అపొస్తలుల కార్యములు 2 : 1 (ERVTE)
{పవిత్రాత్మ రావటం} [PS] పెంతెకొస్తు అనే పండుగ వచ్చింది. ఆ రోజు వాళ్ళంతా ఒక చోట సమావేశం అయ్యారు.
అపొస్తలుల కార్యములు 2 : 2 (ERVTE)
తీవ్రమైన గాలి వీచినప్పుడు కలిగే ధ్వనిలాంటిది పరలోకంనుండి అకస్మాత్తుగా వచ్చి వాళ్ళు కూర్చొన్న యింటినంతా నింపివేసింది.
అపొస్తలుల కార్యములు 2 : 3 (ERVTE)
అప్పుడు వాళ్ళకు నాలుకల్లా అగ్నిజ్వాలలు కనిపించాయి. అవి విడిపోయి ప్రతి ఒక్కరి మీదా దిగినవి.
అపొస్తలుల కార్యములు 2 : 4 (ERVTE)
అందరూ పవిత్రాత్మతో నిండిపోయి తమ భాషల్లో కాక యితర భాషల్లో మాట్లాడటం మొదలు పెట్టారు. వాళ్ళిలా మాట్లాడటానికి పవిత్రాత్మ శక్తినిచ్చాడు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 2 : 5 (ERVTE)
అప్పుడు ఈ యెరూషలేము పట్టణంలో అన్ని దేశాలకు చెందిన దైవభక్తిగల యూదులు ఉండినారు.
అపొస్తలుల కార్యములు 2 : 6 (ERVTE)
ఆ మాటల శబ్దం విని ఒక పెద్ద ప్రజల గుంపు అక్కడికి వచ్చింది. గుంపులోని ప్రతి ఒక్కడూ తన స్వంత భాషలో వాళ్ళు మాట్లాడటం విని దిగ్భ్రాంతి చెందాడు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 2 : 7 (ERVTE)
వాళ్ళు దిగ్భ్రాంతి చెంది, “మాట్లాడుతున్న వాళ్ళందరూ గలిలయ ప్రాంతపు వాళ్ళే కదా?
అపొస్తలుల కార్యములు 2 : 8 (ERVTE)
అలాంటప్పుడు, మాలోని ప్రతి ఒక్కడూ, అతని స్వంత భాషలో వాళ్ళు మాట్లాడటం ఎట్లా వింటున్నాడు.
అపొస్తలుల కార్యములు 2 : 9 (ERVTE)
మేము, అంటే ‘పార్తి’ దేశం వాళ్ళు, ‘మాదీ’ దేశం వాళ్ళు, ‘ఏలామీ’ దేశం వాళ్ళు, ‘మెసొపొతమియ’ నివాసులు, యూదయ, కప్పదొకియ, పొంతు, ఆసియ నివాసులు,
అపొస్తలుల కార్యములు 2 : 10 (ERVTE)
ప్రుగియ, పంపులియ, ఈజిప్టు ప్రాంతాల వాళ్ళు, ‘లిబియ’ లోని ‘కురేనే’ దగ్గరున్న ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు, రోము నగరం నుండి వచ్చిన వాళ్ళు,
అపొస్తలుల కార్యములు 2 : 11 (ERVTE)
యూదులు, యూద మతంలో చేరిన వాళ్ళు, క్రేతీయులు, అరబీయులు, వాళ్ళు దేవుని మహిమల్ని గురించి మా స్వంత భాషలో చెప్పటం వింటున్నామే!” అని అన్నారు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 2 : 12 (ERVTE)
దిగ్భ్రాంతి చెందటం వల్ల, జరిగిన విషయాలు అర్థం కాకపోవటం వల్ల, “దీని అర్థమేమిటి” అని పరస్పరం ప్రశ్నించుకొన్నారు.
అపొస్తలుల కార్యములు 2 : 13 (ERVTE)
“బాగా మద్యం త్రాగి మత్తులో ఉన్నారు” అని కొందరు వాళ్ళనెగతాళి చేసారు. [PS]
అపొస్తలుల కార్యములు 2 : 14 (ERVTE)
{పేతురు ఉపన్యసించటం} [PS] ఇది విని పేతురు పదకొండుగురితో లేచి, పెద్ద గొంతుతో ప్రజల్ని సంబోధిస్తూ, “తోటి యూదా సోదరులారా! యెరూషలేంలో నివసిస్తున్న సమస్త ప్రజలారా! నన్ను దీన్ని గురించి మీకు చెప్పనివ్వండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి.
అపొస్తలుల కార్యములు 2 : 15 (ERVTE)
మీరనుకొన్నట్లు వీళ్ళు త్రాగలేదు. ఇప్పుడు ఇంకా ఉదయం తొమ్మిది గంటలే కదా!
అపొస్తలుల కార్యములు 2 : 16 (ERVTE)
దీన్ని గురించి ప్రవక్త యోవేలు ఈ విధంగా వ్రాసాడు కనుక యివి జరుగుతున్నాయి:
అపొస్తలుల కార్యములు 2 : 17 (ERVTE)
‘దేవుడు ఈ విధంగా అంటున్నాడు: [QBR] ఈ చివరి దినాల్లో నా ఆత్మను అందరిపై కురిపిస్తాను! [QBR2] మీ కుమారులు, కుమార్తెలు, నా ప్రవచనాలు పలుకుతారు! [QBR2] మీ యువతరం దివ్యదర్శనాలు చూస్తుంది. [QBR2] వయస్సు మళ్ళిన మీ వాళ్ళు కలలుగంటారు. [QBR]
అపొస్తలుల కార్యములు 2 : 18 (ERVTE)
ఆడా, మగా అనే భేదం లేకుండా నా సేవకులందరిపై ఆ దినాల్లో నా ఆత్మను కురిపిస్తాను. [QBR2] అప్పుడు వాళ్ళు నా ప్రవచనాలు చెబుతారు. [QBR]
అపొస్తలుల కార్యములు 2 : 19 (ERVTE)
పైన ఆకాశంలో నేను అద్భుతాలు చూపిస్తాను. [QBR2] క్రింద భూమ్మీద రుజువులు చూపిస్తాను. [QBR2] రక్తం, మంటలు, చిక్కటి పొగలు చెలరేగుతాయి. [QBR]
అపొస్తలుల కార్యములు 2 : 20 (ERVTE)
సూర్యుణ్ణి చీకటిగా మారుస్తాను. [QBR2] చంద్రుణ్ణి ఎర్రటి రక్తంలా మారుస్తాను. [QBR] ఉత్కృష్టమైనటువంటి, తేజోవంతమైనటువంటి ప్రభువు యొక్క దినం రాక ముందే యిది జరుగుతుంది. [QBR]
అపొస్తలుల కార్యములు 2 : 21 (ERVTE)
అప్పుడు ఆయన నామంలో ప్రార్థించు ప్రతి ఒక్కణ్ణి ప్రభువు రక్షిస్తాడు.’ యోవేలు 2:28-32 [PS]
అపొస్తలుల కార్యములు 2 : 22 (ERVTE)
“ఇశ్రాయేలు ప్రజలారా! ఇది వినండి. దేవుడు నజరేతు నివాసియైన యేసును, తాను ప్రత్యేకంగా నియమించాడన్న విషయం మీకు నిరూపించాలని ఆయన ద్వారా మహాత్యాలు, అద్భుతాలు మీకోసం చేసాడు. సూచనలు చూపాడు. ఈ మహాత్యాలు, అద్భుతాలు చేసినట్లు, సూచనలు చూపినట్లు మీకు ఇదివరకే తెలుసు.
అపొస్తలుల కార్యములు 2 : 23 (ERVTE)
దైవ సంకల్పానుసారం ఆయన దివ్య జ్ఞానానుసారం యేసు మీకు అప్పగింపబడ్డాడు. ఆ తర్వాత మీరు దుర్మార్గుల సహాయంతో ఆయనను సిలువకు వేసి, మేకులు కొట్టి ఆయన్ని చంపారు.
అపొస్తలుల కార్యములు 2 : 24 (ERVTE)
కాని దేవుడాయన్ని బ్రతికించాడు. ఆయనకు మరణవేదన నుండి విముక్తి కలిగించాడు. మరణానికి ఆయన్ని బంధించి ఉంచటం చేతకాలేదు.
అపొస్తలుల కార్యములు 2 : 25 (ERVTE)
దావీదు యేసును గురించి ఈ విధంగా అన్నాడు: ‘ప్రభువును, నేను నా ముందు అన్ని వేళలా చూసాను. [QBR2] నన్ను రక్షించటానికి ప్రభువు నా వెంట ఉన్నాడు! [QBR]
అపొస్తలుల కార్యములు 2 : 26 (ERVTE)
అందుకే నా మాటల్లో [QBR2] ఆనందం నిండియున్నది. [QBR] అందుకే నా దేహం ఆశతో జీవిస్తోంది. [QBR2]
అపొస్తలుల కార్యములు 2 : 27 (ERVTE)
ఎందుకంటే, నా ఆత్మను నీవు చనిపోయిన వాళ్ళతో వదిలివేయవు [QBR2] నీవు నీ భక్తుని దేహాన్ని కుళ్ళనీయవు. [QBR]
అపొస్తలుల కార్యములు 2 : 28 (ERVTE)
నాకు జీవపు దారుల్ని చూపావు! [QBR2] నా వెంటే ఉండి నాకు ఆనందం కలిగించావు!’ కీర్తన 16:8-11 [PS]
అపొస్తలుల కార్యములు 2 : 29 (ERVTE)
“సోదరులారా! మన వంశీయుడైన దావీదును గురించి నేనిది ఖచ్చితంగా చెప్పగలను. అతడు చనిపొయ్యాడు. అతణ్ణి సమాధి చేసారు. ఆ సమాధి ఈ నాటికీ ఉంది.
అపొస్తలుల కార్యములు 2 : 30 (ERVTE)
దావీదు ఒక ప్రవక్త. దావీదు వంశంలో పుట్టిన వాణ్ణొకణ్ణి సింహాసనంపై కూర్చో బెడ్తానని దేవుడు అతనికి ప్రమాణ పూర్వకంగా వాగ్దానం చేసాడు. ఇది దావీదుకు తెలుసు.
అపొస్తలుల కార్యములు 2 : 31 (ERVTE)
ఈ జరుగనున్న దాన్ని గురించి దావీదుకు ముందే తెలుసు. అందువల్లే అతడు క్రీస్తు బ్రతికి రావటాన్ని గురించి ఈ విధంగా అన్నాడు: ‘దేవుడు ఆయన్ని సమాధిలో వదిలివేయ లేదు. [QBR] ఆయన శరీరము కుళ్ళు పట్టలేదు.’ క్రీస్తు సమాధినుండి లేచే విషయమై దావీదు మాటలాడుచూ ఉన్నాడు.
అపొస్తలుల కార్యములు 2 : 32 (ERVTE)
కావున దేవుడు ఈ యేసునే మృత్యువు నుండి బ్రతికించినాడు. దీనికి మేమంతా సాక్ష్యము.
అపొస్తలుల కార్యములు 2 : 33 (ERVTE)
యేసు పరలోకానికి ఎత్తబడినాడు. ఇప్పుడు యేసు దేవునితో ఆయన కుడిప్రక్కన ఉన్నాడు. తండ్రి పరిశుద్ధాత్మను యేసుకు ఇచ్చాడు. దేవుడు ఇస్తానని వాగ్దానము చేసినది పరిశుద్ధాత్మయే. యేసు ఇప్పుడాయాత్మను ఇస్తున్నాడు. ఇదే మీరు వింటున్నది, చూస్తున్నదీ.
అపొస్తలుల కార్యములు 2 : 34 (ERVTE)
(34-35) యేసులా దావీదు పరలోకానికి వెళ్ళలేదు. అయినా, అతడీ విధంగా అన్నాడు: ‘ప్రభువు నా ప్రభువుతో, [QBR] నేను నీ శత్రువుల్ని నీ పాదపీఠంగా చేసే వరకు [QBR2] నీవు నా కుడివైపు కూర్చో!’ కీర్తన 110:1 [PS]
అపొస్తలుల కార్యములు 2 : 35 (ERVTE)
అపొస్తలుల కార్యములు 2 : 36 (ERVTE)
“అందువల్ల ఇశ్రాయేలు ప్రజలందరూ యిది ఖచ్చితంగా తెలుసుకోవాలి. దేవుడు, మీరు సిలువకు వేసి చంపిన ఈ యేసును ప్రభువుగా, క్రీస్తుగా నియమించాడు.” [PE][PS]
అపొస్తలుల కార్యములు 2 : 37 (ERVTE)
ఇది విని ప్రజల హృదయాలు కదిలిపొయ్యాయి. వాళ్ళు పేతురు మరియు యితర అపొస్తలులను, “సోదరులారా! మేము ఏం చెయ్యాలి?” అని అడిగారు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 2 : 38 (ERVTE)
పేతురు ఈ విధంగా జవాబు చెప్పాడు: “మీలో ప్రతి ఒక్కడూ పాప క్షమాపణ నిమిత్తం మారుమనస్సు కలిగి యేసు క్రీస్తు పేరిట బాప్తిస్మము పొందాలి. అప్పుడు మీ పాపాలు క్షమించబడ్తాయి. మీకు పవిత్రాత్మ వరం లభిస్తుంది.
అపొస్తలుల కార్యములు 2 : 39 (ERVTE)
దేవుడు ఈ వాగ్దానాన్ని మీకోసం, మీ సంతానాని కోసం, ప్రభువు ఆహ్వానించబోయే దూర ప్రాంతాల వాళ్ళకందరి కోసం చేసాడు.” [PE][PS]
అపొస్తలుల కార్యములు 2 : 40 (ERVTE)
వాళ్ళకు అనేక మాటల ద్వారా ఎన్నో విషయాలు చెప్పాడు. అంతేకాక, వాళ్ళతో ఈ విధంగా బ్రతిమిలాడాడు: “వక్రబుద్ధులున్న ఈ తరం వాళ్ళనుండి విడిపోయి రక్షణ పొందండి.”
అపొస్తలుల కార్యములు 2 : 41 (ERVTE)
అతని సందేశాన్ని అంగీకరించిన వాళ్ళు బాప్తిస్మము పొందారు. ఆ రోజు సుమారు మూడువేల మంది విశ్వాసులుగా చేరారు. [PS]
అపొస్తలుల కార్యములు 2 : 42 (ERVTE)
{విశ్వాసుల సహవాసం} [PS] వాళ్ళు అపొస్తలుల బోధను వింటూ సహవాసములోను, రొట్టె విరుచుటలోను పాలి భాగస్థులై; ప్రార్థన చేయుటలో నిమగ్నులై యుండేవాళ్ళు.
అపొస్తలుల కార్యములు 2 : 43 (ERVTE)
దేవుడు అపొస్తలుల ద్వారా ఎన్నో అద్భుతాలు చేసాడు. చిహ్నాలు చూపాడు. ప్రతి ఒక్కనిలో దైవ భీతి కలిగింది.
అపొస్తలుల కార్యములు 2 : 44 (ERVTE)
భక్తులంతా ఒకే చోట సమావేశమయ్యారు. తమ దగ్గరున్న ప్రతి వస్తువును అందరితో కలిసి పంచుకొనే వాళ్ళు.
అపొస్తలుల కార్యములు 2 : 45 (ERVTE)
తమ ఆస్తిని, వస్తువుల్ని అమ్మి అవసరమున్న వాళ్ళకు యిచ్చేవాళ్ళు.
అపొస్తలుల కార్యములు 2 : 46 (ERVTE)
ప్రతి రోజు మందిరావరణంలో ఒకే ఉద్దేశ్యంతో సమావేశమయ్యేవాళ్ళు. ఇండ్లలో సమావేశమై ఆహారాన్ని పంచుకొని తినేవాళ్ళు. మంచి మనస్సుతో అమితానందంగా భుజించే వాళ్ళు,
అపొస్తలుల కార్యములు 2 : 47 (ERVTE)
దేవుణ్ణి స్తుతించే వాళ్ళు. ప్రజలందరూ వాళ్ళను యిష్టపడేవాళ్ళు. ప్రభువు తాను రక్షించిన వాళ్ళను విశ్వాసులతో చేరుస్తూ వచ్చాడు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47

BG:

Opacity:

Color:


Size:


Font: