యిర్మీయా 13 : 1 (ERVTE)
{నడికట్టు బట్ట సంకేతం} [PS] యెహోవా నాతో ఇలా అన్నాడు, “యిర్మీయా, నీవు వెళ్లి నారతో చేసిన ఒక నడికట్టు బట్టకొని [*నడికట్టు బట్ట ప్రాచీన యూదా రాజ్యంలో ఇది సర్వ సామాన్యమైన చల్లడము. (అడుగు నధరించే వస్త్రము). అది నడుమునుండి తొడల దిగువ వరకు వుంటుంది] తీసుకురా. దానిని నీవు ధరించుము. కాని దానిని తడవనీయవద్దు.” [PE][PS]
యిర్మీయా 13 : 2 (ERVTE)
కావున యెహోవా చెప్పిన విధంగా నేనొక నడికట్టు వస్త్రం కొని ధరించాను.
యిర్మీయా 13 : 3 (ERVTE)
అప్పుడు రెండవసారి యెహోవా వాక్కు నాకు వినిపించింది.
యిర్మీయా 13 : 4 (ERVTE)
ఆ వాక్కు ఇలా వుంది: “యిర్మీయా, నీవు కొని ధరించిన నడికట్టు వస్త్రం తీసుకొని ఫరాతుకు [†ఫరాతు బహుశః ఫరాతు అనేది యెరూషలేము దగ్గర ఒక ఊరు కావచ్చు. బెన్యామీను రాజ్యనగరాలుగా పేర్కొనబడిన వాటిలో ఇది ఒకటికావచ్చును. చుడండి: యెహోషువ 18:23; కాని ‘ఫరాతు’ అనే పదాన్ని యూఫ్రటీసు నదికి పర్యాయపదంగా కూడా వాడినారు.] వెళ్లుము. అక్కడ ఒకబండ బీటలో ఆ నడికట్టు వస్త్రాన్ని దాచి పెట్టు.” [PE][PS]
యిర్మీయా 13 : 5 (ERVTE)
అందుచేత నేను ఫరాతు (యూఫ్రటీసు) కు వెళ్లి ఒక బండ బీటలో నడికట్టు వస్త్రాన్ని (చల్లడము) అక్కడ యెహోవా చెప్పిన రీతిలో దాచాను.
యిర్మీయా 13 : 6 (ERVTE)
చాలా రోజుల తరువాత యెహోవా నాతో, “యిర్మీయా, ఇప్పుడు ఫరాతుకు వెళ్లుము. బండ బీటలో నిన్ను దాయమని చెప్పిన నడికట్టు వస్త్రాన్ని తీసుకొని రమ్ము” అని చెప్పాడు. [PE][PS]
యిర్మీయా 13 : 7 (ERVTE)
అప్పుడు నేను ఫరాతుకు వెళ్లి నడికట్టు వస్త్రాన్ని తవ్వి తీశాను. నేను దాచిన బండ బొరియలోనుండి దానిని వెలికి తీశాను. కాని నేను దానిని ధరించ లేక పోయాను. కారణమేమంటే అది జీర్ణించిపోయింది. అది ఎందుకూ పనికిరానిదయ్యింది. [PE][PS]
యిర్మీయా 13 : 8 (ERVTE)
అప్పుడు యెహోవా వర్తమానం నాకు చేరింది.
యిర్మీయా 13 : 9 (ERVTE)
యెహోవా ఇలా చెప్పినాడు: “నడికట్టు బట్ట జీర్ణించి, ఎందుకూ పనికిరానిదయి పోయింది. అదే విధంగా, యూదాలోను, యెరూషలేములోనుగల గర్విష్టులనందరినీ నాశనం చేస్తాను.
యిర్మీయా 13 : 10 (ERVTE)
యూదాలోని గర్విష్టులను, దుష్టులను నాశనం చేస్తాను. వారు నా వాక్కు వినటానికి నిరాకరిస్తున్నారు. మొండి వైఖరి దాల్చి, వారు చేయదలచుకున్న పనులే వారు చేస్తారు. వారు అన్యదేవుళ్లను అనుసరించి, ఆరాధిస్తారు. అటువంటి యూదా వారంతా ఈ నార నడికట్టు బట్టలా అయిపోతారు. వారు సర్వనాశనమవుతారు. వారెందుకూ పనికిరారు.
యిర్మీయా 13 : 11 (ERVTE)
నడికట్టు వస్త్రాన్ని మనుష్యులు తమ నడుము చుట్టూ గట్టిగా కట్టుకుంటారు. అదే మాదిరి ఇశ్రాయేలు సంతతి వారిని, యూదా వంశంవారిని నాచుట్టూ కప్పుకొన్నాను.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది “నేనలా ఎందుకు చేసినానంటే వారంతా నా ప్రజలు కావాలని. నా ప్రజలు నాకు ఖ్యాతిని, మహిమను, గౌరవాన్ని తెస్తారనుకున్నాను. కాని నా ప్రజలు నా మాటనే వినలేదు.” [PS]
యిర్మీయా 13 : 12 (ERVTE)
{యూదాకు హెచ్చరికలు} [PS] “యిర్మీయా, యూదా ప్రజలకు ఇశ్రాయేలీయుల దేవుడు ఇలా చెపుతున్నాడని తెలియజేయుము: ‘ప్రతి ద్రాక్షరసపు తిత్తియు [‡ద్రాక్షారసపు తిత్తి ద్రాక్షారసమును ఒక రకపు జంతు చర్మంతో చేసిన తిత్తులలో నల్వచేసే వారు.] ద్రాక్షారసముతో నింపాలి.’ అది విన్న ఆ జనులు నవ్వి, ‘అవును. ప్రతి ద్రాక్షారసపు తిత్తీ ద్రాక్షారసంతోనే నింపాలని మాకు తెలుసు’ అని నీతో అంటారు.
యిర్మీయా 13 : 13 (ERVTE)
అప్పుడు నీవిలా చెప్పాలి, ‘యెహోవా ఇలా అంటున్నాడు: ఈ రాజ్యంలో నివసించే ప్రతివాని తాగిన వానిలా నిస్సహాయుని చేస్తాను. దావీదు సింహాసనం మీద కూర్చున్న రాజులను గురించి నేను మాట్లాడుతున్నాను. ఇంకా నేను యాజకుల గురించి, ప్రవక్తల గురించి యెరూషలేము వారందరిని గురించి నేను మాట్లాడుతున్నాను.
యిర్మీయా 13 : 14 (ERVTE)
యూదా ప్రజలందరినీ తూలిపోయి ఒకరిమీద ఒకరు పడేలా చేస్తాను. తండ్రులు, కొడుకులు ఒకరిమీద ఒకరు పడిపోతారు.’ ఈ వర్తమానం యెహోవా వద్దనుండి వచ్చినది ‘నేను వారిని గురించి విచారించటంగాని, జాలిపడటంగాని జరుగదు. యూదా ప్రజలను నాశనం చేయుటలో అనుతాపాన్ని (కనికరం) నన్ను అడ్డగించనివ్వను.’ ”
యిర్మీయా 13 : 15 (ERVTE)
శ్రద్ధగా ఆలకించండి. [QBR2] యెహోవా మీతో మాట్లాడియున్నాడు. [QBR2] మీరు గర్విష్టులు కావద్దు. [QBR]
యిర్మీయా 13 : 16 (ERVTE)
మీ యెహోవా దేవుని గౌరవించండి. [QBR] ఆయనను స్తుతించండి. లేనిచో ఆయన మీకు అంధకారాన్ని సృష్టిస్తాడు. [QBR2] మీరు చీకటి కొండల్లో పడిపోక ముందుగానే మీరాయనను స్తోత్రం చేయండి. [QBR] యూదా ప్రజలారా మీరు వెలుగుకై ఎదురు చూస్తూన్నారు. [QBR2] కాని యెహోవా ఆ వెలుగును కటిక చీకటిగా మార్చుతాడు. [QBR2] యెహోవా వెలుగును మహా అంధకారంగా మార్చగలడు. [QBR]
యిర్మీయా 13 : 17 (ERVTE)
యూదా ప్రజలారా, మీరు యెహోవా వాక్కు వినకపోతే [QBR2] నేను దాగుకొని విలపిస్తాను. [QBR] మీ గర్వం నన్ను విలపించేలా చేస్తోంది. [QBR2] నేను బిగ్గరగా విలపిస్తాను. [QBR] నా కన్నీరు వరదలై పారుతుంది. [QBR2] ఎందువల్లనంటే, యెహోవా మంద [§యెహోవా మంద యూదా ప్రజలకు ఈ పేరు అలంకారికంగా పెట్టబడింది. యెహోవా కాపరిగాను, ఆయను ప్రజలు గొర్రెల మందగాను భావించబడిరి.] బందీయైపోయింది. [QBR]
యిర్మీయా 13 : 18 (ERVTE)
ఈ విషయం రాజుకు, ఆయన భార్యకు తెలియ జెప్పండి: [QBR2] “మీ సింహాసనాల నుండి మీరు దిగిరండి. [QBR2] మీ అందాల కిరీటాల మీ తలలనుండి కిందికి పడిపోయాయి.” [QBR]
యిర్మీయా 13 : 19 (ERVTE)
నెగెవు [*నెగెవు యూదా సామ్రాజ్యానికి దక్షిణానవున్న ఎడారి ప్రాంతానికి నెగెవు అని పేరు.] ఎడారిలో మీ నగరాలు మూసివేయ బడ్డాయి. [QBR2] వాటిని ఎవ్వరూ తెరువలేరు. [QBR] యూదా ప్రజలంతా చెరపట్టబడ్డారు. [QBR2] వారంతా బందీలుగా కొనిపోబడ్డారు.
యిర్మీయా 13 : 20 (ERVTE)
యెరూషలేమా, పైకి చూడు! [QBR2] ఉత్తర దిశనుండి వచ్చే శత్రువును చూడు. [QBR] నీ మంద ఎక్కడ? ఆ అందమైన మందను దేవుడు నీకిచ్చాడు. [QBR2] ఆ మంద రక్షణ బాధ్యత నీదై వుంది. [QBR]
యిర్మీయా 13 : 21 (ERVTE)
ఆ మంద ఏమైనదని దేవుడు నిన్నడిగితే నీవేమి చెపుతావు? [QBR2] నీవు దేవుని గురించి ప్రజలకు బోధించవలసివుంది. [QBR] నీ నాయకులు ప్రజలను నడిపించవలసి ఉంది. [QBR2] కాని వారి పని వారు చేయ లేదు! [QBR] కావున నీవు మిక్కిలి బాధను, కష్టాలను అనుభవిస్తావు. [QBR2] నీ బాధ స్త్రీ యొక్క ప్రనవవేదనలాంటిది. [QBR]
యిర్మీయా 13 : 22 (ERVTE)
“నాకెందుకీ చెడు దాపురించింది?” [QBR2] అని నీకు నీవే ప్రశ్నించుకో. [QBR] నీవు చేసిన అనేక పాపాల ఫలమే నీకు వచ్చిన కష్టాలు. [QBR2] నీ పాపాల కారణంగా నీ అంగీ చిరిగిపోయింది. [QBR] నీ పాదరక్షలు తీసుకొని పోబడ్డాయి. [QBR2] నిన్ను చిక్కులు పెట్టటానికే వారలా చేశారు. [QBR]
యిర్మీయా 13 : 23 (ERVTE)
నల్లని వ్యక్తి తన శరీరపు రంగును మార్చలేడు. [QBR2] చిరుతపులి తన మచ్చలను మార్చుకోలేదు. [QBR] అలాగే, ఓ యెరూషలేమా, నీవు మారి మంచి పనులు చేయలేవు. [QBR] నీవు ఎల్లప్పుడూ చెడు చేయటానికే అలవాటడ్డానావు.
యిర్మీయా 13 : 24 (ERVTE)
“మీరు మీ ఇండ్లు వదిలిపోయేలా వత్తిడి తెస్తాను. [QBR2] మీరు పారిపోయేటప్పుడు చెల్లా చెదరై అన్ని వైపులకూ పారిపోతారు. [QBR2] ఎడారి గాలికి కొట్టుకు పోయే పొట్టులాంటి వారు మీరు. [QBR]
యిర్మీయా 13 : 25 (ERVTE)
ఈ విషయాలన్నీ నీకు సంభవిస్తాయి. [QBR2] నా ప్రణాళికల్లో నీ పాత్ర ఇదే.” [QBR] ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది. [QBR] “ఇది ఎందుకు సంభవిస్తుంటే [QBR2] నీవు నన్ను మర్చిపోయావు. [QBR2] నీవు బూటకపు దేవుళ్ల నమ్మావు. [QBR]
యిర్మీయా 13 : 26 (ERVTE)
యెరూషలేమా, నీ అంగీని అంచుబట్టి నీ ముఖంమీదికి లాగుతాను. [QBR2] ప్రతివాడూ నిన్ను చూస్తారు నీవు అవమానం పాలవుతావు. [QBR]
యిర్మీయా 13 : 27 (ERVTE)
నీవు చేసిన భయంకరమైన పనులను నేను చూశాను. [†నీవు … చూశాను బూటకపు దేవతలను ఆరాధించే విషయం కావచ్చు. దేవాలయ వేశ్యలతో, పురుషగాములతో వ్యభిచరించటం అనేది ఆ విగ్రహారాధనలో ఒక భాగంలాంటిది.] [QBR2] నీవు విజృంభించి ప్రియులతో వ్యభిచరించటం చూశాను. [QBR2] వేశ్యలా ప్రవర్తించాలనే నీ పథకం నాకు తెలుసు. [QBR] నీవు కొండలమీద, మైదానాల మీద పాపాలు చేయుట నేను చూశాను. [QBR] యెరూషలేమా, ఇది నీకు చాలా చెడ్డదిగా ఉంటుంది. [QBR2] అసహ్యమైన ఈ పాపాలు నీ వెన్నాళ్లు సాగిస్తావోనని నేను ఆశ్చర్యపోతున్నాను.” [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27

BG:

Opacity:

Color:


Size:


Font: