యిర్మీయా 47 : 1 (ERVTE)
{ఫిలిప్తీయుల గురించిన సందేశం} [PS] ప్రవక్తయైన యిర్మీయాకు యెహోవా నుండి ఈ సందేశం వచ్చింది. ఆ వర్తమానం ఫిలిష్తీయులను గురించినది. గాజా నగరంపై ఫరో దాడి చేయటానికి ముందుగా ఈ వర్తమానం వచ్చింది.
యిర్మీయా 47 : 2 (ERVTE)
యెహోవా ఇలా చెపుతున్నాడు, [QBR] “చూడు, శత్రుసైనికులు ఉత్తరాన సమకూడుతున్నారు. [QBR2] శరవేగంతో పొంగి ప్రవహించే నదిలా వారు వస్తారు. [QBR] దేశాన్నంతా ఒక మహా వెల్లువలా వారు ఆవరిస్తారు. [QBR2] వారు అన్ని పట్టణాలను, వాటి ప్రజలను చుట్టుముడతారు. దేశంలో ప్రతి పౌరుడూ సహాయంకొరకు ఆక్రందిస్తాడు. [QBR]
యిర్మీయా 47 : 3 (ERVTE)
పరుగెత్తే గుర్రపు డెక్కల చప్పుడు వారు వింటారు. [QBR2] రథాల చప్పుడు వారు వింటారు. కదిలే చక్రాల రణగొణ ధ్వని వారు వింటారు. [QBR] తండ్రులు తమ పిల్లలను రక్షణ కల్పించలేరు. [QBR2] ఆ తండ్రులు సహాయం చేయలేనంత బలహీనులవుతారు. [QBR]
యిర్మీయా 47 : 4 (ERVTE)
ఫిలిష్తీయులనందరినీ యెహోవా [QBR2] త్వరలో నాశనం చేస్తాడు! [QBR] తూరు, సీదోనులకు సహాయపడే మిగిలిన [QBR2] వారందరినీ నాశనం చేస్తాడు. [QBR] ఫిలిష్తీయులను యెహోవా అతి త్వరలో నాశనం చేస్తాడు. [QBR2] క్రేతు [*క్రేతు “కఫోరు” ద్వీపమని దీని శబ్దార్థం. దీన్ని కొన్ని సార్లు క్రేతు అని, మరికొన్ని సార్లు కుప్ర అని అనటం కద్దు. బైబిలు ప్రకారం ఫిలిష్తీయులు ప్రథమంగా కఫ్తోరునుండి వచ్చారు.] ద్వీపవాసులలో మిగిలిన వారందరినీ ఆయన నాశనం చేస్తాడు. [QBR]
యిర్మీయా 47 : 5 (ERVTE)
గాజా ప్రజలు ధుఃఖంతో తమ తలలు గొరిగించుకుంటారు. [QBR] ఆష్కెలోను ప్రజల నోరు నొక్కబడుతుంది. [QBR2] లోయలో మిగిలిన ప్రజలారా, ఎంతకాలం మిమ్మల్ని మీరు గాయపర్చుకుంటారు? [†ఎంతకాలం … గాయపర్చుకుంటారు తమ విచారాన్ని సూచించేందుకు ప్రజలు తమ శరీరాలను చీరుకొని గాయపర్చుకునేవారు.]
యిర్మీయా 47 : 6 (ERVTE)
“ఓ యెహోవా ఖడ్గమా, నీవు ఎంతకాలము పోరాడెదవు. [QBR2] నీ ఒరలోనికి నీవు వెళ్లుము! [QBR] ఆగిపో! శాంతించు, అని మీరంటారు. [QBR]
యిర్మీయా 47 : 7 (ERVTE)
కాని యెహోవా ఖడ్గం ఏ విధంగావిశ్రాంతి తీసికుంటుంది? [QBR2] యెహోవా దానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. [QBR] అష్కెలోను నగరాన్ని, సముద్ర తీరాన్ని [QBR2] ఎదుర్కొనమని యెహోవా దానికి ఆజ్ఞ ఇచ్చాడు.” [PE]

1 2 3 4 5 6 7

BG:

Opacity:

Color:


Size:


Font: