న్యాయాధిపతులు 4 : 1 (TEV)
ఏహూదు మరణమైనతరువాత ఇశ్రాయేలీయులు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి గనుక
న్యాయాధిపతులు 4 : 2 (TEV)
యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీనుచేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషెతులో నివసించిన సీసెరా.
న్యాయాధిపతులు 4 : 3 (TEV)
అతనికి తొమి్మదివందల ఇనుపరథము లుండెను. అతడు ఇరువది సంవత్సరములు ఇశ్రాయేలీయు లను కఠినమైన బాధపెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి.
న్యాయాధిపతులు 4 : 4 (TEV)
ఆ కాలమున లప్పీదోతునకు భార్యయైన దెబోరా అను ప్రవక్త్రి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతినిగా ఉండెను.
న్యాయాధిపతులు 4 : 5 (TEV)
ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమందలి రామా కును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళవృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుటకద్దు, తీర్పు చేయుటకై ఇశ్రా యేలీయులు ఆమెయొద్దకు వచ్చు చుండిరి.
న్యాయాధిపతులు 4 : 6 (TEV)
ఆమె నఫ్తాలి కెదెషులోనుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెనునీవువెళ్లి నఫ్తాలీయుల లోను జెబూలూనీయులలోను పదివేలమంది మనుష్యులను తాబోరు కొండయొద్దకు రప్పించుము;
న్యాయాధిపతులు 4 : 7 (TEV)
నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతియైన సీసెరాను అతని రథములను అతని సైన్యమను కీషోను ఏటియొద్దకు కూర్చి నీ చేతికి అత నిని అప్పగించెదనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చియుండలేదా? అని దెబోరా చెప్పగా
న్యాయాధిపతులు 4 : 8 (TEV)
బారాకు నీవు నాతోకూడ వచ్చిన యెడల నేను వెళ్లెదను గాని నీవు నాతో కూడ రాని యెడల నేను వెళ్లనని ఆమెతో చెప్పెను.
న్యాయాధిపతులు 4 : 9 (TEV)
అప్పుడు ఆమెనీతో నేను అగత్యముగా వచ్చెదను; అయితే నీవు చేయు ప్రయాణమువలన నీకు ఘనతకలుగదు, యెహోవా ఒక స్త్రీచేతికి సీసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడ కెదెషు నకు వెళ్లెను.
న్యాయాధిపతులు 4 : 10 (TEV)
బారాకు జెబూలూనీయులను నఫ్తాలీయు లను కెదెషు నకు పిలిపించినప్పుడు పదివేలమంది మనుష్యులు అతనివెంట వెళ్లిరి;
న్యాయాధిపతులు 4 : 11 (TEV)
దెబోరాయు అతనితోకూడ పోయెను. అంతకులోగా కయీనీయుడైన హెబెరు మోషే మామ యైన హోబాబు సంతతివారైన కయీనీయులనుండి వేరు పడి కెదెషునొద్దనున్న జయనన్నీములోని మస్తకివృక్షము నొద్ద తన గుడారమును వేసికొనియుండెను.
న్యాయాధిపతులు 4 : 12 (TEV)
అబీనో యము కుమారుడైన బారాకు తాబోరుకొండమీదికిపోయె నని సీసెరాకు తెలుపబడినప్పుడు సీసెరా తన రథములన్ని టిని తన తొమి్మదివందల ఇనుప రథములను
న్యాయాధిపతులు 4 : 13 (TEV)
అన్యుల హరో షెతునుండి కీషోను వాగువరకు తన పక్షముగా నున్న సమస్త జనమును పిలిపింపగా
న్యాయాధిపతులు 4 : 14 (TEV)
దెబోరాలెమ్ము, యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరునుగదా అని బారాకుతో చెప్పినప్పుడు, బారాకు ఆ పదివేలమంది మనుష్యులను వెంటబెట్టుకొని తాబోరు కొండ మీదినుండి దిగి వచ్చెను.
న్యాయాధిపతులు 4 : 15 (TEV)
బారాకు వారిని హతము చేయునట్లు యెహోవా సీసెరాను అతని రథములన్నిటిని అతని సర్వ సేనను కలవరపరచగా సీసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయెను.
న్యాయాధిపతులు 4 : 16 (TEV)
బారాకు ఆ రథములను సేనను అన్యుల హరోషెతువరకు తరుమగా సీసెరాయొక్క సర్వసేనయు కత్తివాత కూలెను, ఒక్కడైనను మిగిలియుండలేదు
న్యాయాధిపతులు 4 : 17 (TEV)
హాసోరురాజైన యాబీనుకును కయీనీయుడైన హెబెరు వంశస్థులకును సమాధానము కలిగియుండెను గనుక సీసెరా కాలినడకను కయీనీయుడగు హెబెరు భార్యయైన యాయేలు గుడారమునకు పారిపోయెను.
న్యాయాధిపతులు 4 : 18 (TEV)
అప్పుడు యాయేలు సీసెరాను ఎదుర్కొన బోయి అతనిని చూచి నా యేలినవాడా నాతట్టు తిరుగుము, తిరుగుము భయ పడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారమును జొచ్చెను.
న్యాయాధిపతులు 4 : 19 (TEV)
ఆమె గొంగళితో అతని కప్పగా అతడుదప్పికొనియున్నాను, దయచేసి దాహమునకు కొంచెము నీళ్లిమ్మని ఆమెనడిగెను. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతని కప్పుచుండగా
న్యాయాధిపతులు 4 : 20 (TEV)
అతడుగుడారపు ద్వారమున నిలిచి యుండుము; ఎవడేకాని లోపలికివచ్చియిక్కడ నెవడైననున్నాడా అని నిన్నడిగినయెడల నీవుఎవడును లేడని చెప్పవలెననెను.
న్యాయాధిపతులు 4 : 21 (TEV)
పిమ్మట హెబెరు భార్యయైన యాయేలు గుడారపు మేకు తీసికొని సుత్తె చేతపట్టు కొని అతనియొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢనిద్ర కలిగియుండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా
న్యాయాధిపతులు 4 : 22 (TEV)
అతడు చచ్చెను బారాకు సీసెరాను తరుముచుండగా యాయేలు అతనిని ఎదుర్కొన వచ్చిరమ్ము, నీవు వెదకుచున్న మనుష్యుని నీకు చూపిం చెదననగా అతడు వచ్చినప్పుడు సీసెరా చచ్చి పడి యుండెను, ఆ మేకు అతని కణతలలో నుండెను.
న్యాయాధిపతులు 4 : 23 (TEV)
ఆ దినమున దేవుడు ఇశ్రాయేలీయులయెదుట కనాను రాజైన యాబీనును అణచెను.
న్యాయాధిపతులు 4 : 24 (TEV)
తరువాత వారు కనాను రాజైన యాబీనును సంహరించువరకు ఇశ్రాయేలీయుల చెయ్యి కనాను రాజైన యాబీనుకు విరోధముగా అంతకంతకు హెచ్చుచువచ్చెను.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24

BG:

Opacity:

Color:


Size:


Font: