గలతీయులకు 4 : 1 (TEV)
మరియు నేను చెప్పునదేమనగా, వారసుడు అన్నిటికిని కర్తయైయున్నను బాలుడైయున్నంతకాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు.
గలతీయులకు 4 : 2 (TEV)
తండ్రిచేత నిర్ణయింపబడిన దినము వచ్చువరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహనిర్వాహకులయొక్కయు అధీనములో ఉండును.
గలతీయులకు 4 : 3 (TEV)
అటువలె మనమును బాలురమై యున్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై యుంటిమి;
గలతీయులకు 4 : 4 (TEV)
అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను;ఆయన స్త్రీయందు పుట్టి,
గలతీయులకు 4 : 5 (TEV)
మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి యున్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను.
గలతీయులకు 4 : 6 (TEV)
మరియు మీరు కుమారులై యున్నందుననాయనా తండ్రీ, అని మొఱ్ఱపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను.
గలతీయులకు 4 : 7 (TEV)
కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే. కుమారుడవైతే దేవునిద్వారా వారసుడవు.
గలతీయులకు 4 : 8 (TEV)
ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగనివారై, నిజమునకు దేవుళ్లు కానివారికి దాసులై యుంటిరి గాని
గలతీయులకు 4 : 9 (TEV)
యిప్పుడు మీరు దేవునిని ఎరిగినవారును, మరి విశేషముగా దేవునిచేత ఎరుగబడినవారునై యున్నారు గనుక, బల హీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూల పాఠములతట్టు మరల తిరుగనేల? మునుపటివలె మరల వాటికి దాసులైయుండ గోరనేల?
గలతీయులకు 4 : 10 (TEV)
మీరు దినములను, మాసములను,ఉత్సవకాలములను,సంవత్సరములను ఆచరించుచున్నారు.
గలతీయులకు 4 : 11 (TEV)
మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమై పోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను.
గలతీయులకు 4 : 12 (TEV)
సహోదరులారా, నేను మీవంటివాడనైతిని గనుక మీరును నావంటివారు కావలెనని మిమ్మును వేడు కొనుచున్నాను.
గలతీయులకు 4 : 13 (TEV)
మీరు నాకు అన్యాయము చేయలేదు. మొదటిసారి శరీరదౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితినని మీరెరుగుదురు.
గలతీయులకు 4 : 14 (TEV)
అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానినిబట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు గాని దేవుని దూతనువలెను, క్రీస్తుయేసునువలెను నన్ను అంగీక రిం
గలతీయులకు 4 : 15 (TEV)
మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకిచ్చివేసి యుందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను.
గలతీయులకు 4 : 16 (TEV)
నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా?
గలతీయులకు 4 : 17 (TEV)
వారు మీ మేలుకోరి మిమ్మును ఆసక్తితో వెంటాడువారు కారు; మీరే తమ్మును వెంటాడవలెనని మిమ్మును బయటికి త్రోసి వేయ6 గోరుచున్నారు.
గలతీయులకు 4 : 18 (TEV)
నేను మీయొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక యెల్లప్పుడును మంచి విషయములో ఆసక్తిగానుండుట యుక్తమే.
గలతీయులకు 4 : 19 (TEV)
నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీయందేర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవవేదన కలుగుచున్నది.
గలతీయులకు 4 : 20 (TEV)
మిమ్మునుగూర్చి యెటుతోచక యున్నాను; నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరియొక విధముగా మీతో మాటలాడ గోరుచున్నాను.
గలతీయులకు 4 : 21 (TEV)
ధర్మశాస్త్రమునకు లోబడియుండ గోరువారలారా, మీరు ధర్మశాస్త్రము వినుటలేదా? నాతో చెప్పుడి.
గలతీయులకు 4 : 22 (TEV)
దాసివలన ఒకడును స్వతంత్రురాలివలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రాహామునకు కలిగిరని వ్రాయబడియున్నది గదా?
గలతీయులకు 4 : 23 (TEV)
అయినను దాసివలన పుట్టినవాడు శరీరప్రకారము పుట్టెను, స్వతంత్రురాలివలన పుట్టినవాడు వాగ్దాన మునుబట్టి పుట్టెను.
గలతీయులకు 4 : 24 (TEV)
ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడియున్నవి. ఈ స్త్రీలు రెండు నిబంధనలై యున్నారు; వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును; ఇది హాగరు.
గలతీయులకు 4 : 25 (TEV)
ఈ హాగరు అనునది అరేబియాదేశములోఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడ దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటయియున్నది.
గలతీయులకు 4 : 26 (TEV)
అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది; అది మనకుతల్లి.
గలతీయులకు 4 : 27 (TEV)
ఇందుకుకనని గొడ్రాలా సంతోషించుము, ప్రసవవేదనపడని దానా, బిగ్గరగా కేకలువేయుము; ఏలయనగా పెనిమిటిగలదాని పిల్లలకంటె పెనిమిటి లేనిదాని పిల్లలు ఎక్కువమంది ఉన్నారు అని వ్రాయబడియున్నది.
గలతీయులకు 4 : 28 (TEV)
సహోదరులారా, మనమును ఇస్సాకువలె వాగ్దానమునుబట్టి పుట్టిన కుమారులమై యున్నాము.
గలతీయులకు 4 : 29 (TEV)
అప్పుడు శరీరమునుబట్టి పుట్టినవాడు ఆత్మనుబట్టి పుట్టినవానిని ఏలాగు హింసపెట్టెనో యిప్పుడును ఆలాగే జరుగుచున్నది.
గలతీయులకు 4 : 30 (TEV)
ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుచున్నది?దాసిని దాని కుమారుని వెళ్లగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితోపాటు వారసుడై యుండడు.
గలతీయులకు 4 : 31 (TEV)
కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమా రులమే గాని దాసి కుమారులము కాము.
❮
❯