ఆదికాండము 10 : 1 (ERVTE)
{జనముల అభివృద్ధి విస్తరణ} [PS] నోవహు కుమారులు షేము, హాము, యాఫెతు. ప్రళయం తర్వాత ఈ ముగ్గురు మగవాళ్లు ఇంకా అనేకమంది కుమారులకు తండ్రులయ్యారు. షేము, హాము, యాఫెతు ద్వారా వచ్చిన కుమారుల జాబితా ఇది. యాఫెతు వంశస్థులు:
ఆదికాండము 10 : 2 (ERVTE)
{యాఫెతు సంతానము} [PS] యాఫెతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు.
ఆదికాండము 10 : 3 (ERVTE)
గోమెరు కుమారులు అష్కనజు, రీఫతు, తోగర్మా
ఆదికాండము 10 : 4 (ERVTE)
యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము. [PS]
ఆదికాండము 10 : 5 (ERVTE)
మధ్యధరా సముద్రానికి చుట్టు ప్రక్కల దేశాల్లో నివశించు ప్రజలంతా ఈ యాఫెతు కుమారుల సంతానమే. ఒక్కో కుమారునికి ఒక్కో స్వంత దేశం ఉంది. కుటుంబాలన్ని పెరిగి వేరు వేరు జాతుల వారయ్యారు. ప్రతి జాతివారికి వారి స్వంత భాష ఉంది.
ఆదికాండము 10 : 6 (ERVTE)
{హాము సంతానము} [PS] హాము కుమారులు కూషు, మిస్రాయిము, [*మిస్రాయిము ఇది ఈజిప్టు యొక్క మరో పేరు.] పూతు, కనాను.
ఆదికాండము 10 : 7 (ERVTE)
కూషు కుమారులు సెబా, హవీలా, సబ్తా. రాయమా కుమారులు షేబ, దదాను. [PS]
ఆదికాండము 10 : 8 (ERVTE)
కూషుకు నిమ్రోదు అనే కుమారుడు కూడా ఉన్నాడు. భూమిమీద నిమ్రోదు చాలా శక్తిమంతుడయ్యాడు.
ఆదికాండము 10 : 9 (ERVTE)
నిమ్రోదు యెహోవా యెదుట గొప్ప వేటగాడు. అందుకే మనుష్యులు కొందరిని నిమ్రోదుతో పోల్చి, “ఆ మనిషి నిమ్రోదు వలె యెహోవా యెదుట గొప్ప వేటగాడు” అంటారు. [PE][PS]
ఆదికాండము 10 : 10 (ERVTE)
షీనారు దేశంలో బాబెలు, ఎరెకు, అక్కదు అనే చోట్ల నిమ్రోదు రాజ్యం ఆరంభం అయింది.
ఆదికాండము 10 : 11 (ERVTE)
నిమ్రోదు అష్షూరు కూడా వెళ్లాడు. అక్కడే నీనెవె రహోబో, తీరు, కాలహు,
ఆదికాండము 10 : 12 (ERVTE)
రెసెను పట్టణాలను అతడు నిర్మించాడు. (నీనెవెకు, కాలహు మహా పట్టణానికి మధ్య రెసెను ఉంది.)
ఆదికాండము 10 : 13 (ERVTE)
లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, సఫ్తుహీయులు.
ఆదికాండము 10 : 14 (ERVTE)
సత్రుసీయులు, కఫ్తోరీయుల జనాంగములకు మిస్రాయము తండ్రి. (ఫిలిష్తీయులు కస్లూహీయులలో నుండి వచ్చిన వారే.)
ఆదికాండము 10 : 15 (ERVTE)
సీదోను తండ్రి కనాను. కనాను జ్యేష్ఠ కుమారుడు సీదోను, హేతుకు కనాను తండ్రి.
ఆదికాండము 10 : 16 (ERVTE)
యెబూసీయులు, అమోరీయులు, గీర్గాషీయులు.
ఆదికాండము 10 : 17 (ERVTE)
హివ్వీయులు, అర్కీయులు, సినీయులు.
ఆదికాండము 10 : 18 (ERVTE)
అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు అందరికి కనాను తండ్రి. [PS] కనాను వంశాలు ప్రపంచంలోని వేర్వేరు భాగాలకు వ్యాప్తి చెందాయి.
ఆదికాండము 10 : 19 (ERVTE)
ఉత్తరాన సీదోను నుండి దక్షీణాన గెరారు వరకు, పశ్చిమాన గాజా నుండి తూర్పున సొదొమ, గొమొర్రా, అద్మా. సెబోయిము నుండి లాషా వరకు కనాను ప్రజల భూభాగమే. [PE][PS]
ఆదికాండము 10 : 20 (ERVTE)
ఆ ప్రజలంతా హాము సంతానం. ఆ ప్రజలందరికీ వారికి స్వంత భాషలు, స్వంత దేశాలు ఉన్నాయు. వారు వేరు వేరు జాతులయ్యారు. [PS]
ఆదికాండము 10 : 21 (ERVTE)
{షేము సంతానము} [PS] యాఫెతు అన్న షేము. షేము వంశస్థుల్లో ఒకడైన ఏబెరు హెబ్రీ ప్రజలందరికీ తండ్రి.
ఆదికాండము 10 : 22 (ERVTE)
షేము కుమారులు, ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము.
ఆదికాండము 10 : 23 (ERVTE)
అరాము కుమారులు ఊజు, హోలు, గెతెరుమాష.
ఆదికాండము 10 : 24 (ERVTE)
అర్పక్షదు షేలహుకు తండ్రి. షేలహు ఏబెరుకు తండ్రి.
ఆదికాండము 10 : 25 (ERVTE)
ఏబెరు ఇద్దరు కుమారులకు తండ్రి, ఒక కుమారునికి పెలెగు [†పెలెగు అనగా విభజన] అని పేరు పెట్టబడింది. అతని జీవిత కాలములోనే భూమి విభజించబడింది. కనుక అతనికి ఈ పేరు పెట్టబడింది. మరో సోదరుడి పేరు యొక్తాను.
ఆదికాండము 10 : 26 (ERVTE)
యొక్తాను కుమారులు అల్మదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు,
ఆదికాండము 10 : 27 (ERVTE)
హదోరము, ఊజాలు, దిక్లాను
ఆదికాండము 10 : 28 (ERVTE)
ఓబాలు, అబీమాయెలు, షేబ,
ఆదికాండము 10 : 29 (ERVTE)
ఓఫీరు, హవీలా, యోబాబు. ఈ మనుష్యులంతా యొక్తాను కుమారులు.
ఆదికాండము 10 : 30 (ERVTE)
మేషాకు దేశానికి, తూర్పునున్న కొండ దేశానికి మధ్య ఆ ప్రజలు జీవించారు. సెపారా దేశపు దిశలో మేషా ఉంది. [PS]
ఆదికాండము 10 : 31 (ERVTE)
వాళ్లు షేము వంశంనుండి వచ్చిన ప్రజలు. వంశాలు, భాషలు, దేశాలు, జాతులను బట్టి వారి క్రమం ఏర్పాటు చేయబడింది. [PE][PS]
ఆదికాండము 10 : 32 (ERVTE)
నోవహు కుమారుల వంశాల జాబితా అది. అవి వారి జాతుల ప్రకారం ఏర్పాటు చేయబడ్డాయి. జలప్రళయం తర్వాత భూమి అంతటా వ్యాపించిన ప్రజలందరూ ఆ వంశాల నుండి వచ్చిన వారే. [PE]
❮
❯