రోమీయులకు 4 : 1 (TEV)
కాబట్టి శరీరము విషయమై మన మూలపురుషుడగు అబ్రాహామునకేమి దొరికెనని అందుము.
రోమీయులకు 4 : 2 (TEV)
అబ్రాహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడినయెడల అతనికి అతిశయకారణము కలుగును గాని అది దేవుని యెదుట కలుగదు.
రోమీయులకు 4 : 3 (TEV)
లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రా హాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను
రోమీయులకు 4 : 4 (TEV)
పని చేయువానికి జీతము ఋణమేగాని దానమని యెంచ బడదు.
రోమీయులకు 4 : 5 (TEV)
పనిచేయక, భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వానియందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది.
రోమీయులకు 4 : 6 (TEV)
ఆ ప్రకారమే క్రియలు లేకుండ దేవుడెవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మను ష్యుడు ధన్యుడని దావీదుకూడ చెప్పుచున్నాడు.
రోమీయులకు 4 : 7 (TEV)
ఏలా గనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు.
రోమీయులకు 4 : 8 (TEV)
ప్రభువు చేత నిర్దోషియని ఎంచబడినవాడు ధన్యుడు,
రోమీయులకు 4 : 9 (TEV)
ఈ ధన్యవచనము సున్నతిగలవారినిగూర్చి చెప్పబడినదా సున్నతిలేనివారినిగూర్చికూడ చెప్ప బడినదా? అబ్రాహాము యొక్క విశ్వాస మతనికి నీతి అని యెంచబడెనను చున్నాము గదా?
రోమీయులకు 4 : 10 (TEV)
మంచిది; అది ఏ స్థితి యందు ఎంచ బడెను?సున్నతి కలిగి యుండినప్పుడా సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి యుండినప్పుడు కాదు సున్నతి లేనప్పుడే.
రోమీయులకు 4 : 11 (TEV)
మరియు సున్నతి లేని వారైనను, నమి్మనవారికందరికి అతడు తండ్రి యగుటవలన వారికి నీతి ఆరోపించుటకై, అతడు సున్నతి పొందకమునుపు, తనకు కలిగిన విశ్వాసమువలననైన నీతికి ముద్రగా, సున్నతి అను గురుతు పొందెను.
రోమీయులకు 4 : 12 (TEV)
మరియు సున్నతి గలవారికిని తండ్రియగుటకు, అనగా సున్నతిమాత్రము పొందినవారు గాక, మన తండ్రియైన అబ్రాహాము సున్నతి పొందకమునుపు అతనికి కలిగిన విశ్వాసముయొక్క అడుగు జాడలనుబట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు, అతడు ఆ గురుతు పొందెను.
రోమీయులకు 4 : 13 (TEV)
అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రా హామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రమూల ముగా కలుగలేదుగాని విశ్వాసమువలననైన నీతి మూలము గానే కలిగెను.
రోమీయులకు 4 : 14 (TEV)
ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన యెడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్థక మగును.
రోమీయులకు 4 : 15 (TEV)
ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టిం చును; ధర్మశాస్త్రము లేని యెడల అతిక్రమమును లేక పోవును.
రోమీయులకు 4 : 16 (TEV)
ఈ హేతువుచేతను ఆ వాగ్దానమును యావత్సం తతికి, అనగా ధర్మశాస్త్రముగలవారికి మాత్రముకాక అబ్రాహామునకున్నట్టి విశ్వాసముగలవారికికూడ దృఢము కావలెనని, కృప ననుసరించినదై యుండునట్లు, అది విశ్వాసమూలమైనదాయెను.
రోమీయులకు 4 : 17 (TEV)
తాను విశ్వసించిన దేవుని యెదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని యెదుట, అతడు మనకందరికి తండ్రియైయున్నాడుఇందును గూర్చినిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడియున్నది.
రోమీయులకు 4 : 18 (TEV)
నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పినదానినిబట్టి తాననేక జనములకు తండ్రి యగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను.
రోమీయులకు 4 : 19 (TEV)
మరియు అతడు విశ్వాసమునందు బల హీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సుగలవాడై యుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భéమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని,
రోమీయులకు 4 : 20 (TEV)
అవి శ్వాసమువలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక
రోమీయులకు 4 : 21 (TEV)
దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను.
రోమీయులకు 4 : 22 (TEV)
అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను.
రోమీయులకు 4 : 23 (TEV)
అది అతనికి ఎంచబడెనని అతని నిమిత్తము మాత్రమే కాదుగాని
రోమీయులకు 4 : 24 (TEV)
మన ప్రభువైన యేసును మృతులలోనుండి లేపినవానియందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తముకూడ వ్రాయ బడెను.
రోమీయులకు 4 : 25 (TEV)
ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింప బడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25

BG:

Opacity:

Color:


Size:


Font: