1 కొరింథీయులకు 10 : 1 (ERVTE)
సోదరులారా! ఈ సత్యమును గ్రహించకుండా యుండుట నాకిష్టం లేదు. మన పూర్వీకులు మేఘం క్రింద యుండిరి. సముద్రాన్ని చీల్చి ఏర్పరచబడిన దారి మీద వాళ్ళు నడిచి వెళ్ళారు.
1 కొరింథీయులకు 10 : 2 (ERVTE)
వాళ్ళు మేఘంలో, సముద్రంలో బాప్తిస్మము పొందాక, మోషేలోనికి ఐక్యత పొందారు.
1 కొరింథీయులకు 10 : 3 (ERVTE)
అందరూ ఒకే ఆత్మీయ ఆహారం తిన్నారు.
1 కొరింథీయులకు 10 : 4 (ERVTE)
అందరూ ఒకే విధమైన ఆత్మీయ నీటిని త్రాగారు. ఈ నీటిని వాళ్ళ వెంటనున్న ఆత్మీయమైన బండ యిచ్చింది. ఆ బండ క్రీస్తే.
1 కొరింథీయులకు 10 : 5 (ERVTE)
అయినా వాళ్ళలో కొందరు మాత్రమే దేవునికి నచ్చిన విధంగా జీవించారు. మిగతా వాళ్ళు ఎడారిలో చనిపొయ్యారు.
1 కొరింథీయులకు 10 : 6 (ERVTE)
వాళ్ళలా మనం చెడు చేయరాదని వారించటానికి ఇవి దృష్టాంతాలు.
1 కొరింథీయులకు 10 : 7 (ERVTE)
కొందరు పూజించినట్లు మీరు విగ్రహాలను పూజించకండి. ధర్మశాస్త్రంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ప్రజలు తిని, త్రాగటానికి కూర్చొన్నారు. లేచి నృత్యం చేసారు.”
1 కొరింథీయులకు 10 : 8 (ERVTE)
మనం వాళ్ళు చేసినట్లు వ్యభిచారం చేయరాదు. వ్యభిచారం చెయ్యటం వల్ల ఒక్క రోజులో వాళ్ళలో ఇరవైమూడు వేలమంది మరణించారు.
1 కొరింథీయులకు 10 : 9 (ERVTE)
వాళ్ళు ప్రభువును శోధించిన విధంగా మనం శోధించరాదు. పరీక్షించిన వాళ్ళను పాములు చంపివేసాయి.
1 కొరింథీయులకు 10 : 10 (ERVTE)
వాళ్ళవలె సణగకండి. సణగిన వాళ్ళను మరణదూత చంపివేశాడు.
1 కొరింథీయులకు 10 : 11 (ERVTE)
మనకు దృష్టాంతముగా ఉండాలని వాళ్ళకు ఇవి సంభవించాయి. మనల్ని హెచ్చరించాలని అవి ధర్మశాస్త్రంలో వ్రాయబడ్డాయి. ఈ యుగాంతములో బ్రతుకుతున్న మనకు బుద్ధి కలుగుటకై ఇవి వ్రాయబడ్డాయి.
1 కొరింథీయులకు 10 : 12 (ERVTE)
కనుక గట్టిగా నిలుచున్నానని భావిస్తున్న వాడు క్రింద పడకుండా జాగ్రత్త పడాలి.
1 కొరింథీయులకు 10 : 13 (ERVTE)
మానవులకు సహజంగా సంభవించే పరీక్షలు తప్ప మీకు వేరే పరీక్షలు కలుగలేదు. దేవుడు నమ్మకస్తుడు. భరించగల పరీక్షలకన్నా, పెద్ద పరీక్షలు మీకు ఆయన కలుగనీయడు. అంతేకాక, పరీక్షా సమయం వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొని జయం పొందే మార్గం కూడా దేవుడు చూపుతాడు.
1 కొరింథీయులకు 10 : 14 (ERVTE)
కనుక నా ప్రియ మిత్రులారా! మీరు విగ్రహారాధనకు దూరంగా ఉండండి.
1 కొరింథీయులకు 10 : 15 (ERVTE)
మీరు తెలివిగల వాళ్ళు కనుక ఇలా మాట్లాడుతున్నాను. నేను చెపుతున్న వాటిని గురించి మీరే నిర్ణయించండి
1 కొరింథీయులకు 10 : 16 (ERVTE)
మనము కృతజ్ఞతతో దీవెన పాత్రనుండి త్రాగటం క్రీస్తు రక్తాన్ని పంచుకోవటము, కదా? మనము విరిచిన రొట్టెను పంచుకోవటము, క్రీస్తు శరీరాన్ని పంచుకోవటము కదా?
1 కొరింథీయులకు 10 : 17 (ERVTE)
రొట్టె ఒకటే గనుక ఆ ఒకే రొట్టెలో పాలుపొందే మనం అనేకులమైనప్పటికిని ఒకే శరీరమైయున్నాము.
1 కొరింథీయులకు 10 : 18 (ERVTE)
ఇశ్రాయేలు ప్రజల్ని చూడండి. బలి ఇచ్చిన దాన్ని తినేవాళ్ళు బలిపీఠానికి భాగస్వాములు కారా?
1 కొరింథీయులకు 10 : 19 (ERVTE)
మరి నేను చెపుతున్న దానికి అర్థం ఏమిటి? విగ్రహాల్లో కాని, ఆరగింపు చేసిన ప్రసాదంలో కాని, ఏదో ప్రత్యేకత ఉందని చెపుతున్నానా?
1 కొరింథీయులకు 10 : 20 (ERVTE)
లేదు. నేను చెపుతున్నది ఏమిటంటే యూదులుకాని వాళ్ళు బలిపీఠాలపై బలి ఇచ్చినవి దయ్యాల కోసం బలి ఇవ్వబడ్డాయి. అవి దేవునికి అర్పితం కావు. మీరు దయ్యాలతో భాగస్వాములు కారాదని నా విన్నపం.
1 కొరింథీయులకు 10 : 21 (ERVTE)
మీరు ప్రభువు పాత్రనుండి త్రాగుతూ దయ్యాల పాత్రనుండి కూడా త్రాగాలని ప్రయత్నించరాదు. మీరు ప్రభువు పంక్తిలో కూర్చొని భోజనం చేస్తూ దయ్యాల పంక్తిలో కూడా కూర్చోవటానికి ప్రయత్నం చేయరాదు.
1 కొరింథీయులకు 10 : 22 (ERVTE)
మనం దేవుని కోపాన్ని రేపటానికి ప్రయత్నిద్దామా? మనం ఆయన కంటే శక్తిగల వాళ్ళమా? ఎన్నటికీ కాదు.
1 కొరింథీయులకు 10 : 23 (ERVTE)
“మనకు ఏది చెయ్యటానికైనా స్వేచ్ఛ ఉంది” కాని అన్నీ లాభదాయకం కావు. “మనకు అన్నీ చెయ్యటానికి స్వేచ్ఛ ఉంది” కాని అన్నిటి వల్ల వృద్ధి కలుగదు.
1 కొరింథీయులకు 10 : 24 (ERVTE)
ఎవరూ తమ మంచి కొరకే చూసుకోరాదు. ఇతరుల మంచి కోసం కూడా చూడాలి.
1 కొరింథీయులకు 10 : 25 (ERVTE)
మీ మనస్సులు పాడు చేసుకోకుండా కటికవాని అంగడిలో అమ్మే ఏ మాంసాన్నైనా తినండి.
1 కొరింథీయులకు 10 : 26 (ERVTE)
“ఎందుకంటే ఈ భూమి, దానిలో ఉన్నవన్నీ ప్రభునివే.”
1 కొరింథీయులకు 10 : 27 (ERVTE)
క్రీస్తును విశ్వసించని వాడు మిమ్మల్ని భోజనానికి పిలిస్తే మీకు ఇష్టముంటే వెళ్ళండి. మనస్సుకు సంబంధించిన ప్రశ్నలు వేయకుండా మీ ముందు ఏది ఉంచితే అది తినండి.
1 కొరింథీయులకు 10 : 28 (ERVTE)
కాని ఎవరైనా మీతో, “ఇది విగ్రహాలకు ఆరగింపు పెట్టిన ప్రసాదం” అని అంటే, ఈ విషయం మీతో చెప్పినవాని కోసం, వాని మనస్సుకోసం దాన్ని తినకండి
1 కొరింథీయులకు 10 : 29 (ERVTE)
అంటే, మీ మనస్సు కోసం అని కాదు, ఆ చెప్పిన వాని మనస్సు కోసం దాన్ని తినకండి. నా స్వాతంత్ర్యం విషయంలో అవతలి వాని మనస్సు ఎందుకు తీర్పు చెప్పాలి?
1 కొరింథీయులకు 10 : 30 (ERVTE)
నేను కృతజ్ఞతలు అర్పించి భోజనం చెయ్యటం మొదలుపెడ్తాను. నేను కృతజ్ఞతలు అర్పించి తినే భోజనాన్ని గురించి ఇతరులు నన్నెందుకు విమర్శించాలి?
1 కొరింథీయులకు 10 : 31 (ERVTE)
కానీ మీరు తిన్నా, త్రాగినా, ఏది చేసినా అన్నీ దేవుని ఘనత కోసం చేయండి.
1 కొరింథీయులకు 10 : 32 (ERVTE)
యూదులకు గాని, యూదులుకాని వాళ్ళకు గాని, దేవుని సంఘానికి గాని, కష్టం కలిగించకుండా జీవించండి.
1 కొరింథీయులకు 10 : 33 (ERVTE)
నేను చేస్తున్నట్లు మీరు చెయ్యండి. నేను అన్ని పనులూ ఇతరులను సంతోషపెట్టాలని చేస్తాను. నా మంచి నేను చూసుకోను. వాళ్ళ మంచి కోసం చేస్తాను. వాళ్ళు రక్షింపబడాలని నా ఉద్దేశ్యం.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33

BG:

Opacity:

Color:


Size:


Font: