ఆదికాండము 41 : 1 (ERVTE)
{ఫరో కలలు} [PS] రెండు సంవత్సరాల తర్వాత ఫరోకు ఒక కల వచ్చింది. ఫరో నైలునది ప్రక్కగా నిలబడినట్టు అతనికి కల వచ్చింది.
ఆదికాండము 41 : 2 (ERVTE)
అప్పుడు ఏడు ఆవులు నదిలోనుంచి బయటకు రావటం ఫరో చూశాడు. ఆవులు బలిసి అందంగా ఉన్నాయి. ఆవులు అక్కడ నిలబడి గడ్డి తింటున్నాయి.
ఆదికాండము 41 : 3 (ERVTE)
అప్పుడు ఇంక ఏడు ఆవులు నదిలోనుంచి బయటకు వచ్చాయి. కానీ ఈ ఆవులు చిక్కిపోయి, బక్కగా ఉన్నాయి. అందంగా ఉన్న ఏడు ఆవుల ప్రక్కగా ఈ ఏడు ఆవులు నిలబడ్డాయి.
ఆదికాండము 41 : 4 (ERVTE)
అసహ్యంగా ఉన్న ఏడు ఆవులు అందంగా బలిసి ఉన్న ఏడు ఆవులను తినివేసాయి. అంతలో ఫరో మేల్కొన్నాడు. [PE][PS]
ఆదికాండము 41 : 5 (ERVTE)
ఫరో మరల నిద్రపోగా రెండవసారి కల వచ్చింది. ఒకే ధాన్యపు మొక్కకు ఏడు వెన్నులు పెరగటం అతడు తన కలలో చూశాడు. ఆ ధాన్యపు గింజలు బలంగా, బాగుండటం అతడు చూశాడు. [PE][PS]
ఆదికాండము 41 : 6 (ERVTE)
తర్వాత అదే ధాన్యపు మొక్కకు మరో ఏడు వెన్నులు పెరగటం అతడు చూశాడు. అయితే ఈ వెన్నులు పీలగా ఉండి, వేడి గాడ్పులకు పాడైపోయాయి.
ఆదికాండము 41 : 7 (ERVTE)
అప్పుడు పీలగా ఉన్న వెన్నులు, బలంగా బాగున్న వెన్నులను తినివేసాయి. ఫరోకు మరల మెళుకువ వచ్చింది. అదంతా కల మాత్రమేనని ఫరో గ్రహించాడు.
ఆదికాండము 41 : 8 (ERVTE)
మర్నాడు ఉదయం ఆ కలల విషయమై ఫరోకు కలవరం కలిగింది. కనుక అతడు ఈజిప్టులోని మంత్రగాళ్లందరిని పిలిపించాడు. విద్వాంసులందరిని అతడు పిలిపించాడు. ఆ కలను గూర్చి ఫరో వాళ్లతో చెప్పాడు. అయితే వాళ్లలో ఒక్కడు కూడా ఆ కలను వివరించలేక పోయారు. దాని భావం చెప్పలేకపోయారు. [PS]
ఆదికాండము 41 : 9 (ERVTE)
{సేవకుడు యోసేపును గూర్చి ఫరోతో చెప్పటం} [PS] అప్పుడు ద్రాక్షాపాత్రల సేవకునికి యోసేపు జ్ఞాపకం వచ్చాడు. ఆ సేవకుడు ఫరోతో ఇలా చెప్పాడు: “నాకు జరిగిన ఒక విషయం జ్ఞాపకం వస్తుంది.
ఆదికాండము 41 : 10 (ERVTE)
నా మీద, మరో సేవకుని మీద తమరికి కోపం వచ్చింది. మీరు మమ్మల్ని చెరసాలో వేసారు.
ఆదికాండము 41 : 11 (ERVTE)
చెరసాలలో మా యిద్దరికీ ఒకే రాత్రి కల వచ్చింది. ఒక్కో కలకు ఒక్కో అర్థం ఉంది.
ఆదికాండము 41 : 12 (ERVTE)
హెబ్రీ యువకుడు ఒకడు మాతో బాటు ఆ చెరసాలలోనే ఉన్నాడు. రాజు సంరక్షక ధళాధిపతికి అతడు సేవకుడు. మేము మా కలలు అతనితో చెబితే, అతడు వాటిని మాకు వివరించాడు. ఒక్కో కల అర్థం అతడు మాకు చెప్పాడు.
ఆదికాండము 41 : 13 (ERVTE)
అతడు చెప్పిన అర్థాలు సత్యం. నాకు విడుగల అవుతుందని, నా పాత ఉద్యోగం మళ్లీ నాకు లభిస్తుందని అతడు నాకు చెప్పాడు. అది సత్యమే. వంటల పెద్ద మరణిస్తాడని అతడు చెప్పాడు, అదీ సత్యమే.” [PS]
ఆదికాండము 41 : 14 (ERVTE)
{కలల భావం చెప్పేందుకు యోసేపును పిల్చారు} [PS] కనుక ఫరో చెరసాలలోనుంచి యోసేపును పిలిపించాడు. సంరక్షకులు వెంటనే యోసేపును చెరసాలలోనుంచి తీసుకొని వచ్చారు. యోసేపు క్షవరం చేసుకొని శుభ్రమైన బట్టలు వేసుకొన్నాడు. అప్పుడు అతడు వెళ్లి ఫరో ముందర నిలవబడ్డాడు.
ఆదికాండము 41 : 15 (ERVTE)
అప్పుడు ఫరో “నాకో కల వచ్చింది, అయితే ఆ కలను నాకు వివరించగల వాళ్లు ఒక్కళ్లూ లేరు. ఎవరైనా వారి కల నీతో చెబితే నీవు వాటిని వివరించి, భావంకూడ చెప్పగలవని నేను విన్నాను” అని యోసేపుతో అన్నాడు. [PE][PS]
ఆదికాండము 41 : 16 (ERVTE)
యోసేపు, “కలలను గ్రహించటంలో నా నైపుణ్యం ఏమీ లేదు. ఆ శక్తి దేవుడికే ఉంది. కనుక దేవుడే ఫరోకు గూడ ఈ పని చేసి పెడ్తాడు” అని జవాబిచ్చాడు. [PE][PS]
ఆదికాండము 41 : 17 (ERVTE)
అప్పుడు ఫరో యోసేపుతో చెప్పాడు: “నా కలలో నేను నైలునది పక్కగా నిలబడ్డాను.
ఆదికాండము 41 : 18 (ERVTE)
ఆ నదిలోనుంచి ఏడు ఆవులు బయటకు వచ్చి గడ్డి మేయటం నేను చూశాను. ఈ ఆవులు బలిసి, అందంగా ఉన్నాయి.
ఆదికాండము 41 : 19 (ERVTE)
అప్పుడు మరో ఏడు ఆవులు నదిలో నుంచి రావటం నేను చూశాను. ఈ ఆవులు బక్కచిక్కి రోగిష్టివిగా ఉన్నాయి. ఈజిప్టు దేశం మొత్తంలో నేను చూసిన ఆవుల్లో అవి పరమ అసహ్యంగా ఉన్నాయి.
ఆదికాండము 41 : 20 (ERVTE)
అసహ్యమైన ఈ ఏడు ఆవులు ముందు వచ్చిన అందమైన ఏడు ఆవులను తినివేసాయి.
ఆదికాండము 41 : 21 (ERVTE)
అయితే ఆ ఏడు ఆవులను తినివేసిన తర్వాత కూడ అవి ఇంకా బక్కచిక్కి ఉన్నాయి. వాటిని చూస్తే, అవి ఏడు ఆవులను తిన్న వాటిల్లాగ అగుపించవు. ముందు అవి ఎంత బక్కగా అసహ్యంగా ఉన్నాయో యిప్పుడూ అలానే కనబడ్డాయి. అప్పుడు నేను మేల్కొన్నాను. [PE][PS]
ఆదికాండము 41 : 22 (ERVTE)
“తర్వాత నాకు వచ్చిన మరో కలలో ఒకే ధాన్యపు మొక్కకు ఏడు వెన్నులు పెరగటం నేను చూశాను. ఆ వెన్నులు నిండుగా, చక్కగా, అందంగా ఉన్నాయి.
ఆదికాండము 41 : 23 (ERVTE)
తర్వాత వాటికి యింకా ఏడు వెన్నులు పెరిగాయి. కానీ ఆ వెన్నులు పీలగా, అసహ్యంగా ఉండి, వేడి గాడ్పులకు పాడైపోయాయి.
ఆదికాండము 41 : 24 (ERVTE)
అప్పుడు ఏడు మంచి వెన్నులను పీల వెన్నులు తినివేసాయి. [PE][PS] “మంత్రాలు తెలిసిన నా మనుష్యులకు, విద్వాంసులకు నేను ఈ కల చెప్పాను. కానీ ఎవ్వరూ ఆ కలను వివరించలేక పోతున్నారు. ఏమిటి దీని భావం?” [PS]
ఆదికాండము 41 : 25 (ERVTE)
{కల భావం యోసేపు వివరిస్తాడు} [PS] అప్పుడు ఫరోతో యోసేపు ఇలా చెప్పాడు: “ఈ రెండు కలల భావం ఒక్కటే. ఏమి చేయనున్నాడో అది దేవుడు మీతో చెబతున్నాడు.
ఆదికాండము 41 : 26 (ERVTE)
ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరాలు. ఏడు మంచి ధాన్యపు వెన్నులు ఏడు సంవత్సరాలు. రెండు కలల్లోని సంగతి ఒక్కటే.
ఆదికాండము 41 : 27 (ERVTE)
బక్కచిక్కి ఉన్న ఏడు ఆవులు, పీలగా ఉన్న ఏడు ధాన్యపు వెన్నులు కూడ, ఏడు అంటే, అవి ఈ దేశంలో ఏడు ఆకలి సంవత్సరాలు. ఏడు మంచి సంవత్సరాల తర్వాత ఈ ఏడు సంవత్సరాలు వస్తాయి.
ఆదికాండము 41 : 28 (ERVTE)
త్వరలో ఏమి జరుగుతుందో దాన్ని దేవుడు మీకు చూపెట్టాడు. నేను చెప్పినట్టే ఇది జరుగుతుంది.
ఆదికాండము 41 : 29 (ERVTE)
ఈజిప్టు దేశమంతటా ఏడేళ్లపాటు మంచి పంటలు పండి తినటానికి సమృద్ధిగా ఉంటుంది.
ఆదికాండము 41 : 30 (ERVTE)
అయితే ఆ ఏడు సంవత్సరాల తర్వాత, దేశమంతటా కరువు సంవత్సరాలు ఏడు వస్తాయి. ఈజిప్టులో పండిన పంట ఎంత ఉన్నదానిని మరచిపోతారు. ఈ ఆకలి దేశాన్ని నాశనం చేస్తుంది.
ఆదికాండము 41 : 31 (ERVTE)
సమృద్ధగా భోజనం చేయటం అంటే ఏమిటో ప్రజలు మరచిపోతారు. [PE][PS]
ఆదికాండము 41 : 32 (ERVTE)
“ఫరోగారూ, ఒకే విషయాన్ని గూర్చి మీకు రెండు కలలు ఎందుకు వచ్చాయి? దేవుడు తప్పక జరిపిస్తాడని చూపించేందుకు ఇలా జరిగింది. అదీ త్వరలోనే దేవుడు జరిగిస్తాడని సూచిస్తోంది.
ఆదికాండము 41 : 33 (ERVTE)
కనుక ఓ ఫరో, చాలా తెలివి, జ్ఞానం ఉన్న ఒక మనిషిని మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఆ మనిషిని ఈజిప్టు దేశం అంతటిమీద అధికారిగా మీరు నియమించాలి.
ఆదికాండము 41 : 34 (ERVTE)
ఆ తర్వాత ప్రజల దగ్గర్నుండి ధాన్యం సేకరించేందుకు మరి కొందర్ని మీరు నియమించాలి. ప్రతీ వ్యక్తి ఏడు మంచి సంవత్సరాల్లో పండించే మంచి పంటలో అయిదవ భాగం ఇవ్వాలి.
ఆదికాండము 41 : 35 (ERVTE)
రాబోయే మంచి సంవత్సరాల కాలంలో ఈ ధాన్యం అంతా సేకరించమని ఈ మనుష్యులకు ఆజ్ఞాపించండి. ఈ ధాన్యం పట్టణాల్లో భద్రం చేయటానికి వాళ్లకు అధికారం ఉందని ఈ మనుష్యులకు చెప్పండి. తర్వాత ఆ ధాన్యం అవసరం వచ్చేంతవరకు వారు దాన్ని కాపాడాలి. ఫరో! ఈ విధంగా ఆ ఆహారం మీ అధీనంలో ఉంటుంది.
ఆదికాండము 41 : 36 (ERVTE)
ఈజిప్టు దేశంలో వచ్చే ఏడు ఆకలి సంవత్సరాల్లో ఈ ధాన్యం సహాయపడుతుంది. అప్పుడు ఈజిప్టు ప్రజలు ఆ ఏడు సంవత్సరాల్లో కరువు కారణంగా మరణించరు.” [PE][PS]
ఆదికాండము 41 : 37 (ERVTE)
ఇది చాలా చక్కని తలంపులా కనబడింది ఫరోకు. అతని సేవకులంతా ఒప్పుకొన్నారు.
ఆదికాండము 41 : 38 (ERVTE)
“ఈ పని చేసేందుకు యోసేపు కంటే మంచివాడ్ని ఇంకెవరినైనా మీరు కనుగొనగలరా? దేవుని ఆత్మ మూలంగా ఇతడు నిజంగా జ్ఞాని” అని ఫరో తన సేవకులతో చెప్పాడు. [PE][PS]
ఆదికాండము 41 : 39 (ERVTE)
కనుక ఫరో, “వీటన్నింటిని దేవుడే నీకు చూపెట్టాడు కనుక నీవు అందరిలో మహా జ్ఞానివై ఉండాలి.
ఆదికాండము 41 : 40 (ERVTE)
అంచేత నిన్నే ఈ దేశం మీద అధిపతిగా నేను చేస్తాను. ప్రజలు నీ ఆజ్ఞలన్నింటికి విధేయులవుతారు. ఈ దేశంలో నేను ఒక్కడ్ని మాత్రమే నీకంటె గొప్ప అధికారిగా ఉంటాను” అని యోసేపుతో చెప్పాడు. [PE][PS]
ఆదికాండము 41 : 41 (ERVTE)
(ఫరో యోసేపును రాజ్యపాలకునిగా నియమించినప్పుడు ప్రత్యేక సమావేశం మరియు ఊరేగింపు వుండినవి.) అప్పుడు ఫరో, “ఇప్పుడు ఈజిప్టు దేశం అంతటి మీద నిన్ను నేను పాలకునిగా నియమిస్తున్నాను” అని యోసేపుతో చెప్పాడు.
ఆదికాండము 41 : 42 (ERVTE)
అప్పుడు ఫరో రాజముద్రగల తన ఉంగరాన్ని యోసేపుకు ఇచ్చాడు. యోసేపు ధరించటానికి నాణ్యతగల ఒక అంగీని అతడు ఇచ్చాడు. యోసేపు మెడలో ఒక బంగారు గొలుసు ఫరో వేసాడు.
ఆదికాండము 41 : 43 (ERVTE)
రెండో రాజరథం మీద తిరిగమని ఫరో యోసేపుతో చెప్పాడు. ప్రత్యేక సంరక్షకులు అతని రథానికి ముందర నడిచారు. “ప్రజలారా, యోసేపుకు సాష్టాంగపడండి” అంటూ వాళ్లు ప్రజలను హెచ్చరించారు. కనుక ఈజిప్టు దేశం అంతటి మీద యోసేపు పాలకునిగా నియమించబడ్డాడు. [PE][PS]
ఆదికాండము 41 : 44 (ERVTE)
అతనితో ఫరో అన్నాడు: “నేను ఫరోను అంటే రాజును. కనుక నేను ఏమి అయినా చేయాలనుకొంటే అది చేస్తాను. కానీ, ఈజిప్టులో మరి ఏ వ్యక్తి అయినా నీవు చెప్పకుండ ఒక చేయి ఎత్తకూడదు, కాలు కదపగూడదు.” [PE][PS]
ఆదికాండము 41 : 45 (ERVTE)
యోసేపుకు జప్నత్సనేహు అనే మరో పేరు ఫరో పెట్టాడు. ఓను యాజకుడు పోతీఫెర కుమార్తె ఆసెనతును యోసేపుకు భార్యగా ఫరో ఇచ్చాడు. కనుక ఈజిప్టు దేశం అంతటిమీద యోసేపు పాలకుడయ్యాడు. [PE][PS]
ఆదికాండము 41 : 46 (ERVTE)
యోసేపు ఈజిప్టు రాజు కొలువులో పని చేయడం మొదలు బెట్టినప్పుడు అతని వయస్సు 30 సంవత్సరాలు. యోసేపు ఈజిప్టు దేశం అంతటా సంచారం చేసాడు.
ఆదికాండము 41 : 47 (ERVTE)
ఏడు మంచి సంవత్సరాల కాలంలోనూ దేశంలో పంటలు బాగుగా పండాయి.
ఆదికాండము 41 : 48 (ERVTE)
ఆ ఏడు సంవత్సరాల్లో యోసేపు చాలా ధాన్యం ఈజిప్టులో పొదుపు చేసాడు. ఆహారాన్ని యోసేపు పట్టణాల్లో భద్రపరచాడు. ప్రతి పట్టణం చుట్టు ప్రక్కల పండిన పంటను ఆ పట్టణంలోనే యోసేపు భద్రపరచాడు.
ఆదికాండము 41 : 49 (ERVTE)
యోసేపు విస్తారంగా ధాన్యం చేర్చి పెట్టాడు. సముద్రపు ఇసుకలా ఉంది అదంతాను. కొలిచేందుకు గూడ వీలు లేనంత విస్తారంగా ఉంది అతడు చేర్చిపెట్టిన ధాన్యం. [PE][PS]
ఆదికాండము 41 : 50 (ERVTE)
ఓను యాజకుడైన పోతీఫెర కుమార్తె అయిన ఆసెనతు యోసేపుకు భార్య. మొదటి ఆకలి సంవత్సరం రాకముందే యోసేపు ఆసెనెతులకు ఇద్దరు కుమారులు పుట్టారు.
ఆదికాండము 41 : 51 (ERVTE)
మొదటి కుమారుని పేరు మనష్షే. “నా కష్టాలు అన్నింటినీ, నా ఇంటని గూర్చిన విషయాలన్నింటినీ నేను మరచిపోయేటట్టు దేవుడు చేసాడు” అని అనుకొన్నాడు గనుక యోసేపు అతనికి ఈ పేరు పెట్టాడు.
ఆదికాండము 41 : 52 (ERVTE)
యోసేపు తన రెండవ కుమారునికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. “నాకు ఎన్నో గొప్ప కష్టాలు వచ్చాయి, గాని అన్ని విషయాల్లో దేవుడు నాకు సాఫల్యాన్ని కార్యసాధనను కల్గించాడు” అని యోసేపు అనుకొన్నాడు గనుక యోసేపు అతనికి ఈ పేరు పెట్టాడు. [PS]
ఆదికాండము 41 : 53 (ERVTE)
{ఆకలి కాలం మొదలవుట} [PS] ఏడు సంవత్సరాల పాటు ప్రజలు తినేందుకు అవసరమైన ఆహారం అంతా వారికి ఉంది. కానీ సంవత్సరాలన్నీ ముగిశాయి. అవసరమైనది అంతా పండింది.
ఆదికాండము 41 : 54 (ERVTE)
అయితే ఏడు సంవత్సరాల ఆకలి కాలం మొదలయింది. సరిగ్గా యోసేపు చెప్పినట్టే ఇది జరిగింది. అన్ని దేశాలలో, అంతట ఏ ఆహారం పండలేదు. తినుటకు ప్రజలకు ఏమీ లేదు. కానీ యోసేపు ధాన్యం భద్రపరచినందువల్ల ఈజిప్టులో ప్రజలు తినుటకు సరిపడినంత ఉంది.
ఆదికాండము 41 : 55 (ERVTE)
కరువు కాలం ప్రారంభం కాగానే ఆహారంకోసం ప్రజలు ఫరోకు మొరపెట్టారు. ఫరో, “యోసేపును అడగండి. అతడు ఏమి చేయమంటే అలా చేయండి” అని చెప్పాడు ఈజిప్టు ప్రజలతో. [PE][PS]
ఆదికాండము 41 : 56 (ERVTE)
కనుక ఆ దేశంలో ఎక్కడ చూసినా కరువు ప్రబలుతున్నప్పుడు, ధాన్యము భద్రపరచిన గదులలో నుండి యోసేపు ప్రజలకు ధాన్యం ఇచ్చాడు. చేర్చిపెట్టిన ధాన్యం ఈజిప్టు ప్రజలకు యోసేపు విక్రయించాడు. ఈజిప్టులో కరువు చాలా భయంకరంగా ఉంది.
ఆదికాండము 41 : 57 (ERVTE)
ఈజిప్టు చుట్టుపక్కల దేశాల ప్రజలంతా ధాన్యం కొనేందుకు ఈజిప్టు వచ్చారు. కరువు ఈజిప్టులోను, మరి యితర ప్రాంతాలలోను ఎక్కువగా ఉంది. ఈజిప్టు చుట్టుపక్కల దేశాలవారు యోసేపు దగ్గరకు వచ్చారు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57

BG:

Opacity:

Color:


Size:


Font: