ఆదికాండము 21 : 1 (ERVTE)
{శారాకు ఒక శిశువు} [PS] యెహోవా శారాకు అనుగ్రహిస్తానని ఆమెకు వాగ్దానం చేసాడు. ఆయన వాగ్దానం చేసినట్టే ఆమెపై అనుగ్రహాన్ని చూపాడు.
ఆదికాండము 21 : 2 (ERVTE)
అబ్రాహాము వృద్దాప్యంలో శారా గర్భవతి అయ్యింది, అతనికి ఒక కుమారుని కన్నది. ఈ సంగతులన్నీ సరిగ్గా దేవుడు వాగ్దానం చేసినట్టే జరిగాయి.
ఆదికాండము 21 : 3 (ERVTE)
శారా కుమారుని కన్నది, అబ్రాహాము వానికి ఇస్సాకు అని పేరు పెట్టాడు.
ఆదికాండము 21 : 4 (ERVTE)
దేవుడు ఆజ్ఞాపించినట్టు, ఇస్సాకుకు ఎనిమిది రోజులు నిండగానే అబ్రాహాము అతనికి సున్నతి చేశాడు. [PE][PS]
ఆదికాండము 21 : 5 (ERVTE)
తన కుమారుడు ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రాహాము నయస్సు 100 సంవత్సరాలు.
ఆదికాండము 21 : 6 (ERVTE)
“దేవుడు నన్ను సంతోషపెట్టాడు. ఇది విన్న ప్రతి ఒక్కరూ నాతో సంతోషిస్తారు.
ఆదికాండము 21 : 7 (ERVTE)
నేను శారాను, అబ్రాహాము కుమారుణ్ణి పొందుతాడని ఏ ఒక్కరూ తలంచలేదు. కానీ ఆయన వృద్ధుడుగా ఉన్నప్పుడు అబ్రాహాముకు నేను ఒక కుమారుని కన్నాను” అంది శారా. [PS]
ఆదికాండము 21 : 8 (ERVTE)
{ఇంట్లో చిక్కు} [PS] ఇస్సాకు ఎదుగుతున్నాడు. త్వరలోనే గట్టి పదార్థాలు భోజనం చేసేటంతటి పెద్దవాడయ్యాడు. అప్పట్లో అబ్రాహాము ఒక మహా గొప్ప విందు చేసాడు.
ఆదికాండము 21 : 9 (ERVTE)
గతంలో ఈజిప్టు బానిసైన స్త్రీ హాగరు ఒక కుమారుని కన్నది. ఆ కుమారునికి కూడా తండ్రి అబ్రాహామే. అయితే ఆ కుమారుడు ఇప్పుడు ఇస్సాకును వేధించడం శారా చూసింది.
ఆదికాండము 21 : 10 (ERVTE)
“కనుక ఆ బానిస స్త్రీని, ఆమె కుమారుణ్ణి బలవంతంగా వెళ్లగొట్టు. మన మరణం తరువాత మన కుమారుడు ఇస్సాకు మన ఆస్తి అంతటికి వారసుడవుతాడు. దానిలో దాసీ కుమారుడు ఇస్సాకుతో భాగం పంచుకోవటం నాకు ఇష్టం లేదు అంటూ” శారా అబ్రాహాముతో చెప్పింది. [PE][PS]
ఆదికాండము 21 : 11 (ERVTE)
ఇదంతా అబ్రాహాముకు బాధ కలిగించింది. తన కుమారుడైన ఇష్మాయేలును గూర్చి అతడు చింతించాడు.
ఆదికాండము 21 : 12 (ERVTE)
కానీ అబ్రాహాముతో దేవుడన్నాడు: “ఆ పిల్లవాణ్ణి గూర్చి నీవు చింతించకు. ఆ బానిస స్త్రీని గూర్చి నీవు చింతపడకు. శారా కోరినట్టే చేయి. ఇస్సాకు మాత్రమే నీకు వారసుడయిన కుమారుడు.
ఆదికాండము 21 : 13 (ERVTE)
అయితే నీ బానిస స్త్రీ కుమారుణ్ణి కూడా నేను ఆశీర్వదిస్తాను. అతడు నీ కుమారుడే, కనుక అతని వంశం నుండి గూడ నేను ఒక గొప్ప జనాన్ని చేస్తాను.” [PE][PS]
ఆదికాండము 21 : 14 (ERVTE)
మర్నాడు వేకువనే అబ్రాహాము కొంత భోజనాన్ని, తిత్తిలో నీళ్లు తెచ్చాడు. అబ్రాహాము వీటిని హాగరుకు ఇచ్చాడు. హాగరు వీటిని తీసుకొని, తన కుమారునితో కలసి వెళ్లిపోయింది. హాగరు ఆ చోటు విడిచి బెయేర్షెబా అరణ్యంలో సంచరించింది. [PE][PS]
ఆదికాండము 21 : 15 (ERVTE)
కొన్నాళ్లకు తిత్తిలోని నీళ్లన్నీ అయిపోయాయి. తాగటానికి ఏమీ మిగలలేదు. కనుక హాగరు తన కుమారుణ్ణి ఒక పొద పక్కన పెట్టింది.
ఆదికాండము 21 : 16 (ERVTE)
హాగరు కొంచె దూరం నడచి వెళ్లింది. అక్కడ ఆగిపోయి కూర్చుంది. నీళ్లు లేవు గనుక తన కుమారుడు చనిపోతాడనుకొంది హాగరు. వాడు చస్తోంటే చూడటం ఆమెకు ఇష్టం లేదు. ఆమె అక్కడ కూర్చొని ఏడ్వటం మొదలు పెట్టింది. [PE][PS]
ఆదికాండము 21 : 17 (ERVTE)
ఆ పిల్లవాడు ఏడ్వడం దేవుడు విన్నాడు. పరలోకంనుండి దేవుని దూత హాగరును పిలిచాడు. అతడన్నాడు, “హాగరూ, ఏం జరిగింది? భయపడకు. అక్కడ పిల్లవాడు ఏడ్వడం యెహోవా విన్నాడు.
ఆదికాండము 21 : 18 (ERVTE)
వెళ్లి పిల్లవాడికి సహాయం చేయి. వాడి చేయి పట్టి నడిపించు. ఒక గొప్ప జనాంగానికి అతణ్ణి తండ్రిగా నేను చేస్తాను” [PE][PS]
ఆదికాండము 21 : 19 (ERVTE)
అంతలో హాగరుకు ఒక బావి కనబడేటట్టు చేసాడు దేవుడు. కనుక హాగరు ఆ బావి దగ్గరకు వెళ్లి తన తిత్తిని నీళ్లతో నింపుకొన్నది. తర్వాత పిల్లవాడు తాగటానికి ఆమె నీళ్లు ఇచ్చింది. [PE][PS]
ఆదికాండము 21 : 20 (ERVTE)
ఆ పిల్లవాడు ఎదుగుతూ ఉండగా దేవుడు వానికి తోడుగానే ఉన్నాడు. ఇష్మాయేలు అరణ్యంలో జీవిస్తూ, వేయగాడయ్యాడు. బాణం కొట్టడంలో నిపుణత నేర్చుకొన్నాడు.
ఆదికాండము 21 : 21 (ERVTE)
అతని తల్లి అతని కోసం ఈజిప్టులో భార్యను కనుగొన్నది. వారు పారాను అరణ్యంలోనే జీవిస్తూ ఉన్నారు. [PS]
ఆదికాండము 21 : 22 (ERVTE)
{అబీమెలెకుతో అబ్రాహాము బేరం} [PS] అంతట ఆబీమెలెకు, ఫీకోలు అబ్రాహాముతో మాట్లాడారు. అబీమెలెకు, అతని సైన్యాధిపతి ఫికోలు అబ్రాహాముతో ఇలా చెప్పారు: “నీవు చేసే ప్రతి దానిలోను దేవుడు నీతో ఉన్నాడు.
ఆదికాండము 21 : 23 (ERVTE)
కనుక ఇక్కడ దేవుని యెదుట నాకు ఒక వాగ్దానం చేయాలి. నాతో, నా పిల్లలతో నీవు న్యాయంగా వ్యవహరిస్తావని వాగ్దానం చేయాలి. నీవు నివసించిన ఈ దేశం మీద, నా మీద నీవు దయగలిగి ఉంటానని వాగ్దానం చేయాలి. నీపైన నేను ఎంత దయ చూపెట్టానో, నాపైన నీవు కూడా అంత దయ చూపెడ్తానని వాగ్దానం చేయాలి.” [PE][PS]
ఆదికాండము 21 : 24 (ERVTE)
“నన్ను నీవు ఎలా పరామర్శించావో నేను కాడు నిన్ను అలాగే పరామర్శిస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను” అన్నాడు అబ్రాహాము.
ఆదికాండము 21 : 25 (ERVTE)
అప్పుడు అబ్రాహాము అబీమెలెకుతో ఒక ఫిర్యాదు చేసాడు. అబీమెలెకు సేవకులు ఒక మంచి నీటి బావిని స్వాధీనం చేసుకొన్నందుచేత అబ్రాహాము అబీమెలెకుతో ఫిర్యాదు చేసాడు. [PE][PS]
ఆదికాండము 21 : 26 (ERVTE)
కానీ అబీమెలెకు, “ఇది ఎవరు చేసారో నాకు తెలియదు. ఇంతకు ముందు ఈ విషయం నీవు నాతో చెప్పలేదు” అన్నాడు. [PE][PS]
ఆదికాండము 21 : 27 (ERVTE)
కనుక అబ్రాహాము, అబీమెలెకు ఒక ఒడంబడిక చేసుకొన్నారు. ఆ ఒడంబడిక సూచనగా కొన్ని గొర్రెలను, పశువులను అబీమెలెకుకు అబ్రాహాము ఇచ్చాడు.
ఆదికాండము 21 : 28 (ERVTE)
ఏడు [*ఏడు ‘ఏడు’ అనే అర్థం ఇచ్చే హీబ్రూ పదం, ‘ప్రమాణం’ లేక ‘ఒప్పందం’ అనే అర్థం ఇచ్చే హీబ్రూ పదం ఒక్కటే. అందుకు ఏడు గొర్రెలు ఈ వాగ్దానానికి రుజువు.] ఆడ గొర్రె పిల్లల్ని కూడా అబీమెలెకు ఎదుట ఉంచాడు అబ్రాహాము.
ఆదికాండము 21 : 29 (ERVTE)
“ఈ ఏడు ఆడ గొర్రెపిల్లల్ని ఇలా ప్రత్యేకంగా ఎందుకు పెట్టావు?” అని అబీమెలెకు అబ్రాహామును అడిగాడు. [PE][PS]
ఆదికాండము 21 : 30 (ERVTE)
“ఈ గొర్రెపిల్లల్ని నా దగ్గర నుండి నీవు స్వీకరించినప్పుడు, ఈ బావిని నేను తవ్వించినట్టు రుజువు అవుతుంది” అని అబ్రాహాము జవాబిచ్చాడు. [PE][PS]
ఆదికాండము 21 : 31 (ERVTE)
కనుక ఆ తర్వాత ఆ బావి బెయేర్షెబా [†బెయేర్షెబా “ప్రమాణపు బావి” అని దీని అర్థం.] అని పిలువబడింది. వారిద్దరు ఒకరికి ఒకరు ఆ స్థలంలో వాగ్దానం చేసుకొన్న చోటు గనుక దానికి వారు ఆ పేరు పెట్టారు.
ఆదికాండము 21 : 32 (ERVTE)
కనుక అబ్రాహాము, అబీమెలెకు బెయేర్షెబా దగ్గర ఒక ఒడంబడిక చేసుకొన్నారు. అప్పుడు అబెమెలెకు, అతని సైన్యాధిపతి తిరిగి ఫిలిష్తీ ప్రజల దేశం వెళ్లిపోయారు. [PE][PS]
ఆదికాండము 21 : 33 (ERVTE)
బెయేర్షెబాలో అబ్రాహాము ఒక అలంకారపు చెట్టు [‡అలంకారపు చెట్టు పొడవుగా సన్నగా వెంట్రుకలవలె ఎల్లప్పుడు పచ్చగావుండే ఆకులుగల పొద.] నాటాడు. అప్పుడు అబ్రాహాము ప్రభువు, ఎల్లప్పుడు జీవిస్తున్న దేవుడైన యెహోవాకు అతడు అక్కడ ప్రార్థన చేశాడు.
ఆదికాండము 21 : 34 (ERVTE)
ఫిలిష్తీయుల దేశంలో అబ్రాహాము చాలాకాలం నివసించాడు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34

BG:

Opacity:

Color:


Size:


Font: