అపొస్తలుల కార్యములు 25 : 1 (ERVTE)
{ఫేస్తు సమక్షంలో విచారణ} [PS] ఫేస్తు ఆ ప్రాంతానికి వచ్చిన మూడు రోజుల తర్వాత కైసరియ నుండి యెరూషలేమునకు వెళ్ళాడు.
అపొస్తలుల కార్యములు 25 : 2 (ERVTE)
అక్కడ ప్రధాన యాజకులు, యూదుల పెద్దలు అతణ్ణి కలుసుకొని, పౌలును గురించి చెప్పారు.
అపొస్తలుల కార్యములు 25 : 3 (ERVTE)
పౌలును వెంటనే యెరూషలేముకు పంపి తమకు ఉపకారం చెయ్యుమని వేడుకున్నారు. ఎవ్వరికీ తెలియకుండా పౌలును దారిలో చంపేయాలని వాళ్ళ కుట్ర.
అపొస్తలుల కార్యములు 25 : 4 (ERVTE)
ఫేస్తు, “పౌలు కైసరియలో బందీగా ఉన్నాడు. నేను కూడా అక్కడికి త్వరలోనే వెళ్తున్నాను.
అపొస్తలుల కార్యములు 25 : 5 (ERVTE)
మీలో ముఖ్యమైన వాళ్ళు నావెంట వస్తే, అతడు ఒకవేళ ఏదైనా నేరం చేసి ఉంటే అతనిపై మీ నేరారోపణలు అక్కడే చేయవచ్చు” అని అన్నాడు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 25 : 6 (ERVTE)
అక్కడ వాళ్ళతో ఎనిమిది, పది రోజులు గడిపాక కైసరియకు వెళ్ళాడు. వెళ్ళిన మరుసటి రోజు న్యాయసభను ఏర్పాటు చేసి పౌలును తన ముందుకు పిలుచుకు రమ్మని ఆజ్ఞాపించాడు.
అపొస్తలుల కార్యములు 25 : 7 (ERVTE)
పౌలు కనపడగానే యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ చేరి అతనిపై తీవ్రమైన నేరాలు ఆరోపించారు. ఎన్ని నేరాల్ని ఆరోపించినా, ఒక్క నేరాన్ని కూడా నిరూపించలేక పోయారు.
అపొస్తలుల కార్యములు 25 : 8 (ERVTE)
తదుపరి పౌలు, తాను నేరస్థుడు కాదని నిరూపించుకోవటానికి ఈ విధంగా వాదించాడు, “నేను యూదుల ధర్మశాస్త్రాన్ని కాని, మందిర నియమాల్ని కాని అతిక్రమించ లేదు. చక్రవర్తికి ఎదురు తిరిగి ప్రవర్తించనూ లేదు.” [PE][PS]
అపొస్తలుల కార్యములు 25 : 9 (ERVTE)
ఫేస్తు, యూదులకు ఉపకారం చేయాలని, పౌలుతో, “నీవు యెరూషలేము వచ్చి అక్కడ నా ఎదుట న్యాయస్థానంలో నిలుచోగలవా?” అని అడిగాడు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 25 : 10 (ERVTE)
పౌలు ఈ విధంగా సమాధానం చెప్పాడు. “నేను ప్రస్తుతం చక్రవర్తి యొక్క న్యాయస్థానంలో నిలుచున్నాను. ఇక్కడే తీర్పు జరగాలి. నేను యూదులకు ఏ అన్యాయం చెయ్యలేదు. ఇది మీకు బాగా తెలుసు.
అపొస్తలుల కార్యములు 25 : 11 (ERVTE)
మరణదండన పొందవలసిన నేరం నేను ఒక వేళ ఏదైనా చేసివుంటే, మరణించటానికి నేను వెనుకంజ వేయను. కాని వీళ్ళు ఆరోపించిన నేరాలు అసత్యమైతే నన్ను వీళ్ళకప్పగించే అధికారం ఎవ్వరికీ లేదు. చక్రవర్తినే ఈ విషయంపై తీర్పు చెప్పుమని నేను విన్నవించుకొంటాను.” [PE][PS]
అపొస్తలుల కార్యములు 25 : 12 (ERVTE)
ఫేస్తు తన సలహాదార్లతో సంప్రదించి యిలా ప్రకటించాడు: “నీవు చక్రవర్తి సమక్షంలో విన్నవించుకోవాలని కోరావు. కనుక నిన్ను చక్రవర్తి దగ్గరకు పంపుతాను.” [PS]
అపొస్తలుల కార్యములు 25 : 13 (ERVTE)
{ఫేస్తు అగ్రిప్పను సంప్రదించటం} [PS] కొద్ది రోజుల తర్వాత అగ్రిప్పరాజు, బెర్నీకే, ఫేస్తును కలుసుకొందామని కైసరియకు వచ్చారు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 25 : 14 (ERVTE)
వాళ్ళక్కడ చాలా రోజులున్నారు. ఫేస్తు పౌలు విషయాన్ని రాజుగారితో చర్చిస్తూ, “ఇక్కడ, ఫేలిక్సు కారాగారంలో ఉంచిన వాడొకడున్నాడు.
అపొస్తలుల కార్యములు 25 : 15 (ERVTE)
నేను యెరూషలేముకు వెళ్ళినప్పుడు ప్రధాన యాజకులు, యూదుల పెద్దలు అతనిపై నేరారోపణ చేసి అతనికి మరణదండన విధించుమని నన్ను కోరారు.
అపొస్తలుల కార్యములు 25 : 16 (ERVTE)
నేను, ‘నేరమారోపింపబడిన వానికి తనపై నేరారోపణ చేసిన వాళ్ళను ప్రత్యక్షంగా కలుసుకొని, వాళ్ళారోపించిన నేరాలకు ప్రతిగా తన రక్షణార్థం మాట్లాడే అవకాశం కలగాలి. దానికి ముందు అతణ్ణి అప్పగించటం రోమనుల పద్ధతి కాదు’ అని జవాబు చెప్పాను. [PE][PS]
అపొస్తలుల కార్యములు 25 : 17 (ERVTE)
“నాతో కలిసి వాళ్ళిక్కడికి వచ్చారు. నేను ఆలస్యం చెయ్యకుండా మరుసటి రోజే సభనేర్పాటు చేసి పౌలును సభలోకి పిలుచుకురమ్మని ఆజ్ఞాపించాను.
అపొస్తలుల కార్యములు 25 : 18 (ERVTE)
అతనిపై నేరారోపణ చేసిన వాళ్ళు లేచి మాట్లాడారు. కాని నేననుకున్న ఏ నేరాన్నీ అతనిపై ఆరోపించలేదు.
అపొస్తలుల కార్యములు 25 : 19 (ERVTE)
దానికి మారుగా తామనుసరించే మతాన్ని గురించి అతనితో వాదించారు. చనిపోయిన యేసును గురించి తర్కించారు. కాని పౌలు యేసు బ్రతికే ఉన్నాడని వాదించాడు.
అపొస్తలుల కార్యములు 25 : 20 (ERVTE)
అలాంటి విషయాలు ఏ విధంగా విచారణ చెయ్యాలో నాకు తెలియదు. అందువల్ల నేను అతణ్ణి, ‘విచారణ కోసం నీవు యెరూషలేము వెళ్తావా?’ అని అడిగాను.
అపొస్తలుల కార్యములు 25 : 21 (ERVTE)
చక్రవర్తే తీర్పు చెప్పాలని, అంతదాకా తనను కారాగారంలో ఉంచుమని పౌలు కోరాడు. ఆ కారణంగా అతణ్ణి కైసరు దగ్గరకు పంపేదాకా కారాగారంలో ఉంచుమని ఆజ్ఞాపించాను” అని చెప్పాడు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 25 : 22 (ERVTE)
అగ్రిప్ప ఫేస్తుతో, “అతడు మాట్లాడే విషయాలు వినాలని నాక్కూడా ఉంది” అని అన్నాడు. [PE][PS] “రేపు మీరతని మాటలు వింటారు” అని ఫేస్తు జవాబు చెప్పాడు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 25 : 23 (ERVTE)
మరుసటి రోజు అగ్రిప్ప, బెర్నీకే మిక్కిలి ఆడంబరంగా సభలోకి వచ్చి సహస్రాధిపతులతో, పట్టణ ప్రముఖులతో కలిసి కూర్చున్నారు. ఫేస్తు ఆజ్ఞాపించగానే పౌలు సభలోకి తేబడ్డాడు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 25 : 24 (ERVTE)
ఫేస్తు యిలా అన్నాడు: “అగ్రిప్ప రాజా! సభికులారా! మీరు చూస్తున్న ఈ వ్యక్తిని గురించి యూదులు యెరూషలేములో, ఇక్కడ, ‘ఇతడిక ఎక్కువ రోజులు బ్రతకటానికి వీల్లేదు’ అని బిగ్గరగా కేకలు వేసి నాకు ఫిర్యాదు చేసారు.
అపొస్తలుల కార్యములు 25 : 25 (ERVTE)
మరణదండన విధించవలసిన నేరమేదీ అతడు చేయలేదని నాకర్థమైనది. కాని అతడు చక్రవర్తికి విన్నవించుకొంటానని అన్నాడు. కనుక అతణ్ణి చక్రవర్తి దగ్గరకు పంపాలని నిశ్చయించుకున్నాను.
అపొస్తలుల కార్యములు 25 : 26 (ERVTE)
ఇతణ్ణి గురించి చక్రవర్తికి వ్రాయటానికి నాకేదీ కనిపించలేదు. అందువల్ల యితణ్ణి మీ ముందుకు పిలుచుకు వచ్చాను. అగ్రిప్ప రాజా! ముఖ్యంగా మీకోసం యితణ్ణి పిలిపించాను. మీ విచారణ వల్ల వ్రాయటానికి నాకేదైనా కనిపించవచ్చు.
అపొస్తలుల కార్యములు 25 : 27 (ERVTE)
ఒక బందీని, అతడు చేసిన నేరం స్పష్టంగా చూపకుండా పంపటం న్యాయం కాదని నా అభిప్రాయం.” [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27

BG:

Opacity:

Color:


Size:


Font: