సమూయేలు రెండవ గ్రంథము 22 : 1 (ERVTE)
{దావీదు యెహోవాను స్తుతించడం} [PS] యెహోవా దావీదును సౌలు నుండి, తదితర శత్రువుల బారి నుండి తప్పించాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని దావీదు ఈ స్తుతిగీతం ఆలపించాడు:
సమూయేలు రెండవ గ్రంథము 22 : 2 (ERVTE)
యెహోవా నా కొండ, నా కోట, నా రక్షకుడు! [QBR2]
సమూయేలు రెండవ గ్రంథము 22 : 3 (ERVTE)
సహాయంకొరకు నేనాయనను ఆశ్రయిస్తాను! [QBR] ఆయన నా రక్షణ దుర్గం! దేవుడు నా రక్షణ స్థలం! [QBR2] ఆయన శక్తి నన్ను రక్షిస్తుంది! [*ఆయన శక్తి నన్ను రక్షిస్తుంది ఆయనే నాకు మోక్ష మార్గం అని పాఠాంతరం.] [QBR] యెహోవా నా ఉన్నత దుర్గము ఆయన నా భద్రమైన తావు. [QBR2] నాకు కీడు రాకుండా కాపాడే రక్షకుడు! [QBR]
సమూయేలు రెండవ గ్రంథము 22 : 4 (ERVTE)
యెహోవా స్తుతింపబడుగాక! [QBR2] ఆదుకొమ్మని యెహోవాను వేడుకున్నాను [QBR2] దేవుడు నా శత్రువుల బారి నుండి నన్ను రక్షించును!
సమూయేలు రెండవ గ్రంథము 22 : 5 (ERVTE)
మృత్యు తరంగాలు నన్ను చుట్టుముట్టాయి, కష్టాలు ముంచుకొచ్చాయి. [QBR2] అవి నన్ను బెదరగొట్టాయి! [QBR]
సమూయేలు రెండవ గ్రంథము 22 : 6 (ERVTE)
సమాధి ఉచ్చులు నాచుట్టూ బిగిశాయి, [QBR2] మృత్యు మాయలో చిక్కుకున్నాను! [QBR]
సమూయేలు రెండవ గ్రంథము 22 : 7 (ERVTE)
నేను కష్టాల ఊబిలో వున్నాను. అయినా నేను యెహోవాని అర్థించాను. [QBR2] అవును, నేను నా దేవుని పిలిచాను! [QBR] ఆయన తన ఆలయంలో వున్నాడు, ఆయన నా మొరాలకించాడు; [QBR2] నా ఆక్రందన ఆయన చెవులను చేరింది. [QBR]
సమూయేలు రెండవ గ్రంథము 22 : 8 (ERVTE)
భూమి విస్మయం చెంది, కంపించింది, [QBR2] పరలోకపు పునాదులు కదిలి పోయాయి, [QBR2] యెహోవా కోపావేశుడైన కారణాన! [QBR]
సమూయేలు రెండవ గ్రంథము 22 : 9 (ERVTE)
ఆయన ముక్కు రంధ్రాల నుండి పొగబారింది, [QBR2] ఆయన నోటి నుండి [QBR2] అగ్ని శిఖలు వెలువడ్డాయి. [QBR]
సమూయేలు రెండవ గ్రంథము 22 : 10 (ERVTE)
ఆకాశమును ఛేదించుకొని ఆయన భువికి దిగి వచ్చాడు! [QBR2] ఆయన ఒక కారు మేఘముపై నిలబడ్డాడు! [QBR]
సమూయేలు రెండవ గ్రంథము 22 : 11 (ERVTE)
యెహోవా కెరూబు దూతల మీద వేగంగా వచ్చాడు; [QBR2] అవును, ఆయన గాలి రెక్కలపై పయనించటం ప్రజలు చూసారు! [QBR]
సమూయేలు రెండవ గ్రంథము 22 : 12 (ERVTE)
యెహోవా కారుచీకటిని తన చుట్టూ డేరావలె కప్పుకున్నాడు. [QBR2] ఆయన వానమబ్బులను ఆకాశంలో పోగు చేస్తాడు. [QBR]
సమూయేలు రెండవ గ్రంథము 22 : 13 (ERVTE)
ఆయన తేజస్సు బొగ్గులను [QBR2] మండింప చేసింది! [QBR]
సమూయేలు రెండవ గ్రంథము 22 : 14 (ERVTE)
యెహోవా ఆకాశంలో గర్జించాడు [QBR2] ఆ సర్వోన్నతుడు మాట్లాడాడు! [QBR]
సమూయేలు రెండవ గ్రంథము 22 : 15 (ERVTE)
యెహోవా బాణములు వేసి శత్రువులను చెల్లాచెదరు చేశాడు. [QBR2] యెహోవా మెరుపులను ప్రసరింప చేశాడు, వారు భయకంపితులై పారిపోయారు.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 16 (ERVTE)
అప్పుడు ప్రజలు సముద్రపు అడుగును చూడ గలిగారు, [QBR2] భూమి పునాదులు బహిర్గతమయ్యాయి.! [QBR] యెహోవా గర్జించగా అవన్నియూ జరిగాయి, [QBR2] ఆయన నాసికారంధ్రముల నుండి వెలువడిన వేడిగాల్పులకు అలా జరిగాయి!
సమూయేలు రెండవ గ్రంథము 22 : 17 (ERVTE)
యెహోవా ఆకాశం నుండి చేయిచాచి నన్ను పట్టుకున్నాడు! [QBR2] అనంత జలరాసుల నుండి నన్ను వెలికి తీశాడు; [QBR]
సమూయేలు రెండవ గ్రంథము 22 : 18 (ERVTE)
నాబద్ధ శత్రువు నుండి, నన్ను ద్వేషించు వారి నుండి ఆయన నన్ను కాపాడాడు. [QBR2] నా శత్రువులు నిజానికి నా శక్తికి మించిన వారు, కావున వారి నుండి ఆయన నన్ను కాపాడాడు! [QBR]
సమూయేలు రెండవ గ్రంథము 22 : 19 (ERVTE)
నా కష్టకాలంలో శత్రువులు నన్నెదిరించగా యెహోవా నన్నాదుకున్నాడు! [QBR2]
సమూయేలు రెండవ గ్రంథము 22 : 20 (ERVTE)
నాకు నిర్భయత్వమును కలుగ జేశాడు. [QBR] ఆయనకు నేను ప్రీతిపాత్రుడను గనుక ఆయన నన్ను కాపాడాడు. [QBR2] నేను న్యాయ బద్దమైన పనులు చేయుటచే యెహోవా నన్ను సత్కరించాడు; [QBR]
సమూయేలు రెండవ గ్రంథము 22 : 21 (ERVTE)
యెహోవా నన్ను సత్కరించాడంటే నా చేతులు [QBR2] పాపం చేయక పరిశుద్ధంగా వున్నాయి! [QBR]
సమూయేలు రెండవ గ్రంథము 22 : 22 (ERVTE)
అంటే, యెహోవా యొక్క న్యాయ [QBR2] మార్గాన్ని నేననుసరించాను! [QBR]
సమూయేలు రెండవ గ్రంథము 22 : 23 (ERVTE)
యెహోవా యొక్క తీర్పులు నిత్యం నా మదిలో మెదలుతూనే ఉంటాయి. [QBR2] ఆయన ఆజ్ఞలను నేనెన్నడూ విడనాడను. [QBR]
సమూయేలు రెండవ గ్రంథము 22 : 24 (ERVTE)
దేవుని ముందు నేను దోషిని కాను; [QBR2] నేను పాపానికి దూరంగా ఉంటాను! [QBR]
సమూయేలు రెండవ గ్రంథము 22 : 25 (ERVTE)
అందువల్లనే యెహోవా నాకు ప్రతిఫలమిచ్చును. [QBR2] ఎందుకంటే, నేను న్యాయబద్ధంగా నివసిస్తాను! దేవుడు గమనించేలా నేను నిష్కళంక జీవితాన్ని గడుపుతాను.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 26 (ERVTE)
నిన్నొక్క వ్యక్తి ప్రేమిస్తున్నాడంటే, నీవు నీ ప్రేమానురాగాలను వానికి పంచి ఇస్తావు! [QBR2] ఒక వ్యక్తి నీ పట్ల నిజాయితీగా వుంటే నీవు కూడ అతని పట్ల సత్యసంధుడవై వుంటావు! [QBR]
సమూయేలు రెండవ గ్రంథము 22 : 27 (ERVTE)
ఎవరైనా నీ పట్ల సత్ప్రవర్తనతో మెలిగితే, నీవు కూడ అతని పట్ల సద్భావం చూపిస్తావు! [QBR2] కాని ఎవరైనా నీకు ప్రతికూలంగా వుంటే, నీవు కూడ ప్రతికూలుడవై వుంటావు! [QBR]
సమూయేలు రెండవ గ్రంథము 22 : 28 (ERVTE)
ఆపదలోవున్న వారిని నీవు ఆదుకుంటావు, కాని గర్వాంధులను తిరస్కరిస్తావు. [QBR2] గర్వముగల వానిని అవమానిస్తావు పొగరు బోతులను నేలరాస్తావు! [QBR]
సమూయేలు రెండవ గ్రంథము 22 : 29 (ERVTE)
యెహోవా, నీవు నాకు వెలుగైయున్నావు. [QBR2] యెహోవా నా చుట్టూ అలుముకొన్న చీకటిని పారదోలి వెలుగు నిస్తావు. [QBR]
సమూయేలు రెండవ గ్రంథము 22 : 30 (ERVTE)
మూకుమ్మడిగా మీద పడే సైనికులను చెండాడేలా నాకు సహాయపడ్డావు. [QBR2] దేవుడిచ్చిన శక్తితో, నేను ప్రాకారాలను దూక గలను!
సమూయేలు రెండవ గ్రంథము 22 : 31 (ERVTE)
దేవుని మార్గము దోషరహితమైనది; [QBR2] యెహోవా మాట పొల్లుపోనిది. [QBR2] తనను శరణుజొచ్చిన ప్రతి వానినీ యెహోవా రక్షిస్తాడు. [QBR]
సమూయేలు రెండవ గ్రంథము 22 : 32 (ERVTE)
యెహోవాను మించిన దేవుడు లేడు; [QBR2] మన దేవునిలా కొండ వంటి మరో అండలేదు. [QBR]
సమూయేలు రెండవ గ్రంథము 22 : 33 (ERVTE)
దేవుడు నా రక్షణ దుర్గం; [QBR2] సన్మార్గుల జీవన మార్గంలో దేవుడు నడచి మార్గదర్శకుడవుతాడు! [QBR]
సమూయేలు రెండవ గ్రంథము 22 : 34 (ERVTE)
జింక కాళ్ల వేగాన్ని దేవుడు నాకు ప్రసాదిస్తాడు! [QBR2] ఉన్నత స్థలాల మీద నన్ను నిలకడగా నిలుపుతాడు. [QBR]
సమూయేలు రెండవ గ్రంథము 22 : 35 (ERVTE)
దేవుడు నాకు యుద్ధానికి శిక్షణ యిస్తాడు. [QBR2] నా చేతులు ఇత్తడి విల్లంబును వంచి వేయగలవు.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 36 (ERVTE)
డాలువలె నీవు నన్ను రక్షిస్తావు! [QBR2] నీ సహాయం నన్ను ఉన్నతుని చేసింది! [QBR]
సమూయేలు రెండవ గ్రంథము 22 : 37 (ERVTE)
నా పాదాలు తడబడకుండా [QBR2] నీవు నా మార్గాన్ని విశాలం చేశావు. [QBR]
సమూయేలు రెండవ గ్రంథము 22 : 38 (ERVTE)
నేను నా శత్రువులను తరిమి, వారిని నాశనం చేశాను! [QBR2] వారిని సర్వనాశనం చేసేదాకా నేను వెనుకకు తిరుగను; [QBR]
సమూయేలు రెండవ గ్రంథము 22 : 39 (ERVTE)
నేను నా శత్రువులను నాశనం చేశాను, [QBR2] నేను వారిని పూర్తిగా సంహరించాను! [QBR] వారు మరల తలయెత్తే అవకాశం లేదు! [QBR2] అవును, నేను నా శత్రువులను నా కాలరాశాను!
సమూయేలు రెండవ గ్రంథము 22 : 40 (ERVTE)
ఎందువల్లననగా నీవు నన్ను యుద్ధంలో బలవంతునిగా చేశావు. [QBR2] నీవే నా శత్రువులను ఓడించినావు. [QBR]
సమూయేలు రెండవ గ్రంథము 22 : 41 (ERVTE)
నా శత్రువులు పరుగెత్తి పోయేలా నీవు చేశావు! [QBR2] నన్ను అసహ్యించుకునే వారిని నేను ఓడిస్తాను! [QBR]
సమూయేలు రెండవ గ్రంథము 22 : 42 (ERVTE)
నా శత్రవులు సహాయం కోసం తల్లడిల్ల గా [QBR2] వారిని ఆదుకొనే వారొక్కరూ లేకుండిరి! [QBR]
సమూయేలు రెండవ గ్రంథము 22 : 43 (ERVTE)
నా శత్రుమూకను తుత్తునియలు చేశాను! [QBR2] వారు నేలమీది ధూళిలా చితికిపోయారు; [QBR] నా శత్రువులు వీధిలోని బురదగా మారేలాగు వారిని [QBR2] నా పాదములతో అణగ దొక్కాను.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 44 (ERVTE)
నా ప్రజలు నన్ను వ్యతిరేకించినప్పుడు కూడా నీవు నన్ను కాపాడావు! [QBR2] నన్ను రాజ్యాలకు అధిపతిగా చేశావు; [QBR2] నాకు తెలియని ప్రజలు నన్ను సేవిస్తారు! [QBR]
సమూయేలు రెండవ గ్రంథము 22 : 45 (ERVTE)
ఇతర రాజ్యాల ప్రజలు నాకు విధేయులవుతారు! [QBR2] నా పేరు వినినంతనే వారు విధేయులవుతారు. [QBR]
సమూయేలు రెండవ గ్రంథము 22 : 46 (ERVTE)
అన్య రాజ్యాల వారు నేనంటే భయపడతారు; [QBR2] భయకంపితులై వారి రహస్య స్థావరాల నుండి బయటికి వస్తారు!
సమూయేలు రెండవ గ్రంథము 22 : 47 (ERVTE)
యెహోవా నిత్యుడు! కొండంత అండ అయిన నా దేవుని నామమును కీర్తించండి! [QBR2] ఆయనను సర్వోన్నతునిగా స్వీకరించండి! [QBR2] అయన నన్ను కాపాడే కొండ; [QBR]
సమూయేలు రెండవ గ్రంథము 22 : 48 (ERVTE)
నా కొరకు నా శత్రువులను దండించే దేవుడు, [QBR2] ప్రజలను నా పాలనలోకి తెచ్చు వాడాయన; [QBR2]
సమూయేలు రెండవ గ్రంథము 22 : 49 (ERVTE)
నా శత్రువుల నుండి నన్ను విముక్తి చేయువాడు ఆయనే! అవును, నా శత్రువులకు మిన్నగా నన్ను ఉన్నతుని చేశావు! [QBR2] నన్ను గాయపర్చనుద్దేశించిన వాని నుండి నన్ను రక్షించావు. [QBR]
సమూయేలు రెండవ గ్రంథము 22 : 50 (ERVTE)
యెహోవా! అన్ని రాజ్యాల సమక్షంలో [QBR2] నీకు స్తోత్రములు అర్పిస్తున్నాను!
సమూయేలు రెండవ గ్రంథము 22 : 51 (ERVTE)
ఆయన నియమించిన రాజుకు దిగ్విజయం కలిగేలా యెహోవా సహాయపడతాడు; [QBR2] ఆయన అభిషిక్తము చేసిన రాజైన దావీదుకు, [QBR2] అతని సంతతికి అనంతంగా దేవుడు తన ప్రేమానురాగాలను పంచి ఇస్తాడు! [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51

BG:

Opacity:

Color:


Size:


Font: