హెబ్రీయులకు 3 : 1 (TEV)
ఇందువలన, పరలోకసంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపొస్తలుడును ప్రధానయాజకుడునైన యేసుమీద లక్ష్యముంచుడి.
హెబ్రీయులకు 3 : 2 (TEV)
దేవుని యిల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు, ఈయనకూడ తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను.
హెబ్రీయులకు 3 : 3 (TEV)
ప్రతి యిల్లును ఎవడైన ఒకనిచేత కట్టబడును; సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటె దానిని కట్టిన వాడెక్కువ ఘనతపొందినట్టు,
హెబ్రీయులకు 3 : 4 (TEV)
ఈయన మోషేకంటె ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను.
హెబ్రీయులకు 3 : 5 (TEV)
ముందు చెప్పబోవు సంగతులకు సాక్ష్యార్థ ముగా మోషే పరిచారకుడైయుండి దేవుని యిల్లంతటిలో నమ్మకముగా ఉండెను.
హెబ్రీయులకు 3 : 6 (TEV)
అయితే క్రీస్తు కుమారుడైయుండి, ఆయన యింటిమీద నమ్మకముగా ఉన్నాడు; ధైర్యమును నిరీక్షణవలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినయెడల మనమే ఆయన యిల్లు.
హెబ్రీయులకు 3 : 7 (TEV)
మరియు పరి శుద్ధాత్మయిట్లు చెప్పుచున్నాడు.
హెబ్రీయులకు 3 : 8 (TEV)
నేడు మీరాయన శబ్దమును వినినయెడల, అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటివలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి.
హెబ్రీయులకు 3 : 9 (TEV)
నలువది సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి.
హెబ్రీయులకు 3 : 10 (TEV)
కావున నేను ఆ తరమువారివలన విసిగి వీరెల్లప్పుడును తమ హృదయాలోచనలలో తప్పిపోవుచున్నారు నా మార్గములను తెలిసికొనలేదు.
హెబ్రీయులకు 3 : 11 (TEV)
గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితిని.
హెబ్రీయులకు 3 : 12 (TEV)
సహోదరులారా, జీవముగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసములేని దుష్టహృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి.
హెబ్రీయులకు 3 : 13 (TEV)
నేడు మీరాయన శబ్దమును వినినయెడల, కోపము పుట్టించి నప్పటివలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనుక,
హెబ్రీయులకు 3 : 14 (TEV)
పాపమువలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లునేడు అనబడు సమయముండగానే, ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి.
హెబ్రీయులకు 3 : 15 (TEV)
ఏలయనగా మొదటనుండి మనకున్న దృఢ విశ్వాసము అంతముమట్టుకు గట్టిగా చేపట్టినయెడలనే క్రీస్తులో పాలివారమై యుందుము.
హెబ్రీయులకు 3 : 16 (TEV)
విని కోపము పుట్టించినవారెవరు? మోషేచేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చినవారందరే గదా
హెబ్రీయులకు 3 : 17 (TEV)
ఎవరిమీద నలువది ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసినవారి మీదనే గదా? వారి శవములు6 అరణ్యములో రాలి పోయెను.
హెబ్రీయులకు 3 : 18 (TEV)
తన విశ్రాంతిలో ప్రవేశింపరని యెవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైనవారినిగూర్చియే గదా
హెబ్రీయులకు 3 : 19 (TEV)
కాగా అవిశ్వాసముచేతనే వారు ప్రవేశింపలేక పోయిరని గ్రహించుచున్నాము.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19

BG:

Opacity:

Color:


Size:


Font: