ద్వితీయోపదేశకాండమ 32 : 1 (TEV)
ఆకాశమండలమా, చెవినొగ్గుము; నేను మాట లాడుదును భూమండలమా, నా నోటిమాట వినుము.
ద్వితీయోపదేశకాండమ 32 : 2 (TEV)
నా ఉపదేశము వానవలె కురియును నా వాక్యము మంచువలెను లేతగడ్డిమీద పడు చినుకులవలెను పచ్చికమీద కురియు వర్షమువలెను ఉండును.
ద్వితీయోపదేశకాండమ 32 : 3 (TEV)
నేను యెహోవా నామమును ప్రకటించెదను మన దేవుని మహాత్మ్యమును కొనియాడుడి.
ద్వితీయోపదేశకాండమ 32 : 4 (TEV)
ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు; ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నియు న్యాయములు ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు యథార్థవంతుడు.
ద్వితీయోపదేశకాండమ 32 : 5 (TEV)
వారు తమ్ము చెరుపుకొనిరి; ఆయన పుత్రులుకారు; వారు కళంకులు మూర్ఖతగల వక్రవంశము.
ద్వితీయోపదేశకాండమ 32 : 6 (TEV)
బుద్ధిలేని అవివేకజనమా, ఇట్లు యెహోవాకు ప్రతికారము చేయుదురా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా?ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను.
ద్వితీయోపదేశకాండమ 32 : 7 (TEV)
పూర్వదినములను జ్ఞాపకము చేసికొనుము తరతరముల సంవత్సరములను తలంచుకొనుము నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును; నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు.
ద్వితీయోపదేశకాండమ 32 : 8 (TEV)
మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభా గించినప్పుడు నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇశ్రాయేలీయుల లెక్కనుబట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను.
ద్వితీయోపదేశకాండమ 32 : 9 (TEV)
యెహోవా వంతు ఆయన జనమే ఆయన స్వాస్థ్యభాగము యాకోబే.
ద్వితీయోపదేశకాండమ 32 : 10 (TEV)
అరణ్యప్రదేశములోను భీకరధ్వనిగల పాడైన యెడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను.
ద్వితీయోపదేశకాండమ 32 : 11 (TEV)
పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను.
ద్వితీయోపదేశకాండమ 32 : 12 (TEV)
యెహోవా మాత్రము వాని నడిపించెను అన్యులయొక్క దేవుళ్లలో ఏ దేవుడును ఆయనతో కూడ ఉండలేదు.
ద్వితీయోపదేశకాండమ 32 : 13 (TEV)
భూమియొక్క ఉన్నతస్థలములమీద వాని నెక్కిం చెను పొలముల పంట వానికి తినిపించెను కొండబండనుండి తేనెను చెకుముకి రాతిబండనుండి నూనెను అతనికి జుఱ్ఱించెను.
ద్వితీయోపదేశకాండమ 32 : 14 (TEV)
ఆవు మజ్జిగను గొఱ్ఱమేకల పచ్చిపాలను గొఱ్ఱపిల్లల క్రొవ్వును బాషాను పొట్టేళ్లను మేకలను గోధుమల మెరికెల సారమును నీకిచ్చెను. నీవు త్రాగిన మద్యము ద్రాక్షలరసము.
ద్వితీయోపదేశకాండమ 32 : 15 (TEV)
యెషూరూను క్రొవ్వినవాడై కాలు జాడించెను నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను తన రక్షణ శైలమును తృణీకరించెను.
ద్వితీయోపదేశకాండమ 32 : 16 (TEV)
వారు అన్యుల దేవతలచేత ఆయనకు రోషము పుట్టిం చిరిహేయకృత్యములచేత ఆయనను కోపింపజేసిరి
ద్వితీయోపదేశకాండమ 32 : 17 (TEV)
వారు దేవత్వములేని దయ్యములకు తామెరుగని దేవతలకు క్రొత్తగా పుట్టిన దేవతలకు తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి.
ద్వితీయోపదేశకాండమ 32 : 18 (TEV)
నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి. నిన్ను కనిన దేవుని మరచితివి.
ద్వితీయోపదేశకాండమ 32 : 19 (TEV)
యెహోవా దానిని చూచెను. తన కూమారులమీదను కుమార్తెలమీదను క్రోధపడెను వారిని అసహ్యించుకొనెను.
ద్వితీయోపదేశకాండమ 32 : 20 (TEV)
ఆయన ఇట్లనుకొనెను నేను వారికి విముఖుడనై వారి కడపటిస్థితి యేమగునో చూచెదను వారు మూర్ఖచిత్తముగలవారు విశ్వాసములేని పిల్లలు.
ద్వితీయోపదేశకాండమ 32 : 21 (TEV)
వారు దైవము కానిదానివలన నాకు రోషము పుట్టిం చిరి తమ వ్యర్థప్రవర్తనవలన నాకు ఆగ్రహము పుట్టించిరి కాబట్టి జనముకానివారివలన వారికి రోషము పుట్టిం తును అవివేక జనమువలన వారికి కోపము పుట్టింతును.
ద్వితీయోపదేశకాండమ 32 : 22 (TEV)
నా కోపాగ్ని రగులుకొనును పాతాళాగాధమువరకు అది దహించును అది భూమిని దాని పంటను కాల్చును పర్వతముల పునాదులను రవలబెట్టును.
ద్వితీయోపదేశకాండమ 32 : 23 (TEV)
వారికి ఆపదలను విస్తరింపజేసెదను వారిమీద నా బాణములన్నిటిని వేసెదను.
ద్వితీయోపదేశకాండమ 32 : 24 (TEV)
వారు కరవుచేత క్షీణించుదురు మంటచేతను క్రూరమైన హత్యచేతను హరించి పోవు దురు బురదలో ప్రాకు పాముల విషమును మృగముల కోరలను వారిమీదికి రప్పించెదను.
ద్వితీయోపదేశకాండమ 32 : 25 (TEV)
బయట ఖడ్గమును లోపట భయమును ¸°వనులను కన్యకలను శిశువులను నెరిసిన తలవెండ్రు కలుగలవారిని నశింపజేయును.
ద్వితీయోపదేశకాండమ 32 : 26 (TEV)
వారిని దూరమునకు చెదరగొట్టెదను వారి పేరు మనుష్యులలో లేకుండచేసెదననుకొందును వారి విరోధులు నిజము గ్రహింపకుందురేమో
ద్వితీయోపదేశకాండమ 32 : 27 (TEV)
ఇదంతయు యెహోవా చేసినదికాదు మా బలముచేత వారిని గెలిచితివిు అని వారనుకొందు రేమో విరోధి గర్వమునకు భయపడి చెదరగొట్టలేదు.
ద్వితీయోపదేశకాండమ 32 : 28 (TEV)
వారు ఆలోచనలేని జనము వారిలో వివేచనలేదు.
ద్వితీయోపదేశకాండమ 32 : 29 (TEV)
వారు జ్ఞానము తెచ్చుకొని దీని తలపోసి తమ కడవరి స్థితి యోచించుట మేలు.
ద్వితీయోపదేశకాండమ 32 : 30 (TEV)
తమ ఆశ్రయదుర్గము వారిని అమి్మవేయనియెడల యెహోవా వారిని అప్పగింపనియెడల ఒక్కడు ఎట్లు వేయిమందిని తరుమును? ఇద్దరు ఎట్లు పదివేలమందిని పారదోలుదురు?
ద్వితీయోపదేశకాండమ 32 : 31 (TEV)
వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గమువంటిది కాదు ఇందుకు మన శత్రువులే తీర్పరులు.
ద్వితీయోపదేశకాండమ 32 : 32 (TEV)
వారి ద్రాక్షావల్లి సొదొమ ద్రాక్షావల్లి అది గొమొఱ్ఱా పొలములలో పుట్టినది. వారి ద్రాక్షపండ్లు పిచ్చి ద్రాక్షపండ్లు వాటి గెలలు చేదైనవి.
ద్వితీయోపదేశకాండమ 32 : 33 (TEV)
వారి ద్రాక్షారసము క్రూరసర్పముల విషము నాగుపాముల క్రూరవిషము.
ద్వితీయోపదేశకాండమ 32 : 34 (TEV)
ఇది నాయొద్ద మరుగుపడి యుండలేదా? నా నిధులలో ముద్రింపబడి యుండలేదా?
ద్వితీయోపదేశకాండమ 32 : 35 (TEV)
వారి కాలు జారుకాలమున పగతీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే; వారి ఆపద్దినము సమీపించును వారి గతి త్వరగా వచ్చును.
ద్వితీయోపదేశకాండమ 32 : 36 (TEV)
వారి కాధారము లేకపోవును.
ద్వితీయోపదేశకాండమ 32 : 37 (TEV)
నిర్బంధింపబడినవాడును స్వతంత్రుడును లేకపోవును యెహోవా చూచును తన సేవకులనుగూర్చి సంతాపపడును.
ద్వితీయోపదేశకాండమ 32 : 38 (TEV)
నిజముగా తన ప్రజలకు తీర్పుచేయును. ఆయనవారి నైవేద్యముల క్రొవ్వును తిని వారి పానీ యార్పణమైన ద్రాక్షారసమును త్రాగినవారి దేవత లేమైరి?వారు ఆశ్రయించిన దుర్గములే లేచి మీకు సహాయము చేయవచ్చునువారు మీకు శరణము కానియ్యుడి అని చెప్పును.
ద్వితీయోపదేశకాండమ 32 : 39 (TEV)
ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతినొందించువాడను బ్రదికించువాడను నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే నా చేతిలోనుండి విడిపించువాడెవడును లేడు
ద్వితీయోపదేశకాండమ 32 : 40 (TEV)
నేను తళతళలాడు నా ఖడ్గము నూరి నా చేత న్యాయమును పట్టుకొనినయెడల నా శత్రువులకు ప్రతీకారము కలుగజేసెదను
ద్వితీయోపదేశకాండమ 32 : 41 (TEV)
నన్ను ద్వేషించువారికి ప్రతిఫలమిచ్చెదను రక్తముచేత నా బాణములను మత్తిల్ల చేసెదను.
ద్వితీయోపదేశకాండమ 32 : 42 (TEV)
చంపబడినవారి రక్తమును చెరపట్టబడినవారి రక్తమును శత్రువులలో వీరుల తలలను నా ఖడ్గము భక్షించును నేను ఆకాశముతట్టు నా హస్తమెత్తి నా శాశ్వత జీవముతోడని ప్రమాణము చేయుచున్నాను.
ద్వితీయోపదేశకాండమ 32 : 43 (TEV)
జనములారా, ఆయన ప్రజలతోకూడ ఆనందించుడి. హతులైన తన సేవకులనుబట్టి ఆయన ప్రతిదండన చేయును తన విరోధులకు ప్రతీకారము చేయును తన దేశము నిమిత్తమును తన ప్రజలనిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయును.
ద్వితీయోపదేశకాండమ 32 : 44 (TEV)
మోషేయు నూను కుమారుడైన యెహోషువయు ఈ కీర్తన మాటలన్నియు ప్రజలకు వినిపించిరి.
ద్వితీయోపదేశకాండమ 32 : 45 (TEV)
మరియు మోషే యీ మాటలన్నియు ఇశ్రాయేలీయులందరితో చెప్పి చాలించి
ద్వితీయోపదేశకాండమ 32 : 46 (TEV)
మరల వారితో ఇట్లనెనుమీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటిని మీ మన స్సులలో పెట్టుకొని, మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనవలెనని వారి కాజ్ఞాపింపవలెను.
ద్వితీయోపదేశకాండమ 32 : 47 (TEV)
ఇది మీకు నిరర్థకమైన మాటకాదు, ఇది మీకు జీవమే. మరియు మీరు స్వాధీనపరచుకొను టకు యొర్దానును దాటబోవుచున్న దేశములో దీనినిబట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు.
ద్వితీయోపదేశకాండమ 32 : 48 (TEV)
ఆ దినమున యెహోవా మోషేతో ఇట్లనెను యెరికో యెదుటనున్న మోయాబుదేశమందలి అబారీ మను ఈ పర్వతము,
ద్వితీయోపదేశకాండమ 32 : 49 (TEV)
అనగా నెబోకొండ యెక్కి నేను ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న కనాను దేశమును చూచి
ద్వితీయోపదేశకాండమ 32 : 50 (TEV)
నీ సహోదరుడైన అహరోను హోరు కొండమీద మృతిబొంది తన స్వజనుల యొద్దకు చేరినట్లు నీవు ఎక్కబోవుచున్న కొండమీద మృతిబొంది నీ స్వజ నులయొద్దకు చేరుదువు.
ద్వితీయోపదేశకాండమ 32 : 51 (TEV)
ఏలయనగా మీరు సీను అరణ్య ములో కాదేషు మెరీబా నీళ్లయొద్ద ఇశ్రాయేలీయుల మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలీయుల మధ్యను నామీద తిరుగుబాటు చేసితిరి.
ద్వితీయోపదేశకాండమ 32 : 52 (TEV)
ఎదురుగా ఆ దేశమును చూచెదవు కాని నేను ఇశ్రాయేలీయుల కిచ్చుచున్న ఆ దేశమున నీవు ప్రవేశింపవు.
❮
❯