హెబ్రీయులకు 10 : 1 (ERVTE)
ధర్మశాస్రం రాబోవు మంచి విషయాల నీడలాంటిది. అది అస్పష్టమైనది. అంటే, ఆ మంచి విషయాలు అప్పటికింకా రాలేదన్నమాట. ధర్మశాస్రం ఆదేశించిన విధంగా ప్రజలు దేవుని దగ్గరకు ప్రతి సంవత్సరం వచ్చి తప్పకుండా ఒకే రకమైన బలులు అర్పించే వాళ్ళు. కాని ధర్మశాస్త్రం వాళ్ళలో పరిపూర్ణత కలిగించలేదు.
హెబ్రీయులకు 10 : 2 (ERVTE)
అలా చేసినట్లైతే, వాళ్ళు ఆ బలులు యివ్వటం మాని ఉండేవాళ్ళు. పాపాలు శాశ్వతంగా పరిహారమై వాళ్ళు పశ్చాత్తాపం చెందవలసిన అవసరం ఉండేది కాదు.
హెబ్రీయులకు 10 : 3 (ERVTE)
కాని దానికి మారుగా ఆ బలులు వాళ్ళు చేసిన పాపాల్ని ప్రతి సంవత్సరం వాళ్ళకు జ్ఞాపకం చేస్తూ ఉంటాయి.
హెబ్రీయులకు 10 : 4 (ERVTE)
ఎద్దుల రక్తంతో, మేకల రక్తంతో పాప పరిహారం కలుగటమనేది అసంభవం. [PE][PS]
హెబ్రీయులకు 10 : 5 (ERVTE)
ఆ కారణంగానే, క్రీస్తు ఈ ప్రపంచంలోకి వచ్చాక దేవునితో ఈ విధంగా అన్నాడు: “బలుల్ని, అర్పణల్ని నీవు కోరలేదు కాని, [QBR2] నేనుండటానికి ఈ శరీరాన్ని సృష్టించావు. [QBR]
హెబ్రీయులకు 10 : 6 (ERVTE)
జంతువుల్ని కాల్చి అర్పించిన ఆహుతులు కాని, [QBR2] పాపపరిహారం కోసం యిచ్చిన బలులు కాని, [QBR2] నీకు అనందం కలిగించలేదు. [QBR]
హెబ్రీయులకు 10 : 7 (ERVTE)
అప్పుడు నేను, ‘ఇదిగో దేవా! [QBR2] ఇక్కడ ఉన్నాను! నన్ను గురించి గ్రంథాల్లో వ్రాశారు. [QBR2] నేను నీ యిచ్చ నెరవేర్చటానికి వచ్చాను’ అని అన్నాను.” కీర్తన 40:6-8
హెబ్రీయులకు 10 : 8 (ERVTE)
“బలుల్ని, అర్పణల్ని, జంతువుల్నికాల్చి యిచ్చిన ఆహుతుల్ని, పాప పరిహారం కోసం యిచ్చిన ఆహుతుల్ని, నీవు కోరలేదు. అవి నీకు ఆనందం కలిగించలేదు” అని మొదట అన్నాడు. కాని, ధర్మశాస్త్రం ఈ ఆహుతుల్ని యివ్వమని ఆదేశించింది.
హెబ్రీయులకు 10 : 9 (ERVTE)
ఆ తర్వాత క్రీస్తు, “ఇదిగో దేవా!ఇక్కడ ఉన్నాను. నీ యిచ్ఛ నెరవేర్చటానికి వచ్చాను” అని అన్నాడు. ఆయన రెండవ దాన్ని నెరవేర్చటానికి మొదటి దాన్ని రద్దుచేశాడు.
హెబ్రీయులకు 10 : 10 (ERVTE)
దైవేచ్ఛ నెరవేర్చటానికి క్రీస్తు తన శరీరాన్ని బలిగా అర్పించి మనల్ని శాశ్వతంగా పవిత్రం చేశాడు. ఆయన యిచ్చిన మొదటి బలి, చివరి బలి యిదే. [PE][PS]
హెబ్రీయులకు 10 : 11 (ERVTE)
ప్రతి యాజకుడు మత సంబంధమైన కర్తవ్యాన్ని ప్రతిరోజు నెరవేరుస్తూ ఉంటాడు. ఇచ్చిన బలుల్నే మళ్ళీ మళ్ళీ యిస్తూ ఉంటాడు. ఈ బలులు పాప పరిహారం చెయ్యలేవు.
హెబ్రీయులకు 10 : 12 (ERVTE)
కాని క్రీస్తు మన పాప పరిహారార్థం ఒకే ఒక బలి యిచ్చి దేవుని కుడిచేతి వైపు శాశ్వతంగా కూర్చుండి పొయ్యాడు.
హెబ్రీయులకు 10 : 13 (ERVTE)
అప్పటినుండి, ఆయన శత్రువుల్ని దేవుడు ఆయన పాదపీఠంగా చెయ్యాలని కాచుకొని ఉన్నాడు.
హెబ్రీయులకు 10 : 14 (ERVTE)
ఆయన ఒకే ఒక అర్పణ చేసి పరిశుద్ధులలో శాశ్వతమైన పరిపూర్ణత కలిగించాడు. [PE][PS]
హెబ్రీయులకు 10 : 15 (ERVTE)
ఈ విషయాన్ని గురించి పరిశుద్ధాత్మ మనకు యిలా ప్రకటిస్తున్నాడు:
హెబ్రీయులకు 10 : 16 (ERVTE)
“ఆ తర్వాత నేను వాళ్ళతో ఈ ఒడంబడిక చేస్తాను. [QBR] నా నియమాల్ని వాళ్ళ హృదయాల్లో ఉంచుతాను. [QBR2] వాటిని వాళ్ళ మనస్సులపై వ్రాస్తాను.” యిర్మీయా 31:33
హెబ్రీయులకు 10 : 17 (ERVTE)
ఆ పరిశుద్ధాత్మ ఇంకా యిలా అన్నాడు: “వాళ్ళ పాపాల్ని, [QBR2] దుర్మార్గాల్ని నేను మరిచిపోతాను!” యిర్మీయా 31:34
హెబ్రీయులకు 10 : 18 (ERVTE)
వాళ్ళ పాపాల్ని దేవుడు క్షమించాడు కాబట్టి, పాపం కోసం బలుల్ని అర్పించవలసిన అవసరం తీరిపోయింది. [PS]
హెబ్రీయులకు 10 : 19 (ERVTE)
{విశ్వాసాన్ని వదులుకోకండి} [PS] సోదరులారా! యేసు తన రక్తాన్ని అర్పించాడు. తద్వారా అతి పవిత్ర స్థానానికి వెళ్ళగలమనే విశ్వాసం మనలో కలిగింది.
హెబ్రీయులకు 10 : 20 (ERVTE)
ఆయన శరీరం ఒక తెరగా ఉంది. దాన్ని తొలగించి మనకోసం సజీవమైన నూతన మార్గాన్ని వేశాడు.
హెబ్రీయులకు 10 : 21 (ERVTE)
అంతేకాక, ఆ ప్రధాన యాజకుడు మన దేవాలయంపై అధికారిగా పనిచేస్తున్నాడు.
హెబ్రీయులకు 10 : 22 (ERVTE)
తప్పు చేసి బాధపడ్తున్న మన హృదయాలపై రక్తం ప్రోక్షింపబడింది. స్వచ్ఛమైన నీళ్ళతో మన దేహాలు పరిశుభ్రం చేయబడ్డాయి. ఇప్పుడిక మంచి హృదయాలతో, సంపూర్ణ విశ్వాసంతో దైవ సన్నిధిని చేరుకొందాం.
హెబ్రీయులకు 10 : 23 (ERVTE)
మనకు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. అందువల్ల మనం బహిరంగంగా ప్రకటిస్తున్న విశ్వాసాన్ని విడవకుండా ధైర్యంతో ఉందాం. [PE][PS]
హెబ్రీయులకు 10 : 24 (ERVTE)
ప్రేమిస్తూ మంచిపనులు చేస్తూ ఉండమని పరస్పరం ప్రోత్సాహపరుచుకొందాం.
హెబ్రీయులకు 10 : 25 (ERVTE)
సమావేశాలకు రాకుండా ఉండటం కొందరికి అలవాటు. కాని, మనం పరస్పరం కలుసుకొంటూ ఉందాం. ముఖ్యంగా ప్రభువు రానున్నదినం [*ప్రభువు … దినం బహుశః, ఇది క్రీస్తు రెండవ సారి తిరిగి వస్తాడని సూచిస్తుంది.] సమీపిస్తోంది గనుక పరస్పరం ప్రోత్సాహ పరచుకొంటూ ఉందాం. [PE][PS]
హెబ్రీయులకు 10 : 26 (ERVTE)
సత్యాన్ని గురించి జ్ఞానం సంపాదించిన తర్వాత కూడా, మనం కావాలని పాపాలు చేస్తూ ఉంటే, యిక అర్పించటానికి మన దగ్గర బలి ఎక్కడుంది?
హెబ్రీయులకు 10 : 27 (ERVTE)
తీర్పు జరుగుతుందనే భయము, దేవుని శత్రువుల్ని కాల్చివేసే మంటలురానున్నాయనే భయము మాత్రమే మిగిలిపోతాయి.
హెబ్రీయులకు 10 : 28 (ERVTE)
మోషే నియమాల్ని ఉల్లంఘించిన వానిపై యిద్దరు లేక ముగ్గురు చెప్పిన సాక్ష్యాలతో దయ చూపకుండా మరణ శిక్ష విధించే వాళ్ళు.
హెబ్రీయులకు 10 : 29 (ERVTE)
మరి దేవుని కుమారుణ్ణి కాళ్ళ క్రింద త్రొక్కినవాణ్ణి, తనను పవిత్రం చేసిన ఒడంబడిక రక్తాన్ని అపవిత్రంగా పరిగణించేవాణ్ణి, అనుగ్రహించే ఆత్మను అవమాన పరిచేవాణ్ణి, యింకెంత కఠినంగా శిక్షించాలో మీరే ఊహించండి.
హెబ్రీయులకు 10 : 30 (ERVTE)
“పగ తీర్చుకోవలసిన పని నాది, తిరిగి చెల్లించేవాణ్ణి నేను” అని అన్నవాడు, “ప్రభువు తన ప్రజలపై తీర్పు చెపుతాడు” [✡ఉల్లేఖము: ద్వితీ. 32:35; ద్వితీ. 32:36; కీర్తన 135:14.] అని అన్న వాడు ఎవరో మనకు తెలుసు.
హెబ్రీయులకు 10 : 31 (ERVTE)
సజీవంగా ఉన్న దేవుని చేతుల్లో పాపాత్ములు చిక్కుకోవటమనేది భయానకమైన విషయము. [PE][PS]
హెబ్రీయులకు 10 : 32 (ERVTE)
మీరు వెలిగింపబడిన రోజుల్ని జ్ఞాపకం తెచ్చుకోండి. ఆ రోజుల్లో మీరు ఎన్నో కష్టాలు అనుభవించారు. అయినా మీరు వాటిని సహించారు.
హెబ్రీయులకు 10 : 33 (ERVTE)
కొన్నిసార్లు మీరు అవమానాన్ని, హింసను బహిరంగంగా అనుభవించారు. మరికొన్నిసార్లు అవమానాన్ని, హింసను అనుభవించే వాళ్ళ ప్రక్కన నిలుచున్నారు.
హెబ్రీయులకు 10 : 34 (ERVTE)
అంతేకాక, చెరసాలల్లో ఉన్న వాళ్ళ పట్ల మీరు సానుభూతి చూపించారు. పైగా “మీ ఆస్తుల్ని” దోచుకొంటుంటే ఆనందంగా అంగీకరించారు. ఎందుకంటే, మీరు పొందిన ఆస్తి మీరు పోగొట్టుకొన్న ఆస్తికన్నా ఉత్తమమైనదని మీకు తెలుసు. అది శాశ్వతమైనదని కూడా మీకు తెలుసు. [PE][PS]
హెబ్రీయులకు 10 : 35 (ERVTE)
అందువల్ల మీ విశ్వాసాన్ని వదులుకోకండి. దానికి మంచి ప్రతి ఫలం లభిస్తుంది.
హెబ్రీయులకు 10 : 36 (ERVTE)
మీరు పట్టుదలతో ఉండాలి. దైవేచ్చే ప్రకారం నడుచుకోవాలి. ఆ తర్వాత దేవుడు, తాను వాగ్దానం చేసిన దాన్ని ప్రసాదిస్తాడు.
హెబ్రీయులకు 10 : 37 (ERVTE)
ఎందుకంటే, త్వరలోనే, “వస్తున్నాడు, వస్తాడు, [QBR2] ఆలస్యం చెయ్యడు! [QBR]
హెబ్రీయులకు 10 : 38 (ERVTE)
నీతిమంతులైన నా ప్రజలు [QBR2] నన్ను విశ్వసిస్తూ జీవిస్తారు. [QBR] కాని వాళ్ళలో ఎవరైనా వెనుకంజ వేస్తే [QBR2] నా ఆత్మకు ఆనందం కలుగదు.” హబక్కూకు 2:3-4
హెబ్రీయులకు 10 : 39 (ERVTE)
కాని, మనం వెనుకంజ వేసి నశించిపోయే వాళ్ళలాంటి వారం కాదు. గాని విశ్వాసం ద్వారా రక్షంచబడే వాళ్ళ లాంటివారం. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39

BG:

Opacity:

Color:


Size:


Font: