ప్రసంగి 3 : 1 (ERVTE)
{ప్రతిదానికి ఒక తరుణం} [PS] ప్రతిదానికి సరైన సమయం ఒకటుంది. ఈ భూమి మీద ప్రతీది సరైన సమయంలో సంభవిస్తుంది.
ప్రసంగి 3 : 2 (ERVTE)
పుట్టేందుకొక సమయం వుంది, [QBR2] చనిపోయేందుకొక సమయం వుంది. [QBR] మొక్కలు నాటేందుకొక సమయం వుంది, [QBR2] మొక్కలు పెరికేందుకొక సమయం వుంది. [QBR]
ప్రసంగి 3 : 3 (ERVTE)
చంపేందుకొక సమయం వుంది, [QBR2] గాయం మాన్పేందుకొక సమయం వుంది. [QBR] నిర్మూలించేందుకొక సమయం వుంది, [QBR2] నిర్మించేందుకొక సమయం వుంది. [QBR]
ప్రసంగి 3 : 4 (ERVTE)
ఏడ్చేందుకొక సమయం వుంది, [QBR2] నవ్వేందుకొక సమయం వుంది. [QBR] దుఃఖించేందుకొక సమయం వుంది. [QBR2] సంతోషంతో నాట్య మాడేందుకొక సమయం వుంది. [QBR]
ప్రసంగి 3 : 5 (ERVTE)
ఆయుధాలు పడవేసేందుకొక సమయం వుంది, [QBR2] వాటిని తిరిగి చేపట్టేందుకుకొక సమయం వుంది. [QBR] ఒకరిని కౌగిలించు కొనేందుకొక సమయం వుంది, [QBR2] ఆ కౌగిలిని సడలించేందుకొక సమయం ఉంది. [*ఆయుధాలు … సమయం ఉంది అక్షరాలా “రాళ్లు పారేసేందుకొక సమయం ఉంది, వాటిని పోగుచేసేందుకొక సమయం ఉంది.”] [QBR]
ప్రసంగి 3 : 6 (ERVTE)
దేన్నయినా వెదికేందుకొక సమయం వుంది, [QBR2] అది పోగొట్టుకొనేందుకొక సమయం వుంది. [QBR] వస్తువులు పదిల పర్చు కొనే సమయం వుంది, [QBR2] వాటిని పారవేసే సమయం వుంది. [QBR]
ప్రసంగి 3 : 7 (ERVTE)
వస్త్రం చింపేందుకొక సమయం వుంది, [QBR2] దాన్ని కుట్టేందుకొక సమయం వుంది. [QBR] మౌనానికొక సమయం వుంది. [QBR2] మాట్లాడేందు కొక సమయం వుంది. [QBR]
ప్రసంగి 3 : 8 (ERVTE)
ప్రేమించేందుకొక సమయం వుంది, [QBR2] ద్వేషించేందుకొక సమయం వుంది. [QBR] సమరానికొక సమయం వుంది, [QBR2] శాంతికొక సమయం వుంది. [PS]
ప్రసంగి 3 : 9 (ERVTE)
{దేవుడు తన జగత్తుని అదుపు చేస్తాడు} [PS] మనిషి చేసే కష్ట భూయిష్టమైన పనికిగాను అతనికి నిజంగా ఏమైనా లభిస్తుందా? (ఉండదు!)
ప్రసంగి 3 : 10 (ERVTE)
చేసేందుకు దేవుడు మనకిచ్చే కష్ట భూయిష్టమైన పనులన్నీ ఏమిటో నేను గుర్తించాను.
ప్రసంగి 3 : 11 (ERVTE)
తన జగత్తును గురించి ఆలోచించే సామర్థ్యాన్ని దేవుడు మనకి యిచ్చాడు. [†జగత్తును … యిచ్చాడు లేక, “భవిష్యత్తును తెలుసు కోవాలన్న వాంఛను.”] అయితే దేవుడు చేసే వాటన్నింటినీ మనం ఎన్నడూ పూర్తిగా తెలుసు కోలేము. అయితేనేమి, దేవుడు అన్ని పనుల్నీ సరిగ్గా సరైన సమయంలోనే చేస్తాడు. [PE][PS]
ప్రసంగి 3 : 12 (ERVTE)
తాము బతికినంత కాలము సంతోషంగా ఉండటం, తనివితీరా సుఖాలు అనుభవించడం ఇవి మనుష్యులు చేయవలసిన అత్యుత్తమమైన పని అన్న విషయం నేను గ్రహించాను.
ప్రసంగి 3 : 13 (ERVTE)
ప్రతి మనిషి తినాలి, తాగాలి, తాను చేసే పనిని ఆహ్లాదంగా చెయ్యాలి ఇది దేవుడు కోరుకునేది. ఇవి దేవుడిచ్చిన వరాలు. [PE][PS]
ప్రసంగి 3 : 14 (ERVTE)
దేవుడు చేసేది ప్రతీది శాశ్వతంగా కొనసాగు తుందని నేను తెలుసుకున్నాను. దేవుడు చేసినదానికి మనుష్యులు దేన్నీ ఎంతమాత్రం జోడించలేరు మరియు దేవుడు చేసే పనినుండి దేనినీ తీసుకొనలేరు. మనుష్యులు తనని గౌరవించేందుకే దేవుడు ఇదంతా చేశాడు.
ప్రసంగి 3 : 15 (ERVTE)
గతంలో జరిగినవేవో జరిగాయి, (మరి మనం వాటిని మార్చలేము.) భవిష్యత్తులో జరగ బోయేవేవో జరుగుతాయి. (మనం వాటిని మార్చలేము) అయితే, ఎవరైతే చెడ్డగా చూడబడ్డారో, వారికి దేవుడు మంచి చెయ్యాలని కోరుకుంటాడు. [‡దేవుడు … కోరుకుంటాడు లేక, “ఇప్పుడు జరుగుతున్నది గతంలో కూడా జరిగింది. భవిష్యత్తులో జరగబోయేది కూడా గతంలో జరిగాయి. దేవుడు ఆయా విషయాలు మళ్లీ మళ్లీ జరిగేలా చేస్తాడు.”] [PE][PS]
ప్రసంగి 3 : 16 (ERVTE)
ఈ ప్రపంచములో యీ విషయాలన్నీ నేను చూశాను. న్యాయ స్థానాల్లో మంచితనము, న్యాయము నిండుగా ఉండాలి, అయితే అక్కడ మనం కను గొంటుంది చెడుగు.
ప్రసంగి 3 : 17 (ERVTE)
అందుకని, నాలో నేను ఇలా అనుకున్నాను: “దేవుడు ప్రతి పనికి ఒక కాలాన్ని ఎంచుకున్నాడు. అంతేకాదు, మనుష్యులు చేసే పనులన్నింటిని విచారించేందుకు దేవుడు ఒక ప్రత్యేక కాలాన్ని ఎంచుకున్నాడు. దేవుడు మంచివాళ్లని విచారిస్తాడు, చెడ్డవాళ్లని విచారిస్తాడు.” మనుష్యులకి జంతువులకి భేదమే లేదా? [PS]
ప్రసంగి 3 : 18 (ERVTE)
మనుష్యులు ఒకరిపట్ల మరొకరు వ్యవహరించే తీరును గమనించిన నేను నాలో నేనిలా అనుకున్నాను, “తాము జంతువుల మాదిరిగా వున్నామన్న విషయాన్ని మనుష్యులు గమనించాలని దేవుడు కోరుకున్నాడు.
ప్రసంగి 3 : 19 (ERVTE)
మనిషి జంతువుకంటే మెరుగైనవాడా? (కాడు) ఎందుకని? ఎందుకంటే, అన్ని నిష్ర్పయోజనం కనుక. మనుష్యులూ మరణిస్తారు. జంతువులూ మరణిస్తాయి. ఒకే ‘ఊపిరి’ [§ఊపిరి ఆత్మ ప్రాణం.] మనుష్యుల్లోనూ, జంతువుల్లోనూ ఉన్నది. చనిపోయిన జంతువుకి, మనిషికి మధ్య తేడా ఏమైనా ఉందా?
ప్రసంగి 3 : 20 (ERVTE)
అన్ని ఒక్క చోటుకే పోతాయి. అవి ఏ మట్టినుంచి పుట్టాయో చివరికి ఆ మట్టిలోకే పోతాయి.
ప్రసంగి 3 : 21 (ERVTE)
మనిషి ఆత్మకి ఏమి జరుగుతుందో ఎవరికెరుక? జంతువు ఆత్మ పాతాళానికి పోతే, మనిషి ఆత్మ పైకి దేవుని దగ్గరికి వెళ్తుందేమో ఎవరికి తెలుసు?” [PE][PS]
ప్రసంగి 3 : 22 (ERVTE)
అందుకని, మనిషి తాను చేసే పనిలో ఆనందం పొందడమే అత్యుత్తమమైనదని నేను గ్రహించాను. అదే వాళ్ల భాగ్యం. (మరో విషయంయేమంటే, భవిష్యత్తు గురించి మనిషి దిగులు పెట్టుకోకూడదు.) ఎందుకంటే భవిష్యత్తులో ఏమి జరుగుతుందో తెలుసుకొనేందుకు మనిషికి ఎవ్వరూ తోడ్పడలేరు. [PE]
❮
❯