హెబ్రీయులకు 4 : 1 (ERVTE)
దేవుని విశ్రాంతిలో ప్రవేశించుదుమన్న వాగ్ధానం యింకా అలాగే ఉంది. అందువలన అక్కడికి వెళ్ళగలిగే అవకాశాన్ని ఎవ్వరూ జారవిడుచుకోకుండా జాగ్రత్త పడదాం.
హెబ్రీయులకు 4 : 2 (ERVTE)
ఎందుకంటే, వాళ్ళకు ప్రకటింపబడినట్లే మనకు కూడా సువార్త ప్రకటింపబడింది. కాని, వాళ్ళు ఆ సువార్తను విశ్వాసంతో వినలేదు గనుక అది వాళ్ళకు నిష్ర్పయోజనమైపోయింది.
హెబ్రీయులకు 4 : 3 (ERVTE)
సువార్తను విశ్వసించే మనం దేవుని విశ్రాంతిలో ప్రవేశిస్తాము. “నా కోపంతో ప్రమాణం చేసి చెప్పుచున్నాను: [QBR2] “నా విశ్రాంతిలోనికి వాళ్ళను రానివ్వను” కీర్తన 95:11 అని దేవుడు అన్నాడు. ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత ఆయన కార్యం ముగిసింది.
హెబ్రీయులకు 4 : 4 (ERVTE)
కాని, “దేవుడు ప్రపంచాన్ని సృష్టించటం ముగించిన తర్వాత విశ్రాంతి తీసుకొనెను” [✡ఉల్లేఖము: ఆది. 2:2.] అని ఏడవ రోజును గురించి ఒక చోట వ్రాయబడి ఉంది.
హెబ్రీయులకు 4 : 5 (ERVTE)
దేవుడు ఈ విషయాన్ని గురించి మళ్ళీ చెబుతూ, “నా విశ్రాంతిలోనికి వాళ్ళను రానివ్వను” అని అన్నాడు. [PE][PS]
హెబ్రీయులకు 4 : 6 (ERVTE)
ఆ విశ్రాంతిలో ప్రవేశించటానికి అవకాశం ఇంకావుంది. ఇదివరలో శుభసందేశాన్ని విన్నవాళ్ళు, వాళ్ళ అవిధేయతవల్ల లోపలికి వెళ్ళలేక పొయ్యారు.
హెబ్రీయులకు 4 : 7 (ERVTE)
అందువల్ల దేవుడు మరొక దినాన్ని నిర్ణయించాడు. దాన్ని “ఈ రోజు” అని అన్నాడు. నేను ముందు వ్రాసినట్లు చాలాకాలం తర్వాత దేవుడు దావుదు ద్వారా ఈ విధంగా మాట్లాడాడు: “ఈ రోజు మీరాయన స్వరం వింటే, [QBR2] మూర్ఖంగా ప్రవర్తించకండి.” కీర్తన 95:7-8
హెబ్రీయులకు 4 : 8 (ERVTE)
యోహూషువా వాళ్ళకు విశ్రాంతి ఇచ్చినట్లయితే దేవుడు ఆ తర్వాత మరొక రోజును గురించి మాట్లాడిఉండేవాడు కాదు.
హెబ్రీయులకు 4 : 9 (ERVTE)
అందువల్ల, దేవుని ప్రజల కోసం ‘విశ్రాంతి’ కాచుకొని ఉంది.
హెబ్రీయులకు 4 : 10 (ERVTE)
దేవుడు తన పని ముగించి విశ్రమించాడు. అలాగే, దేవుని విశ్రాంతిలో ప్రవేశించే ప్రతి ఒక్కడూ తన పనినుండి విశ్రాంతి పొందుతాడు.
హెబ్రీయులకు 4 : 11 (ERVTE)
అందువల్ల ఆ విశ్రాంతిని పొందటానికి మనం అన్ని విధాలా ప్రయత్నంచేద్దాం. వాళ్ళలా అవిధేయతగా ప్రవర్తించి క్రింద పడకుండా జాగ్రత్తపడదాం. [PE][PS]
హెబ్రీయులకు 4 : 12 (ERVTE)
దైవసందేశం సజీవమైంది. దానిలో చురుకుదనం ఉంది. అది రెండు వైపులా పదునుగానున్న కత్తికన్నా పదునైంది. అది చొచ్చుకొని పోయి ఆత్మను, ప్రాణాన్ని, కీళ్ళను, ఎముకలో ఉన్న మూలుగను విభాగించగలదు. అది మనస్సు యొక్క భావాలమీద, ఆలోచనల మీద తీర్పు చెప్పగలదు.
హెబ్రీయులకు 4 : 13 (ERVTE)
సృష్టిలో ఉన్న ఏ వస్తువూ దేవుని దృష్టినుండి తప్పించుకోలేదు. కళ్ళ ముందు పరచబడినట్లు ఆయనకు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. అలాంటి దేవునికి మనం మనకు సంబంధించిన లెక్కల్ని చూపవలసి వుంటుంది. [PS]
హెబ్రీయులకు 4 : 14 (ERVTE)
{యేసు గొప్ప ప్రధాన యాజకుడు} [PS] పరలోకానికి వెళ్ళిన యేసు దేవుని కుమారుడు. ఆయనే మన ప్రధాన యాజకుడు. మనం బహిరంగంగా అంగీకరించిన విశ్వాసాన్ని విడువకుండా దృఢంగా ఉండాలి.
హెబ్రీయులకు 4 : 15 (ERVTE)
మన ప్రధాన యాజకుడు మన బలహీనతలను చూసి సానుభూతి చెందుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయన మనలాగే అన్ని రకాల పరీక్షలకు గురి అయ్యాడు. కాని, ఆయన ఏ పాపమూ చెయ్యలేదు.
హెబ్రీయులకు 4 : 16 (ERVTE)
అందువలన మనకు అనుగ్రహం ప్రసాదించే దేవుని సింహాసనం దగ్గరకు విశ్వాసంతో వెళ్ళుదాం. అలా చేస్తే మనకు అవసరమున్నప్పుడు, ఆయన దయ, అనుగ్రహము మనకు లభిస్తాయి. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

BG:

Opacity:

Color:


Size:


Font: