యెహొషువ 21 : 1 (TEV)
లేవీయుల పితరుల కుటుంబముల ప్రధానులు కనాను దేశమందలి షిలోహులో యాజకుడైన ఎలియాజరు నొద్ద కును, నూను కుమారుడైన యెహోషువ యొద్దకును, ఇశ్రాయేలీయుల గోత్రములయొక్క పితరుల కుటుంబముల ప్రధానులయొద్దకును వచ్చి
యెహొషువ 21 : 2 (TEV)
మేము నివసించుటకు పురములను మా పశువులకు పొలములను ఇయ్యవలెనని యెహోవా మోషేద్వారా ఆజ్ఞాపించెననగా
యెహొషువ 21 : 3 (TEV)
ఇశ్రా యేలీయులు యెహోవా మాటచొప్పున తమ స్వాస్థ్యము లలో ఈ పట్టణములను వాటి పొలములను లేవీయుల కిచ్చిరి.
యెహొషువ 21 : 4 (TEV)
వంతుచీటి కహాతీయుల వంశముల పక్షముగా వచ్చెను. లేవీయులలో యాజకుడైన అహరోను వంశకుల పక్ష ముగా యూదా గోత్రికులనుండియు, షిమ్యోను గోత్రి కులనుండియు, బెన్యామీను గోత్రికులనుండియు చీట్లవలన వచ్చినవి పదమూడు పట్టణములు.
యెహొషువ 21 : 5 (TEV)
కహాతీయులలో మిగిలిన వంశకుల పక్షముగా ఎఫ్రాయిము గోత్రికుల నుండియు, దాను గోత్రికుల నుండియు, మనష్షే అర్ధ గోత్రపువారినుండియు వంతుచీట్లవలన వచ్చినవి పది పట్ట ణములు.
యెహొషువ 21 : 6 (TEV)
ఇశ్శాఖారు గోత్రికులనుండియు, ఆషేరు గోత్రికుల నుండియు, నఫ్తాలి గోత్రికులనుండియు, బాషానులోనున్న మనష్షే అర్ధగోత్రపువారినుండియు చీట్లవలన గెర్షోనీయులకు కలిగినవి పదమూడు పట్టణములు.
యెహొషువ 21 : 7 (TEV)
రూబేను గోత్రి కులనుండియు, గాదు గోత్రికులనుం డియు, జెబూలూను గోత్రికులనుండియు, వారి వంశములచొప్పున మెరారీయు లకు కలిగినవిపండ్రెండు పట్టణములు.
యెహొషువ 21 : 8 (TEV)
యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు వంతు చీట్ల వలన ఆ పట్టణములను వాటి పొలములను లేవీయుల కిచ్చిరి.
యెహొషువ 21 : 9 (TEV)
వారు యూదావంశస్థుల గోత్రములోను షిమ్యోనీ యుల గోత్రములోను చెప్పబడిన పేరులుగల యీ పట్టణ ములను ఇచ్చిరి.
యెహొషువ 21 : 10 (TEV)
అవి లేవీయులైన కహాతీయుల వంశము లలో అహరోను వంశకులకు కలిగినవి, ఏలయనగా మొదట చేతికివచ్చిన వంతుచీటి వారిది.
యెహొషువ 21 : 11 (TEV)
యూదావంశస్థుల మన్య ములో వారికి కిర్యతర్బా, అనగా హెబ్రోను నిచ్చిరి. ఆ అర్బా అనాకు తండ్రి దాని చుట్టునున్న పొలమును వారి కిచ్చిరి.
యెహొషువ 21 : 12 (TEV)
అయితే ఆ పట్టణముయొక్క పొలములను దాని గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు స్వాస్థ్య ముగా ఇచ్చిరి.
యెహొషువ 21 : 13 (TEV)
యాజకుడైన అహరోను సంతానపువారికి వారు నర హంతకునికి ఆశ్రయపట్టణమైన హెబ్రోనును
యెహొషువ 21 : 14 (TEV)
దాని పొల మును లిబ్నాను దాని పొలమును యత్తీరును దాని పొల మును ఎష్టెమోయను దాని పొలమును హోలోనును దాని పొలమును
యెహొషువ 21 : 15 (TEV)
దెబీరును దాని పొలమును ఆయినిని దాని పొల మును యుట్టయును దాని పొలమును బేత్షెమెషును దాని పొలమును,
యెహొషువ 21 : 16 (TEV)
అనగా ఆ రెండు గోత్రములవారినుండి తొమి్మది పట్టణములను ఇచ్చిరి.
యెహొషువ 21 : 17 (TEV)
బెన్యామీను గోత్రము నుండి నాలుగు పట్టణములను అనగా గిబియోనును దాని పొలమును గెబను దాని పొలమును
యెహొషువ 21 : 18 (TEV)
అనాతోతును దాని పొలమును అల్మోనును దాని పొలమును ఇచ్చిరి.
యెహొషువ 21 : 19 (TEV)
యాజకు లైన అహరోను వంశకుల పట్టణములన్నియు వాటి పొల ములు పోగా పదమూడు పట్టణములు.
యెహొషువ 21 : 20 (TEV)
కహాతీయుల వంశపువారైన లేవీయులకు, అనగా కహాతు సంబంధులలో మిగిలినవారికి వంతుచీట్లవలన కలిగిన పట్టణములు ఎఫ్రాయిము గోత్రమునుండి వారికియ్యబడెను.
యెహొషువ 21 : 21 (TEV)
నాలుగు పట్టణములను, అనగా ఎఫ్రాయిమీ యుల మన్యదేశములో నరహంతకునికొరకు ఆశ్రయపట్టణ మైన షెకెమును దాని పొలమును గెజె రును దాని పొలమును
యెహొషువ 21 : 22 (TEV)
కిబ్సాయిమును దాని పొలమును బేత్‌హోరోనును దాని పొలమును వారికిచ్చిరి.
యెహొషువ 21 : 23 (TEV)
దాను గోత్రికులనుండి నాలుగు పట్టణములను, అనగా ఎత్తెకేను దాని పొలమును గిబ్బెతోనును దాని పొలమును
యెహొషువ 21 : 24 (TEV)
అయ్యాలోనును దాని పొలమును గత్రి మ్మోనును దాని పొలమును వారికిచ్చిరి.
యెహొషువ 21 : 25 (TEV)
రెండు పట్టణ ములును, అనగా మనష్షే అర్ధగోత్రికులనుండి తానా కును దాని పొలమును గత్రిమ్మోనును దాని పొల మును ఇచ్చిరి.
యెహొషువ 21 : 26 (TEV)
వాటి పొలములు గాక కహాతు సంబం ధులలో మిగిలినవారికి కలిగిన పట్టణములన్నియు పది.
యెహొషువ 21 : 27 (TEV)
లేవీయుల వంశములలో గెర్షోనీయులకు రెండు పట్టణ ములను, అనగా నరహంతకునికొరకు ఆశ్రయపట్టణమగు బాషానులోని గోలానును దాని పొలమును బెయెష్టెరాను దాని పొలమును ఇచ్చిరి.
యెహొషువ 21 : 28 (TEV)
ఇశ్శాఖారు గోత్రికుల నుండి నాలుగు పట్టణములను, అనగా కిష్యోనును దాని పొలమును దాబెరతును దాని పొలమును యర్మూతును దాని పొలమును
యెహొషువ 21 : 29 (TEV)
ఏన్గన్నీమును దాని పొలమును ఇచ్చిరి.
యెహొషువ 21 : 30 (TEV)
ఆషేరు గోత్రికులనుండి నాలుగు పట్టణములను, అనగా మిషెయలును దాని పొలమును అబ్దోనును దాని పొల మును
యెహొషువ 21 : 31 (TEV)
హెల్కతును దాని పొలమును రెహోబును దాని పొలమును ఇచ్చిరి.
యెహొషువ 21 : 32 (TEV)
నఫ్తాలి గోత్రికులనుండి మూడు పట్టణ ములను, అనగా నరహంతుకునికొరకు ఆశ్రయపట్టణమగు గలిలయలోని కెదెషును దాని పొలమును హమ్మోత్దోరును దాని పొలమును కర్తానును దాని పొలమును ఇచ్చిరి.
యెహొషువ 21 : 33 (TEV)
వారి వంశములచొప్పున గెర్షోనీయుల పట్టణములన్నియు వాటి పొలములుగాక పదమూడు పట్టణములు.
యెహొషువ 21 : 34 (TEV)
లేవీయులలో మిగిలిన మెరారీయుల వంశములకు జెబూలూను గోత్రములనుండి నాలుగు పట్టణములను, అనగా యొక్నెయాము దాని పొలమును
యెహొషువ 21 : 35 (TEV)
కర్తాను దాని పొలమును దిమ్నాను దాని పొలమును నహలాలును దాని పొలమును ఇచ్చిరి.
యెహొషువ 21 : 36 (TEV)
రూబేను గోత్రికుల నుండి నాలుగు పట్టణములను, అనగా బేసెరును దాని పొలమును యాహ సును దాని పొలమును
యెహొషువ 21 : 37 (TEV)
కెదెమోతును దాని పొలమును మేఫాతును దాని పొలమును ఇచ్చిరి.
యెహొషువ 21 : 38 (TEV)
గాదు గోత్రికుల నుండి నాలుగు పట్టణములును, అనగా నరహంతకునికొరకు ఆశ్రయపట్టణమగు గిలాదులోని రామోతును దాని పొల మును మహనయీమును దాని పొలమును
యెహొషువ 21 : 39 (TEV)
హెష్బోనును దాని పొలమును యాజెరును దాని పొలమును ఇచ్చిరి.
యెహొషువ 21 : 40 (TEV)
వారి వారి వంశములచొప్పున, అనగా లేవీయుల మిగిలిన వంశములచొప్పున అవన్నియు మెరారీయులకు కలిగిన పట్టణములు. వంతుచీటివలన వారికి కలిగిన పట్టణములు పండ్రెండు.
యెహొషువ 21 : 41 (TEV)
ఇశ్రాయేలీయుల స్వాస్థ్యములో వాటి పల్లెలుగాక లేవీయుల పట్టణములన్నియు నలువది యెనిమిది.
యెహొషువ 21 : 42 (TEV)
ఆ పట్టణములన్నిటికి పొలములుండెను. ఆ పట్టణములన్నియు అట్లేయుండెను.
యెహొషువ 21 : 43 (TEV)
యెహోవా ప్రమాణము చేసి వారి పితరుల కిచ్చెదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇశ్రా యేలీయుల కప్పగించెను. వారు దాని స్వాధీనపరచుకొని దానిలో నివసించిరి.
యెహొషువ 21 : 44 (TEV)
యెహోవా వారి పితరులతో ప్రమాణముచేసిన వాటన్నిటి ప్రకారము అన్నిదిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులనందరిని వారి చేతి కప్పగించియుండెను గనుక వారిలోనొకడును ఇశ్రాయేలీయులయెదుట నిలువ లేకపోయెను.
యెహొషువ 21 : 45 (TEV)
యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పియుండలేదు, అంతయు నెరవేరెను.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45

BG:

Opacity:

Color:


Size:


Font: