రాజులు రెండవ గ్రంథము 12 : 1 (ERVTE)
ఇశ్రాయేలు రాజుగా యెహూ పాలన సాగించిన ఏడవ సంవత్సరంనుండి యోవాషు తన పరిపాలన ప్రారంభించాడు. యెరూషలేములో యోవాషు 40 సంవత్సరములు పాలించాడు. యోవాషు తల్లి బెయేర్షెబాకు చెందిన జిబ్యా.
రాజులు రెండవ గ్రంథము 12 : 2 (ERVTE)
యెహోవా సరి అయినవని చెప్పిన పనుల యోవాషు జరిగించాడు. జీవితాంతమూ యోవాషు యెహోవా పట్ల విధేయుడై వుండెను. యాజకుడైన యెహోయాదా తనకు నేర్పించిన పనులు అతను చేశాడు.
రాజులు రెండవ గ్రంథము 12 : 3 (ERVTE)
కాని అతను ఉన్నత స్థానాలను నాశనం చెయ్యలేదు. ఆ ఆరాధనా స్థలాలలో నేటికీ ప్రజలు బలులు అర్పిస్తున్నారు, ధూపం వేస్తున్నారు.
రాజులు రెండవ గ్రంథము 12 : 4 (ERVTE)
[This verse may not be a part of this translation]
రాజులు రెండవ గ్రంథము 12 : 5 (ERVTE)
[This verse may not be a part of this translation]
రాజులు రెండవ గ్రంథము 12 : 6 (ERVTE)
కాని యాజకులు మరమ్మతులు చేయలేదు. యోవాషు రాజుగావున్న 23 సంవత్సరమున, యాజకులు అప్పటికి మరమ్మతులు చేయలేదు.
రాజులు రెండవ గ్రంథము 12 : 7 (ERVTE)
అందువల్ల యోవాషు రాజు యెహోయాదా యాజకుని, ఇతర యాజకులను పిలిపించుకున్నాడు. యెవాషు, యెహోయాదా, ఇతర యాజకులతో, “మీరెందుకు ఆలయాన్ని మరమ్మతు చేయలేదు? మీరు సేవించే మనుష్యుల వద్దనుండి మీరు డబ్బును తీసుకోవడం నిలిపివేయండి. ఆ డబ్బును వాడకండి. ఆలయాన్ని మరమ్మతు చేయుటకే అది వినియోగించ బడాలి” అని చెప్పాడు.
రాజులు రెండవ గ్రంథము 12 : 8 (ERVTE)
ప్రజలవద్ద నుండి డబ్బు వసూలు చేయడాన్ని ఆపివేయడానికి యాజకులు సమ్మతించారు. అయితే ఆలయాన్ని బాగు చేయకూడదని నిర్ణయించు కున్నారు.
రాజులు రెండవ గ్రంథము 12 : 9 (ERVTE)
అందువల్ల యాజకుడైన యెహోయాదా ఒక పెట్టె తీసుకుని దానిమీద ఒక రంధ్రం చేశాడు. తర్వాత యెహోయాదా బలిపీఠపు దక్షిణ దిశగా పెట్టెను ఉంచాడు. ఈ పెట్టె యెహోవా ఆలయానికి ప్రజలు వచ్చే ద్వారానికి పక్కగా వున్నది. కొందురు యాజకులు ఆలయంలోని ఆ ద్వారాన్ని కాపలా కాసారు. యెహోవాకి ప్రజలు సమర్పించిన డబ్బును ఆ యాజకులు తీసుకుని, ఆ పెట్టలో వేశారు.
రాజులు రెండవ గ్రంథము 12 : 10 (ERVTE)
తర్వాత ఆలయానికి వెళ్లినప్పుడల్లా ప్రజలు ఆ పెట్టెలో డబ్బు వేయడం మొదలుపెట్టారు. రాజుగారి కార్యదర్శి, ప్రధాన యాజకుడు ఆ పెట్టెలో డబ్బు చాలా ఉండడం చూసివప్పుడు, వారు ఆ పెట్టె నుండి డబ్బు తీసుకోసాగారు. వారు ఆ డబ్బుని సంచులలో వేసి లెక్కించారు.
రాజులు రెండవ గ్రంథము 12 : 11 (ERVTE)
యెహోవా ఆలయాన పనిచేసే వారికి వారు ఆ డబ్బు ఇచ్చి వేశారు. వడ్రంగులు మరి ఇతర ఆలయ కాపరులకు డబ్బు ఇచ్చారు.
రాజులు రెండవ గ్రంథము 12 : 12 (ERVTE)
రాళ్లు చెక్కే వారికి రాళ్లు మోసేవారికి ఇవ్వడానికి ఆ డబ్బు వినియోగించారు. మరియు కలపకొనడానికి, రాళ్లు ముక్కలు చేయడానికి, ఆలయ మరమ్మతు పనులకు వారు ఆ డబ్బు వినియోగించారు.
రాజులు రెండవ గ్రంథము 12 : 13 (ERVTE)
[This verse may not be a part of this translation]
రాజులు రెండవ గ్రంథము 12 : 14 (ERVTE)
[This verse may not be a part of this translation]
రాజులు రెండవ గ్రంథము 12 : 15 (ERVTE)
ఆ డబ్బునంతా ఎవ్వరూ లెక్కించలేదు. ఆ డబ్బు ఏమి చేయబడినదో చెప్పమని ఏ పనివానిని నిర్భంధించ లేదు. ఎందుకనగా పనివారు నమ్మకస్థులుగా ఉన్నారు.
రాజులు రెండవ గ్రంథము 12 : 16 (ERVTE)
అపరాధ పరహారార్థ బలులు, పాపపరిహారార్థ బలులు సమర్పించు సమయములో ప్రజలు ఆ డబ్బు ఇచ్చారు. ఆ డబ్బు పనివారికి ఇవ్వబడడం జరిగేదికాదు. ఆ డబ్బు యాజకులకు చెందినది.
రాజులు రెండవ గ్రంథము 12 : 17 (ERVTE)
సిరియారాజు హాజాయేలు. గాతు నగరానికి ప్రతి కూలంగా యుద్ధం చేయడానికి హజాయేలు వెళ్లాడు. హజాయేలు గాతుని ఓడించాడు. తర్వాత అతను యెరూషలేముకు ప్రతికూలంగా యుద్ధం చేయడానికి నిశ్చయించాడు.
రాజులు రెండవ గ్రంథము 12 : 18 (ERVTE)
యెహోషాపాతు, యెహోరాము అహజ్యాలు యూదా రాజులుగా వున్నారు. వారు యోవాషు పూర్వికులు. వారు యెహోవాకు చాలా వస్తువులు సమర్పించారు. ఆ వస్తువులు ఆలయంలో ఉంచబడ్డాయి. యోవాషు కూడా చాలా వస్తువులు యెహోవాకు సమర్పించాడు. యోవాషు ఆలయంలోవున్న అన్ని వస్తువులు, బంగారం తీసుకున్నాడు. తన యింట్లో ఉన్న వాటిని కూడా తీసుకున్నాడు. తర్వాత యోవాషు ఆ విలువగల వస్తువులు సిరియా రాజైన హజాయేలుకి పంపాడు. అప్పుడు హజాయేలు యెరూషలేమునుండి వెళ్లిపోయాడు.
రాజులు రెండవ గ్రంథము 12 : 19 (ERVTE)
యోవాషు చేసిన అన్ని ఘనకార్యాలు ‘యూదా రాజుల చరిత్ర’ అనే గ్రంథంలో వ్రాయబడినవి.
రాజులు రెండవ గ్రంథము 12 : 20 (ERVTE)
యోవాషు అధికారులు అతనికి విరుద్ధంగా పథకం వేశారు. వారు సిల్లాకి వెళ్లే మార్గమున ఉన్న ‘మిల్లో’ అనే ఇంట్లో యోవాషును చంపివేశారు.
రాజులు రెండవ గ్రంథము 12 : 21 (ERVTE)
షిమాతు కుమారుడైన యోజాకారు , షోమేరు కుమారుడైన యెహోజాబాదు యోవాషు అధికారులు. వారు యోవాషుని చంపివేశారు. దావీదు నగరంలో అతని పూర్వికులతో పాటుగా యోవాషుని సమాధి చేశారు. యోవాషు కుమారుడైన అహాజ్యా అతని తర్వాత కొత్తగా రాజయ్యాడు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21

BG:

Opacity:

Color:


Size:


Font: