీదికి వచ్చి
అపొస్తలుల కార్యములు 6 : 13 (TEV)
అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసికొనిపోయి అబద్ధపు సాక్షులను నిలువబెట్టిరి. వారుఈ మనుష్యుడెప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మ శాస్త్రమునకును విరోధముగా వ
అపొస్తలుల కార్యములు 6 : 14 (TEV)
ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడుచేసి, మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి.
అపొస్తలుల కార్యములు 6 : 15 (TEV)
సభలో కూర్చున్న వారందరు అతనివైపు తేరిచూడగా అతని ముఖము దేవదూత ముఖమువలె వారికి కనబడెను.
❮
❯