హెబ్రీయులకు 6 : 1 (ERVTE)
అందువల్ల క్రీస్తును గురించి బోధింపబడిన ప్రాథమిక పాఠాలను చర్చించటం మాని ముందుకు వెళ్తూ పరిపూర్ణత చెందుదాం. ఘోరమైన తప్పులు చేసి మారుమనస్సు పొందటం, దేవుని పట్ల విశ్వాసం,
హెబ్రీయులకు 6 : 2 (ERVTE)
బాప్తిస్మమును [*బాప్తిస్మము ఇక్కడ బాప్తిస్మము అనగా “క్రైస్తవ బాప్తిస్మము” అయివుండవచ్చు లేక యూదా సంప్రదాయ శుద్ధీకరణలు అయివుండవచ్చు.] గురించి బోధించటం, చేతులు తల మీద ఉంచి అభిషేకించటం, చనిపోయన వాళ్ళు తిరిగి బ్రతికి రావటం, శాశ్వతమైన తీర్పు, యివి మన పునాదులు. ఈ పునాదుల్ని మళ్ళీ మళ్ళీ వేయకుండా ఉందాం.
హెబ్రీయులకు 6 : 3 (ERVTE)
దేవుడు సమ్మతిస్తే అలాగే జరుగుతుంది. [PE][PS]
హెబ్రీయులకు 6 : 4 (ERVTE)
ఒకసారి వెలిగింపబడిన వాళ్ళు, పరలోకం నుండి పొందిన వరాన్ని రుచి చూసిన వాళ్ళు, ప్రవిత్రాత్మలో భాగం పంచుకున్న వాళ్ళు.
హెబ్రీయులకు 6 : 5 (ERVTE)
దైవసందేశం యొక్క మంచితన్నాన్ని రుచి చూసిన వాళ్ళు, రానున్న కాలం యొక్క శక్తిని రుచి చూచిన వాళ్ళు
హెబ్రీయులకు 6 : 6 (ERVTE)
పడిపోతే మారుమనస్సు పొందేటట్లు చేయటం అసంభవం. ఎందుకంటే, వాళ్ళు ఈ విధంగా చేసి దేవుని కుమారుణ్ణి మళ్ళీ సిలువవేసి చంపుతున్నారు. ఆయన్ని నలుగురిలో అవమానపరుస్తున్నారు. [PE][PS]
హెబ్రీయులకు 6 : 7 (ERVTE)
తన మీద తరచుగా పడ్తున్న వర్షాన్ని పీల్చుకొనే భూమి, తనను దున్నిన రైతులకు పంటనిచ్చిన భూమి దేవుని ఆశీస్సులు పొందుతుంది.
హెబ్రీయులకు 6 : 8 (ERVTE)
కాని, ముళ్ళ మొక్కలు, కలుపుమొక్కలతో పెరిగేభూమి నిరుపయోగమైనది. అలాంటి భూమిని దేవుడు శపిస్తాడు. చివరకు దాన్ని కాల్చి వేస్తాడు. [PE][PS]
హెబ్రీయులకు 6 : 9 (ERVTE)
ప్రియమైన సోదరులారా! మేము మాట్లాడుతున్న ఈ రక్షణ సంబంధమైన విషయాల ద్వారా మీకు మంచి కలుగుతుందనే విశ్వాసం మాకుంది.
హెబ్రీయులకు 6 : 10 (ERVTE)
దేవుడు అన్యాయం చెయ్యడు. మీరు దేవుని ప్రజలకు సహాయం చేసారు. యిప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. మీరు చేసిన కార్యాలను మీరాయన పట్ల చూపిన ప్రేమను ఆయన మరిచిపోడు.
హెబ్రీయులకు 6 : 11 (ERVTE)
మీ నిరీక్షణ సంపూర్ణమగునట్లుగా మీలో ప్రతి ఒక్కడు మీరిదివరకు చూపిన ఆసక్తి చివరివరకు చూపాలి.
హెబ్రీయులకు 6 : 12 (ERVTE)
మీరు సోమరులుగా నుండకూడదు. కాని వాగ్దానము చేయబడిన దానిని విశ్వాసము ద్వారా, సహనము ద్వారా పొందినవారిని అనుసరించండి. [PE][PS]
హెబ్రీయులకు 6 : 13 (ERVTE)
దేవుడు అబ్రాహాముతో వాగ్దానం చేసినప్పుడు తనకంటే గొప్పవాడెవ్వడూ లేనందు వలన స్వయంగా తన మీదే ప్రమాణం తీసుకొంటూ,
హెబ్రీయులకు 6 : 14 (ERVTE)
ఇలా అన్నాడు: “నేను నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాను. నీ సంతతిని అభివృద్ధి పరుస్తాను.”
హెబ్రీయులకు 6 : 15 (ERVTE)
అబ్రాహాము ఓర్పుతో కాచుకొన్నాడు. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. [PE][PS]
హెబ్రీయులకు 6 : 16 (ERVTE)
ప్రజలు తమకన్నా గొప్ప వాళ్ళ మీద ప్రమాణం చేస్తారు. ఈ ప్రమాణాలు వివాదాలు సాగనీయకుండా చేసి మాటల్లో మీ సత్యాన్ని దృఢ పరుస్తాయి.
హెబ్రీయులకు 6 : 17 (ERVTE)
దేవుడు తన వాగ్దానం విషయంలో తన ఉద్దేశ్యాన్ని మార్చుకోనని వాగ్దానం పొందిన వారసులకు స్పష్టం చేయాలనుకున్నాడు. అందువల్ల ఆ వాగ్దానాన్ని తన మీద ప్రమాణం చేసి ధృఢపరిచాడు.
హెబ్రీయులకు 6 : 18 (ERVTE)
అందువల్ల ఈ “రెండూ” మార్పు చెందలేవు. వీటివిషయంలో దేవుడు అసత్యమాడలేడు. [PE][PS] తానివ్వబోయే వాటికోసం ఆశాభావంతో పరుగెత్తుతున్న వాళ్ళకు ప్రోత్సాహం కలగాలని ఈ ప్రమాణం చేశాడు.
హెబ్రీయులకు 6 : 19 (ERVTE)
భద్రతను దృఢత్వాన్ని కలిగించే ఈ నిరీక్షణ మన ఆత్మలకు లంగరు లాంటిది. ఈ నిరీక్షణ తెరవెనుక లోపలి భాగంలో స్థిరముగా ప్రవేశించగలదు.
హెబ్రీయులకు 6 : 20 (ERVTE)
యేసు మన కోసం, మనకన్నా ముందు ఆ తెరలోపలికి వెళ్ళాడు. మెల్కీసెదెకు క్రమంలో యేసు కూడా శాశ్వతంగా ప్రధాన యాజకుడుగా ఉంటాడు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20

BG:

Opacity:

Color:


Size:


Font: