ద్వితీయోపదేశకాండమ 21 : 1 (ERVTE)
{ఒకడు హత్య చేయబడి ఉంటే} [PS] “మీరు నివసించేందుకు, మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో ఒక పొలంలో హత్య చేయబడిన వాడు ఒకడు కనబడవచ్చును. కానీ ఆతణ్ణి చంపింది ఎవరో ఎవరికీ తెలియదు.
ద్వితీయోపదేశకాండమ 21 : 2 (ERVTE)
అప్పుడు మీ నాయకులు, న్యాయమూర్తులు బయటకు వచ్చి, చంపబడిన మనిషి చుట్టూ ఉన్న పట్టణాల దూరాన్ని కొలత వేయాలి.
ద్వితీయోపదేశకాండమ 21 : 3 (ERVTE)
చచ్చిన వానికి అతి దగ్గరగా ఉన్న పట్టణం ఏదో తెలిసినప్పుడు, ఆ పట్టణం పెద్దల వారి మందలో నుండి ఒక ఆవును తీసుకొని రావాలి. అది పెయ్యగా ఉండాలి. అది ఎన్నడూ ఏ పనికీ వినియోగించబడనిది కావాలి.
ద్వితీయోపదేశకాండమ 21 : 4 (ERVTE)
అప్పుడు ఆ పట్టణపు నాయకుడు, నీరు ప్రవహిస్తున్న ఒక లోయలోనికి ఆ ఆవును తీసుకొని రావాలి. ఆ లోయ ఇదివరకు ఎన్నడూ దున్ననిది, మొక్కలు నాటనిదిగా ఉండాలి. అప్పుడు నాయకులు ఆ లోయలో ఆవు మెడను విరుగగొట్టాలి.
ద్వితీయోపదేశకాండమ 21 : 5 (ERVTE)
లేవీ సంతతివారు యాజకులుకూడ అక్కడికి వెళ్లాలి. (యెహోవాను సేవించేందుకు, ఆయన పేరిట ప్రజలను దీవించేందుకు మీ దేవుడైన యెహోవా ఈ యాజకులను ఏర్పాటు చేసుకొన్నాడు. వివాదానికి సంబంధించిన ప్రతి విషయంలో న్యాయం ఎవరిదో యాజకులే నిర్ణయిస్తారు.)
ద్వితీయోపదేశకాండమ 21 : 6 (ERVTE)
ఆ శవానికి అతి సమీపంగా ఉన్న పట్టణపు నాయకులంతా, లోయలో మెడ విరుగగొట్టబడిన ఆవుమీద వారి చేతులు కడుగుకోవాలి.
ద్వితీయోపదేశకాండమ 21 : 7 (ERVTE)
ఈ నాయకులు ఇలా చెప్పాలి, ‘ఈ మనిషిని మేము చంపలేదు. అది జరగటం మేము చూడలేదు.
ద్వితీయోపదేశకాండమ 21 : 8 (ERVTE)
యెహోవా, నీవు విమోచించిన నీ ఇశ్రాయేలు ప్రజలను క్షమించు. నీ ప్రజల్లో నిర్దోషిని ఎవరినీ నిందించబడనీయకు.’ అప్పుడు ఆ హత్య నిమిత్తం వారు నిందించబడరు.
ద్వితీయోపదేశకాండమ 21 : 9 (ERVTE)
అలాంటి పరిస్థితుల్లో ఇలా చేయటమే మీకు సరి. అలా చేయటం ద్వారా నిర్దోషులు ఎవరి హత్యనుగూర్చీ నిందించబడరు. [PS]
ద్వితీయోపదేశకాండమ 21 : 10 (ERVTE)
{యుద్ధంలో పట్టుబడ్డ స్త్రీలు} [PS] “మీరు మీ శత్రువులతో యుద్ధం చేస్తారు, మీరు వారిని ఓడించేటట్టు మీ దేవుడైన యెహోవా చేస్తాడు. అప్పుడు మీరు మీ శత్రువులను బందీలుగా కొని పోతారు.
ద్వితీయోపదేశకాండమ 21 : 11 (ERVTE)
ఆ బందీలలో అందమైన ఒక స్త్రీని నీవు చూడవచ్చు. నీవు ఆమెను వాంఛించి, నీ భార్యగా చేసుకోవాలని తలంచవచ్చు.
ద్వితీయోపదేశకాండమ 21 : 12 (ERVTE)
అప్పుడు నీవు ఆమెను నీ ఇంటికి తీసుకొని రావాలి. ఆమె తన తల గొరిగించుకొని, గోళ్లు కత్తిరించుకోవాలి.
ద్వితీయోపదేశకాండమ 21 : 13 (ERVTE)
ఆమె ధరించి ఉన్న బట్టలు తీసివేయాలి. ఆమె నీ ఇంటనే ఉండి తన తల్లిదండ్రుల కోసం నెల రోజులు విలపించాలి, ఆ తర్వాత నీవు ఆమె దగ్గరికి పోవచ్చును. ఆమెకు భర్తవు కావచ్చును. ఆమె నీకు భార్య అవుతుంది.
ద్వితీయోపదేశకాండమ 21 : 14 (ERVTE)
కాని ఆమె వలన నీకు సంతృప్తి కలుగకపోతే, తనకు ఇష్టంవచ్చిన చోటికి నీవు ఆమెను పోనివ్వాలి. ఆయితే నీవు ఆమెను అమ్మకూడదు. నీవు ఆమెను బానిసగా చూడరాదు. ఎందుకంటే నీ వలన ఆమెకు అవమానము కలిగింది గనుక. [PS]
ద్వితీయోపదేశకాండమ 21 : 15 (ERVTE)
{జ్యేష్ఠ కుమారడు} [PS] “ఒక పురుషునికి ఇద్దరు భార్యలు ఉండి, వారిలో ఒకదానికంటె మరొక దానిని అతడు ఎక్కువగా ప్రేమిస్తూ ఉండవచ్చును. ఆ ఇద్దరు భార్యలూ ఆతనికి పిల్లలను కనవచ్చును. ఆతడు ప్రేమించని భార్యకు పుట్టిన బిడ్డ మొదటి బిడ్డ కావచ్చును.
ద్వితీయోపదేశకాండమ 21 : 16 (ERVTE)
ఆతడు తన ఆస్తిని తన పిల్లలకు పంచి ఇచ్చేటప్పుడు జ్యేష్ఠునికి చెందిన ప్రత్యేకమైన ని, తాను ప్రేమించే భార్య కుమారునికి ఆతడు ఇచ్చివేయకూడదు.
ద్వితీయోపదేశకాండమ 21 : 17 (ERVTE)
తన ప్రేమకు పాత్రము కాని మొదటి భార్య బిడ్డను ఆతడు స్వీకరించాలి. ఆతడు అన్నించిలో రెండంతల భాగం మొదటి కుమారునికి ఇవ్వాలి. ఎందుకంటే, ఆ బిడ్డ ఆతని మొదటి బిడ్డ గనుక. ప్రథమ సంతానం హక్కు ఆ బిడ్డకే చెందుతుంది. [PS]
ద్వితీయోపదేశకాండమ 21 : 18 (ERVTE)
{లోబడేందుకు తిరస్కరించే కుమారులు} [PS] “ఒకని కుమారుడు మొండివాడు, లోబడడు. ఈ కుమారుడు తండ్రికి గాని తల్లికి గాని విధేయుడు కాడు. తల్లిదండ్రులు ఆ కుమారుని శిక్షిస్తారు. ఆయినప్పటికీ వారి మాట ఆతడు నిరాకరిస్తాడు.
ద్వితీయోపదేశకాండమ 21 : 19 (ERVTE)
అప్పుడు పట్టణ సమావేశ స్థలం దగ్గర ఉండే ఆ పట్టణ నాయకుల దగ్గరకు ఆ తల్లిదండ్రులు వానిని తీసుకొని వెళ్లాలి.
ద్వితీయోపదేశకాండమ 21 : 20 (ERVTE)
ఆ పట్టణ నాయకులతో వారు ఇలా చెప్పాలి: ‘మా కుమారడు మొండివాడు, లోబడటం లేదు. మేము చెప్పిన ఏ పనీ అతడు చేయడు. వాడు విపరీతంగా తిని తాగుతున్నాడు.’
ద్వితీయోపదేశకాండమ 21 : 21 (ERVTE)
అప్పుడు ఆ పట్టణంలోని మనుష్యులు ఆ కుమారుని రాళ్లతో కొట్టి చంపాలి. ఇలా చేయటం ద్వారా ఈ చెడుతనాన్ని మీ నుండి తొలగిస్తారు. ఇశ్రాయేలు ప్రజలంతా దీనిగూర్చి విని భయపడతారు. [PS]
ద్వితీయోపదేశకాండమ 21 : 22 (ERVTE)
{నేరస్థులు చంపబడి చెట్టుకు వ్రేలాడదీయబడటం} [PS] “ఒక వ్యక్తి మరణ శిక్షకు యోగ్యమైన పాపం చేసి నేరస్థుడు కావచ్చును. అతణ్ణి చంపేసిన తర్వాత ఆతని శవాన్ని ఒక చెట్టుకు వేలాడదీయాలి.
ద్వితీయోపదేశకాండమ 21 : 23 (ERVTE)
అలా జరిగినప్పుడు ఆతని శవం రాత్రి అంతా చెట్టుకు ఉండకూడదు. ఆ మనిషిని మీరు ఆ రోజే తప్పక సమాధి చేయాలి. ఎందుకంటే, చెట్టుమీద వేలాడే మనిషి దేవుని చేత శపించబడ్డాడు. మీరు నివసించేందుకు మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశాన్ని మీరు పాడు చేయకూడదు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23

BG:

Opacity:

Color:


Size:


Font: