1 కొరింథీయులకు 1 : 1 (ERVTE)
దైవేచ్ఛవల్ల యేసు క్రీస్తు అపొస్తలుడుగా వుండటానికి పిలువబడ్డ పౌలు నుండి, మరియు సోదరుడైన సొసైవేసు నుండి.
1 కొరింథీయులకు 1 : 2 (ERVTE)
కొరింథులోని దేవుని సంఘానికి అంటే యేసు క్రీస్తులో పరిశుద్ధులుగా నుండుటకు పిలువబడిన మీకును, ఇతర ప్రాంతాల్లో నివసిస్తూ, యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్న వారందరికి శుభం కలుగు గాక!
1 కొరింథీయులకు 1 : 3 (ERVTE)
మన తండ్రియైన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు శాంతి, అనుగ్రహం లభించుగాక!
1 కొరింథీయులకు 1 : 4 (ERVTE)
యేసు క్రీస్తు ద్వారా మీకు తన అనుగ్రహం ప్రసాదించిన దేవునికి నేను మీ పక్షాన అన్ని వేళలా కృతజ్ఞతలు అర్పిస్తాను.
1 కొరింథీయులకు 1 : 5 (ERVTE)
మీరు ఆయనలో ఐక్యత పొందారు. కనుక మీ మాటలో, మీ జ్ఞానంలో అన్ని విధాలా అభివృద్ధి చెందారు.
1 కొరింథీయులకు 1 : 6 (ERVTE)
క్రీస్తును గురించి చెప్పబడిన సందేశం మీలో బాగా నాటుకుపోయింది.
1 కొరింథీయులకు 1 : 7 (ERVTE)
మరియు ప్రభువైన యేసు క్రీస్తు రెండవ రాకడ కొరకు మీరు కాచుకొని ఉన్నారు. ఆత్మీయ జ్ఞానానికి మీలో ఏ కొరతా లేదు.
1 కొరింథీయులకు 1 : 8 (ERVTE)
మన యేసు క్రీస్తు ప్రభువు వచ్చిన రోజున మీరు నిర్దోషులుగా పరిగణింపబడతారు. దానికి తగినట్లు దేవుడు మీకు చివరిదాకా శక్తినిస్తాడు.
1 కొరింథీయులకు 1 : 9 (ERVTE)
తన కుమారుడును, మన ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తుతో సహా వారసులగుటకు దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆయన నమ్మకస్తుడు.
1 కొరింథీయులకు 1 : 10 (ERVTE)
సోదరులారా! మీలో చీలికలు కలుగకుండా అంతా ఒకే మాటపై నిలబడండి. మీరంతా ఒకే ధ్యేయంతో, ఒకే మనస్సుతో ఉండాలని మన యేసు క్రీస్తు ప్రభువు పేరిట మిమ్మల్ని వేడుకొంటున్నాను.
1 కొరింథీయులకు 1 : 11 (ERVTE)
నా సోదరులారా! మీలో మీరు పోట్లాడుకుంటున్నారని క్లోయెకుటుంబం నాకు తెలియ చేసింది.
1 కొరింథీయులకు 1 : 12 (ERVTE)
నేను చెప్పేదేమిటంటే మీలో ఒకడు,”పౌలును అనుసరిస్తున్నానని’ ఇంకొకడు, ‘నేను అపొల్లోను అనుసరిస్తున్నానని” మరొకడు, నేను కేఫాను అనుసరిస్తున్నానని” నాలుగో వాడు, ‘నేను క్రీస్తును అనుసరిస్తున్నానని’ అంటున్నారు.
1 కొరింథీయులకు 1 : 13 (ERVTE)
అంటే క్రీస్తు భజింపబడ్డాడా?పౌలు మీకోసంసిలువపైచనిపొయ్యాడా? పౌలు పేరిట మీరు బాప్తిస్మము పొందారా?
1 కొరింథీయులకు 1 : 14 (ERVTE)
నేను క్రిస్పుకు, గాయియుకు తప్ప ఎవ్వరికీ బాప్తిస్మము నివ్వలేదు. అందుకు నేను దేవునికి కృతజ్ఞుణ్ణి.
1 కొరింథీయులకు 1 : 15 (ERVTE)
కనుక మీరు నా నామంలో బాప్తిస్మము పొందినట్లు ఎవ్వరూ అనలేరు.
1 కొరింథీయులకు 1 : 16 (ERVTE)
ఔను, నేను సైఫను కుటుంబానికి చెందిన వాళ్ళకు మాత్రమే బాప్తిస్మము ఇచ్చితిని. వీరికి తప్ప మరెవ్వరికైనా ఇచ్చితినేమో జ్ఞాపకం లేదు.
1 కొరింథీయులకు 1 : 17 (ERVTE)
ఎందుకంటే, క్రీస్తు బాప్తిస్మము యివ్వటానికి నన్ను పంపలేదు. సువార్త ప్రకటించటానికి పంపాడు. తెలివిగా మాట్లాడి బోధించటానికి నన్ను పంపలేదు. అలా చేస్తే క్రీస్తు సిలువకు ఉన్న శక్తి తగ్గిపోతుంది.
1 కొరింథీయులకు 1 : 18 (ERVTE)
ఎందుకంటే, క్రీస్తు సిలువను గురించిన సందేశము నశించిపోయే వాళ్ళకు నిష్ప్రయోజనంగా కనిపిస్తుంది. కాని రక్షింపబడుతున్న మనకు అది దేవుని శక్తి.
1 కొరింథీయులకు 1 : 19 (ERVTE)
దీన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది: ‘విజ్ఞానుల్లో ఉన్న విజ్ఞానాన్ని నేను నాశనం చేస్తాను. పండితుల్లో ఉన్న తెలివిని నిష్ప్రయోజనం చేస్తాను.’ యెషయా 29:14
1 కొరింథీయులకు 1 : 20 (ERVTE)
మరి విజ్ఞానులు ఏమయ్యారు? పండితులు ఏమయ్యారు? సమకాలిక తర్క శాస్త్రజ్ఞులు ఏమయ్యారు? అంటే, దేవుడు ఈ ప్రపంచంలో ఉన్న జ్ఞానం నిష్ప్రయోజనమని రుజువు చేసినట్లే కదా!
1 కొరింథీయులకు 1 : 21 (ERVTE)
తనను జ్ఞానంతో కనుక్కోవటం సాధ్యం కారాదని దేవుడే నిర్ణయించాడు. దానికి మారుగా ప్రజలు ‘మూర్ఖత్వం’ అని భావిస్తున్న ‘మా సందేశాన్ని’ విశ్వసించిన వాళ్ళు రక్షింపబడాలని ఆయన నిర్ణయించాడు.
1 కొరింథీయులకు 1 : 22 (ERVTE)
యూదులు మహిమలు అడుగుతారు. గ్రీకులు జ్ఞానాన్ని అన్వేషిస్తారు.
1 కొరింథీయులకు 1 : 23 (ERVTE)
మేమైతే, సిలువపైనున్న క్రీస్తును ప్రకటిస్తాము. మా సందేశం యూదులకు ఒక ఆటంకంగాను, యూదులుకాని వాళ్ళకు అర్థం లేని దానిగాను కనిపిస్తుంది.
1 కొరింథీయులకు 1 : 24 (ERVTE)
కాని దేవుడు పిలిచిన యూదులకు, యూదులుకాని వాళ్ళకు ‘క్రీస్తు’ దేవుని శక్తితో, ఆయన జ్ఞానంతో సమానము.
1 కొరింథీయులకు 1 : 25 (ERVTE)
దేవునికి అవివేకంలా కనిపించేది, నిజానికి మానవుని జ్ఞానం కన్నా శ్రేష్టమైనది. దేవుని బలహీనత మానవుల బలంకన్నా శక్తివంతమైనది.
1 కొరింథీయులకు 1 : 26 (ERVTE)
సోదరులారా! మిమ్నల్ని పిలిచినప్పుడు మీరు ఏ విధంగా ఉన్నారో జ్ఞాపకం ఉందా? ప్రపంచ మిమ్నల్ని జ్ఞానులుగా పరిగణించలేదు. మీకు పేరు ప్రతిష్టలు లేవు. మీరు ఉన్నత కుటుంబాలకు చెందలేదు.
1 కొరింథీయులకు 1 : 27 (ERVTE)
కాని దేవుడు విజ్ఞానుల్ని సిగ్గుపరచాలని, ప్రపంచంలోని మూర్ఖుల్ని ఎన్నుకొన్నాడు. బలవంతుల్ని సిగ్గుపరచాలని ప్రపంచంలోని బలహీనుల్ని ఎన్నుకొన్నాడు.
1 కొరింథీయులకు 1 : 28 (ERVTE)
ప్రపంచం ముఖ్యమైన వాళ్ళని భావిస్తున్న మనుష్యుల ప్రాముఖ్యతను తీసివేయటానికి, దేవుడు ఈ లోకంలో చిన్న చూపుతో చూడబడే వాళ్ళనూ, ఏవగించుకొనబడే వాళ్ళనూ, లెక్క చెయ్యబడని వాళ్ళను ఎన్నుకొన్నాడు.
1 కొరింథీయులకు 1 : 29 (ERVTE)
తనముందు ఎవ్వరూ గర్వించరాదని ఆయన ఉద్దేశ్యం.
1 కొరింథీయులకు 1 : 30 (ERVTE)
కాని దేవుని కారణంగా మీకు యేసు క్రీస్తులో ఐక్యత కలిగింది. దేవుడు క్రీస్తును మీకు జ్ఞానంగా యిచ్చాడు. క్రీస్తు మనకు నీతి, పవిత్రత, విమోచన కలిగిస్తాడు.
1 కొరింథీయులకు 1 : 31 (ERVTE)
అందువల్ల లేఖనాల్లో వ్రాయబడినట్లు. ‘గర్వించాలనుకొన్నవాడు ప్రభువు విషయంలో గర్వించాలి.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

BG:

Opacity:

Color:


Size:


Font: