యిర్మీయా 9 : 1 (ERVTE)
నా తన నీటితో నిండియున్నట్లయితే, [QBR2] నా నేత్రాలు కన్నీటి ఊటలైతే హతులైన [QBR2] నా ప్రజల కొరకై నేను రాత్రింబవళ్లు దుఃఖిస్తాను!
యిర్మీయా 9 : 2 (ERVTE)
ప్రయాణీకులు రాత్రిలో తలదాచుకొనే ఇల్లు వంటి ప్రదేశం [QBR2] ఎడారిలో నాకొకటి ఉంటే [QBR] అక్కడ నా ప్రజలను వదిలి వేయగలను. [QBR2] వారినుండి నేను దూరంగా పోగలను! [QBR] ఎందువల్లనంటే వారంతా దేవునికి విధేయులై లేరు. [QBR2] వారంతా దేవునికి వ్యతిరేకులవుతున్నారు.
యిర్మీయా 9 : 3 (ERVTE)
“వారి నాలుకలను వారు విల్లంబుల్లా వినియోగిస్తున్నారు. [QBR2] వాటినుండి బాణాల్లా అబద్ధాలు దూసుకు వస్తున్నాయి. [QBR] సత్యం కాదు కేవలం అసత్యం దేశంలో ప్రబలిపోయింది. [QBR] వారు ఒక పాపం విడిచి మరో పాపానికి ఒడిగట్టుతున్నారు. [QBR2] వారు నన్నెరుగకున్నారు.” [QBR] ఈ విషయాలు యెహోవా చెప్పియున్నాడు.
యిర్మీయా 9 : 4 (ERVTE)
“మీ పొరుగు వారిని కనిపెట్టి ఉండండి! [QBR2] మీ స్వంత సోదరులనే మీరు నమ్మవద్దు! [QBR] ఎందువల్లనంటే ప్రతి సోదరుడూ మోసగాడే. [QBR2] ప్రతి పొరుగు వాడూ నీ వెనుక చాటున మాట్లాడేవాడే. [QBR]
యిర్మీయా 9 : 5 (ERVTE)
ప్రతివాడూ తన పొరుగువానితో అబద్ధములు చెప్పును. [QBR2] ఎవ్వడూ సత్యం పలుకడు. [QBR] యూదా ప్రజలు అబద్ధమాడుటలో [QBR2] తమ నాలుకలకు తగిన శిక్షణ ఇచ్చారు. [QBR] వారి పాపం ఆకాశమంత ఎత్తుకు చేరింది! [QBR]
యిర్మీయా 9 : 6 (ERVTE)
ఒక దుష్టకార్యాన్ని మరో దుష్టకార్యం అనుసరించింది. [QBR2] అబద్ధాలను అబద్ధాలు అనుసరించాయి! [QBR2] ప్రజలు నన్ను తెలుసుకోవటానికి నిరాకరించారు.” ఈ [QBR] విషయాలను యెహోవా చెప్పినాడు!
యిర్మీయా 9 : 7 (ERVTE)
కావున, సర్వశక్తిమంతుడైన దేవుడు ఇలా చెపుతున్నాడు, [QBR] “లోహాలను అగ్నిలో కాల్చి పరీక్ష చేసినట్లు నేను యూదా ప్రజలను తప్పకుండా పరీక్షిస్తాను! [QBR2] నాకు వేరే మార్గం లేదు. [QBR2] నా ప్రజలు పాపం చేశారు. [QBR]
యిర్మీయా 9 : 8 (ERVTE)
యూదా ప్రజలు వాడి బాణాల్లాంటి నాలుకలు కలిగి ఉన్నారు. [QBR2] వారి నార్లు అబద్ధాలనే మాట్లాడతాయి. [QBR] ప్రతివాడూ తన పొరుగు వానితో పైకి ఇంపుగానే మాట్లాడతాడు. [QBR2] కాని అతడు తన పొరుగు వానిని ఎదిరించటానికి రహస్య పథకాలు వేస్తాడు. [QBR]
యిర్మీయా 9 : 9 (ERVTE)
మరి యూదా ప్రజలు ఈ పనులన్నీ చేస్తున్నందుకు నేను వారిని శిక్షించవద్దా?” [QBR] “ఆ రకమైన ప్రజలను నేను శిక్షించాలని నీకు తెలుసు. [QBR2] నేను వారిని అర్హమైన శిక్ష విధించాలి.” [QBR] ఇది యెహోవా వాక్కు.
యిర్మీయా 9 : 10 (ERVTE)
నేను (యిర్మీయా) కొండల కొరకు మిక్కిలి దుఃఖిస్తాను. [QBR2] వట్టి పొలాల కొరకు నేను విషాద గీతాన్ని పాడతాను. [QBR2] ఎందువల్లనంటే జీవించివున్నవన్నీ పోయినాయి. [QBR] ఎవ్వడూ అక్కడ పయనించడు. [QBR2] ఆ ప్రదేషశాలలో పశువుల అరుపులు వినరావు. [QBR] పక్షులు ఎగిరి పోయాయి: [QBR2] పశువులు పారిపోయాయి.
యిర్మీయా 9 : 11 (ERVTE)
“నేను (యెహోవా నయిన) యెరూషలేము నగరాన్ని చెత్తకుప్పలాగున చేస్తాను. [QBR2] అది గుంట నక్కలకు [*గుంట నక్కలకు మనుష్య సంచారం లేనిచోట నివసించే, కుక్కను పోలిన ఒక అడవి జంతువు.] స్థావరమవుతుంది. [QBR] నేను యూదా రాజ్యపు నగరాలను నాశనం చేస్తాను. [QBR2] అందుచే అక్కడ ఎవ్వరూ నివసించరు.”
యిర్మీయా 9 : 12 (ERVTE)
ఈ విషయాలను అర్థం చేసుకోగల జ్ఞానవంతుడు ఎవడైనా ఉన్నాడా? [QBR2] యెహోవాచే బోధింపబడిన వాడెవడైనా ఉన్నాడా? [QBR] యెహోవా వార్త ఎవ్వడైనా వివరించగలడా? [QBR2] రాజ్యం ఎందువలన నాశనం చేయబడింది? [QBR2] జన సంచారంలేని వట్టి ఎడారిలా అది ఎందుకు మార్చివేయబడింది.
యిర్మీయా 9 : 13 (ERVTE)
యెహోవాయే ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. [QBR] ఆయన ఇలా చెప్పినాడు: “ఆ విధంగా జరుగుటకు కారణమేమంటే యూదా ప్రజలు నా మాట వినలేదు. [QBR] వారికి నా ఉపదేశములు ఇచ్చాను. [QBR2] కాని వారు వినటానికి నిరాకరించారు. [QBR2] వారు నా ఉపదేశములను అనుసరించుట విడిచారు. [QBR]
యిర్మీయా 9 : 14 (ERVTE)
యూదా ప్రజలు తమకు ఇష్టమొచ్చిన విధంగా వారు జీవించారు. [QBR2] వారు మొండివారు. [QBR] వారు బూటకపు దేవతైన బయలును అనుసరించారు. [QBR2] బూటకపు దేవుళ్లను అనుసరించుట వారికి వారి తండ్రులే నేర్పారు.”
యిర్మీయా 9 : 15 (ERVTE)
సర్వశక్తిమంతుడైన ఇశ్రాయేలు దేవుడు ఇలా చెపుతున్నాడు, [QBR] “యూదా ప్రజలు త్వరలో చేదైన ఆహారం తినేలా చేస్తాను. [QBR2] విషం కలిపిన నీరు తాగేలా చేస్తాను. [QBR]
యిర్మీయా 9 : 16 (ERVTE)
యూదా ప్రజలు ఇతర దేశాలలో చెల్లా చెదరైపోయేలా చేస్తాను. [QBR] వారు పరాయి రాజ్యాలలో నివసించవలసి వస్తుంది. [QBR2] వారు గాని, వారి తండ్రులు గాని ఆ రాజ్యాలను ముందెన్నడూ ఎరిగియుండలేదు. [QBR] కత్తులు చేతబట్టిన వారిని నేను పంపిస్తాను. [QBR2] యూదా ప్రజలను వారు చంపివేస్తారు. [QBR2] ప్రజలెవ్వరూ మిగలకుండా వారు చంపివేస్తారు.”
యిర్మీయా 9 : 17 (ERVTE)
సర్వాశక్తిమంతుడైన యెహోవా ఇలా అంటున్నాడు, [QBR] “ఇప్పుడు నీవీ విషయాల గురించి అలోచించుము! [QBR2] శవాలకు అంత్యక్రియలు జరిపించేటప్పుడు విలపించేందుకు సొమ్ము తీసుకొనే స్త్రీలను విలపించుము. [QBR2] కార్యములు నిర్వహించుటలో అనుభవమున్న వారిని పిలువనంపుము. [QBR]
యిర్మీయా 9 : 18 (ERVTE)
‘ఆ స్త్రీలను వెంటనే వచ్చి మాకొరకు విలపించమనండి. [QBR] అప్పుడు మా నేత్రాలు కన్నీటితో నిండిపోతాయి. [QBR2] కన్నీరు కాలువలై ప్రవహిస్తుంది’ అని ప్రజలంటారు.
యిర్మీయా 9 : 19 (ERVTE)
“సీయోను నుండి గట్టిగా విలపించే రోదన, [QBR2] ‘మేము నిజంగా నాశనమయ్యాము! [QBR2] మేము నిజంగా అవమానం పాలైనాము! [QBR] మా ఇండ్లు నాశనం చేయబడినాయి కావున మేము మా రాజ్యాన్ని వదిలి పోవాలి’ అంటూ వినిపిస్తూ ఉంది.”
యిర్మీయా 9 : 20 (ERVTE)
యూదా స్త్రీలారా, యెహోవా వర్తమానం మీరిప్పుడు వినండి. [QBR2] యెహోవా వాక్కు వినటానికి మీ చెవులనొగ్గండి. [QBR] యెహోవా ఇలా అంటున్నాడు, మీ కుమార్తెలకు గగ్గోలుగా విలపించటం ఎలానో నేర్పండి. [QBR2] ప్రతీ స్త్రీ ఈ విలాపగీతం పాడటం నేర్చుకోవాలి: [QBR]
యిర్మీయా 9 : 21 (ERVTE)
“మృత్యువు మా కిటికీలగుండా ఎక్కి లోనికి వచ్చింది. [QBR2] మృత్యువు మా భవనాలలో ప్రవేశించింది. [QBR] వీధుల్లో ఆడుకొంటున్న మా పిల్లల వద్దకు మృత్యువు వచ్చింది. [QBR2] బహిరంగ స్థలాలలో కలుసుకొనే యువకుల వద్దకు మృత్యువు వచ్చింది.”
యిర్మీయా 9 : 22 (ERVTE)
“యిర్మీయా, ‘ఇది యెహోవా వాక్కు అని చెప్పుము, [QBR] పొలాలలో పశువుల పేడలా శవాలు పడివుంటాయి. [QBR2] పంటకోత కాలంలో చేల నిండా వేసిన పనల్లా శవాలు భూమి మీద పడివుంటాయి [QBR2] కాని వాటిని తీసి వేయటానికి ఒక్కడూ ఉండడు.’ ”
యిర్మీయా 9 : 23 (ERVTE)
యెహోవా ఇలా చెపుతున్నాడు: [QBR] “తెలివిగల వారు తమ ప్రజ్ఞా విశేషాల గురించి [QBR2] గొప్పలు చెప్పుకోరాదు. [QBR] బలవంతులు తమ బలాన్ని గురించి [QBR2] గొప్పలు చెప్పుకోరాదు. [QBR] శ్రీమంతులు తమ ఐశ్వర్యాన్ని గూర్చి [QBR2] గొప్పలు చెప్పుకోరాదు. [QBR]
యిర్మీయా 9 : 24 (ERVTE)
ఎవడైనా గొప్పలు చెప్పుకోదలిస్తే వానిని ఈ విషయాలపై చెప్పుకోనిమ్ము. [QBR2] నన్నతను అర్థం చేసికున్నట్లు, నన్ను తెలుసుకున్నట్లు గొప్పలు చెప్పుకోనిమ్ము. [QBR] నేనే నిజమైన దేవుడనని తను అర్థం చేసికున్నట్లు గొప్పలు చెప్పుకోనిమ్ము. [QBR2] నేను దయామయుడనని, న్యాయవర్తనుడనని గొప్పలు చెప్పనియి. [QBR2] యెహోవానైన నేను భూమి మీద మంచి కార్యాలు నెరవేర్చు తానని గొప్పలు చెప్పనీయుము. [QBR2] నేను ఆ పనులన్నీ చేయటానికి యిష్టపడతాను.” [QBR] ఈ వర్తమానం యెహోవా వద్దనుండి వచ్చినది. [PS]
యిర్మీయా 9 : 25 (ERVTE)
ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది: “శారీరకంగా మాత్రమే సున్నతి సంస్కారం పొందిన వారిని నేను శిక్షించే సమయమాసన్న మవుతూ ఉంది.
యిర్మీయా 9 : 26 (ERVTE)
తమ చెంపలను కత్తిరించే ఈజిప్టు, యూదా, ఎదోము, అమ్మోను, మోయాబు ప్రజలు మరియు ఎడారిలో నివసించే జనులందరిని గూర్చి నేను మాట్లాడుతున్నాను. ఈ దేశాలలోని పురుషులు శారీరకంగా సున్నతి సంస్కారం పొందియుండలేదు. కాని ఇశ్రాయేలు కుటుంబం నుండి వచ్చిన ప్రజలు హృదయ సంబంధమైన సున్నతి సంస్కారం కలిగియుండలేదు.” [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26

BG:

Opacity:

Color:


Size:


Font: