అపొస్తలుల కార్యములు 7 : 1 (TEV)
ప్రధానయాజకుడుఈ మాటలు నిజమేనా అని అడిగెను.
అపొస్తలుల కార్యములు 7 : 2 (TEV)
అందుకు స్తెఫను చెప్పినదేమనగాసహోదరు లారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రాహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతమియలో ఉన్నప్పుడు మహిమగల దేవుడ
అపొస్తలుల కార్యములు 7 : 3 (TEV)
నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి, నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను.
అపొస్తలుల కార్యములు 7 : 4 (TEV)
అప్పుడతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తరువాత, అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న యీ దేశమందు నివసించుటకై దేవు
అపొస్తలుల కార్యములు 7 : 5 (TEV)
ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక, అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని, అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరతునని అతనికి వాగ్దానము చేసెను.
అపొస్తలుల కార్యములు 7 : 6 (TEV)
అయితే దేవుడు అతని సంతానము అన్యదేశమందు పరవాసు లగుదురనియు, ఆ దేశస్థులు నన్నూరు సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధ పెట్టుదురనియు చెప్పెన
అపొస్తలుల కార్యములు 7 : 7 (TEV)
మరియు దేవుడుఏ జనము నకు వారు దాసులై యుందురో ఆ జనమును నేను విమర్శ చేయుదుననియు, ఆ తరువాత వారు వచ్చి ఈ చోటనన్ను సేవింతురనియు చెప్పెను.
అపొస్తలుల కార్యములు 7 : 8 (TEV)
మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతని కనుగ్రహించెను. అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున ఎనిమిదవ దినమందు అత నికి సున్నతిచేసెను; ఇస్సాకు యాకోబును యాకోబు పన్నిద్దరు గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసిరి.
అపొస్తలుల కార్యములు 7 : 9 (TEV)
ఆ గోత్రకర్తలు మత్సరపడి, యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమి్మవేసిరిగాని, దేవుడతనికి తోడైయుండి అతని శ్రమలన్నిటిలోనుండి తప్పించి
అపొస్తలుల కార్యములు 7 : 10 (TEV)
దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరోయెదుట అతనికి అను గ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన యింటికంతటికిని అతనిని అధిపతిగా నియమించెను.
అపొస్తలుల కార్యములు 7 : 11 (TEV)
తరువాత ఐగుప్తు దేశమంతటికిని కనాను దేశమంతటికిని కరవును బహు శ్రమయువచ్చెను గనుక మన పితరులకు ఆహారము లేకపోయెను.
అపొస్తలుల కార్యములు 7 : 12 (TEV)
ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని, మన పితరులను అక్కడికి మొదటి సారి పంపెను.
అపొస్తలుల కార్యములు 7 : 13 (TEV)
వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తన్ను తెలియజేసి కొనెను; అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చెను.
అపొస్తలుల కార్యములు 7 : 14 (TEV)
యోసేపు తన తండ్రియైన యాకోబును తన స్వజనులందరిని పిలువనంపెను; వారు డెబ్బదియయిదు గురు
అపొస్తలుల కార్యములు 7 : 15 (TEV)
యాకోబు ఐగుప్తునకు వెళ్లెను; అక్కడ అతడును మన పితరులును చనిపోయి అక్కడ నుండి షెకెమునకు తేబడి,
అపొస్తలుల కార్యములు 7 : 16 (TEV)
షెకెములోని హమోరు కుమారులయొద్ద అబ్రా హాము వెలయిచ్చికొనిన సమాధిలో ఉంచబడిరి.
అపొస్తలుల కార్యములు 7 : 17 (TEV)
అయితే దేవుడు అబ్రాహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించినకొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపును ఎరుగని వేరొకరాజు ఐగుప్తును ఏలనారంభి
అపొస్తలుల కార్యములు 7 : 18 (TEV)
ఇతడు మన వంశస్థుల యెడల కపటముగా ప్రవర్తించి
అపొస్తలుల కార్యములు 7 : 19 (TEV)
తమ శిశువులు బ్రదుకకుండ వారిని బయట పారవేయవలెనని మన పితరులను బాధ పెట్టెను.
అపొస్తలుల కార్యములు 7 : 20 (TEV)
ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్యసుందరుడై తన తండ్రి యింట మూడు నెలలు పెంచ బడెను.
అపొస్తలుల కార్యములు 7 : 21 (TEV)
తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసికొని తన కుమారునిగా పెంచు కొనెను.
అపొస్తలుల కార్యములు 7 : 22 (TEV)
మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, మాటలయందును కార్యములయందును ప్రవీణుడై యుండెను.
అపొస్తలుల కార్యములు 7 : 23 (TEV)
అతనికి నలువది ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను.
అపొస్తలుల కార్యములు 7 : 24 (TEV)
అప్పుడు వారిలో ఒకడు అన్యాయము ననుభవించుట అతడు చూచి, వానిని రక్షించి బాధపడినవాని పక్షమున ఐగుప్తీయుని చంపి ప్రతికారముచేసెను.
అపొస్తలుల కార్యములు 7 : 25 (TEV)
తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి.
అపొస్తలుల కార్యములు 7 : 26 (TEV)
మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి అయ్యలారా, మీరు సహోదరులు; మీరెందుకు ఒకనికొకడు అన్యాయము చేసికొనుచున్నారని చెప్పి వారిని సమాధానపరచ జూచెను.
అపొస్తలుల కార్యములు 7 : 27 (TEV)
అయినను తన పొరుగువానికి అన్యాయము చేసినవాడుమా మీద అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడు?
అపొస్తలుల కార్యములు 7 : 28 (TEV)
నీవు నిన్న ఐగుప్తీయుని చంపినట్టు నన్నును చంపదలచియున్నావా అని అతనిని త్రోసివేసెను.
అపొస్తలుల కార్యములు 7 : 29 (TEV)
మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశములో పరదేశియైయుండి, అక్కడ ఇద్దరు కుమారులను కనెను.
అపొస్తలుల కార్యములు 7 : 30 (TEV)
నలువది ఏండ్లయిన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికగపడెను.
అపొస్తలుల కార్యములు 7 : 31 (TEV)
మోషే చూచి ఆ దర్శనము నకు ఆశ్చర్యపడి దాని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా
అపొస్తలుల కార్యములు 7 : 32 (TEV)
నేను నీ పితరుల దేవుడను, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడెను గనుక మోషే వణకి, నిదానించి చూచుటకు తెగింప లేదు.
అపొస్తలుల కార్యములు 7 : 33 (TEV)
అందుకు ప్రభువునీ చెప్పులు విడువుము; నీవు నిలిచియున్నచోటు పరిశుద్ధభూమి.
అపొస్తలుల కార్యములు 7 : 34 (TEV)
ఐగుప్తులో నున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని; వారి మూలుగు వింటిని; వారిని విడిపించుటకు దిగివచ్చి యున్నాను; రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను.
అపొస్తలుల కార్యములు 7 : 35 (TEV)
అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించినవాడెవడని వారు నిరాకరించిన యీ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకునిగాను నియమించి పంపెను
అపొస్తలుల కార్యములు 7 : 36 (TEV)
ఇతడు ఐగుప్తులోను ఎఱ్ఱసముద్రములోను నలువది ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను.
అపొస్తలుల కార్యములు 7 : 37 (TEV)
నావంటి యొక ప్రవక్తను దేవుడు మీ సహోదరు లలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే యితడే.
అపొస్తలుల కార్యములు 7 : 38 (TEV)
సీనాయి పర్వతముమీద తనతో మాటలాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసికొనినవాడితడే.
అపొస్తలుల కార్యములు 7 : 39 (TEV)
ఇతనికి మన పితరులు లోబడనొల్లక యితనిని త్రోసివేసి, తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై
అపొస్తలుల కార్యములు 7 : 40 (TEV)
మాకు ముందు నడుచునట్టి దేవతలను మాకు చేయుము; ఐగుప్తు దేశములోనుండి మనలను తోడుకొని వచ్చిన యీ మోషే యేమాయెనో మాకు తెలియదని అహరోనుతో అనిరి.
అపొస్తలుల కార్యములు 7 : 41 (TEV)
ఆ దినములలో వారొక దూడను చేసికొని ఆ విగ్రహమునకు బలి నర్పించి, తమ చేతులతో నిర్మించిన వాటియందు ఉల్లసించిరి.
అపొస్తలుల కార్యములు 7 : 42 (TEV)
అందుకు దేవుడు వారికి విము ఖుడై ఆకాశసైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఈలాగు వ్రాయబడియున్నది.ఇశ్రాయేలు ఇంటివారలారామీర
అపొస్తలుల కార్యములు 7 : 43 (TEV)
మీరు పూజించుటకు చేసికొనిన ప్రతిమలైన మొలొకు గుడారమును రొంఫాయను దేవతయొక్క నక్షత్రమును మోసికొని పోతిరి గనుక బబులోను ఆవలికి మిమ్మును కొనిపోయెదను.
అపొస్తలుల కార్యములు 7 : 44 (TEV)
అతడు చూచిన మాదిరిచొప్పున దాని చేయవలెనని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము, సాక్ష్యపుగుడారము అరణ్యములో మన పితరులయొద్ద ఉండెను.
అపొస్తలుల కార్యములు 7 : 45 (TEV)
మన పితరులు తమ పెద్దలచేత దానిని తీసికొనిన వారై, దేవుడు తమ యెదుటనుండి వెళ్లగొట్టిన జనములను వారు స్వాధీనపరచుకొన్నప్పుడు, యెహోషువతోకూడ ఈ దేశములోనికి దానిని తీసికొనివచ్చిరి. అది దావీదు దినములవరకు ఉండెను.
అపొస్తలుల కార్యములు 7 : 46 (TEV)
అతడు దేవుని దయపొంది యాకోబుయొక్క దేవుని నివాసస్థలము కట్టగోరెను.
అపొస్తలుల కార్యములు 7 : 47 (TEV)
అయితే సొలొమోను ఆయనకొరకు మందిరము కట్టించెను.
అపొస్తలుల కార్యములు 7 : 48 (TEV)
అయినను ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నాకొరకు ఏలాటి మందిరము కట్టుదురు?నా విశ్రాంతి స్థలమేది?
అపొస్తలుల కార్యములు 7 : 49 (TEV)
ఇవన్నియు నా హస్తకృతములు కావా? అని ప్రభువు చెప్పుచున్నాడు
అపొస్తలుల కార్యములు 7 : 50 (TEV)
అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్త కృతాలయములలో నివసింపడు.
అపొస్తలుల కార్యములు 7 : 51 (TEV)
ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లనివారలారా, మీ పితరులవలె మీరును ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు.
అపొస్తలుల కార్యములు 7 : 52 (TEV)
మీ పితరులు ప్రవక్తలలో ఎవనిని హింసింపక యుండిరి? ఆ నీతిమంతుని రాకనుగూర్చి ముందు తెలిపినవారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసినవారైతిరి.
అపొస్తలుల కార్యములు 7 : 53 (TEV)
దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరిగాని దానిని గైకొనలేదని చెప్పెను.
అపొస్తలుల కార్యములు 7 : 54 (TEV)
వారీ మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లుకొరికిరి.
అపొస్తలుల కార్యములు 7 : 55 (TEV)
అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశమువైపు తేరిచూచి, దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటను చూచి
అపొస్తలుల కార్యములు 7 : 56 (TEV)
ఆకాశము తెరవబడుటయు, మనుష్యకుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటయు చూచుచున్నానని చెప్పెను.
అపొస్తలుల కార్యములు 7 : 57 (TEV)
అప్పుడు వారు పెద్ద కేకలువేసి చెవులు మూసికొని యేకముగా అతనిమీదపడి
అపొస్తలుల కార్యములు 7 : 58 (TEV)
పట్టణపు వెలుపలికి అతనిని వెళ్లగొట్టి, రాళ్లు రువి్వ చంపిరి. సాక్షులు సౌలు అను ఒక ¸°వనుని పాదములయొద్ద తమ వస్త్రములు పెట్టిరి.
అపొస్తలుల కార్యములు 7 : 59 (TEV)
ప్రభువును గూర్చి మొరపెట్టుచుయేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి.
అపొస్తలుల కార్యములు 7 : 60 (TEV)
అతడు మోకాళ్లూని ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను; ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను.
❮
❯