హెబ్రీయులకు 1 : 1 (ERVTE)
దేవుడు గతంలో ప్రవక్తల ద్వారా ఎన్నోసార్లు, ఎన్నోవిధాలుగా మన పూర్వీకులతో మాట్లాడాడు.
హెబ్రీయులకు 1 : 2 (ERVTE)
అన్నిటిపై తన కుమారుణ్ణి వారసునిగా నియమించాడు. ఆయన ద్వారా ఈ విశ్వాన్ని సృష్టించాడు. ఈ చివరి రోజుల్లో ఆయన ద్వారా మనతో మాట్లాడాడు.
హెబ్రీయులకు 1 : 3 (ERVTE)
కుమారుడు దేవుని మహిమ యోక్క ప్రకాశం. తండ్రి యొక్క ఉనికిలో పరిపూర్ణ ఉనికిగలవాడు. కుమారుడు శక్తివంతమైన తన మాటతో అన్నిటినీ పోషించి సంరక్షిస్తున్నాడు. పాపపరిహారం చేసాక ఈయన పరలోకంలోకి వెళ్ళాడు. అక్కడ, మహా తేజ స్వియైన దేవుని కుడివైపు కూర్చున్నాడు.
హెబ్రీయులకు 1 : 4 (ERVTE)
ఆయన దేవదూతలకన్నా గొప్పవాడు. దానికి తగ్గట్టుగా ఆయన గొప్ప పేరు కూడా వారసత్వం పొందాడు. దేవదూతలకన్నా కుమారుడు గొప్పవాడు. [PE][PS]
హెబ్రీయులకు 1 : 5 (ERVTE)
ఎందుకంటే దేవుడు ఏ దేవదూతతో కూడా ఈ విధంగా అనలేదు: “నీవు నా కుమారుడవు, [QBR2] నేడు నేను నీ తండ్రినయ్యాను.” కీర్తన 2:7 మరొక చోట: “నేనతనికి తండ్రి నౌతాను. [QBR2] అతడు నా కుమారుడౌతాడు.” 2 సమూయేలు 7:14
హెబ్రీయులకు 1 : 6 (ERVTE)
మరొకచోట, దేవుడు తన మొదటి సంతానాన్ని ఈ ప్రపంచంలోకి తీసుకొని వచ్చినప్పుడు ఈ విధంగా అన్నాడు: “దేవదూతలు ఆయన్ని ఆరాధించాలి!” ద్వితీయోపదేశ 32:43
హెబ్రీయులకు 1 : 7 (ERVTE)
దేవదూతల గురించి దేవుడు మాట్లాడుతూ: “దేవుడు తన దూతల్ని ఆత్నలుగాను [QBR2] తన సేవకుల్ని అగ్ని జ్వాలల్లా చేస్తాడు!” కీర్తన 104:4
హెబ్రీయులకు 1 : 8 (ERVTE)
కాని కుమారుణ్ణి గురించి ఈ విధంగా అన్నాడు: “ఓ దేవా! నీ సింహాసనం చిరకాలం వుంటుంది. [QBR2] నీతి నీ రాజ్యానికి రాజదండంగా వుంటుంది. [QBR]
హెబ్రీయులకు 1 : 9 (ERVTE)
నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించావు. [QBR2] అందువల్ల దేవుడు! నీ దేవుడు ఆనందమనే నూనెతో నిన్ను [QBR2] అభిషేకించి నీ స్నేహితులందరి కన్నా నిన్ను అధికంగా గౌరవించాడు.” కీర్తన 45:6-7
హెబ్రీయులకు 1 : 10 (ERVTE)
ఆయనింకా ఈ విధంగా అన్నాడు: “ఓ ప్రభూ! ఆదిలో ఈ ప్రపంచానికి నీవు పునాదులు వేశావు. [QBR2] ఆకాశాలను నీ చేతుల్తో సృష్టించావు. [QBR]
హెబ్రీయులకు 1 : 11 (ERVTE)
అవి నశించి పోతాయి ఒక వస్త్రంలా పాత బడతాయి. [QBR2] కాని, నీవు చిరకాలం వుంటావు. [QBR]
హెబ్రీయులకు 1 : 12 (ERVTE)
వాటిని నీవు ఒక వస్త్రంలా మడుస్తావు. [QBR2] వాటిని నీవు దుస్తులు మార్చినట్లు మారుస్తావు. [QBR] కాని నీవు మాత్రం అలాగే వుంటావు! [QBR2] నీ సంవత్సరములకు అంతంలేదు!” కీర్తన 102:25-27
హెబ్రీయులకు 1 : 13 (ERVTE)
దేవుడు ఏ దేవదూతతోనైనా: “నీ శత్రువుల్ని నీ పాద పీఠంగా చేసే [QBR2] వరకు నా కుడివైపు కూర్చో,” కీర్తన 110:1 అని ఎన్నడైనా అన్నాడా?
హెబ్రీయులకు 1 : 14 (ERVTE)
ఈ దేవదూతలందరూ సేవ చేయటానికి వచ్చిన ఆత్మలే కదా! రక్షణ పొందే వ్యక్తుల సేవ చేయటానికే గదా దేవుడు వీళ్ళను పంపింది? [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14

BG:

Opacity:

Color:


Size:


Font: