యిర్మీయా 2 : 1 (ERVTE)
{విశ్వాసంలేని యూదా} [PS] యెహోవా యొక్క వర్తమానం నాకు వినిపించింది. యెహోవా వాక్కు ఇలా వుంది:
యిర్మీయా 2 : 2 (ERVTE)
“యిర్మీయా, నీవు వెళ్లి యెరూషలేము ప్రజలతో మాట్లాడుము. నీవు ఇలా చెప్పాలి: “ ‘నీవొక చిన్న రాజ్యంగా ఉన్నప్పుడు నీవు నాకు విశ్వాసంగా ఉన్నావు. [QBR2] ఒక యౌవ్వన వధువులా నీవు నన్ననుసరించావు. [QBR] ఎడారులలోను, సాగుచేయని బీడు భూములలోను [QBR2] నీవు నన్ను అనుసరించావు. [QBR]
యిర్మీయా 2 : 3 (ERVTE)
ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు ఒక పవిత్రమైన బహుమానము: [QBR2] వారు యెహోవా ఏర్పచుకొన్న ప్రథమ ఫలం. [QBR] ఇశ్రాయేలుకు హాని చేయబోయిన ప్రజలంతా దోషులుగా నిలిచారు. [QBR2] ఆ దుష్టులు అనేక కష్టనష్టాలకు గురవుతారు.’ ” [QBR] ఇది యెహోవా వాక్కు.
యిర్మీయా 2 : 4 (ERVTE)
యాకోబు వంశీయులారా! యెహోవా వార్తవినండి. [QBR2] ఇశ్రాయేలు సంతతి కుటుంబాల గుంపుల వారందరూ! ఈ వర్తమానం వినండి.
యిర్మీయా 2 : 5 (ERVTE)
యెహోవా ఇలా చెప్పాడు: [QBR] “మీ పూర్వీకులపట్ల నేను ఉదారంగా ప్రవర్తించి యుండలేదా? [QBR2] అందుకేనా వారు నాపట్ల విముఖులై నారు? [QBR] మీ పూర్వీకులు పనికిమాలిన విగ్రహాలను ఆరాధించారు. [QBR2] తద్వారా వారుకూడ పనికిమాలిన వారైనారు. [QBR]
యిర్మీయా 2 : 6 (ERVTE)
‘మమ్మల్ని ఈజిప్టు నుండి విముక్తిచేసి [QBR2] తీసుకుని వచ్చిన యెహోవా ఎక్కడ ఉన్నాడు? [QBR] మాకు ఎడారులలో మార్గదర్శి అయిన [QBR2] యెహోవా ఎక్కడ ఉన్నాడు? [QBR] మమ్మల్ని నిర్జల ప్రాంతాలలోను, కొండల్లో, కోనల్లో [QBR2] సురక్షితంగా నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడు? [QBR] ఎవరూ నివసించని గాఢాంధకారములోనూ, [QBR2] ప్రమాదకరమైన భూమియందు యెహోవా మమ్మును నడిపించాడు. [QBR2] ప్రజలు ఆ ప్రదేశం గుండా ప్రయాణించరు. [QBR] కానీ యెహోవా మమ్మును దాని గుండా నడిపించాడు.’ [QBR2] మీ పూర్వీకులు ఈ విషయాలు మీకు చెప్పలేదు.”
యిర్మీయా 2 : 7 (ERVTE)
ఒక మంచి, మరియు సారవంతమైన అనేక మంచి వస్తువులతో [QBR2] నిండివున్న రాజ్యానికి మిమ్మల్ని తీసుకొనివచ్చాను. [QBR] మీరు ఆ ఫలాలను తినాలనీ, అక్కడ పండే ధాన్యాలను మీరు ఉత్పత్తి చేయాలనీ నేనలా చేశాను. [QBR2] కాని మీరు వచ్చినా దేశాన్ని అపవిత్ర పర్చారు. [QBR] ఆ దేశాన్ని మీకు నేనిచ్చాను. [QBR2] అయితే మీరు దానిని చెడ్డ దేశంగా మార్చివేశారు.
యిర్మీయా 2 : 8 (ERVTE)
“యెహోవా ఎక్కడ అని [QBR2] యాజకులు అడగలేదు. [QBR] నా ఉపదేశాలను అనుసరించేవారు నన్ను తెలుసు కోవటానికి నిరాకరించారు. [QBR2] ఇశ్రాయేలు ప్రజానాయకులు నాకు వ్యతిరేకులయ్యారు. [QBR] బూటకపు దేవతైన బయలు పేరిట ప్రవక్తలు ప్రవచనాలు చేశారు. [QBR2] వారు పనికిమాలిన విగ్రహాలను ఆరాధించారు.” [QBR]
యిర్మీయా 2 : 9 (ERVTE)
కావున మిమ్మల్ని, మీ పుత్ర పౌత్రులను [QBR2] నేను నిందిస్తున్నాను. [QBR]
యిర్మీయా 2 : 10 (ERVTE)
సముద్రం మీదుగా కిత్తీయుల ద్వీపానికి [*కిత్తీయుల ద్వీపానికి ఈ పేరుకు అర్థము ప్రద్వీపము కాని ఈ పేరు తరచుగా ఇతర ద్వీపాలకు, మధ్యధరా సముద్రతీర ప్రాంతాలకు వాడబడింది.] వెళ్లి చూడండి. [QBR2] ఒకనిని కేదారు [†కేదారు ఇది పాలస్తీను (ఫిలిష్తీయ) కు తూర్పునవున్న ఎడారిలో నివసించిన అరబీయ వంశం యొక్క పేరు.] రాజ్యానికి పంపిశ్రద్ధగా పరిశీలించమనండి. [QBR] అక్కడ ఎవరైనా ఈ రకంగా [QBR2] ప్రవర్తించి యున్నారేమో పరిశీలించండి. [QBR]
యిర్మీయా 2 : 11 (ERVTE)
ఏ దేశవాసులైనా తమ పాత దేవుళ్లను [QBR2] కొత్త దేవుళ్లతో మార్చుకున్నారు? [QBR] లేదు! నిజానికి వారి దేవుళ్లు వాస్తవ దేవుళ్లు కానేకారు [QBR] అయినను నా ప్రజలు తమ మహిమాన్వితుడైన దేవుని ఆరాధించటం మానుకొని [QBR2] పనికిమాలిన విగ్రహాలను పూజించటం ప్రారంభించారు అని యెహోవా అన్నాడు.
యిర్మీయా 2 : 12 (ERVTE)
“ఆకాశములారా, జరిగిన విషయాలకు విస్మయము చెందండి. [QBR2] భయకంపితులుకండి!” [QBR] యెహోవా ఇలా చెప్పాడు. [QBR]
యిర్మీయా 2 : 13 (ERVTE)
“నా ప్రజలు రెండు చెడు కార్యాలు చేశారు: [QBR] వారు జీవజల (ఊటనైన) నన్ను విడిచేసారు [QBR2] పైగా వారు వారివారి తొట్లను తవ్వుకున్నారు. [QBR] (వారు ఇతర దేవుళ్ళవైపు మొగ్గారు.) [QBR2] కాని వారి తొట్లు పగిలి పోయాయి. అవి నీటిని పట్టజాలవు.
యిర్మీయా 2 : 14 (ERVTE)
“ఇశ్రాయేలు ప్రజలు బానిసలైపోయారు? [QBR2] వారు పుట్టుకతో బానిసలుగా తయారైనారా? [QBR2] ఇశ్రాయేలు ప్రజలను ఇతరులు ఎందుకు కొల్లగొడుతున్నారు? [QBR]
యిర్మీయా 2 : 15 (ERVTE)
యువకిశోరాలు (శత్రువులు) ఇశ్రాయేలు రాజ్యంపై గర్జిస్తున్నాయి. [QBR2] సింహాలు కోపంతో గుర్రుమంటున్నాయి. ప్రజలు దేశాన్ని సింహాలు నాశనం చేశాయి. [QBR] ఇశ్రాయేలు నగరాలు తగులబెట్టబడ్డాయి. [QBR2] అవి నిర్మానుష్యమైనాయి. వాటిలో ప్రజలెవ్వరూ లేరు. [QBR]
యిర్మీయా 2 : 16 (ERVTE)
మెమ్‌ఫిస్, తహపనేసు [‡మెమ్‌ఫిస్, తహపనేసు ఇవి రెండూ ఈజిప్టులోని నగరాలు.] వీటినుండి వచ్చిన [QBR2] యోధులు నీ తల చితుకగొట్టారు. [QBR]
యిర్మీయా 2 : 17 (ERVTE)
ఈ కష్టానికంతటికి నీ తప్పులే కారణం! [QBR2] చక్కని మార్గంలో మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తున్న [§చక్కని … నడిపిస్తున్న ఈ పంక్తి గ్రీకు తర్జుమాలో లేదు.] [QBR2] మీ దేవుడైన యెహోవా నుండి మీరు తొలగిపోయారు [QBR]
యిర్మీయా 2 : 18 (ERVTE)
యూదా ప్రజలారా, మీరిది ఆలోచించండి: [QBR2] ఈజిప్టుకు వెళ్లటం వలన ఏమైనా మేలు జరిగిందా? [QBR2] నైలునది (షీహోరు) జలాన్ని తాగినందువల్ల ఏమి మేలు జరిగింది? [QBR2] లేదు. ఏమీ లేదు! అష్షూరుకు వెళ్లుట వలన ఏమి జరిగింది? [QBR2] యూఫ్రటీసు నదీజలాన్ని తాగినందువల్ల ఏమి కలిసివచ్చింది. లేదు. ఏమీలేదు. [QBR]
యిర్మీయా 2 : 19 (ERVTE)
మీరు చెడు పనులు చేశారు. [QBR2] మీ చెడ్డ పనులు మీకు శిక్షను తెస్తాయి. [QBR] మీకు కష్టాలు సంభవిస్తాయి. [QBR2] ఆ ఆపద మీకు తగిన గుణపాఠం నేర్పుతుంది. [QBR] దీనిని గురించి యోచన చేయండి! మీకై మీరు మీ దేవునికి దూరమగుట ఎంతటి ఘోరమైన విషయమో అప్పుడు మీకు అర్థమవుతుంది. [QBR2] నేనంటే భయ భక్తులు లేకపోవుట తగనిపని!” [QBR] ఈ వర్తమానం నా ప్రభువును, సర్వశక్తి మంతుడయిన దేవుని వద్దనుండి వచ్చినది. [QBR]
యిర్మీయా 2 : 20 (ERVTE)
“యూదా, చాలాకాలం క్రితమే నీవు నీకాడిని పారవేసినావు. [QBR2] నాకు దగ్గరగా ఉంచుకొనేందుకు నిన్నులాగి పట్టిన పగ్గాలను తెంచుకున్నావు. [QBR2] ‘నేను నిన్ను సేవించను’ అని నన్ను తిరస్కరించావు. [QBR] నిజంగా నీవు ప్రతి కొండమీద, ప్రతి పచ్చని చెట్టుకింద [QBR2] పండుకొని పచ్చి వేశ్యలా ప్రవర్తించావు. [*ప్రతి పచ్చని … ప్రవర్తించావు గతంలో ఆ ప్రజలు కొండలమీద, పచ్చని చెట్ల కింద పలు అన్యదేవుళ్లను పూజించారని దీనికి గూఢార్థం.] [QBR]
యిర్మీయా 2 : 21 (ERVTE)
యూదా, నిన్నొక మేలు రకం ద్రాక్షపాదువలెనాటాను. [QBR2] మీరంతా మేలురకం విత్తనాల్లా ఉన్నారు. [QBR] కాని నాసిరకం పండ్లనిచ్చే వేరొక రకం ద్రాక్షలతల్లా ఎలా తయారయ్యారు? [QBR]
యిర్మీయా 2 : 22 (ERVTE)
క్షారజలంతో స్నానం చేసుకున్నా, [QBR2] నీవు విస్తరించి సబ్బు వినియోగించినా [QBR2] నేను నీ దోష కళంకాన్ని చూడగలను.” [QBR] ఈ వర్తమానం దేవుడైన యెహోవాది. [QBR]
యిర్మీయా 2 : 23 (ERVTE)
“యూదా, ‘నేను దోషినికానని, బయలు విగ్రహాలను ఆరాధించలేదని’ [QBR2] నీ వెలా నాకు చెప్పగలవు? [QBR] లోయలో నీవు చేసిన పనులు గూర్చి ఒకసారి ఆలోచించుకో. [QBR2] నీవు ఏమిచేశావో గుర్తుకు తెచ్చుకో. [QBR] నీవొక వడిగల ఆడ ఒంటివలె [QBR2] ఒక చోటినుండి మరో చోటికి పరుగెత్తావు. [QBR]
యిర్మీయా 2 : 24 (ERVTE)
ఎడారిలో తిరిగే ఒక అడవి గాడిదలా నీవున్నావు. [QBR2] సంగమ సమయంలో అది గాలిని వాసనచూస్తూ తిరుగుతుంది. [QBR2] మిక్కిలి ఎదగొన్నప్పుడు దానిని ఎవ్వరూ వెనుకకు మరల్చలేరు. [QBR] ఎదకాలంలో దానిని కోరే ప్రతీ మగజంతువూ దానిని పొందగలదు. [QBR2] అప్పుడు దానిని కనుగొనటం తేలిక. [QBR]
యిర్మీయా 2 : 25 (ERVTE)
యూదా, ఇక నీవు విగ్రహాలను అనుసరించటం మానాలి. [QBR2] ఇతర దేవుళ్ల కొరకు దాహాన్ని వదిలి పెట్టు. [QBR] కానీ, ‘లాభం లేదు! నేను వదల్లేను! [QBR2] నేను పరదేవుళ్లనే ప్రేమిస్తాను. [QBR2] నేను వాటినే ఆరాధిస్తాను’ అని నీవంటావు.
యిర్మీయా 2 : 26 (ERVTE)
“ప్రజలు పట్టుకున్నప్పుడు [QBR2] దొంగ సిగ్గుపడతాడు [QBR] అదేరీతిగా ఇశ్రాయేలు ప్రజలు అవమానం పాలవుతారు. [QBR2] ఇశ్రాయేలు రాజులు, ప్రజానాయకులు, యాజకులు, ప్రవక్తలు అందరూ సిగ్గుతో తలవంచుకుంటారు. [QBR]
యిర్మీయా 2 : 27 (ERVTE)
ఈ ప్రజలు కర్రముక్కలతో మాట్లాడతారు! [QBR2] దానితో ‘నీవే నా తండ్రివి’ అంటారు. [QBR] ఈ ప్రజలు ఒక రాతి బండతో మాట్లాడతారు. [QBR2] దానితో, ‘నీవేమాకు జన్మనిచ్చావు’ అంటారు. [QBR] ఆ ప్రజలంతా అవమానం పొందుతారు. [QBR] ఆ ప్రజలు నావైపుకు చూడరు. [QBR2] వారు విముఖులైనాకు వెన్ను చూపుతారు. [QBR] కాని యూదా ప్రజలు కష్టాల పాలైనప్పుడు, [QBR2] ‘వచ్చి, మమ్మును ఆదుకోమని!’ నన్నడుగుతారు. [QBR]
యిర్మీయా 2 : 28 (ERVTE)
ఆ విగ్రహాలనే వచ్చి మిమ్మును ఆదుకోనివ్వండి! మీకైమీరు చేసిన ఆ విగ్రహాలు ఎక్కడ వున్నాయి? [QBR2] మీకష్టకాలంలో ఆ విగ్రహాలు వచ్చి మిమ్మును ఆదుకుంటాయేమో చూద్దాము. [QBR] యూదా ప్రజలారా, మీనగరాలెన్ని వున్నాయో మీ విగ్రహాలు కూడా అన్ని వున్నాయి!
యిర్మీయా 2 : 29 (ERVTE)
“మీరు నాతో ఎందుకు వాదిస్తారు? [QBR2] మీరంతా నాకు వ్యతిరేకులయ్యారు.” [QBR] ఈ వర్తమానం యెహోవానుండి వచ్చినది. [QBR]
యిర్మీయా 2 : 30 (ERVTE)
“యూదా ప్రజలారా, నేను మిమ్మును శిక్షించాను. [QBR2] కాని అది పనిచేయలేదు. [QBR] మిమ్మల్ని శిక్షించినప్పుడు కూడా [QBR2] మీరు వెనక్కి మరలలేదు. [QBR] మీ వద్దకు వచ్చిన ప్రవక్తలను మీరు మీకత్తులతో చంపారు. [QBR] మీరొక భయంకర సింహంలా ప్రవర్తించి వారిని సంహరించారు.” [QBR]
యిర్మీయా 2 : 31 (ERVTE)
ఈ తరం ప్రజలారా, యెహోవా వర్తమానం పట్ల శ్రద్ధవహించండి. “ఇశ్రాయేలు ప్రజలకు నేనొక ఎడారిలా ఉన్నానా? [QBR2] వారికి నేనొక అంధకారంతో నిండిన ప్రమాదకరమైన దేశంలా ఉన్నానా? [QBR] ‘మేము మా యిష్టానుసారంగా నడవటానికి మాకు స్వేచ్ఛ ఉంది. [QBR2] యెహోవా, మేము తిరిగి నీ చెంతకు రాము,’ అని నా ప్రజలు అంటారు. [QBR] కానీ, వారలా ఎందుకు మాట్లాడతారు? [QBR]
యిర్మీయా 2 : 32 (ERVTE)
ఏ కన్యకగాని తన నగలను మర్చిపోతుందా? లేదు. మర్చిపోదు! [QBR2] ఏ పెండ్లి కుమార్తెగాని తన దుస్తులకు ఒడ్డాణం మర్చిపోతుందా? లేదు. మర్చిపోదు! [QBR] కాని నా ప్రజలు లెక్కలేనన్ని సార్లు నన్ను మర్చిపోయారు.
యిర్మీయా 2 : 33 (ERVTE)
“యూదా, ప్రేమికులను (బూటకపు దేవుళ్లను) వెంబడించటం నీకు బాగా తెలుసు. [QBR2] కావున దుష్టకార్యాలు చేయుట నీకై నీవే నేర్చుకున్నావు. [QBR]
యిర్మీయా 2 : 34 (ERVTE)
మీ చేతులు రక్తసిక్తమైనాయి! [†రక్తసిక్తమైనాయి రక్తంతో తదవటం.] [QBR2] అది పేదవాళ్ల, అమాయకుల రక్తం. నిష్కారణముగా నీవు ప్రజలను చంపావు. కనీసం వారు నీవు పట్టుకున్న దొంగలైనా కారు. నీవటువంటి చెడ్డ పనులు చేస్తావు. [QBR]
యిర్మీయా 2 : 35 (ERVTE)
కాని, ‘నేను అమాయకుడను, దేవుడు నా ఎడల కోపంగా లేడు’ [QBR2] అని నీవు చెప్పుకుంటూ ఉంటావు. [QBR] అందువల్ల నీవు అబద్ధం చెప్పిన నేరానికి కూడా నిన్ను దోషిగా నేను న్యాయ నిర్ణయం చేస్తాను, [QBR2] ఎందుకంటే ‘నేనేమీ పాపం చేయలేదు’ అని నీవంటున్నావు. [QBR]
యిర్మీయా 2 : 36 (ERVTE)
నీ మనస్సు మార్చుకోవటం నీకు చాలా సులభమైన పని! [QBR2] అష్షూరు నీకు ఆశాభంగం కలిగించింది. [QBR] అందుచేత అష్షూరును [‡అష్షూరు (అస్సీరియా) పాతనిబంధన కాలంలో చాల ముఖ్యమైన దేశం. ఇశ్రాయేలు రాజుల కాలంలోను, ప్రవక్తల కాలంలోను అష్షూరీయులు ఇశ్రాయేలీయులను జయించి ఏలారు. నీనెవె దీనికి రాజధాని. కాలహు రెండవ రాజధాని.] వదిలి ఈజిప్టుకు వెళ్లి సహాయం అర్ధించినావు. [QBR2] ఈజిప్టు కూడా నీకు ఆశాభంగం కల్గిస్తుంది. [QBR]
యిర్మీయా 2 : 37 (ERVTE)
చివరకు నీవు ఈజిప్టును కూడా వదిలివేస్తావు. [QBR2] అవమానంతో నీవు నెత్తిన చేతులు పెట్టుకుంటావు. నీవు ఆ రాజ్యాలను నమ్మినావు. [QBR] కాని ఆ రాజ్యాల సహకారంతో నీవేమీ సాధించలేవు. [QBR2] ఎందువల్లనంటే యెహోవా ఆ రాజ్యాలను తిరస్కరించాడు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37

BG:

Opacity:

Color:


Size:


Font: