యెహొషువ 15 : 1 (TEV)
యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున చీట్లవలన వచ్చినవంతు ఎదోము సరి హద్దువరకును, అనగా దక్షిణదిక్కున సీను అరణ్యపు దక్షిణ దిగంతము వరకును ఉండెను.
యెహొషువ 15 : 2 (TEV)
దక్షిణమున వారి సరిహద్దు ఉప్పు సముద్రతీరమున దక్షిణదిశ చూచుచున్న అఖాతము మొదలుకొని వ్యాపించెను.
యెహొషువ 15 : 3 (TEV)
అది అక్రబ్బీము నెక్కు చోటికి దక్షిణముగా బయలుదేరి సీనువరకు పోయి కాదేషు బర్నేయకు దక్షిణముగా ఎక్కి హెస్రోనువరకు సాగి అద్దారు ఎక్కి కర్కాయువైపు తిరిగి
యెహొషువ 15 : 4 (TEV)
అస్మోనువరకు సాగి ఐగుప్తు ఏటివరకు వ్యాపించెను. ఆ తట్టు సరిహద్దు సముద్రమువరకు వ్యాపించెను, అది మీకు దక్షిణపు సరి హద్దు.
యెహొషువ 15 : 5 (TEV)
దాని తూర్పు సరిహద్దు యొర్దాను తుదవరకు నున్న ఉప్పు సముద్రము. ఉత్తరదిక్కు సరిహద్దు యొర్దాను తుద నున్న సముద్రాఖాతము మొదలుకొని వ్యాపించెను.
యెహొషువ 15 : 6 (TEV)
ఆ సరిహద్దు బేత్‌ హోగ్లావరకు సాగి బేతరాబా ఉత్తర దిక్కువరకు వ్యాపించెను. అక్కడనుండి ఆ సరిహద్దు రూబేనీయుడైన బోహను రాతివరకు వ్యాపించెను.
యెహొషువ 15 : 7 (TEV)
ఆ సరిహద్దు ఆకోరులోయనుండి దెబీరువరకును ఏటికి దక్షిణతీరముననున్న అదుమీ్మము నెక్కుచోటికి ఎదురుగా నున్న గిల్గాలునకు అభిముఖముగా ఉత్తరదిక్కు వైపునకును వ్యాపించెను. ఆ సరిహద్దు ఏన్‌షే మెషు నీళ్లవరకు వ్యాపించెను. దాని కొన ఏన్‌రోగేలునొద్ద నుండెను.
యెహొషువ 15 : 8 (TEV)
ఆ సరిహద్దు పడమట బెన్‌హిన్నోములోయ మార్గముగా దక్షిణదిక్కున యెబూసీయుల దేశమువరకు, అనగా యెరూషలేమువరకు నెక్కెను. ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయకు ఎదురుగానున్న కొండ నడికొప్పువరకు వ్యాపించెను. అది ఉత్తర దిక్కున రెఫాయీయుల లోయ తుదనున్నది.
యెహొషువ 15 : 9 (TEV)
ఆ సరిహద్దు ఆ కొండ నడికొప్పునుండియు నెఫ్తోయ నీళ్లయూటయొద్దనుండియు ఏఫ్రోనుకొండ పురములవరకు వ్యాపించెను. ఆ సరిహద్దు కిర్యత్యారీమను బాలావరకు సాగెను.
యెహొషువ 15 : 10 (TEV)
ఆ సరిహద్దు పడమరగా బాలానుండి శేయీరు కొండకు వంపుగా సాగి కెసాలోనను యారీముకొండ యొక్క ఉత్తరపు వైపునకుదాటి బేత్షెమెషువరకు దిగి తిమ్నావైపునకు వ్యాపించెను.
యెహొషువ 15 : 11 (TEV)
ఉత్తరదిక్కున ఆ సరిహద్దు ఎక్రోనువరకు సాగి అక్కడనుండిన సరిహద్దు షిక్రోను వరకును పోయి బాలాకొండను దాటి యబ్నెయేలువరకును ఆ సరిహద్దు సముద్రమువరకును వ్యాపించెను.
యెహొషువ 15 : 12 (TEV)
పడమటి సరిహద్దు గొప్ప సముద్రపు సరిహద్దువరకు వ్యాపించెను. యూదా సంతతివారి వంశముల చొప్పున వారి సరిహద్దు ఇదే.
యెహొషువ 15 : 13 (TEV)
యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞచొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును, అనగా అనాకీయుల వంశకర్త యైన అర్బాయొక్క పట్టణమును ఇచ్చెను, అది హెబ్రోను.
యెహొషువ 15 : 14 (TEV)
అక్కడనుండి కాలేబు అనాకుయొక్క ముగ్గురు కుమారు లైన షెషయి అహీమాను తల్మయి అను అనాకీయుల వంశీ యులను వెళ్లగొట్టి వారిదేశమును స్వాధీనపరచుకొనెను.
యెహొషువ 15 : 15 (TEV)
అక్కడనుండి అతడు దెబీరు నివాసులమీదికి పోయెను. అంతకుముందు దెబీరు పేరు కిర్యత్సేఫెరు.
యెహొషువ 15 : 16 (TEV)
కాలేబుకిర్యత్సేఫెరును పట్టుకొని దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తెయైన అక్సాను ఇచ్చి పెండ్లిచేసెదనని చెప్పగా
యెహొషువ 15 : 17 (TEV)
కాలేబు సహోదరుడును కనజు కుమారుడునైన ఒత్నీ యేలు దాని పట్టుకొనెను గనుక అతడు తన కుమార్తెయైన అక్సాను అతనికిచ్చి పెండ్లిచేసెను.
యెహొషువ 15 : 18 (TEV)
మరియు ఆమె తన పెనిమిటి యింటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచినీకేమి కావలెనని ఆమె నడిగెను.
యెహొషువ 15 : 19 (TEV)
అందుకామెనాకు దీవెన దయచేయుము; నీవు నాకు దక్షిణభూమి యిచ్చి యున్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయుమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను.
యెహొషువ 15 : 20 (TEV)
యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యమిది.
యెహొషువ 15 : 21 (TEV)
దక్షిణదిక్కున ఎదోము సరిహద్దువరకు యూదా వంశస్థుల గోత్రముయొక్క పట్టణ ములు ఏవేవనగాకబ్సెయేలు
యెహొషువ 15 : 22 (TEV)
ఏదెరు యా గూరు కీనాది
యెహొషువ 15 : 23 (TEV)
మోనా అదాదా కెదెషు
యెహొషువ 15 : 24 (TEV)
హాసోరు యిత్నాను జీఫు
యెహొషువ 15 : 25 (TEV)
తెలెము బెయాలోతు క్రొత్త
యెహొషువ 15 : 26 (TEV)
హాసోరు కెరీయోతు హెస్రోను
యెహొషువ 15 : 27 (TEV)
అనబడిన హాసోరు అమాము
యెహొషువ 15 : 28 (TEV)
షేమ మోలాదా హసర్గద్దా హెష్మోను
యెహొషువ 15 : 29 (TEV)
బేత్పెలెతు హసర్షువలు బెయేర్షెబా
యెహొషువ 15 : 30 (TEV)
బిజ్యోత్యాబాలా ఈయ్యె ఎజెము
యెహొషువ 15 : 31 (TEV)
ఎల్తోలదు కెసీలు హోర్మా సిక్లగు మద్మన్నా
యెహొషువ 15 : 32 (TEV)
సన్సన్నా లెబాయోతు షిల్హిము అయీను రిమ్మోను అనునవి, వాటి పల్లెలు పోగా ఈ పట్ట ణములన్నియు ఇరువది తొమి్మది.
యెహొషువ 15 : 33 (TEV)
మైదానములో ఏవనగా ఎష్తాయోలు జొర్యా అష్నా
యెహొషువ 15 : 34 (TEV)
జానోహ ఏన్గన్నీము తప్పూయ ఏనాము
యెహొషువ 15 : 35 (TEV)
యర్మూతు అదు ల్లాము శోకో అజేకా
యెహొషువ 15 : 36 (TEV)
షరాయిము అదీతాయిము గెదేరా గెదెరోతాయిము అనునవి. వాటి పల్లెలు పోగా పదు నాలుగు పట్టణములు.
యెహొషువ 15 : 37 (TEV)
సెనాను హదాషా మిగ్దోల్గాదు
యెహొషువ 15 : 38 (TEV)
దిలాను మిస్పే యొక్తయేలు
యెహొషువ 15 : 39 (TEV)
లాకీషు బొస్కతు ఎగ్లోను
యెహొషువ 15 : 40 (TEV)
కబ్బోను లహ్మాసు కిత్లిషు గెదెరోతు
యెహొషువ 15 : 41 (TEV)
బేత్దాగోను నయమా మక్కేదా అనునవి, వాటి పల్లెలు పోగా పదియారు పట్ట ణములు.
యెహొషువ 15 : 42 (TEV)
లిబ్నా ఎతెరు ఆషాను యిప్తా అష్నానెసీబు
యెహొషువ 15 : 43 (TEV)
కెయీలా అక్జీబు మారేషా అనునవి,
యెహొషువ 15 : 44 (TEV)
వాటి పల్లెలు పోగా తొమి్మది పట్టణములు. ఎక్రోను దాని గ్రామములును పల్లెలును,
యెహొషువ 15 : 45 (TEV)
ఎక్రోను మొదలుకొని సముద్రమువరకు అష్డోదు ప్రాంత మంతయు,
యెహొషువ 15 : 46 (TEV)
దాని పట్టణములును గ్రామములును, ఐగుప్తు ఏటివరకు పెద్ద సముద్రమువరకును అష్డోదును,
యెహొషువ 15 : 47 (TEV)
గాజాను వాటి ప్రాంతమువరకును వాటి గ్రామములును పల్లెలును,
యెహొషువ 15 : 48 (TEV)
మన్య ప్రదేశమందు షామీరు యత్తీరు
యెహొషువ 15 : 49 (TEV)
శోకో దన్నా కిర్య త్సన్నా
యెహొషువ 15 : 50 (TEV)
అను దెబీరు అనాబు ఎష్టెమో
యెహొషువ 15 : 51 (TEV)
ఆనీము గోషెను హోలోను గిలో అనునవి,
యెహొషువ 15 : 52 (TEV)
వాటి గ్రామములు పోగా పదకొండు పట్టణములు.
యెహొషువ 15 : 53 (TEV)
ఆరాబు దూమా ఎషాను
యెహొషువ 15 : 54 (TEV)
యానీము బేత్తపూయ అఫెకా హుమ్తా కిర్యతర్బా అను హెబ్రోను సీయోరు అనునవి, వాటి పల్లెలు పోగా తొమి్మది పట్టణములు.
యెహొషువ 15 : 55 (TEV)
మాయోను కర్మెలు జీఫు యుట్టయెజ్రెయేలు
యెహొషువ 15 : 56 (TEV)
యొక్దె యాము జానోహ
యెహొషువ 15 : 57 (TEV)
కయీను గిబియా తిమ్నా అనునవి, వాటి పల్లెలు పోగా పది పట్టణములు.
యెహొషువ 15 : 58 (TEV)
హల్హూలు బేత్సూరు గెదోరు మారాతు
యెహొషువ 15 : 59 (TEV)
బేతనోతు ఎల్తెకోననునవి, వాటి పల్లెలు పోగా ఆరు పట్టణములు.
యెహొషువ 15 : 60 (TEV)
కిర్యత్యారీ మనగా కిర్యత్బయలు రబ్బా అనునవి, వాటి పల్లెలు పోగా రెండు పట్టణములు.
యెహొషువ 15 : 61 (TEV)
అరణ్యమున బేతరాబా మిద్దీను సెకాకా నిబ్షాను యీల్మెలహు ఎన్గెదీ అనునవి,
యెహొషువ 15 : 62 (TEV)
వాటి పల్లెలు పోగా ఆరు పట్టణములు.
యెహొషువ 15 : 63 (TEV)
యెరూషలేములో నివసించిన యెబూసీ యులను యూదా వంశస్థులు తోలివేయ లేకపోయిరి గనుక యెబూసీయులు నేటివరకు యెరూషలేములో యూదా వంశస్థులయొద్ద నివసించుచున్నారు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63

BG:

Opacity:

Color:


Size:


Font: