హెబ్రీయులకు 3 : 1 (ERVTE)
{యేసు మోషే కన్నా గొప్పవాడు} [PS] పరలోక దేవుని పిలుపులో పాలివారైన సోదరులారా! మీరు పవిత్రత గలవాళ్ళు. మనం బహిరంగంగా విశ్వసిస్తున్న ప్రధాన యాజకుడు, దేవుని అపొస్తలుడు అయినటువంటి యేసు పట్ల మీ మనస్సు లగ్నం చెయ్యండి.
హెబ్రీయులకు 3 : 2 (ERVTE)
మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు. అలాగే యేసు కూడా తనను నియమించిన దేవునియందు నమ్మకస్తుడుగా ఉండెను.
హెబ్రీయులకు 3 : 3 (ERVTE)
ఇంటికంటే, ఇల్లు కట్టిన వానికి ఎక్కువ గౌరవముంటుంది. అలాగే మోషే కన్నా యేసు ఎక్కువ గౌరవవానికి అర్హుడనిపించుకొన్నాడు.
హెబ్రీయులకు 3 : 4 (ERVTE)
ఎందుకంటే, ప్రతి ఇంటిని ఎవరో ఒకడు కడతాడు, కాని దేవుడు అన్నిటినీ నిర్మించాడు.
హెబ్రీయులకు 3 : 5 (ERVTE)
దేవుని ఇల్లంతటిలో మోషే సేవకునిగా విశ్వాసంతో పని చేసాడు. ఆ కారణంగా, చాలా కాలం తర్వాత మోషే జరుగబోవువాటికి సాక్షిగా ఉండెను.
హెబ్రీయులకు 3 : 6 (ERVTE)
కాని క్రీస్తు దేవుని ఇల్లంతటికి నమ్మకస్తుడైన కుమారుడు. మనం అతిశయించే నిరీక్షణ, ధైర్యంను గట్టిగా పట్టుకొన్న వారమైతే మనం ఆయన ఇల్లౌతాం. అందువల్ల మనం అశిస్తున్న దానికోసం, విశ్వాసంతో ధైర్యంగా ఉంటే ఆ యింటికి చెందిన వాళ్ళమౌతాము. [PS]
హెబ్రీయులకు 3 : 7 (ERVTE)
{దేవుని ప్రజలకు విశ్రాంతి} [PS] (7-8) అందువల్ల పరిశుద్ధాత్మ ఈ విధంగా అంటున్నాడు: “ఆనాడు ఎడారిలో మూర్ఖులై మీరాయనకు ఎదురు తిరిగారు. [QBR2] ఆయన సహనాన్ని పరీక్షించారు. [QBR2] కాని నేడు మీరాయన మాట వింటే మీ హృదయాలు కఠిన పర్చుకోవద్దు. [QBR]
హెబ్రీయులకు 3 : 8 (ERVTE)
హెబ్రీయులకు 3 : 9 (ERVTE)
నేను నలభై సంవత్సరాలు చేసినదంతా చూసి కూడా [QBR2] మీ పూర్వీకులు నన్నూ, నా సహనాన్ని పరీక్షించారు. [QBR]
హెబ్రీయులకు 3 : 10 (ERVTE)
ఆ కారణంగానే, ఆ ప్రజలంటే నాకు కోపం వచ్చింది, [QBR2] ‘వాళ్ళ హృదయాలు పెడదారులు పట్టాయి, [QBR2] నేను చూపిన దారుల్ని వాళ్ళు చూడ లేదు’ అని అన్నాను. [QBR]
హెబ్రీయులకు 3 : 11 (ERVTE)
అందుకే, ‘నా విశ్రాంతిలోనికి వాళ్ళను రానివ్వనని [QBR2] కోపంతో ప్రమాణం చేశాను.’ ” కీర్తన 95:7-11 [PS]
హెబ్రీయులకు 3 : 12 (ERVTE)
సోదరులారా! సజీవంగా ఉన్న దేవునికి దూరమైపోయే హృదయంకాని, విశ్వాసంలేని హృదయంకాని, మీలో ఉండకుండా జాగ్రత్త పడండి.
హెబ్రీయులకు 3 : 13 (ERVTE)
ఆ “నేడు” అనేది యింకా ఉంది గనుక, పరస్పరం ప్రతి రోజు ప్రోత్సాహపరచుకొంటూ ఉండండి. అప్పుడు పాపం మిమ్మల్ని మోసం చెయ్యలేదు. మీలో మూర్ఖత్వం ఉండదు.
హెబ్రీయులకు 3 : 14 (ERVTE)
మనలో మొదటినుండి ఉన్న విశ్వాసాన్ని చివరిదాకా గట్టిగా పట్టుకొనివుంటే, మనం క్రీస్తుతో కలిసి భాగం పంచుకొంటాం.
హెబ్రీయులకు 3 : 15 (ERVTE)
ఇంతకు ముందు చెప్పబడినట్లు: “ఆనాడు మూర్ఖులై మీరాయనకు ఎదురు తిరిగారు కాని, [QBR2] నేడు మీరాయన మాట వింటే అలా చెయ్యకండి.” కీర్తన 95:7-8 [PS]
హెబ్రీయులకు 3 : 16 (ERVTE)
వీళ్ళందరూ ఈజిప్టు దేశంనుండి మోషే పిలిచుకొని వచ్చిన ప్రజలే కదా! దేవుని స్వరం విని ఎదురు తిరిగింది వీళ్ళే కదా!
హెబ్రీయులకు 3 : 17 (ERVTE)
నలభై సంవత్సరాలు దేవుడు కోపగించుకొన్నది ఎవరిమీద? పాపం చేసి ఎడారిలో పడి చనిపోయిన వాళ్ళమీదనే కదా!
హెబ్రీయులకు 3 : 18 (ERVTE)
“నా విశ్రాంతిలోనికి వాళ్ళను రానివ్వను” అని, అవిధేయతగా ప్రవర్తించిన వాళ్ళ విషయంలో దేవుడు ప్రమాణం చేయలేదా?
హెబ్రీయులకు 3 : 19 (ERVTE)
వాళ్ళు విశ్వసించలేదు గనుక ఆ విశ్రాంతిలో ప్రవేశించలేకపొయ్యారు. ఇది మనం గమనిస్తూనే ఉన్నాము. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19

BG:

Opacity:

Color:


Size:


Font: