1 తిమోతికి 3 : 1 (ERVTE)
ఇక్కడొక నమ్మదగిన సంగతి: సంఘంలో పెద్ద కావాలనుకొన్నవాడు గొప్ప సంగతినే కోరుకొనుచున్నాడు.
1 తిమోతికి 3 : 2 (ERVTE)
పెద్దనిందకు చోటివ్వనివాడై ఉండాలి. అతడు ఏకపత్నీవ్రతుడై ఉండాలి. మితంగా జీవించాలి. వివేకవంతుడై ఉండాలి. సంఘంలో గౌరవం కలిగి ఉండాలి. ఇతర్లకు సహాయం చేస్తూ ఉండాలి. బోధించగల సామర్థ్యం ఉండాలి.
1 తిమోతికి 3 : 3 (ERVTE)
అలాంటివాడు మద్యం త్రాగరాదు. అతనిలో కోపానికి మారుగ వినయం ఉండాలి. పోట్లాడే గుణం ఉండకూడదు. ధనం మీద ఆశ ఉండకూడదు.
1 తిమోతికి 3 : 4 (ERVTE)
తన సంసారాన్ని సక్రమంగా నడుపుకోగలిగి ఉండాలి. అతడు, తన పిల్లలు తనపట్ల విధేయతగా ఉండేటట్లు, తనను మనస్పూర్తిగా గౌరవించేటట్లు చేసుకోవాలి.
1 తిమోతికి 3 : 5 (ERVTE)
తన సంసారాన్ని సక్రమంగా నడుపుకోలేనివాడు, దేవుని సంఘాన్ని ఏ విధంగా నడపగలడు? [PE][PS]
1 తిమోతికి 3 : 6 (ERVTE)
అతడు క్రొత్తగా నమ్మినవాడై ఉండకూడదు. అటువంటి వ్యక్తి ఉబ్బెక్కిపోయి సైతాను పొందిన శిక్షనే పొందవచ్చు.
1 తిమోతికి 3 : 7 (ERVTE)
సంఘానికి చెందని వాళ్ళలో కూడా అతనికి మంచి పేరు ఉండాలి. అప్పుడే అతడు చెడ్డ పేరు పొందకుండా సైతాను వలలో పడకుండా ఉంటాడు. [PE][PS]
1 తిమోతికి 3 : 8 (ERVTE)
అదే విధంగా సంఘ పరిచారకులు గౌరవింపదగిన వాళ్ళై ఉండాలి. నీతిపరులై ఉండాలి. త్రాగుబోతులు కాకూడదు. మోసాలు చేసి లాభాలు పొందేవాళ్ళు కాకూడదు.
1 తిమోతికి 3 : 9 (ERVTE)
దేవుడు చెప్పిన సత్యాలను వాళ్ళు పవిత్ర హృదయంతో ఆచరించాలి.
1 తిమోతికి 3 : 10 (ERVTE)
వాళ్ళు మొదట పరీక్షింపబడాలి. ఆ తర్వాత ఎవ్వరికీ ఏ ఆక్షేపణ లేనట్లయితే వాళ్ళను పరిచారకులుగా ఎన్నుకోవచ్చు. [PE][PS]
1 తిమోతికి 3 : 11 (ERVTE)
”అదే విధంగా పరిచర్యచేయు స్త్రీలు [*స్త్రీలు ఈ స్త్రీలు పరిచారకుల భార్యలైయుండవచ్చు. లేక పరిచారకులకు సహకరించే సహాయకులైయుండవచ్చు. విశేష సేవ చేయుటకు ఏర్పరచబడిన స్త్రీలు, రోమా 16:1 చూడండి.] కూడా గౌరవింపదగిన వాళ్ళై ఉండాలి. వాళ్ళు యితర్లను నిందిస్తూ మాట్లాడరాదు. అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. నమ్మదగిన వాళ్ళై ఉండాలి. [PE][PS]
1 తిమోతికి 3 : 12 (ERVTE)
పరిచారకుడు కూడా ఏకపత్నీ వ్రతుడై ఉండాలి. తన పిల్లల్ని, కుటుంబాన్ని సక్రమంగా నడపాలి.
1 తిమోతికి 3 : 13 (ERVTE)
ఆ విధంగా నడిపేవాళ్ళు క్రీస్తులో మంచి పేరు, బలమైన విశ్వాసం సంపాదించుకొంటారు. [PE][PS]
1 తిమోతికి 3 : 14 (ERVTE)
నేను నీ దగ్గరకు త్వరలోనే రావాలనుకొంటున్నాను. అయినా నేనీ ఆజ్ఞల్ని ఎందుకు వ్రాస్తున్నానంటే,
1 తిమోతికి 3 : 15 (ERVTE)
ఒకవేళ నేను రావటం ఆలస్యం అయితే ప్రజలు దేవుని కుటుంబంలో, అంటే సజీవుడైన దేవుని సంఘంలో ఏ విధంగా ప్రవర్తించాలో ఈ లేఖ ద్వారా నీకు తెలియజేస్తున్నాను. దేవుని సంఘం ఒక స్తంభంలాంటిది. అది సత్యానికి ఆధారమైనది.
1 తిమోతికి 3 : 16 (ERVTE)
ఆత్మీయతలో ఉన్న రహస్యం నిస్సందేహంగా చాలా గొప్పది. క్రీస్తు మానవ రూపం ఎత్తాడు. [QBR] పరిశుద్ధాత్మ వలన ఆయన నిజమైన నిర్దోషిగా నిరూపించబడ్డాడు. [QBR] దేవదూతలు ఆయన్ని చూసారు. [QBR] రక్షకుడని ఆయన గురించి ప్రజలకు ప్రకటింపబడింది. [QBR] ప్రజలు ఆయన్ని విశ్వసించారు. [QBR] ఆయన తన మహిమతో పరలోకానికి కొనిపోబడ్డాడు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

BG:

Opacity:

Color:


Size:


Font: