ద్వితీయోపదేశకాండమ 22 : 1 (ERVTE)
{ఇతర ఆజ్ఞలు} [PS] “నీ పొరుగు వాని ఆవు లేక గొర్రె తప్పి పోయి తిరగటం నీవు చూసినప్పుడు చూడనట్టు విస్మరించకూడదు. నీవు దాన్ని తప్పక దాని యజమాని దగ్గరకు తీసుకొని వెళ్లాలి.
ద్వితీయోపదేశకాండమ 22 : 2 (ERVTE)
ఆ యజమాని నివాసం నీకు దగ్గర్లో లేకపోతే, లేక అది ఎవరిదో నీకు తెలియకపోతే అప్పుడు ఆ ఆవును లేక గొర్రెను నీ ఇంటికి నీవు తీసుకొని వెళ్లాలి. దాని యజమాని దానికోసం వెదకుకొంటూ వచ్చేంతవకరు నీవు దానిని నీ దగ్గర ఉంచాలి. అప్పుడు నీవు ఆతనికి దానిని తిరిగి ఇచ్చివేయాలి.
ద్వితీయోపదేశకాండమ 22 : 3 (ERVTE)
నీ పొరుగువాని గాడిద, నీ పొరుగువాని బట్టలు, లేక నీ పొరుగువాడు పోగొట్టుకొన్న దేని విషయంలో నైనా నీవు ఇలానే చేయాలి. నీ పొరుగువానికి నీవు సహాయం చేయాలి. [PE][PS]
ద్వితీయోపదేశకాండమ 22 : 4 (ERVTE)
“నీ పొరుగువాని గాడిద లేక ఆవు దారిలో పడిపోతే నీవు దానిని చూడనట్టు పోకూడదు. దాన్ని లేవనెత్తటానికి నీవు అతనికి సహాయం చేయాలి. [PE][PS]
ద్వితీయోపదేశకాండమ 22 : 5 (ERVTE)
“ఒక పురుషుని బట్టలను ఒక స్త్రీ ధరించకూడదు మరియు పురుషుడు స్త్రీల బట్టలు ధరించకూడదు. ఇలా చేసేవారు ఎవరైనాసరే మీ దేవుడైన యెహోవాకు అసహ్యం. [PE][PS]
ద్వితీయోపదేశకాండమ 22 : 6 (ERVTE)
“నీవు దారిన నడుస్తుండగా ఒక పక్షిగూడును చెట్టుమీదగాని నేలమీదగాని నీవు చూడవచ్చును. తల్లి పక్షి పిల్ల పక్షులతోగాని గుడ్లమీదగాని కూర్చాని ఉంటే పిల్లలతోబాటు తల్లిపక్షిని నీవు తీసుకొనరాదు.
ద్వితీయోపదేశకాండమ 22 : 7 (ERVTE)
పిల్ల పక్షుల్ని నీవు తీసుకొనవచ్చు. కాని నీవు తల్లిని పోనివ్వాలి. ఈ ఆజ్ఞలకు నీవు విధేయుడవైతే నీకు అన్నీ సక్రమంగా జరుగుతాయి, నీవు చాలా కాలం బ్రతుకుతావు. [PE][PS]
ద్వితీయోపదేశకాండమ 22 : 8 (ERVTE)
“నీవు కొత్త యిల్లు కట్టినప్పుడు దాని కప్పు చుట్టూ పిట్టగోడ కట్టాలి. అప్పుడు ఆ యింటి మీదనుండి పడి చచ్చిన వారి మరణదోషం నీ మీద ఉండదు. [PS]
ద్వితీయోపదేశకాండమ 22 : 9 (ERVTE)
{జతపర్చబడకూడని విషయాలు} [PS] “నీ ద్రాక్షపొలంలో రెండు రకాల విత్తనాలు నీవు విత్తకూడదు. ఎందుకంటే అప్పుడు నీవు విత్తిన విత్తనపు పంట, నీ పొలంలోని ద్రక్ష రెండూ నిష్ప్ర యోజనం. [*నీ ద్రాక్ష … నిష్ప్ర యోజనం “అపవిత్రమౌతాయి” అని వాస్తవంగా వ్రాయబడివుంది. దీని అర్థం ఇవి కేవలందేవునికి చెందినవి. అందుచేత ప్రజల చేత ఉపయోగించబడవు.”] [PE][PS]
ద్వితీయోపదేశకాండమ 22 : 10 (ERVTE)
“గాడిదను, ఆవును కలిపి నీవు దున్నకూడదు. [PE][PS]
ద్వితీయోపదేశకాండమ 22 : 11 (ERVTE)
“ఉన్ని, నార రెండూ కలిసి నేసిన బట్ట నీవు ధరించకూడదు. [PE][PS]
ద్వితీయోపదేశకాండమ 22 : 12 (ERVTE)
“నీవు ధరించే అంగీకు నాలుగు మూలలా కుచ్చులు ఉండాలి. [PS]
ద్వితీయోపదేశకాండమ 22 : 13 (ERVTE)
{వివాహ చట్టాలు} [PS] “ఒక పురుషుడు ఒక యువతిని వివాహం చేసుకొని ఆమెతో లైంగిక సంబంధం కలిగి ఉండ వచ్చును. ఆ తర్వాత ఆమె నచ్చలేదని అతడు చెప్పవచ్చు.
ద్వితీయోపదేశకాండమ 22 : 14 (ERVTE)
‘నేను ఈమెను పెళ్లి చేసుకొన్నాను కానీ మేము లైంగికంగా కలిసినప్పుడు ఈమె కన్య కాదని నాకు తెలిసింది’ అని అతడు అబద్ధం చెప్పవచ్చు. ఆమెకు విరోధంగా ఇలా చెప్పటంవల్ల ప్రజలు ఆమెను గూర్చి చెడుగా భావిస్తారు.
ద్వితీయోపదేశకాండమ 22 : 15 (ERVTE)
ఇలా జరిగితే ఆమె తల్లిదండ్రులు ఆ పట్టణ సమావేశ స్థలం దగ్గర పెద్దల వద్దకు ఆమెకన్య అనే రుజువు తీసుకొని రావాలి.
ద్వితీయోపదేశకాండమ 22 : 16 (ERVTE)
ఆ యువతి తండ్రి పెద్దలతో చెప్పాలి, ‘నా కూతుర్ని ఇతనికి భార్యగా నేను ఇచ్చాను, కానీ ఇప్పుడు ఆమె ఆతనికి ఇష్టం లేదు.
ద్వితీయోపదేశకాండమ 22 : 17 (ERVTE)
ఇతడు నా కూతురి మీద అబద్ధాలు చెప్పాడు. “నీ కూతురు కన్య అనే ఋజువు నాకు కనబడలేదు” అని ఆతడు అన్నాడు. ఆయితే నా కూతురు కన్య, నా దగ్గర ఋజువుంది’ అప్పుడు వారు ఆమె బట్టను [†బట్ట రక్తపు మరకలున్న దుప్పటి. ఇది “వివాహ రాత్రి దినాన తన కన్యత్వమును నిరూపించుటకై వధువు ఉపయోగించిన బట్ట.] పట్టణ పెద్దలకు చూపించాలి.
ద్వితీయోపదేశకాండమ 22 : 18 (ERVTE)
అప్పుడు ఆ పట్టణ పెద్దలు ఆతన్ని పట్టుకొని శిక్షించాలి.
ద్వితీయోపదేశకాండమ 22 : 19 (ERVTE)
నూరు వెండితులాలు వారు ఆతనికి జుల్మానా విధించాలి. ఆమె భర్త ఒక ఇశ్రాయేలు యువతికి అవమానం కలిగించాడు గనుక ఆమె తండ్రికి వారు ఆ ధనం ఇవ్వాలి. ఆ యువతి ఆ పురుషునికి భార్యగా కొనసాగాలి. ఆతడు తన జీవితాంతం ఆమెకు విడాకులు ఇవ్వకూడదు. [PE][PS]
ద్వితీయోపదేశకాండమ 22 : 20 (ERVTE)
“ఆయితే ఒకవేళ ఆ భర్త తన భార్యను గూర్చి చెప్పిన విషయాలు నిజం కావచ్చును. ఆమె కన్య అని చెప్పేందుకు ఆ భార్య తల్లిదండ్రుల దగ్గర ఋజువు లేక పోవచ్చును. ఇలా జరిగితే
ద్వితీయోపదేశకాండమ 22 : 21 (ERVTE)
అప్పుడు ఆ పట్టణ నాయకులు ఆ యువతిని ఆమె తల్లిదండ్రుల ఇంటి గుమ్మం దగ్గరకు తీసుకొని రావాలి. తర్వాత ఆ పట్టణంలోని మనుష్యులు ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి. ఎందుకంటే, ఇశ్రాయేలులో ఆమె అవమానకరమైన పని చేసింది. ఆమె తన తండ్రి ఇంటిలో ఒక వేశ్యలా ప్రవర్తించింది. చెడ్డది ఏదైనా సరే మీ ప్రజల్లోనుండి మీరు తీసివేయాలి. [PS]
ద్వితీయోపదేశకాండమ 22 : 22 (ERVTE)
{లైగింక పాపాలు} [PS] “ఒక పురుషడు మరొక పురుషుని భార్యతో లైంగిక సంబధం కలిగి ఉంటే ఆ స్త్రీ, ఆమెతో లైగింక సంబంధం గల ఆ పురుషుడూ ఇద్దరూ చావాలి. చెడ్డది ఏదైనా సరే ఇశ్రాయేలు నుండి తొలగించాలి. [PE][PS]
ద్వితీయోపదేశకాండమ 22 : 23 (ERVTE)
“మరొక పురుషునికి ప్రధానం చేయబడిన ఒక యువతిని ఇంకో పురుషుడు కలియవచ్చును. ఆతడు ఆమెతో లైంగిక సంబంధం కలిగి ఉండవచ్చు. ఇది పట్టణంలో జరిగితే
ద్వితీయోపదేశకాండమ 22 : 24 (ERVTE)
మీరు వాళ్లిద్దర్నీ పట్టణ ద్వారం బయటకు తీసుకొని వచ్చి, మీరు వారిని రాళ్లలో కొట్టి చంపాలి. ఆ పురుషుడు మరొకని భార్యను లైగింక పాపానికి వాడుకున్నాడు గనుక మీరు ఆతడ్ని చంపాలి. ఆ యువతి పట్టణంలోనే ఉండి కూడా సహాయం కోరలేదు గనుక మీరు ఆ యువతిని చంపాలి. చెడ్డది ఏదైనా సరే మీ ప్రజల్లొనుండి మీరు తొలగించాలి. [PE][PS]
ద్వితీయోపదేశకాండమ 22 : 25 (ERVTE)
“ఆయితే ప్రధానం చేయబడిన ఒక యువతిని ఒక పురుషుడు పొలంలో చూచి అతనితో లైగింక సంబంధం అనుభవించమని ఆమెను బలవంతం చేస్తే. అప్పుడు ఆ పురుషుడు మాత్రమే చావాలి.
ద్వితీయోపదేశకాండమ 22 : 26 (ERVTE)
ఆ యువతి మరణశిక్షకు పాత్రమైనది ఏమీ చేయలేదు, గనుక మీరు ఆమెను ఏమీ చేయకూడదు. ఒకడు మరోక అమాయకుని మీద దాడి చేసి హత్య చేసిన వంటిదే ఈ వ్యాజ్యెముకూడాను.
ద్వితీయోపదేశకాండమ 22 : 27 (ERVTE)
ఆ పురుషుడు ప్రధానం చేయబడిన యువతిని బయట పొలంలో చూసాడు. ఆ యువతి సహాయం కోసం కేకలు పెట్టింది, కానీ ఆమెకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు. [PE][PS]
ద్వితీయోపదేశకాండమ 22 : 28 (ERVTE)
“ఒక పురుషుడు ప్రధానం చేయబడని ఒక కన్యను చూచి, అతనితో లైగింక సంబంధం అనుభవించమని బలవంతం చేయవచ్చును. ఒకవేళ అతడు ఇలా చేయటం ప్రజలు చూస్తే
ద్వితీయోపదేశకాండమ 22 : 29 (ERVTE)
అప్పుడు ఆతడు అమ్మాయి తల్లిదండ్రులకు యాభై తులాల వెండి ఇవ్వాలి. ఆ యువతి అతని భార్య అవుతుంది. ఎందుకంటే అతడు ఆమెను లైంగికంగా వాడుకొన్నాడు గనుక. అతడు తన జీవితాంతం ఆమెను విడాకులు ఇవ్వకూడదు. [PE][PS]
ద్వితీయోపదేశకాండమ 22 : 30 (ERVTE)
“ఒక పురుషుడు తన తండ్రి భార్యతో లైంగింక సంబంధం కలిగియుండి తన తండ్రికి ఆవమానం కలిగించకూడదు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30

BG:

Opacity:

Color:


Size:


Font: