ఆదికాండము 3 : 1 (ERVTE)
{పాపం ప్రారంభం} [PS] ఆ సమయంలో ఆ స్త్రీతో సర్పం మాట్లాడింది. యెహోవా దేవుడు సృష్టించిన అడవి జంతువులన్నిటిలో సర్పం చాలా తెలివైనది, కపటమైనది. ఆ సర్పం స్త్రీని మోసగించాలనుకొని, “ఏమమ్మా ఈ తోటలోని ఏ చెట్టు ఫలమైనా తినివద్దని దేవుడు నిజంగా నీతో చెప్పాడా?” అంది. [PE][PS]
ఆదికాండము 3 : 2 (ERVTE)
సర్పానికి ఆమె ఇలా జవాబిచ్చింది: “లేదు! దేవుడు అలాగు చెప్పలేదు. తోటలోని చెట్ల ఫలాలు మేము తినవచ్చు.
ఆదికాండము 3 : 3 (ERVTE)
అయితే ఒక చెట్టుంది, దాని ఫలము మేము తినకూడదు. ‘తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలం మీరు తినకూడదు. అసలు ఆ చెట్టును మీరు ముట్టుకోకూడదు. అలాచేస్తే మీరు చస్తారు’ అని దేవుడు మాతో చెప్పాడు.” [PE][PS]
ఆదికాండము 3 : 4 (ERVTE)
అయితే సర్పం ఆ స్త్రీతో ఇలా అంది: “మీరు చావరు.
ఆదికాండము 3 : 5 (ERVTE)
ఆ చెట్టు ఫలం మీరు తింటే, మంచి చెడ్డలను గూర్చి మీరు తెలుసుకొంటారని దేవునికి తెలుసు. అప్పుడు మీరు దేవునివలె ఉంటారు!” [PE][PS]
ఆదికాండము 3 : 6 (ERVTE)
ఆ చెట్టు చాలా అందంగా ఉన్నట్టు ఆ స్త్రీ చూసింది; ఆ ఫలం తినటానికి మంచిదిగా ఉన్నట్టు, ఆ చెట్టు తెలివినిస్తుందని ఆమె తెలుసుకొంది. కనుక ఆ స్త్రీ ఆ చెట్టు ఫలం తీసుకొని దానిని తిన్నది. ఆ పండులో కొంత ఆమె భర్తకు ఇచ్చింది, అతడు కూడా దాన్ని తిన్నాడు. [PE][PS]
ఆదికాండము 3 : 7 (ERVTE)
అప్పుడు ఆ పురుషుడు, స్త్రీ ఇద్దరూ మారిపోయారు. వారి కళ్లు తెరవబడ్డట్టు, వారికి అన్నీ వేరుగా కనబడ్డాయి. వారికి బట్టలు లేనట్లు నగ్నంగా ఉన్నట్లు వాళ్లు చూశారు. కనుక వారు అంజూరపు ఆకులను కుట్టి వాటినే బట్టలుగా ధరించారు. [PE][PS]
ఆదికాండము 3 : 8 (ERVTE)
సాయంకాలపు చల్లని వేళలో యెహోవా దేవుడు ఆ తోటలో నడుస్తుండగా ఆ పురుషుడు, స్త్రీ ఆ చప్పుడు విని తోటలోని చెట్లమధ్య దాగుకొన్నారు. యెహోవా దేవుని నుండి దాగుకొనేందుకు వారు ప్రయత్నించారు.
ఆదికాండము 3 : 9 (ERVTE)
అయితే యెహోవా దేవుడు ఆ పురుషుని పిలిచాడు. “నీవు ఎక్కడున్నావు?” అన్నాడు యెహోవా. [PE][PS]
ఆదికాండము 3 : 10 (ERVTE)
“నీవు తోటలో నడుస్తున్న చప్పుడు విన్నాను, నాకు భయం వేసింది. నేను నగ్నంగా ఉన్నాను, అందుకే దాగుకొన్నాను” అన్నాడు ఆ పురుషుడు. [PE][PS]
ఆదికాండము 3 : 11 (ERVTE)
దేవుడు ఆ పురుషునితో ఇలా అన్నాడు. “నీవు నగ్నంగా ఉన్నావని నీతో ఎవరు చెప్పారు? నిన్ను సిగ్గుపడేటట్లు చేసింది ఏమిటి? నేను తినవద్దని చెప్పిన పండు నీవు తిన్నావా ఏమిటి? ఆ చెట్టు ఫలం తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించానుగదా!” [PE][PS]
ఆదికాండము 3 : 12 (ERVTE)
అందుకు ఆ పురుషుడు, “నా కోసం నీవు చేసిన ఈమె ఆ చెట్టు ఫలాన్ని నాకిచ్చింది, అందుచేత నేను తిన్నాను” అన్నాడు. [PE][PS]
ఆదికాండము 3 : 13 (ERVTE)
అప్పుడు యెహోవా దేవుడు, “ఏమిటి నీవు చేసింది?” అన్నాడు ఆ స్త్రీతో. [PE][PS] ఆ స్త్రీ, “సర్పం నన్ను మోసం చేసింది. నన్ను వెర్రిదాన్ని చేస్తే ఆ పండు తినేసాను” అని చెప్పింది. [PE][PS]
ఆదికాండము 3 : 14 (ERVTE)
అందుచేత యెహోవా దేవుడు సర్పంతో ఇలా అన్నాడు: “ఈ మహా చెడ్డ పని నీవే చేసావు [QBR2] కనుక నీవు శపించబడ్డావు. [QBR] జంతువులన్నీటి కంటే [QBR2] నీ పరిస్థితి హీనంగా ఉంటుందు. [QBR] నీవు నీ పొట్టతో పాకడం తప్పనిసరౌవుతుంది. [QBR2] నీవు జీవిత కాలమంతా మట్టి తింటావు. [QBR]
ఆదికాండము 3 : 15 (ERVTE)
ఈ స్త్రీని, నిన్ను ఒకరికొకర్ని [QBR2] విరోధుల్నిగా నేను చేస్తాను. [QBR] నీ సంతానము, ఆమె సంతానము [QBR2] ఒకరికొకరు విరోధులవుతారు. [QBR] నీవు ఆమె శిశువు పాదం మీద కాటేస్తావు [QBR2] ఈ శిశువు నీ తలను చతుక కొడతాడు.” [PS]
ఆదికాండము 3 : 16 (ERVTE)
అప్పుడు స్త్రీతో యెహోవా దేవుడు ఇలా అన్నాడు: “నీవు గర్భవతిగా ఉన్నప్పుడు నేను [QBR2] నీకు బహు ప్రయాస కలుగజేస్తాను. [QBR] నీవు పిల్లల్ని కనేటప్పుడు మహా [QBR2] గొప్ప బాధ నీకు కలుగుతుంది. [QBR] నీవు నీ భర్తను వాంఛిస్తావు [QBR2] కాని అతడే నిన్ను ఏలుతాడు.” [PS]
ఆదికాండము 3 : 17 (ERVTE)
అప్పుడు పురుషునితో దేవుడు ఈలాగు అన్నాడు: “ప్రత్యేకమైన చెట్టుఫలాన్ని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించాను. [QBR2] అయితే నీవు నీ భార్య చెప్పిన మాటలు విన్నావు ఆ చెట్టు ఫలాన్ని తిన్నావు కనుక [QBR] నీ మూలంగా భూమిని నేను శపిస్తాను. [QBR2] భూమి ఇచ్చే ఆహారం కోసం నీవు నీ జీవితాంతం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. [QBR]
ఆదికాండము 3 : 18 (ERVTE)
పొలంలో పండే మొక్కల్ని నీవు తినాలని అనుకొంటావు [QBR2] కాని ముళ్లను, పొదలను నేల నీకోసం పండిస్తుంది. [QBR]
ఆదికాండము 3 : 19 (ERVTE)
నీ భోజనం కోసం నీవు చాలా కష్టపడి పని చేస్తావు. [QBR2] నీ ముఖం అంతా చెమటతో నిండి పోయేంతగా నీవు పని చేస్తావు. [QBR] నీవు చనిపోయే రోజు వరకు కష్టపడి పని చేస్తావు [QBR2] మరణించాక నీవు మరలా మట్టి అయిపోతావు. [QBR] నేను నిన్ను చేసినప్పుడు మట్టిలో నుంచే నీవు తీయబడ్డావు [QBR2] మళ్లీ నీవు చనిపోయినప్పుడు తిరిగి మట్టిలోనే కలిసిపోతావు.” [PS]
ఆదికాండము 3 : 20 (ERVTE)
ఆదాము [*ఆదాము ఈ పేరుకు అర్థం ‘మానవుడు’ లేక ‘మానవ జాతి.’] తన భార్యకు హవ్వ [†హవ్వ ‘జీవం’ అని అర్థం వచ్చే హెబ్రీ పదం వంటిది ఈ పదం.] అని పేరు పెట్టాడు. ఎన్నడైనా సరే బతికిన ప్రతి మనిషికి ఈమె తల్లి కనుక ఆయన ఆమెకు ఆ పేరు పెట్టాడు. [PE][PS]
ఆదికాండము 3 : 21 (ERVTE)
యెహోవా దేవుడు జంతు చర్మాలతో ఆ పురుషునికి, అతని భార్యకు చొక్కాలు చేసాడు. ఆ తరువాత ఆ చొక్కాలను వారికి తొడిగించాడు. [PE][PS]
ఆదికాండము 3 : 22 (ERVTE)
అప్పుడు యెహోవా దేవుడు అన్నాడు: “చూడండి, మనిషి మనలా తయారయ్యాడు. మంచి, చెడ్డలు మనిషికి తెలుసు. ఇప్పుడు ఆ మనిషి జీవ వృక్షం నుండి ఫలములు తీసుకొని తింటే అతడు శాశ్వతంగా జీవిస్తాడు.” [PE][PS]
ఆదికాండము 3 : 23 (ERVTE)
కనుక ఏదెను తోటనుండి ఆ మనిషిని యెహోవా దేవుడు వెళ్లగొట్టాడు. ఆదాము బలవంతంగా వెళ్లగొట్టబడి ఏ నేల నుండి అతడు తీయబడ్డాడో ఆ నేలను సేద్యం చేయటం మొదలు పెట్టాడు.
ఆదికాండము 3 : 24 (ERVTE)
తరువాత ఆ తోటకు కాపలాగా దాని ద్వారం దగ్గర కెరూబులను [‡కెరూబులు దేవుని దగ్గర నుండి వచ్చిన ప్రత్యేక దేవ దూతలు.] దేవుడు ఉంచాడు. ఒక అగ్ని ఖడ్గాన్ని కూడా అక్కడ ఉంచాడు. జీవ వృక్షమునకు పోయే మార్గాన్ని కాపలా కాస్తూ ఆ ఖడ్గం చుట్టూరా తిరుగుతూవుంది. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24

BG:

Opacity:

Color:


Size:


Font: