ఆదికాండము 44 : 1 (ERVTE)
{యోసేపు పన్నాగం} [PS] అప్పుడు యోసేపు తన సేవకునికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు: “ఈ మనుష్యులు మోసుకొని పోగలిగినంత ధాన్యం వారి సంచుల్లో నింపు. ప్రతి ఒక్కరి సొమ్మును తిరిగి వారి వారి ధాన్యపు సంచుల్లో పెట్టు.
ఆదికాండము 44 : 2 (ERVTE)
అందరిలో చిన్న తమ్ముని సంచిలో డబ్బు పెట్టు. అయితే నా ప్రత్యేకమైన వెండి పాత్రనుకూడ అతని సంచిలో పెట్టు.” ఆ సేవకుడు యోసేపు చెప్పినట్టు చేసాడు. [PE][PS]
ఆదికాండము 44 : 3 (ERVTE)
మర్నాటి ఉదయాన్నే ఆ సోదరులు వారి గాడిదలతోబాటు వారి దేశం పంపించబడ్డారు.
ఆదికాండము 44 : 4 (ERVTE)
వారు పట్టణం విడిచిన తర్వాత యోసేపు తన సేవకులతో చెప్పాడు: “నీవు వెళ్లి ఆ మనుష్యుల్ని వెంబడించు. వాళ్లను ఆపుజేసి మేము మీతో మంచిగా ఉన్నాం. అయినా మీరెందుకు మాతో చెడ్డగా ప్రవర్తిస్తున్నారు? మా యజమాని వెండి పాత్రను మీరెందుకు దొంగిలించారు?
ఆదికాండము 44 : 5 (ERVTE)
ఇది నా యజమాని యోసేపు పానం చేసే పాత్ర. రహస్య విషయాలను తెలుసుకొనేందుకు ఆయన ఉపయోగించే పాత్ర ఇది. ఆయన పాత్రను దొంగిలించి మీరు తప్పు చేసారు, అని వాళ్లతో చెప్పు.” [PE][PS]
ఆదికాండము 44 : 6 (ERVTE)
అందుచేత ఆ సేవకుడు విధేయుడయ్యాడు. అతడు సవారి చేసి ఆ సోదరులను ఆపుజేసాడు. అతడు చెప్పాల్సిందిగా యోసేపు అతనికి చెప్పిన విషయాలు ఆ సేవకుడు వారితో చెప్పాడు. [PE][PS]
ఆదికాండము 44 : 7 (ERVTE)
అయితే ఆ సోదరులు ఆ సేవకునితో ఇలా అన్నారు: “ఆ పాలకుడు యిలా ఎందుకు అన్నాడు? అలాంటిదేమీ మేము చేయము.
ఆదికాండము 44 : 8 (ERVTE)
ఇంతకు ముందు మా సంచుల్లో మాకు దొరికిన డబ్బు మేం తెచ్చి ఇచ్చాం. అందుచేత మీ యజమాని ఇంటినుండి వెండి బంగారం ఏవీ మేము నిజంగా దొంగిలించం.
ఆదికాండము 44 : 9 (ERVTE)
మాలో ఎవరి సంచిలోనైనా సరె ఆ వెండి పాత్ర నీకు కనబడితే, వాడు చావాల్సిందే. అతణ్ణి నీవు చంపేయి, మేము మీకు బానిసలమవుతాం.” [PE][PS]
ఆదికాండము 44 : 10 (ERVTE)
“మీరు చెప్పినట్టే చేద్దాం. కాని నేను మాత్రం ఎవర్నీ చంపను. వెండి పాత్ర గనుక నాకు కనబడితే ఆ మనిషి మాత్రం నాకు బానిస అవుతాడు. మిగిలిన వాళ్లు స్వేచ్ఛగా వెళ్లొచ్చు” అన్నాడు ఆ సేవకుడు. [PS]
ఆదికాండము 44 : 11 (ERVTE)
{బెన్యామీను పట్టుబడ్డాడు} [PS] అప్పుడు ప్రతి ఒక్క సోదరుడూ తన సంచిని నేలమీద పెట్టి తెరిచాడు.
ఆదికాండము 44 : 12 (ERVTE)
సేవకుడు సంచుల్లో చూశాడు. అతడు జ్యేష్ఠునితో మొదలు బెట్టి కనిష్ఠునితో ముగించాడు. బెన్యామీను సంచిలో ఆ పాత్ర అతనికి కనబడింది.
ఆదికాండము 44 : 13 (ERVTE)
సోదరులకు దుఃఖం వచ్చేసింది. దుఃఖంతో వాళ్లు వారి వస్త్రాలు చింపేసుకొన్నారు. వారు వారి సంచుల్ని మళ్లీ గాడిదలమీద పెట్టి తిరిగి ఆ పట్టణం వెళ్లారు. [PE][PS]
ఆదికాండము 44 : 14 (ERVTE)
యూదా, అతని సోదరులు యోసేపు ఇంటికి వెళ్లారు. యోసేపు ఇంకా అక్కడే ఉన్నాడు. ఆ సోదరులంతా నేలమీద సాష్టాంగపడ్డారు.
ఆదికాండము 44 : 15 (ERVTE)
యోసేపు “మీరెందుకు ఇలా చేసారు? రహస్యాలు తెలుసుకొనే ఒక ప్రత్యేక పద్ధతి నా దగ్గర ఉందని మీకు తెలియదా? ఈ పని నాకంటె బాగగా ఇంకెవ్వరూ చేయలేరు” అన్నాడు. [PE][PS]
ఆదికాండము 44 : 16 (ERVTE)
యూదా, “అయ్యా, మేం ఇంకేమీ చెప్పలేం. వివరించే దారి యింకొకటి లేదు. మేం నేరస్థులం కాదని చూపించే విధం ఇంకొకటి లేదు. మేము చేసిన మరో పని మూలంగా దేవుడు మమ్మల్ని నేరస్థులుగా తీర్పు తీర్చాడు. కనుక మేము అందరం చివరకు బెన్యామీనుతో కూడ బానిసలవుతాం” అన్నాడు. [PE][PS]
ఆదికాండము 44 : 17 (ERVTE)
కానీ యోసేపు, “నేను మిమ్మల్ని అందరినీ బానిసలుగా చేయను. పాత్రను దొంగిలించిన మనిషి ఒక్కడే నాకు బానిస అవుతాడు. మిగిలిన మీరు సమాధానంగా మీ తండ్రి దగ్గరకు వెళ్లవచ్చు” అన్నాడు. [PS]
ఆదికాండము 44 : 18 (ERVTE)
{బెన్యామీను కోసం యూదా బ్రతిమలాడుట} [PS] అప్పుడు యోసేపు దగ్గరకు యూదా వెళ్లి ఇలా చెప్పాడు: “అయ్యా, దయచేసి తమరితో నన్ను తేటగా చెప్పనివ్వండి. దయచేసి నాపై కోపగించకండి. మీరు ఫరో అంతటి వారని నాకు తెలుసు.
ఆదికాండము 44 : 19 (ERVTE)
క్రితంసారి మేము ఇక్కడు ఉన్నప్పుడు ‘మీకు తండ్రిగాని సోదరుడు గాని ఉన్నాడా?’ అని తమరు అడిగారు.
ఆదికాండము 44 : 20 (ERVTE)
దానికి మేము జవాబు చెప్పాం, మాకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయన ముసలివాడు. మాకు ఒక చిన్న తమ్ముడు ఉన్నాడు, వాడు మా తండ్రికి ముసలితనంలో పుట్టాడు, అందుచేత మా తండ్రికి వాడంటే చాలా ప్రేమ. పైగా ఆ చిన్న కుమారుని అన్న చనిపోయాడు. అందుచేత ఆ తల్లికి పుట్టిన కుమారులలో మిగిలినవాడు ఇతడు ఒక్కడే. మా తండ్రికి ఇతనంటే ఎంతే ప్రేమ.
ఆదికాండము 44 : 21 (ERVTE)
అప్పుడు ‘ఆ సోదరుని నా దగ్గరకు తీసుకొని రండి, నేను అతడ్ని చూడాలి’ అన్నారు తమరు.
ఆదికాండము 44 : 22 (ERVTE)
దానికి మేము ‘ఆ చిన్నవాడు రావటానికి వీల్లేదు. అతడ్ని తన తండ్రిని విడిచిపెట్టలేడు. అతని తండ్రి అతణ్ణి గనక పోగొట్టుకొంటే, అతని తండ్రి దుఃఖంతో మరణిస్తాడు’ అని తమరితో చెప్పాం.
ఆదికాండము 44 : 23 (ERVTE)
కానీ తమరేమో ‘మీరు మీ చిన్న తమ్ముడ్ని తప్పక తీసుకొని రావాల్సిందే, లేకపోతే మీకు ధాన్యం అమ్మేది లేదు’ అన్నారు మాతో.
ఆదికాండము 44 : 24 (ERVTE)
కనుక మేము తిరిగి మా తండ్రి దగ్గరకు వెళ్లి, మీరు మాతో చెప్పినది ఆయనకు చెప్పాం. [PE][PS]
ఆదికాండము 44 : 25 (ERVTE)
“తర్వాత మా తండ్రి ‘మీరు మళ్లీ వెళ్లి మనకోసం ధాన్యం కొనండి’ అన్నాడు.
ఆదికాండము 44 : 26 (ERVTE)
మేము మా తండ్రితో ‘మా చిన్న తమ్ముడు లేకుండా మేము వెళ్లలేం. మా చిన్న తమ్ముడ్ని చూచేంత వరకు మళ్లీ మాకు ధాన్యం అమ్మనని ఆ పాలకుడు అన్నాడు’ అని చెప్పాం.
ఆదికాండము 44 : 27 (ERVTE)
అప్పుడు మా తండ్రి మాతో అన్నాడు ‘నా భార్య రాహేలు ఇద్దరు కుమారుల్ని నాకు కన్నది.
ఆదికాండము 44 : 28 (ERVTE)
ఒక కుమారుడ్ని నేను బయటకు వెళ్లనిస్తే, అతణ్ణి అడవి మృగం చంపేసింది. అప్పట్నుండి నేను అతణ్ణి చూడలేదు.
ఆదికాండము 44 : 29 (ERVTE)
రెండో కుమారునిగూడా మీరు నా దగ్గర్నుండి తీసుకొని పోతే, అతనికి ఏమైనా సంభవిస్తే ఆ దుఃఖంతో నేను మరణించాల్సిందే!’
ఆదికాండము 44 : 30 (ERVTE)
కనుక ఇప్పుడు మేము మా కనిష్ఠ సోదరుడు మాతో లేకుండా మేము ఇంటికి వెళ్తే, ఏమి జరుగుతుందో ఊహించండి. మా తండ్రి జీవితంలో ఈ కుర్రవాడు చాలా ముఖ్యం.
ఆదికాండము 44 : 31 (ERVTE)
ఈ కుర్రవాడు మాతో లేకపోవటం గమనిస్తే, మా తండ్రి చనిపోతాడు. ఆ తప్పు మాదే అవుతుంది. మహాగొప్ప దుఃఖంతో మా తండ్రి చనిపోయేటట్టు చెసిన వాళ్లమవుతాం. [PE][PS]
ఆదికాండము 44 : 32 (ERVTE)
“ఈ పిల్లవాని విషయం నేను బాధ్యత తీసుకొన్నాను. ‘ఇతణ్ణి మళ్లీ నీ దగ్గరకు తీసుకొని రాకపోతే నా జీవితకాలమంతా నన్ను నీవు నిందించమని’ నా తండ్రితో నేను చెప్పాను.
ఆదికాండము 44 : 33 (ERVTE)
కనుక ఇప్పుడు నేను మీకు మనవి చేసేది, మిమ్మల్ని బ్రతిమాలాడేది ఏమిటంటే, దయచేసి ఈ పిల్లవాణ్ణి తన సోదరులతో వెళ్లనివ్వండి. నేను ఇక్కడే ఉండి, మీకు బానిసను అవుతాను.
ఆదికాండము 44 : 34 (ERVTE)
ఈ పిల్లవాడు నాతో లేకపోతే నేను తిరిగి నా తండ్రి దగ్గరకు వెళ్లలేను. నా తండ్రికి ఏం జరుగుతుందోనని నాకు చాలా భయంగా ఉంది.” [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34

BG:

Opacity:

Color:


Size:


Font: