హెబ్రీయులకు 8 : 1 (ERVTE)
{క్రొత్త ఒడంబడిక} [PS] మేము చెబుతున్న దానిలో ముఖ్య అంశం ఏమిటంటే: పరలోకంలో మహోన్నతుని సింహాసనానికి కుడివైపు కూర్చోగల అధికారమున్న ప్రధాన యాజకుడు మనకున్నాడు.
హెబ్రీయులకు 8 : 2 (ERVTE)
అంతేకాక ఆయన నిజమైన గుడారంలో, అంటే ప్రభువు నిర్మించిన పరిశుద్ధాలయములో సేవ చేస్తున్నాడు. ఈ గుడారం మానవుడు నిర్మించింది కాదు. [PE][PS]
హెబ్రీయులకు 8 : 3 (ERVTE)
కానుకల్ని, బలుల్ని అర్పించటానికి ప్రధాన యాజకుడు నియమించబడతాడు. అందువల్ల ఈయన దగ్గర కూడా అర్పించటానికి ఏదైనా ఉండవలసిన అవసరం ఏర్పడింది.
హెబ్రీయులకు 8 : 4 (ERVTE)
ఈయన భూలోకంలో ఉండినట్లయితే యాజకుడుగా పని చేసేవాడు కాదు. ఎందుకంటే, ధర్మశాస్త్రం ఆదేశించిన విధంగా కానుకలు అర్పించే యాజకులు యిదివరకే భూలోకంలో ఉన్నారు.
హెబ్రీయులకు 8 : 5 (ERVTE)
వాళ్ళు భూమ్మీదనున్న పరిశుద్ధ స్థలములో సేవచేస్తూ ఉంటారు. భూలోకంలో ఉన్న ఈ పరిశుద్ధ స్థలము పరలోకంలో ఉన్న దానికి నీడ లాంటిది, అంటే ప్రతిబింబం. ఈ కారణంగానే, మోషే గుడారాన్ని నిర్మించటానికి మొదలు పెట్టినప్పుడు దేవుడు అతనితో, “నేను నీకు కొండమీద చూపించిన విధంగా దాన్ని నిర్మించు!” [✡ఉల్లేఖము: నిర్గమ. 25:40.] అని హెచ్చరించాడు.
హెబ్రీయులకు 8 : 6 (ERVTE)
యేసు మధ్యవర్తిగా ఉండి నియమించిన ఒడంబడిక పాత దానికన్నా ఉత్తమమైనది. అందులో ఉత్తమ వాగ్దానాలున్నాయి. అందువల్ల దేవుడు యేసుకిచ్చిన యాజకత్వము వాళ్ళు చేసే యాజకత్వం పనికన్నా ఉత్తమమైనది. [PE][PS]
హెబ్రీయులకు 8 : 7 (ERVTE)
ఎందుకంటే ఒకవేళ మొదటి ఒడంబడికలో ఏ తప్పూ లేక పోయినట్లయితే యింకొక ఒడంబడిక యొక్క అవసరం ఉండక పోయేది.
హెబ్రీయులకు 8 : 8 (ERVTE)
కాని ప్రభువు ప్రజల పొరపాట్లను కనిపెట్టి వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “ఇశ్రాయేలు, యూదా, [QBR2] ప్రజలతో క్రొత్త ఒడంబడిక చేయవలసిన సమయం వస్తుంది! [QBR]
హెబ్రీయులకు 8 : 9 (ERVTE)
వాళ్ళ ముత్తాతల్ని ఈజిప్టు దేశంనుండి, చేయి పట్టుకొని వెలుపలికి పిలుచుకొని వచ్చాను. [QBR2] ఆనాడు వాళ్ళతో ఒక ఒడంబడిక చేసాను. నేను మీతో చేయబోతున్న ఒడంబడిక ఆనాటి ఒడంబడికలా ఉండదు. [QBR] వాళ్ళు నా ఒడంబడిక ప్రకారం నడుచుకోలేదు [QBR2] గనుక వాళ్ళను నేను లేక్క చేయ్యలేదు. [QBR]
హెబ్రీయులకు 8 : 10 (ERVTE)
ఆతర్వాత, ఇశ్రాయేలు ప్రజలతో ఈ విధంగా ఒడంబడిక చేస్తాను: [QBR2] నా నియమాల్ని వాళ్ళ మనస్సుల్లో ఉంచుతాను. [QBR] వాటిని వాళ్ళ హృదయాలపై వ్రాస్తాను. [QBR2] నేను వాళ్ళ దేవునిగా ఉంటాను. [QBR] వాళ్ళు నా ప్రజలుగా ఉంటారు. [QBR]
హెబ్రీయులకు 8 : 11 (ERVTE)
అప్పుడు ప్రభువుని తెలుసుకోమని ప్రక్కింటి వానికి గాని, తన సోదరునికి గాని బోధించవలసిన అవసరం ఉండదు. [QBR] ఎందుకంటే ఆ రోజుల్లో అధముడు, గొప్పవాడు, అందరు నన్ను తెలుసుకొంటారు. [QBR]
హెబ్రీయులకు 8 : 12 (ERVTE)
నేను వాళ్ళ దోషాల్ని క్షమిస్తాను. [QBR2] వాళ్ళ పాపాల్ని మరచిపోతాను. యిర్మీయా 31:31-34 [PS]
హెబ్రీయులకు 8 : 13 (ERVTE)
ఈ ఒడంబడికను “క్రొత్త ఒడంబడిక” అని పిలవటం వల్ల మొదటిది పాత ఒడంబడిక అయిపోయింది. పురాతనమైనది, శిథిలమైనది, త్వరలోనే అదృశ్యమైపోతుంది. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13

BG:

Opacity:

Color:


Size:


Font: