ద్వితీయోపదేశకాండమ 27 : 1 (TEV)
మోషేయు ఇశ్రాయేలీయుల పెద్దలును ప్రజలతో ఇట్లనిరినేడు నేను మీకు విధించుచున్న ధర్మమును మీరాచరింపవలెను.
ద్వితీయోపదేశకాండమ 27 : 2 (TEV)
మీ దేవుడైన యెహోవా మీకిచ్చు చున్న దేశమున ప్రవేశించుటకు మీరు యొర్దాను దాటు దినమున మీరు పెద్దరాళ్లను నిలువ బెట్టి వాటిమీద సున్నము పూసి
ద్వితీయోపదేశకాండమ 27 : 3 (TEV)
నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నీవు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పాలు తేనెలు ప్రవహించు దేశమున ప్రవేశించుటకు నీవు ఏరు దాటినతరువాత ఈ ధర్మ శాస్త్రవాక్యములన్నిటిని వాటిమీద వ్రాయవలెను.
ద్వితీయోపదేశకాండమ 27 : 4 (TEV)
మీరు ఈ యొర్దాను దాటిన తరువాత నేను నేడు మీ కాజ్ఞాపించినట్లు ఈ రాళ్లను ఏబాలు కొండమీద నిలువబెట్టి వాటిమీద సున్నము పూయవలెను.
ద్వితీయోపదేశకాండమ 27 : 5 (TEV)
అక్కడ నీ దేవుడైన యెహో వాకు బలిపీఠమును కట్టవలెను. ఆ బలిపీఠమును రాళ్లతో కట్టవలెను; వాటిమీద ఇనుప పనిముట్టు పడకూడదు.
ద్వితీయోపదేశకాండమ 27 : 6 (TEV)
చెక్కని రాళ్లతో నీ దేవుడైన యెహోవాకు బలిపీఠమును కట్టి దానిమీద నీ దేవుడైన యెహోవాకు దహనబలుల నర్పింపవలెను.
ద్వితీయోపదేశకాండమ 27 : 7 (TEV)
మరియు నీవు సమాధానబలుల నర్పించి అక్కడ భోజనము చేసి నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను.
ద్వితీయోపదేశకాండమ 27 : 8 (TEV)
ఈ విధికి సంబంధించిన వాక్యము లన్నిటిని ఆ రాళ్లమీద బహు విశదముగా వ్రాయవలెను.
ద్వితీయోపదేశకాండమ 27 : 9 (TEV)
మరియు మోషేయు యాజకులైన లేవీయులును ఇశ్రాయేలీయులందరితో ఇట్లనిరిఇశ్రాయేలీయులారా, మీరు ఊరకొని ఆలకించుడి.
ద్వితీయోపదేశకాండమ 27 : 10 (TEV)
నేడు మీరు మీ దేవుడైన యెహోవాకు స్వజనమైతిరి గనుక మీ దేవు డైన యెహోవా మాట విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకొనవలెను.
ద్వితీయోపదేశకాండమ 27 : 11 (TEV)
ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించిన దేమనగా మీరు యొర్దాను దాటినతరువాత షిమ్యోను లేవి యూదా ఇశ్శాఖారు యోసేపు
ద్వితీయోపదేశకాండమ 27 : 12 (TEV)
బెన్యామీను గోత్ర ములవారు ప్రజలనుగూర్చి దీవెనవచనములను పలుకుటకై గెరిజీము కొండమీద నిలువవలెను.
ద్వితీయోపదేశకాండమ 27 : 13 (TEV)
రూబేను గాదు ఆషేరు జెబూలూను దాను నఫ్తాలి గోత్రములవారు శాప వచనములను పలుకుటకై ఏబాలు కొండమీద నిలువ వలెను.
ద్వితీయోపదేశకాండమ 27 : 14 (TEV)
అప్పుడు లేవీయులు యెహోవాకు హేయముగా శిల్పిచేతులతో
ద్వితీయోపదేశకాండమ 27 : 15 (TEV)
మలి చిన విగ్రహమునేగాని పోతవిగ్రహమునేగాని చేసి చాటున నుంచువాడు శాపగ్రస్తుడని యెలుగెత్తి ఇశ్రా యేలీయులందరితోను చెప్పగాఆమేన్‌ అనవలెను.
ద్వితీయోపదేశకాండమ 27 : 16 (TEV)
తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయు వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అన వలెను.
ద్వితీయోపదేశకాండమ 27 : 17 (TEV)
తన పొరుగువాని సరిహద్దురాయిని తీసివేయు వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అనవలెను.
ద్వితీయోపదేశకాండమ 27 : 18 (TEV)
గ్రుడ్డివాని త్రోవను తప్పించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అనవలెను.
ద్వితీయోపదేశకాండమ 27 : 19 (TEV)
పరదేశికేగాని తండ్రిలేనివానికేగాని విధవరాలికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అనవలెను.
ద్వితీయోపదేశకాండమ 27 : 20 (TEV)
తన తండ్రి భార్యతో శయనించువాడు తన తండ్రి కోకను విప్పినవాడు గనుక వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అనవలెను.
ద్వితీయోపదేశకాండమ 27 : 21 (TEV)
ఏ జంతువుతోనైనను శయనించువాడు శాపగ్రస్తు డని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అనవలెను.
ద్వితీయోపదేశకాండమ 27 : 22 (TEV)
తన సహోదరితో, అనగా తన తండ్రికుమార్తెతో గాని తన తల్లికుమార్తెతో గాని శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అనవలెను.
ద్వితీయోపదేశకాండమ 27 : 23 (TEV)
తన అత్తతో శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అనవలెను.
ద్వితీయోపదేశకాండమ 27 : 24 (TEV)
చాటున తన పొరుగువానిని కొట్టువాడు శాప గ్రస్తు డని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అనవలెను.
ద్వితీయోపదేశకాండమ 27 : 25 (TEV)
నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచము పుచ్చు కొనువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అనవలెను.
ద్వితీయోపదేశకాండమ 27 : 26 (TEV)
ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనక పోవుటవలన వాటిని స్థిరపరచనివాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అనవలెను.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26

BG:

Opacity:

Color:


Size:


Font: