యిర్మీయా 30 : 1 (ERVTE)
{ఆశాజనకమైన వాగ్ధానాలు} [PS] ఈ వర్తమానం యిర్మీయాకు యెహోవా నుండి వచ్చింది.
యిర్మీయా 30 : 2 (ERVTE)
ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇలా చెప్పాడు: “యిర్మీయా, నేను నీతో మాట్లాడిన విషయాలన్నీ ఒక పుస్తక రూపంలో వ్రాయుము. నీవే ఈ పుస్తకాన్ని (పత్రము) రాయాలి.
యిర్మీయా 30 : 3 (ERVTE)
ఎందువల్లనంటే, బందీలుగావున్న ఇశ్రాయేలు, యూదా ప్రజలను నేను తిరిగి తీసుకొనివచ్చే రోజులు వస్తాయి.” ఇది యెహోవా సందేశం: “వారి పూర్వీకులకు నేనిచ్చిన దేశంలో వారిని నేను మరల స్థిరపడేలా చేస్తాను. మళ్లీ నా ప్రజలు ఆ రాజ్యన్ని స్వంతం చేసుకుంటారు!” ఇదే యెహోవా వాక్కు. [PE][PS]
యిర్మీయా 30 : 4 (ERVTE)
యెహోవా సందేశాన్ని ఇశ్రాయేలు, యూదా ప్రజలను గూర్చి చెప్పాడు.
యిర్మీయా 30 : 5 (ERVTE)
యెహోవా చెప్పినది ఇలా ఉంది: “భయంతో ప్రజలు చేసే ఆక్రందన మనం వింటున్నాం! [QBR2] ప్రజలు భీతావహులయ్యారు! వారికి శాంతి లేదు!
యిర్మీయా 30 : 6 (ERVTE)
“ఈ ప్రశ్న అడిగి, దాన్ని గురించి ఆలోచించుము: [QBR2] ఎవడైనా ఒక పురుషుడు బిడ్డను కనగలడా? అసంభవం! [QBR] అయితే ప్రతి బలవంతుడు పురిటి నొప్పులతో బాధపడే స్త్రీ వలే [QBR2] తన కడుపు పట్టుకొనటం నేనెందుకు చూస్తున్నాను? [QBR] ఎందువల్ల ప్రతివాని ముఖం శవంలా తెల్లనై వెలవెలబోతుంది? [QBR2] ఎందుకంటే పురుషులు మిక్కిలి భయపడి ఉన్నారు!
యిర్మీయా 30 : 7 (ERVTE)
“యూకోబుకు ఇది గొప్ప సంకట సమయం. [QBR2] ఇది బహు కష్ట కాలం. [QBR] ఇటువంటి కాలం మరి ఉండబోదు. [QBR2] అయినా యాకోబు సంరక్షింపబడతాడు. [PS]
యిర్మీయా 30 : 8 (ERVTE)
“అప్పుడు నేను ఇశ్రాయేలు, యూదా ప్రజల మెడపై కాడిని విరచి వేస్తాను.” ఇది సర్వశక్తిమంతుడైన యెహోవా నుండి వచ్చిన వర్తమానం: మిమ్మల్ని బంధించిన తాళ్లను తెంచివేస్తాను. విదేశీయులెవ్వరూ మరెన్నడు నా ప్రజలను బానిసలుగా చేసుకోవాలని బలవంతం చేయరు.
యిర్మీయా 30 : 9 (ERVTE)
ఇశ్రాయేలు, యూదా ప్రజలు విదేశాలలో దాస్యం చేయరు. ఎన్నడూ చేయరు! వారి దేవుడైన యెహోవానే వారు సేవిస్తారు. వారి రాజైన దావీదుకు [*రాజైన దావీదు ఈ దావీదు మరో ఇశ్రాయేలు రాజు. ఇతను కూడ దావీదు రాజులా ఖ్యాతి చెందిన వాడు] వారు సేవచేస్తారు. ఆ రాజును నేను వారివద్దకు పంపుతాను.
యిర్మీయా 30 : 10 (ERVTE)
“కావున నా సేవకుడవైన యాకోబూ, నీవు భయపడవద్దు!” [QBR2] ఇదే యెహవా వాక్కు: [QBR] “ఇశ్రాయేలూ, భయపడవద్దు! [QBR2] ఆ సుదూర దేశంనుండి నిన్ను నేను రక్షిస్తాను. [QBR] ఆ దూర దేశంలో మీరు బందీలైవున్నారు. [QBR2] మీ సంతతివారిని ఆ భూమినుండి తిరిగి తీసుకొస్తాను. [QBR] యాకోబుకు తిరిగి శాంతి సమకూరుతుంది. [QBR2] ప్రజలు యాకోబును బాధ పెట్టరు. [QBR] నా ప్రజలను భయపెట్టుటకు ఇక శత్రువులుండరు. [QBR]
యిర్మీయా 30 : 11 (ERVTE)
ఇశ్రాయేలు, యూదా ప్రజలారా, నేను మీతో వున్నాను.!” [QBR] ఇదే యెహోవా వాక్కు. [QBR] “నేను మిమ్మల్ని రక్షిస్తాను. [QBR] నేను మిమ్మల్ని ఆయా దేశాలకు చెదరగొట్టాను. [QBR2] కాని ఆ రాజ్యాలను నేను పూర్తిగా నాశనం చేస్తాను. [QBR] ఇది నిజం. నేనా దేశాలను నాశనం చేస్తాను. [QBR2] కాని నేను మిమ్మల్ని మాత్రం నాశనం చేయను. [QBR] అయితే మీరు చేసిన దుష్కార్యాలకు మీరు తప్పక శిక్షింపబడాలి. [QBR2] నేను మిమ్మల్ని బాగ క్రమశిక్షణలోకి తెస్తాను.”
యిర్మీయా 30 : 12 (ERVTE)
యెహోవా ఇలా అంటున్నాడు: [QBR] “ఓ ఇశ్రాయేలు, యూదా ప్రజలారా, మీకు బాగుకాని గాయం ఉంది. [QBR2] మీకు తగిలిన దెబ్బ నయం కానిది. [QBR]
యిర్మీయా 30 : 13 (ERVTE)
మీ పుండ్లను గురించి శ్రద్ధ తీసికొనే వ్యక్తి లేడు. [QBR2] అందుచేత మీరు స్వస్థపర్చబడరు. [QBR]
యిర్మీయా 30 : 14 (ERVTE)
మీరనేక దేశాలతో స్నేహం కుదుర్చుకున్నారు. [QBR2] అయినా ఆ రాజ్యాలు మిమ్మల్ని గురించి పట్టించుకోవు. [QBR2] మీ స్నేహితులనబడేవారు మిమ్మల్ని మర్చిపోయారు. [QBR] ఒక శత్రువువలె మిమ్మల్ని గాయపర్చాను! [QBR2] మిమ్మల్ని చాలా కఠినంగా శిక్షించాను! [QBR] మీరు చేసిన ఘోరమైన నేరం కారణంగా నేనలా చేశాను. [QBR2] మీరు చేసిన అనేక పాపాల కారణంగా నేనలాచేశాను. [QBR]
యిర్మీయా 30 : 15 (ERVTE)
ఇశ్రాయేలూ, యూదా! మీ గాయం గురించి ఎందుకు రోదిస్తున్నారు. [QBR2] మీ గాయం బాధాకరమైనది. [QBR2] పైగా దానికి చికిత్స లేదు. [QBR] ఘోరమైన మీ అపరాధం కారణంగా, యెహోవానైన నేను మీకవన్నీ కలుగజేశాను. [QBR2] మీరు చేసిన అనేక పాపాల కారణంగా నేను మీకు ఈ కష్టాలు కలుగజేశాను. [QBR]
యిర్మీయా 30 : 16 (ERVTE)
ఆ రాజ్యాలవారు మిమ్మల్ని నాశనం చేశారు. [QBR2] కాని ఇప్పుడా రాజ్యాలే నాశనం చేయబడతాయి. [QBR] ఇశ్రాయేలూ, యూదా! మీ శత్రువులే బందీలవుతారు! [QBR] ఆ ప్రజలు మీ ఆస్తిపాస్తులు పొందియున్నాను. [QBR2] కాని ఇతర ప్రజలు వారి ఆస్తిపాస్తులు దోచుకుంటారు. [QBR] ఆ ప్రజలు యుద్ధంలో మీ వస్తువులను తీసుకున్నారు. [QBR2] అలాగే యితరులు యుద్ధంలో వారి వాస్తువులు తీసుకుంటారు. [QBR]
యిర్మీయా 30 : 17 (ERVTE)
అయినా నేను మీకు మరల ఆరోగ్యం చేకూర్చుతాను. [QBR2] మీ గాయాలన్నీ మాన్పుతాను.” ఇదే యెహవా వాక్కు, [QBR] “ఎందవల్లననగా అన్యులు మిమ్మల్ని వెలివేసి భ్రష్టులన్నారు. [QBR2] ‘సీయోనును ఎవ్వరూ లెక్కచేయరు’ అని వారన్నారు!”
యిర్మీయా 30 : 18 (ERVTE)
యెహవా ఇలా చెప్పుచున్నాడు: [QBR] “యూకోబు సంతానం ఇప్పుడు బందీలైయున్నారు. [QBR2] కాని వారు తిరిగివస్తారు. [QBR2] యాకోబు నివాసులపై నేను కనికరం కలిగివుంటాను. [QBR] నగరమంతా [†నగరము నగరమనగా యెరూషలేము కావచ్చును. కాని ఇశ్రాయేలు యూదాలోని నగరాలన్నీ అని కూడా అర్థం కావచ్చు.] కూలిపోయిన భవనాలతో [QBR2] కప్పబడిన కొండలా ఉంది. [QBR2] కాని నగరం మళ్లీ నిర్మింపబడుతుంది. [QBR] రాజభవనం కూడా దాని యథాస్థానంలో తిరిగి నిర్మింపబడుతుంది. [QBR]
యిర్మీయా 30 : 19 (ERVTE)
ఆ ప్రదేశాలలో ప్రజలు స్తుతిగీతాలు ఆలపిస్తారు. [QBR2] ఉల్లాసమైన నవ్వుల కిలకిలలు వినిపిస్తాయి. [QBR] వారి సంతానం అభివృద్ధి అయ్యేలా చేస్తాను. [QBR2] ఇశ్రాయేలు, యూదా అల్ప రాజ్యాలుగా ఉండవు. [QBR] వాటికి కీర్తి ప్రతిష్ఠలు కలుగజేస్తాను. [QBR2] ఎవ్వరూ వారిని చిన్నచూపు చూడరు. [QBR]
యిర్మీయా 30 : 20 (ERVTE)
యాకోబు వంశం తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. [QBR] ఇశ్రాయేలు. యూదా ప్రజలను నేను శక్తివంతులుగా చేస్తాను. [QBR2] అంతేగాదు; వారిని హింసించేవారిని నేను శిక్షిస్తాను. [QBR]
యిర్మీయా 30 : 21 (ERVTE)
వారి స్వజనులలో ఒకడు వారిని నాయకత్వం వహిస్తాడు. [QBR2] ఆ పాలకుడు నా ప్రజలలోనుండే వస్తాడు. [QBR] నేను పిలిస్తేనే ప్రజలు నావద్దకు రాగలరు. [QBR] అందుచేత ఆ నాయకుని వావద్దకు పిలుస్తాను. [QBR2] అతడు నాకు సన్నిహితుడవుతాడు. [QBR]
యిర్మీయా 30 : 22 (ERVTE)
మీరు నా ప్రజలై ఉంటారు. [QBR2] నేను మీ దేవుడనై ఉంటాను.”
యిర్మీయా 30 : 23 (ERVTE)
యెహోవా మిక్కిలి కోపంగా ఉన్నాడు! [QBR2] ఆయన ప్రజలను శిక్షించినాడు. [QBR] ఆ శిక్ష తుఫానులా వచ్చిపడింది. [QBR2] ఆ శిక్ష దుష్టులపైకి పెనుతుఫానులా వచ్చి పడింది. [QBR]
యిర్మీయా 30 : 24 (ERVTE)
తన పథకం ప్రకారం అన్నీ జరిగేవరకు [QBR2] యెహోవా కోపోద్రిక్తుడై ఉంటాడు. [QBR] ఆ రోజు సంభవించినప్పుడు (అంత్య దినాల్లో) [QBR2] మీరు అర్థం చేసుకుంటారు. [PE]
❮
❯