హెబ్రీయులకు 2 : 1 (ERVTE)
{జాగ్రత్తపడమని హెచ్చరిక} [PS] అందువల్ల, మనం విన్న సత్యాలను మనం ముందు కన్నా యింకా ఎక్కువ జాగ్రత్తగా పరిశీలించాలి. అప్పుడే మనం వాటికి దూరమైపోము.
హెబ్రీయులకు 2 : 2 (ERVTE)
దేవదూతలు చెప్పిన సందేశంలో సత్యం ఉందని రుజువైంది. [*దేవదూతలు … రుజువైంది సీనాయి పర్వతం మీద దేవుడు దేవదూతల ద్వారా మోషేకు యిచ్చిన ఆదేశం.] ఆ సందేశాన్ని అనుసరించని వానికి దాన్ని వినని వానికి తగిన శిక్ష లభించింది.
హెబ్రీయులకు 2 : 3 (ERVTE)
మరి, అటువంటి మహత్తరమైన రక్షణను మనం గమనించకపోతే శిక్షనుండి ఏ విధంగా తప్పించుకోగలం? ఈ రక్షణను గురించి మొట్ట మొదట మన ప్రభువు ప్రకటించాడు. ఆ సందేశాన్ని విన్నవాళ్ళు అందులో వున్న సత్యాన్ని మనకు వెల్లడిచేసారు.
హెబ్రీయులకు 2 : 4 (ERVTE)
దేవుడు ఎన్నో సూచనల్ని, అద్భుతాల్ని, మహిమల్ని చూపాడు. తన యిష్టానుసారం పరిశుద్ధాత్మ యొక్క వరాల్ని పంచి పెట్టాడు. తద్వారా ఆ సందేశంలో ఉన్న సత్యాన్ని మనకు రుజువు చేసాడు. [PS]
హెబ్రీయులకు 2 : 5 (ERVTE)
{యేసు మానవజన్మనెత్తటం} [PS] మనం మాట్లాడుతున్న ప్రపంచాన్ని, అంటే రాబోవు ప్రపంచాన్ని దేవుడు తన దూతలకు లోపర్చ లేదు.
హెబ్రీయులకు 2 : 6 (ERVTE)
ధర్మశాస్త్రంలో ఒకచోట ఈ విధంగా వ్రాయబడింది: “మానవుణ్ణి గురించి నీవాలోచించటానికి అతడెంతటి వాడు? [QBR2] మానవ కుమారుణ్ణి నీవు చూడడానికి అతడెంతటి వాడు? [QBR]
హెబ్రీయులకు 2 : 7 (ERVTE)
నీవతనికి దేవదూతలకన్నా కొద్దిగా తక్కువ స్థానాన్ని యిచ్చావు! [QBR2] మహిమ గౌరవమనే కిరీటాన్ని నీవతనికి తొడిగించి, [QBR]
హెబ్రీయులకు 2 : 8 (ERVTE)
అన్నిటినీ అతని పాదాల క్రింద వుంచావు.” కీర్తన 8:4-6 దేవుడు అన్నిటినీ ఆయన పాదాల క్రింద ఉంచాడు అంటే, ప్రతి ఒక్కటి ఆయన అధికారానికి లోబడి ఉండాలన్నమాట. కాని ప్రస్తుతం, అన్నీ ఆయన ఆధీనంలో ఉన్నట్లు మనకు కనిపించటం లేదు.
హెబ్రీయులకు 2 : 9 (ERVTE)
యేసు, దేవదూతల కన్నా కొంత తక్కువ వానిగా చేయబడ్డాడు. అంటే ఆయన మానవులందరి కోసం మరణించాలని, దేవుడాయన్ని అనుగ్రహించి ఈ తక్కువ స్థానం ఆయనకు యిచ్చాడు. యేసు కష్టాలను అనుభవించి మరణించటంవలన ‘మహిమ, గౌరవము’ అనే కిరీటాన్ని ధరించగలిగాడు. [PE][PS]
హెబ్రీయులకు 2 : 10 (ERVTE)
దేవుడు తన కుమారుల్లో చాలామంది తన మహిమలో భాగం పంచుకొనేటట్లు చెయ్యాలని, వాళ్ళ రక్షణకు కారకుడైనటువంటి యేసును కష్టాలనుభవింపజేసి, ఆయనలో పరిపూర్ణత కలుగ చేసాడు. ఎవరికోసం, ఎవరిద్వారా, ఈ ప్రపంచం సృష్టింపబడిందో ఆ దేవుడు ఈ విధంగా చేయటం ధర్మమే! యేసు మానవుల్ని పవిత్రం చేస్తాడు. [PE][PS]
హెబ్రీయులకు 2 : 11 (ERVTE)
ఆయన పవిత్రం చేసిన ప్రజలు, పవిత్రం చేసే ఆయన ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. అందువలనే, వాళ్ళు తన సోదరులని చెప్పుకోవటానికి యేసు సిగ్గుపడటంలేదు.
హెబ్రీయులకు 2 : 12 (ERVTE)
ఆయన ఈ విధంగా అన్నాడు: “నిన్ను గురించి నా సోదరులకు తెలియ చేస్తాను. [QBR2] సభలో, నిన్ను స్తుతిస్తూ పాటలు పాడతాను!” కీర్తన 22:22
హెబ్రీయులకు 2 : 13 (ERVTE)
మరొక చోట “నేను దేవుణ్ణి నమ్ముతున్నాను!” యోషయా 8:17 అంతేకాక ఇలా కూడా అన్నాడు: “నేను, దేవుడు నాకిచ్చిన సంతానం యిక్కడ ఉన్నాము!” యోషయా 8:18 [PS]
హెబ్రీయులకు 2 : 14 (ERVTE)
ఆయన “సంతానమని” పిలువబడిన వాళ్ళు రక్తమాంసాలుగల ప్రజలు. యేసు వాళ్ళలా అయిపోయి వాళ్ళ మానవనైజాన్ని పంచుకొన్నాడు. ఆయన తన మరణం ద్వారా మరణంపై అధికారమున్న సైతాన్ను నాశనం చేయాలని ఇలా చేశాడు.
హెబ్రీయులకు 2 : 15 (ERVTE)
తద్వారా జీవితాంతం మరణానికి భయపడి జీవించే వాళ్ళకు స్వేచ్ఛకలిగించాడు.
హెబ్రీయులకు 2 : 16 (ERVTE)
నిజానికి, ఆయన దేవదూతలకు సహయం చెయ్యాలని రాలేదు. అబ్రహము సంతానానికి సహయం చెయ్యాలని వచ్చాడు.
హెబ్రీయులకు 2 : 17 (ERVTE)
ఈ కారణంగా ఆయన అన్ని విధాల తన సోదరులను పోలి జన్మించవలసి వచ్చింది. ఆయన మహాయాజకుడై తన ప్రజలపై దయ చూపటానికి మానవ జన్మనెత్తాడు. ఆయన ప్రజల పాపాలకు ప్రాయశ్చిత్తం చెయ్యాలని వారిలో ఒకడాయెను.
హెబ్రీయులకు 2 : 18 (ERVTE)
శోధన సమయాల్లో యేసు కష్టాలను అనుభవించాడు. కనుక యిప్పుడు శోధనలకు గురౌతున్న వాళ్ళకు ఆయన సహాయం చేయగలడు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18

BG:

Opacity:

Color:


Size:


Font: