యిర్మీయా 48 : 1 (ERVTE)
మోయాబును గురించిన వర్తమానం ఈ వర్తమానం మోయాబు దేశాన్ని గురించినది. ఇశ్రాయేలు దేవుడు, సర్వ శక్తిమంతుడు అయిన యోహవా ఇలా చెపుతున్నాడు, “నెబో పర్వతానికి [*నెబో పర్వతం ఇశ్రాయేలుకు తూర్పునవున్న మోయాబు దేశంలో ఒక పర్వతం.] చేటు కులుగుతుంది. [QBR2] నెబో పర్వతం నాశనమవుతుంది. [QBR] కిర్యతాయిము పట్టణం అణగ దొక్కబడుతుంది. [QBR2] అది పట్టుబడుతుంది. [QBR] బలమైన దుర్గం అణగ దొక్కబడుతుంది. [QBR2] అది పడగొట్టబడి చిందర వందర చేయబడుతుంది. [QBR]
యిర్మీయా 48 : 2 (ERVTE)
మోయాబు మరెన్నడూ ప్రశంసించబడడు. [QBR2] మోయాబును ఓడించటానికి హెష్బోను పట్టణవాసులు కుట్రపన్నుతారు. [QBR2] ‘రండి. మనమా దేశాన్ని రూపుమాపుదాము’ అని వారంటారు. [QBR] మద్మేనా, నీవు కూడ మాట్లాడకుండా చేయబడతావు. [QBR2] కత్తి నిన్ను వెంటాడుతుంది. [QBR]
యిర్మీయా 48 : 3 (ERVTE)
హొరొనయీము నుండి వచ్చే ఆక్రందనలువిను. [QBR2] అవి కలవరపాటుకు, వినాశనానికి సంబంధించిన కేకలు. [QBR]
యిర్మీయా 48 : 4 (ERVTE)
మోయాబు ధ్వంసం చేయబడుతుంది. [QBR2] దాని చిన్న పిల్లలు సహాయం కొరకు విలపిస్తారు. [QBR]
యిర్మీయా 48 : 5 (ERVTE)
మోయాబు ప్రజలు లూహీతు మార్గంలో వెళ్తున్నారు. [QBR2] వారు మార్గమధ్యంలో మిక్కిలిగా విలపిస్తున్నారు. [QBR] హొరొనయీము పట్టణ మార్గంలో ప్రయాసతోను, [QBR2] బాధతోను కూడిన రోదన వినిపించగలదు. [QBR]
యిర్మీయా 48 : 6 (ERVTE)
పారిపొండి! మీ ప్రాణరక్షణకై పారిపొండి! [QBR2] ఎడారిలో అరుహ వృక్షం [†అరుహ వృక్షం ఇది ఒకరకం చెట్టు. మోయాబు దేశంలో ఒక నగరం పేరువలె ఇది ఉచ్చరింపబడుతుంది. ఇది ద్వంద్యార్థంగా వాడబడిన పదం.] వీచినట్లు మీరు పారిపొండి.
యిర్మీయా 48 : 7 (ERVTE)
“మీరు చేసిన వస్తువులలోను, మీ భాగ్యంలోనే మీరు విశ్వసిస్తారు. [QBR2] కావున మీరు పట్టుబడతారు. [QBR] కెమోషు [‡కెమోషు కెమోషు మోయాబీయుల దైవం. ఆమ్మోనీయులు కూడా దీనిని ఆరాధించారు. ఈ దేవతారాధన రాజైన సొలొమోను ద్వారా యెరూషలేములోనికి వచ్చింది. కాని యోషీయా దానిని నిర్మూలించాడు.] దైవం బందీగా కొనిపోబడతాడు. [QBR2] అతనితో పాటు అతని యాజకులు, అధికారులు కూడ తీసికొని పోబడతారు. [QBR]
యిర్మీయా 48 : 8 (ERVTE)
వినాశనకారుడు ప్రతి పట్టణం మీదికి వస్తాడు. [QBR2] ఒక్క పట్టణం కూడ తప్పించుకోలేదు. [QBR] లోయశిథిలము చేయబడుతుంది. [QBR2] ఉన్నత మైదానం నాశనము చేయబడుతుంది. [QBR] యెహోవా ఇది జరుగుతుందని చెప్పినాడుగాన [QBR2] ఇది జరిగి తీరుతుంది. [QBR]
యిర్మీయా 48 : 9 (ERVTE)
మోయాబు పొలాలపైన ఉప్పు [§ఉప్పు ఇది కూడ ద్వంద్యార్థంగా వాడబడిన పదమే. హెబ్రీలో దీని సరియైన అర్థం మనకు తెలియదు.] చల్లుము. [QBR2] దేశంవట్టి ఎడారి అయిపోతుంది. [QBR] మోయాబు పట్టణాలు ఖాళీ అవుతాయి. [QBR] వాటిలో ఎవ్వరూ నివసించరు. [QBR]
యిర్మీయా 48 : 10 (ERVTE)
ఎవ్వరేగాని యెహోవా చెప్పినట్లు చేయకపోయినా, [QBR2] వారిని చంపటానికి తన కత్తిని వినియోగించకపోయినా, ఆ వ్యక్తికి కీడు మూడుతుంది. [*ఎవ్వరేగాని … మూడుతుంది మోయాబీయులను చంపమని యోహోవా చేత ఆజ్ఞాపించబడిన మోయాబీయుల శత్రువుల గురించి ప్రవక్త మాట్లాడు తున్నాడు.]
యిర్మీయా 48 : 11 (ERVTE)
“మోయాబు ఇప్పటి వరకు ఆపద ఎరుగదు. [QBR2] కుదురుకోడానికి నిలకడగా పెట్టిన ద్రాక్షరసంవలె మోయాబు ఉంది. [QBR] మోయాబు ఇంతవరకు ఒక జాడీనుండి మరొక దానిలోకి పోయబడలేదు అది. [QBR2] నిర్బంధించబడి ఇతర దేశానికి కొని పోబడలేదు. [QBR] పూర్వంవలెనే అది ఇప్పుడూ రుచిగానే వున్నాడు. [QBR2] అతని సువాసన మారలేదు.” [QBR]
యిర్మీయా 48 : 12 (ERVTE)
యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు. [QBR] “కాని మిమ్మల్ని మీ జాడీలలో [†జాడీలు బహుశాః దీని అర్థం మోయాబులోని పట్టణాలు కావచ్చు.] నుంచి బయట పోయుటకు [QBR2] అతి త్వరలోనే నేను మనుష్యులను పంపుతాను. [QBR] ఆ మనుష్యులు మోయాబు యొక్క జాడీలను ఖాళీ చేస్తారు. [QBR2] తరువాత ఆ జాడీలను వారు పగులగొడతారు.” [PS]
యిర్మీయా 48 : 13 (ERVTE)
పిమ్మట మోయాబు ప్రజలు తమ బూటకపు దైవం కెమోషు పట్ల సిగ్గు చెందుతారు. ఇశ్రాయేలు ప్రజలు బేతేలు [‡బేతేలు బేతేలు పట్టణమందు రాజైన యరొబాము నిర్మించిన గుడి అని దీని అర్థం. (చూడండి: రాజుల మొదటి గ్రంథం 12:28-33). అక్కడి ప్రజలు దేవునినింకా వక్రమార్గంలో పూజిస్తున్నారా అనేది స్పష్టంగా తెలియదు. లేదా కనానీయుల బూటకపు దేవత ఏల్ లేక బయలును పూజిస్తున్నదీ తెలియదు.] నందు ఆ బూటకపు దైవాన్ని నమ్మారు. కాని ఆ బూటకపు దైవం వారికి సహాయం చేయనప్పుడు ఇశ్రాయేలీయులు చాలా కలతచెందారు. మోయాబు కూడా అలా అవుతాడు.
యిర్మీయా 48 : 14 (ERVTE)
“ ‘మేము మంచి సైనికులం. మేము యుద్ధవీరులం’ [QBR2] అని మీరు చెప్పుకోలేరు. [QBR]
యిర్మీయా 48 : 15 (ERVTE)
శత్రువు మోయాబును ఎదుర్కొంటాడు. [QBR2] శత్రువు ఆ పట్టణాలలో చొరబడి నాశనం చేస్తాడు. [QBR] మోయాబు యువ వీరులంతా నరకబడతారు.” [QBR2] ఈ వర్తమానం రాజునుండి వచ్చినది. [QBR2] ఆ రాజు పేరు సర్వశక్తిమంతుడైన యెహోవా. [QBR]
యిర్మీయా 48 : 16 (ERVTE)
“మోయాబు అంతం దగ్గర పడింది. [QBR2] మోయాబు త్వరలో నాశనమైపోతుంది. [QBR]
యిర్మీయా 48 : 17 (ERVTE)
మోయాబు చుట్టుపట్ల నివసించు ప్రజలారా ఆ దేశంకొరకు విలపించండి. [QBR2] మోయాబు ఎంత ప్రసిద్ధి గాంచినవాడో మీకు తెలుసు. [QBR] అందువల్ల వానికొరకు మీరు విచారించండి. [QBR2] ‘అధిపతుల అధికారం విరిగిపోయింది. [QBR] మోయాబు కీర్తి ప్రతిష్ఠలు పోయాయి’ [QBR2] అని మీరు చెప్పండి.
యిర్మీయా 48 : 18 (ERVTE)
“దీబోను వాసులారా [QBR2] గొప్పవైన మీ స్థానాలనుండి దిగిరండి. [QBR] నేలమీద మట్టిలో కూర్చోండి. [QBR2] ఎందువల్లనంటే, మోయాబును నాశనం చేసిన శత్రువు వస్తున్నాడు. [QBR] అతడు మీ బలమైన నగరాలను నాశనం చేస్తాడు.
యిర్మీయా 48 : 19 (ERVTE)
“అరోయేరు నివాసులారా, [QBR2] దారి పక్కన నిలబడి కనిపెట్టుకొని ఉండండి. [QBR] పారిపోయే మనిషిని చూడండి. [QBR2] పారిపోయే స్త్రీని చూడండి. [QBR2] ఏమి జరిగినందో వారిని అడగండి.
యిర్మీయా 48 : 20 (ERVTE)
“మోయాబు పాడుపడి, [QBR2] అవమానముతో నిండి పోతుంది. [QBR] మోయాబు ఏకరీతిగా విలపిస్తుంది. [QBR2] మోయాబు పాడుపడిపోయిందని అర్నోను నది [§అర్నోను నది మోయాబులో అర్నోను ఒక ముఖ్యమైన నది.] వద్ద ప్రకటించండి. [QBR]
యిర్మీయా 48 : 21 (ERVTE)
ఉన్నత మైదానంలోని ప్రజలు శిక్షింపబడ్డారు. [QBR2] తీర్పు హోలోనుకు వచ్చింది. యాహసు, మేఫాతు, [QBR]
యిర్మీయా 48 : 22 (ERVTE)
దీబోను, నెబో, బేత్‌ దిబ్లాతయీము, [QBR]
యిర్మీయా 48 : 23 (ERVTE)
కిర్యతాయిము, బేత్గామూలు, బేత్మెయోను, [QBR]
యిర్మీయా 48 : 24 (ERVTE)
కెరీయోతు మరియు బొస్రా పట్టణాలకు తీర్పు ఇవ్వబడింది. [QBR2] మోయాబుకు సమీపాన, దూరాన వున్న పట్టణాలన్నిటికి శిక్ష విధించబడింది. [QBR]
యిర్మీయా 48 : 25 (ERVTE)
మోయాబు బలం తగ్గిపోయింది. [QBR2] మోయాబు చేయి విరిగిపోయింది.” [QBR] ఈ విషయాలు యెహోవా చెప్పాడు.
యిర్మీయా 48 : 26 (ERVTE)
“యెహోవా కంటె తానే ముఖ్యమైనట్లు మోయాబు భావించటం జరిగింది. [QBR2] కావున, తాగినవాని మాదిరి తూలిపోయే వరకు మోయాబును శిక్షించండి. [QBR2] మోయాబు తాను కక్కిన పదార్థంలోపడి దొర్లుతాడు. [QBR] ప్రజలు మోయాబును చూచి హేళన చేస్తారు.
యిర్మీయా 48 : 27 (ERVTE)
“మోయాబూ, నీవు ఇశ్రాయేలును చూచి హేళన చేశావు. [QBR2] ఇశ్రాయేలు ఒక దొంగల గుంపు చేతికి చిక్కింది. [QBR] నీవు ఇశ్రాయేలును గురించి మాట్లాడిన ప్రతిసారీ నీవు తలపంకించి, [QBR2] ఇశ్రాయేలు కంటె నీవే మెరుగైనట్లు ప్రవర్తించావు. [QBR]
యిర్మీయా 48 : 28 (ERVTE)
మోయాబు ప్రజలారా, [QBR2] మీ పట్టణాలను వదిలిపెట్టండి. [QBR] వెళ్లి గుట్టల్లో నివసించండి. [QBR2] గుహద్వారంలో గూడు చేసికొనే గువ్వల్లా ఉండండి.”
యిర్మీయా 48 : 29 (ERVTE)
“మోయాబు గర్వాన్ని గురించి విన్నాము. [QBR2] అతడు మిక్కిలి గర్విష్ఠి. [QBR] తాను చాలా ముఖ్యమైన వానిలా అతడు తలంచినాడు. [QBR2] అతడు ఎల్లప్పుడూ గొప్పలు చెప్పుకొనేవాడు. [QBR2] అతడు మహా గర్విష్ఠి.”
యిర్మీయా 48 : 30 (ERVTE)
యోహోవా ఇలా చెపుతున్నాడు, “మోయాబు ఏ కారణమూ లేకుండానే కోపం తెచ్చుకొంటాడు, స్వంత గొప్పలు చెప్పుకుంటాడని నాకు తెలుసు. [QBR2] కాని అతని గొప్పలన్నీ అబద్ధాలు. [QBR2] అతను చెప్పేవి చేయలేడు. [QBR]
యిర్మీయా 48 : 31 (ERVTE)
కావున, మోయాబు కొరకు నేను ఏడుస్తున్నాను. [QBR2] మోయాబులో ప్రతి పౌరుని కొరకు విచారిస్తున్నాను. [QBR2] కీర్హరెశు మనుష్యుల నిమిత్తం నేను బాధపడుతున్నాను. [QBR]
యిర్మీయా 48 : 32 (ERVTE)
యాజెరు ప్రజలతో కలిసి నేను కూడ యాజెరు కొరకై దుఃఖిస్తున్నాను! [QBR2] సిబ్మా, గతంలో నీ ద్రాక్షలతలు సముద్ర తీరం వరకు వ్యాపించాయి. [QBR] అవి యాజెరు పట్టణం వరకు వ్యాపించాయి. [QBR2] కాని వినాశనకారుడు నీ పంటను, ద్రాక్ష పండ్లను తీసికొన్నాడు. [QBR]
యిర్మీయా 48 : 33 (ERVTE)
మోయాబులో గల విశాలమైన ద్రాక్ష తోటలనుండి సుఖసంతోషాలు మాయమైనాయి. [QBR2] గానుగల నుండి ద్రాక్షరసం కారకుండా ఆపాను. [QBR] రసం తీయటానికి ద్రాక్షకాయలను తొక్కే వారిలో ఆ పాటలు ఆగిపోయాయి [QBR2] వారి అలరింతలు అంతమయ్యాయి. [PS]
యిర్మీయా 48 : 34 (ERVTE)
“హెష్బోను మరియు ఎలాలే పట్టణవాసులు కేకలు పెడుతున్నారు. వారి రోదన దూరానగల యాహసు పట్టణం వరకు వినిపిస్తూ ఉంది. వారి కేక సోయారు నుండి దూరానగల హొరొనయీము, ఎగ్లాత్షాలిషా వరకు వినవచ్చింది. నిమ్రీములో నీరు సహితం ఇంకిపోయింది.
యిర్మీయా 48 : 35 (ERVTE)
మోయాబు ఉన్నత స్థలాలలో దహన బలులు అర్పించటాన్ని నిలుపు చేస్తాను. వారు తమ దేవతలకు ధూపం వేయకుండా ఆపివేస్తాను.” ఇవి యెహోవా చెప్పిన విషయాలు. [PE][PS]
యిర్మీయా 48 : 36 (ERVTE)
“మోయాబు కొరకు నేను మిక్కిలి భిన్నుడనైయున్నాను. వేణువుపై విషాద గీతం ఆలపించినట్లు నా హృదయం విలపిస్తున్నది. కీర్హరెశు ప్రజల విషయంలో కూడా నేను విచారిస్తున్నాను. వారి ధన ధాన్యాలన్నీ తీసికొని పోబడ్డాయి.
యిర్మీయా 48 : 37 (ERVTE)
ప్రతివాని తల గొరగబడింది. ప్రతివాని గడ్డం తీసివేయబడింది. గాయ పర్చబడటంతో ప్రతివాని చేతుల నుండి రక్తం కారుతున్నాయి. [*ప్రతివాని … కారుతున్నాయి చనిపోయిన వారిపట్ల తమ దుఃఖం ప్రకటించటానికి ప్రజలివన్నీ చేస్తారు.] ప్రతివాడూ తన మొలచుట్టూ విషాద సూచక బట్ట కట్టుకున్నాడు.
యిర్మీయా 48 : 38 (ERVTE)
మోయాబులో ప్రతి చోట చనిపోయిన వారికోసం ప్రజలు దుఃఖిస్తున్నారు. వారు ప్రతి ఇంటిపైనా, జన సమ్మర్ద ప్రదేశాలలోనూ అలా విలపించారు. ఒక ఖాళీ జాడీని పగులగొట్టిన విధంగా నేను మోయాబును విచ్ఛిన్నం చేయటంతో విషాదం అలుముకున్నది.” యెహోవా ఈ మాటలు చెప్పాడు. [PE][PS]
యిర్మీయా 48 : 39 (ERVTE)
“మోయాబు విచ్ఛిన్న మవటంలో ప్రజలు ఏడుస్తున్నారు. మోయాబు లొంగిపోయాడు. మోయాబుకు తలవంపులయ్యాయి. మోయాబును చూచి ప్రజలు ఎగతాళి చేస్తారు. కాని అక్కడ జరిగిన విషయాలవల్ల ప్రజలు భయంతో నిండిపోతారు.”
యిర్మీయా 48 : 40 (ERVTE)
యెహోవా ఇలా చెపుతున్నాడు, “చూడండి! ఆకాశం నుండి పక్షిరాజు (శత్రువు) దిగుతున్నాడు. [QBR2] అతను తన రెక్కలను మోయాబు మీదికి చాపుతున్నాడు. [QBR]
యిర్మీయా 48 : 41 (ERVTE)
మోయాబు పట్టణాలు పట్టుబడతాయి. [QBR2] బలమైన దుర్గాలు ఓడింపబడతాయి. [QBR] ఆ సమయంలో మోయాబు సైనికులు [QBR2] ప్రసవించే స్త్రీలా భయాందోళనలు చెందుతారు. [QBR]
యిర్మీయా 48 : 42 (ERVTE)
మోయాబు రాజ్యం నాశనం చేయబడుతుంది. [QBR2] ఎందువల్లనంటే వారు యెహోవా కంటె తమను ముఖ్యమైన వారిగా తలంచారు.”
యిర్మీయా 48 : 43 (ERVTE)
యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, [QBR2] “మోయాబు ప్రజలారా, మీ కొరకై భయం లోతైన గోతులు, ఉరులు [†మీ కొరకై … ఉరులు హెబ్రీలో ఇవి ద్వంద్యార్థంగా వాడబడ్డాయి. పహాద్, పహాత్ అనునవి హెబ్రీ మాటలు.] పొంచివున్నాయి. [QBR]
యిర్మీయా 48 : 44 (ERVTE)
ప్రజలు భయపడి పారిపోతారు. [QBR2] పరుగెత్తి లోతు గోతులల్లో పడిపోతారు. [QBR] ఎవడైనా ఆ లోతు గోతుల నుండి పైకివస్తే [QBR2] అతడు ఉరిలో చిక్కుకుంటాడు. [QBR] మోయాబుకు శిక్షా సంవత్సరాన్ని తీసికొనివస్తాను.” [QBR2] ఈ విషయాలన్నీ యెహోవా చెప్పాడు.
యిర్మీయా 48 : 45 (ERVTE)
“బలవంతుడైన శత్రువునుండి జనం పారిపోయారు. [QBR2] వారు రక్షణకై హెష్బోను పట్టణానికి పారిపోయారు. [QBR] అయినా అక్కడ రక్షణ దొరకలేదు. [QBR2] హెష్బోనులో అగ్ని ప్రజ్వరిల్లింది. [QBR] సీహోను పట్టణంలో [‡సీహోను పట్టణం హెష్బోనుకే సీహోనుని అని ఆలంకారికంగా పేరు పెట్టి పిలిచారు. చూడండి సంఖ్యా కాండము 21:25-30.] నిప్పు చెలరేగింది. [QBR2] అది మోయాబు నాయకులను దహించివేస్తున్నది. అది గర్విష్ఠులను కాల్చివేస్తున్నది. [QBR]
యిర్మీయా 48 : 46 (ERVTE)
మోయాబూ, నీకు చెడు దాపురించింది. [QBR2] కెమోషు ప్రజలు నాశనం చేయబడుతున్నారు. [QBR] నీ కుమారులు, కుమార్తెలు చెరపట్టబడి [QBR2] బందీలుగా కొనిపోబడుతున్నారు. [PS]
యిర్మీయా 48 : 47 (ERVTE)
“మోయాబు ప్రజలు బందీలుగా కొనిపోబడతారు. కాని రాబోయే కాలంలో మోయాబీయులను నేను వెనుకకు తీసికొని వస్తాను.” ఇది యెహోవా సందేశం. [PE][PS] ఇంతటితో మోయాబీయులపై తీర్పు సమాప్తం. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47

BG:

Opacity:

Color:


Size:


Font: