యిర్మీయా 5 : 1 (ERVTE)
{యూదా వారి దౌష్ట్యం} [PS] “యెరూషలేము నగర వీధులలో తిరుగుతూ చుట్టు పక్కల పరిశీలిస్తూ ఈ విషయాలపై ఆలోచించు. నగర కూడలి స్థలాలలో వెడకి ఏ ఒక్కడైనా మంచి వ్యక్తి కనిపిస్తాడేమో చూడు. నీతిగా వ్యవహరించే ఏ ఒక్కడు గాని, సత్యాన్వేషిగాని ఉన్నాడేమో చూడు. ఏ ఒక్క మంచి వ్యక్తిని చూడ గలిగినా, నేను యెరూషలేమును క్షమిస్తాను!
యిర్మీయా 5 : 2 (ERVTE)
ప్రజలు ప్రమాణాలు చేస్తూ ‘నిత్యుడైన యెహోవాతోడు’ అంటారు. కాని అది పేరుకు మాత్రం. వారు చెప్పింది చేయరు.”
యిర్మీయా 5 : 3 (ERVTE)
యెహోవా, నీవు ప్రజలలో నమ్మకస్థులకై [QBR2] చూస్తున్నావని నాకు తెలుసు. [QBR] యూదా వారిని నీవు కొట్టావు. [QBR2] అయినా వారికి నొప్పి కలుగలేదు. [QBR] వారిని నాశనం చేశావు, [QBR2] అయినా వారొక గుణపాఠం నేర్చుకోటానికి తిరస్కరించారు. [QBR] వారు మొండి వైఖరి దాల్చారు. [QBR2] వారి దుష్కార్యాలకు వారు చింతించ నిరాకరించారు.
యిర్మీయా 5 : 4 (ERVTE)
కాని నేను (యిర్మీయా) ఇలా అనుకున్నాను: [QBR] “కేవలం పేద మరియు సామాన్యా వర్గాల వారే అలా మూర్ఖులైవుండాలి. [QBR2] వారే యెహోవా మార్గాన్ని అనుసరించటం నేర్చుకోలేదు. [QBR2] పేదలు వారి దేవుని బోధనలు తెలుసుకోలేదు. [QBR]
యిర్మీయా 5 : 5 (ERVTE)
కావున యూదా ప్రజల నాయకుల వద్దకు నేను వెళతాను. [QBR2] నేను వారితో మాట్లాడతాను. [QBR] నాయకులు తప్పక యెహోవా మార్గాన్ని మరియు ఉపదేశాలను అర్థం చేసికుంటారు. [QBR2] వారి దేవుని న్యాయమార్గం వారికి తెలుస్తుందనే నమ్మిక నాకు ఉంది!” [QBR] కాని నాయకులంతా యెహోవా సేవను [QBR2] నిరాకరించే నిమిత్తం ఏకమైనారు. [*కాని … ఏకమైనారు అక్షరార్థంగా వారు కాడి విరిచి, బంధాలను తెంచుకున్నారు.] [QBR]
యిర్మీయా 5 : 6 (ERVTE)
వారు దేవునికి వ్యతిరేకులైనారు. [QBR] అందువల్ల అరణ్యంలోనుండి ఒక సింహం వారిని ఎదిరిస్తుంది. [QBR2] ఎడారిలో నుండి ఒక తోడేలు వచ్చి వారిని చంపుతుంది. [QBR] వారి నగరాల దాపున ఒక చిరుత పులిపొంచి ఉంది. [QBR2] నగరంలో నుంచి ఎవడు బయటికి వచ్చినా చిరుత పులి చీల్చి చెండాడుతుంది. [QBR] యూదా ప్రజలు మరల మరల చేసిన పాపాల ఫలితంగా ఇదంతా జరుగుతుంది. [QBR2] అనేక పర్యాయములు వారు యెహోవాకు దూరమైనారు.
యిర్మీయా 5 : 7 (ERVTE)
దేవుడిలా అన్నాడు: “యూదా, నేను నిన్నెందుకు క్షమించాలో ఒక కారణం చూపించు. [QBR2] నీ పిల్లలు నన్ను త్యజించారు. [QBR2] దేవుళ్లే కానటువంటి వ్యర్థమైన విగ్రహాలకు వారు ప్రమాణాలు చేశారు. [QBR] నీ సంతానానికి కావలసిన ప్రతీది నేను యిచ్చి వున్నాను. [QBR2] అయినా వారింకా నా పట్ల విశ్వాసఘాతకులై ఉన్నారు! [QBR2] వారెక్కువ కాలం వ్యభిచార గృహాలలోనే గడిపారు [QBR]
యిర్మీయా 5 : 8 (ERVTE)
వారు తినటానికి సమృద్ధిగా ఉండి, సంభోగించటానికి సిద్ధంగా ఉన్న గుర్రాలవలె ఉన్నారు. [QBR2] పొరుగువాని భార్య కోసం మదించి సకిలిస్తున్న గుర్రంలా వున్నారు. [QBR]
యిర్మీయా 5 : 9 (ERVTE)
ఈ పనులన్నీ చేసినందుకు యూదా ప్రజలను నేను శిక్షించవద్దా?” [QBR] ఇదే యెహోవా వాక్కు. [QBR] “అవును! ఇటువంటి దేశాన్ని నేను శిక్షించాలిగదా. [QBR2] వారికి తగిన శిక్ష విధించాలి.
యిర్మీయా 5 : 10 (ERVTE)
“యూదా వారి ద్రాక్షతోటల వరుసలగుండా వెళ్లు. [QBR2] ద్రాక్షలతలన్నీ నరికివేయుము. (కాని వాటిని మొద్దులను నరికి నాశనం చేయ వద్దు). [QBR2] వాటి కొమ్మలన్నీ నరికివేయి. ఎందువల్లనంటే, ఈ తీగెలు యెహోవాకు చెందినవికావు. [†యూదా … చెందినవికావు ఇక్కడ ప్రవక్త యూదాను దాక్షతీగతో పోల్చుతున్నాడు.] [QBR]
యిర్మీయా 5 : 11 (ERVTE)
ఇశ్రాయేలు వంశీయులు, యూదా వంశీయులు [QBR2] ప్రతి విషయంలోనూ నాకు విశ్వాసఘాతుకంగా ఉన్నారు.” [QBR] ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చింది.
యిర్మీయా 5 : 12 (ERVTE)
“యెహోవా విషయంలో ఆ ప్రజలు అబద్ధమాడారు. [QBR] వారిలా అన్నారు: ‘యెహోవా మమ్మల్ని ఏమీ చేయడు. [QBR2] మాకు ఏ రకమైన కీడూ రాదు. [QBR2] మమ్మల్ని ఏ శత్రు సైన్యం ఎదిరించగా మేము చూడము. [QBR2] మేము ఆకలికి మాడిపోము.’ [QBR]
యిర్మీయా 5 : 13 (ERVTE)
తప్పుడు ప్రవక్తలు కేవలం వట్టి మాటలు పలుకువారు, [QBR2] దేవుని వాక్కు వారియందు లేదు. [QBR2] వారికి కీడు మూడుతుంది.”
యిర్మీయా 5 : 14 (ERVTE)
సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు తెలియజేసాడు: [QBR] “నేను వారిని శిక్షించనని ఆ ప్రజలు అన్నారు. [QBR] కావున యిర్మీయా, నేను నీకు చెప్పిన మాటలు అగ్నిలా ఉంటాయి. [QBR2] ఆ ప్రజలు కొయ్యలాంటివారు. [QBR] అగ్ని ఆ కట్టెనంతా దహించివేస్తుంది.” [QBR]
యిర్మీయా 5 : 15 (ERVTE)
ఓ ఇశ్రాయేలు వంశీయులారా, యెహోవా ఇలా చెప్పినాడు: [QBR] “మీ మీదికి బహు దూరంలో ఉన్న ఒక దేశాన్ని తీసుకొని వస్తున్నాను. [QBR] అది ఒక ప్రాచీన రాజ్యం [QBR2] అది ఒక శక్తివంతమైన రాజ్యం. [QBR] మీకు అర్థంకాని భాషను వారు మాట్లాడతారు. [QBR2] వారు చెప్పేది మీకు అర్థం కాదు. [QBR]
యిర్మీయా 5 : 16 (ERVTE)
వారి అమ్ముల పొదులు తెరచిన సమాధుల్లా వున్నాయి. [QBR2] వారంతా యోధనా యోధులు. [QBR]
యిర్మీయా 5 : 17 (ERVTE)
మీరు పండించిన పంటనంతా ఆ సైనికులు తినివేస్తారు. [QBR2] మీ ఆహారాన్నంతా వారు తినివేస్తారు. [QBR2] మీ కుమారులను, కుమార్తెలను వారు నాశనంచేస్తారు. [QBR] వారు మీ గొర్రెల మందలను, పశువుల మందలను తింటారు. [QBR2] మీ ద్రాక్షాపంటను, అంజూరపు చెట్లను వారు తింటారు. [QBR] కత్తులతో వారు మీ బలమైన నగరాలను నాశనం చేస్తారు. [QBR2] మీరు నమ్మి తల దాచుకున్న బలమైన నగరాలను వారు నాశనం చేస్తారు!”
యిర్మీయా 5 : 18 (ERVTE)
యెహోవా ఇలా చెపుతున్నాడు: [QBR] “కాని ఆ భయంకరమైన రోజులు వచ్చినప్పుడు, [QBR2] ఓ యూదా, నేను నిన్ను పూర్తిగా నాశనం కానివ్వను. [QBR]
యిర్మీయా 5 : 19 (ERVTE)
యూదా ప్రజలు నిన్ను, [QBR2] ‘యిర్మీయా, మా దేవుడైన యెహోవా మాకెందుకీ ఆపద తెచ్చిపెట్టాడు?’ అని అడుగుతారు. [QBR] అప్పుడు నీవు, [QBR] ‘ఓ యూదా ప్రజలారా, మీరు యెహోవాను విస్మరించారు. [QBR2] మీ స్వంత దేశంలోనే పరదేశాల వారి విగ్రహాలను పూజించారు. [QBR] మీరలా ప్రవర్తించారు గనుక [QBR2] ఇప్పుడు మీరు పరాయి రాజులను మీకు చెందని రాజ్యంలో సేవించవలసి ఉంది!’ అని సమాధానం చెప్పు.”
యిర్మీయా 5 : 20 (ERVTE)
యెహోవా ఇలా అన్నాడు: “యాకోబు వంశస్తులకు ఈ వర్తమానం అందజేయుము. [QBR2] యూదా రాజ్యానికి ఈ సమాచారం తెలియజేయుము. [QBR]
యిర్మీయా 5 : 21 (ERVTE)
బుద్ధిహీనులైన మూర్ఖుపు జనులారా ఈ వర్తమానం వినండి: [QBR2] మీకు కళ్లు ఉండికూడా చూడరు! [QBR2] మీకు చెవులు ఉండి కూడా వినరు! [QBR]
యిర్మీయా 5 : 22 (ERVTE)
నేనంటే మీరు నిజంగా భయపడటం లేదు.” [QBR] ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది [QBR] “మీరు నాముందు భయంతో కంపించాలి. [QBR2] సముద్రానికి తీరాన్ని ఏర్పరచిన వాడను నేనే. [QBR2] తద్వారా సముద్రజలాలు తమ పరిధిలో శాశ్వతంగా ఉండేలా చేశాను. [QBR2] అలల తాకిడికి సముద్రతీరం దెబ్బతినదు. [QBR2] అలలు ఘోషిస్తూ తీరాన్ని చేర తాయి, కాని అవి దానిని దాటిపోవు. [QBR]
యిర్మీయా 5 : 23 (ERVTE)
కాని యూదా ప్రజలు మొండి వైఖరి వహించారు. [QBR2] వారు నాకు వ్యతిరేకంగా తిరగటానికి అనేక మార్గాలు అన్వేషిస్తున్నారు. [QBR2] నాకు విముఖులై, నానుండి వారు దూరంగా పోయారు. [QBR]
యిర్మీయా 5 : 24 (ERVTE)
మనం మన దేవుడైన యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండాలని, [QBR2] ‘ఆయన మనకు శరత్కాల, వసంతకాల వర్షాలు సకాలంలో ఇస్తున్నాడనీ, [QBR2] ఆయన సకాలంలో, సవ్వంగా మనం పంటనూర్పిడి చేసుకొనేలా చేస్తున్నాడనీ’ [QBR2] యూదా ప్రజలు ఎన్నడూ అనుకోలేదు. [QBR]
యిర్మీయా 5 : 25 (ERVTE)
యూదా ప్రజలారా, మీరు చెడు చేశారు. అందువల్ల వర్షాలు లేవు; నూర్పిళ్లు లేవు. [QBR2] నీవు యెహోవా ఇచ్చే అనేక మంచి విషయాలను మీరు అనుభవించకుండా మీ పాపాలు అడ్డు పడుతున్నాయి. [QBR]
యిర్మీయా 5 : 26 (ERVTE)
నా ప్రజల మధ్య దుష్ట వ్యక్తులున్నారు. [QBR2] ఆ దుష్టులు పక్షులను పట్టటానికి వలలు పన్నే కిరాతకుల్లా [‡నా ప్రజల … కిరాతకుల్లా ఇక్కడ హెబ్రీ భాష బహు కష్టంగావుండి, భావం స్పష్టంగా అర్థం కాదు.] ఉన్నారు. [QBR] వారు తమ బోనులు సిద్ధంచేసి పొంచి వుంటారు. [QBR2] కాని వాళ్లు పక్షులకు బదులు మనుష్యులను పట్టుకుంటారు. [QBR]
యిర్మీయా 5 : 27 (ERVTE)
పంజరం నిండా పక్షులున్నట్లుగా, [QBR2] ఈ దుష్టుల ఇండ్ల నిండా అబద్దాలే! [QBR] వారి అబద్ధాలు వారిని ధనికులుగా, శక్తివంతులుగా చేశాయి. [QBR2]
యిర్మీయా 5 : 28 (ERVTE)
వారు చేసిన దుష్కార్యాల ద్వారా వారు బాగా ఎదిగి, కొవ్వెక్కినారు. [QBR] వారు చేసే అకృత్యాలకు అంతం లేదు. [QBR2] వారు అనాధ శిశువులు తరఫున వాదించరు. [QBR2] వారు అనాధలను అదుకోరు. [QBR2] వారు పేదవారికి న్యాయం జరిగేలా చూడరు. [QBR]
యిర్మీయా 5 : 29 (ERVTE)
వారు ఈ కృత్యాలన్నీ చేస్తున్నందుకు యూదా ప్రజలను నేను శిక్షించవద్దా?” [QBR] ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది. [QBR] “ఈ రకమైన దేశాన్ని నేను శిక్షించాలని నీకు తెలుసు. [QBR2] వారికి తగిన శిక్ష నేను విధించాలి.”
యిర్మీయా 5 : 30 (ERVTE)
యెహోవా ఇలా అన్నాడు, [QBR2] “యూదా రాజ్యంలో ఆశ్చర్య కలిగించే ఒక భయానక సంఘటన జరిగింది. అదేమంటే, [QBR]
యిర్మీయా 5 : 31 (ERVTE)
ప్రవక్తలు అబద్ధం చెప్పటం; [QBR] యాజకులు దేన్ని చేయుటకై ఎంచుకోబడ్డారో దానిని చేయరు [§యాజకులు … చేయరు ఇక్కడ హెబ్రీ భాష జటిలమైనది సులభగ్రాహ్యం కాదు.] [QBR2] నా ప్రజలు దానినే ఆదరించారు. [QBR] కానీ, ఓ ప్రజలారా చివరలో మీరు శిక్షకు [QBR2] గురియైన నాడు మీరేమి చేస్తారు?” [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

BG:

Opacity:

Color:


Size:


Font: