లేవీయకాండము 19 : 1 (ERVTE)
మోషేతో యెహోవా ఇలా చెప్పాడు:
లేవీయకాండము 19 : 2 (ERVTE)
“ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: నేను మీ దేవుడైన యెహోవాను నేను పవిత్రుణ్ణి కనుక మీరునూ పవిత్రంగా ఉండాలి!
లేవీయకాండము 19 : 3 (ERVTE)
“మీలో ప్రతి ఒక్కరూ తన తల్లిని, తండ్రిని గౌరవించాలి, నా ప్రత్యేక విశ్రాంతి దినాలను పాటించాలి. నేను మీ దేవుడైన యెహోవాను.
లేవీయకాండము 19 : 4 (ERVTE)
“విగ్రహాలను పూజించకండి. మీకోసం అచ్చు వేసిన విగ్రహ దేవతలను చేసుకోవద్దు. నేనే మీ దేవుడైన యెహోవాను.”
లేవీయకాండము 19 : 5 (ERVTE)
“మీరు యెహోవాకు సమాధాన బలి అర్పించేటప్పుడు, మీరు స్వీకరించబడేందుకు దానిని అర్పించాలి.
లేవీయకాండము 19 : 6 (ERVTE)
మీరు దాన్ని అర్పించిన రోజున, ఆ మరునాడు దాన్ని తినవచ్చును. కానీ ఆ బలిలో ఏమైనా మూడో నాటికి మిగిలి ఉంటే దాన్ని మీరు అగ్నితో కాల్చివేయాలి.
లేవీయకాండము 19 : 7 (ERVTE)
బలిలోనిది ఏదైనా మూడో రోజున తింటే అది దారుణ పాపం. అది స్వీకరించబడదు.
లేవీయకాండము 19 : 8 (ERVTE)
అలా చేసే వ్యక్తి పాపం చేసిన అపరాధి అవుతాడు. ఎందు చేతనంటే యెహోవాకు చెందిన పవిత్ర విషయాలను అతడు గౌరవించలేదు కనుక ఆ వ్యక్తి తన ప్రజల్లోనుంచి వేరు చేయబడాలి.”
లేవీయకాండము 19 : 9 (ERVTE)
“కోతకాలంలో మీరు మీ పంటకోసేప్పుడు, మొత్తం మీ పొలాల మూలవరకు కోసెయ్యకండి. ఒకవేళ గింజలు ఏమైనా నేలమీద పడితే ఆ గింజలు మీరు ఏరుకోగూడదు.
లేవీయకాండము 19 : 10 (ERVTE)
మీ ద్రాక్షా తోటల్లో ద్రాక్షాపండ్లన్నీ ఏరుకోవద్దు. నేలమీద పడిన ద్రాక్షపండ్లను ఏరుకోవద్దు. ఎందుచేతనంటే, పేదవాళ్ళ కోసం, మీ దేశంగుండా ప్రయాణం చేసే వాళ్ళకోసమూ మీరు వాటిని విడిచిపెట్టాలి. నేను మీ దేవుడైన యెహోవాను.
లేవీయకాండము 19 : 11 (ERVTE)
“మీరు దొంగతనం చేయకూడదు. మీరు ప్రజల్ని మోసం చేయకూడదు. మీరు ఒకరితో ఒకరు అబద్ధం చెప్పకూడదు.
లేవీయకాండము 19 : 12 (ERVTE)
నా నామాన్ని ప్రయోగించి దొంగ వాగ్దానాలు చేయకూడదు. మీరు అలా చేస్తే, మీ దేవుని పేరుమీద మీకు భక్తి లేదని మీరు వ్యక్తంచేస్తారు. నేను యెహోవాను.
లేవీయకాండము 19 : 13 (ERVTE)
“మీ పొరుగువారికి మీరు కీడు చేయకూడదు. మీరు అతని దగ్గర దోచు కోగూడదు. కూలివాని కూలి మర్నాటి ఉదయం వరకు మీరు బిగబట్టి ఉంచకూడదు.”
లేవీయకాండము 19 : 14 (ERVTE)
“మీరు చెవిటివారిని శపించకూడదు. గుడ్డివారి యెదుట ఏదీ అడ్డముంచి వారిని పడిపోయే విధంగా చేయకూడదు. కాని నీవు దేవునికి భయపడాలి. నేను యెహోవాను.
లేవీయకాండము 19 : 15 (ERVTE)
“తీర్పు విషయంలో మీరు న్యాయంగా ఉండాలి. పేదవాళ్ళని చెప్పి ప్రత్యేకంగా పక్షపాతం చూపెట్టకూడదు. ప్రముఖులనీ పక్షపాతం చూపెట్ట కూడదు. మీ పొరుగు వారికి తీర్పు చెప్పేటప్పుడు మీరు న్యాయంగా ఉండాలి.
లేవీయకాండము 19 : 16 (ERVTE)
మీరు ఇతరులను గూర్చి తప్పడు కథలు వ్యాపింపజేస్తూ తిరగకూడదు. నీ పొరుగువాని ప్రాణానికి అపాయం కలిగించేది ఏదీ చేయవద్దు. నేను యెహోవాను.”
లేవీయకాండము 19 : 17 (ERVTE)
“నీ సోదరుణ్ణి నీ హృదయంలో కూడా నీవు ద్యేషించకూడదు. ఒకవేళ నీ పొరుగువాడు ఏదైనా తప్పు చేస్తే దాన్ని గూర్చి అతనితో మాట్లాడు. అయితే అతణ్ణి క్షమించు.
లేవీయకాండము 19 : 18 (ERVTE)
మనుష్యులు నీకు చేసిన కీడును మరచిపో. వారికి తిరిగి కీడు చేయాలని ప్రయత్నించకు. నిన్ను నీవు ప్రేమించుకొన్నట్టే నీ పొరుగువాణ్ణి ప్రేమించు. నేను యెహోవాను.”
లేవీయకాండము 19 : 19 (ERVTE)
“నా ఆజ్ఞలకు నీవు విధేయత చూపాలి. రెండురకాల పశువులను కలిసి సంతానోత్సత్తి చేయకూడదు. రెండు రకాల విత్తనాలు నీ పొలంలో నీవు చల్లకూడదు. రెండు రకాల మిశ్రమ దారాలతో నేయబడిన బట్టలు నీవు తొడగకూడదు.
లేవీయకాండము 19 : 20 (ERVTE)
“మరొకని బానిస స్త్రీతో ఒకడు లైంగిక సంబంధాలు పెట్టుకోవటం సంభవించవచ్చు. అయితే ఈ బానిస స్త్రీ డబ్బుతో ఖరీదు చేయబడలేదు, లేక స్వతంత్రమూ పొందలేదు. ఇలా గనుక జరిగితే వారికి శిక్ష విధించాలి. కానీ వారికి మరణ శిక్ష లేదు. ఎందుచేతనంటే ఆ స్త్రీ స్వతంత్రురాలు కాదు.
లేవీయకాండము 19 : 21 (ERVTE)
ఆ మగవాడు సన్నిధి గుడార ద్వారం దగ్గరకు అపరాధ పరిహారార్థ బలి అర్పణను తీసుకొని రావాలి. అపరాధ పరిహారార్థ బలిగా ఒక గొర్రెపొట్టేలును అతడు తీసుకొని రావాలి.
లేవీయకాండము 19 : 22 (ERVTE)
అతణ్ణి పవిత్రం చేసే కార్యాన్ని యాజకుడు జరిగిస్తాడు. ఆ పొట్టేలును అతడు చేసిన పాపం కోసం అపరాధ పరిహారార్థ బలిగా యెహోవా ఎదుట యాజకుడు అర్పించాలి. అప్పుడు అతడు చేసిన పాపం విషయంలో అతడు క్షమాపణ పొందుతాడు.
లేవీయకాండము 19 : 23 (ERVTE)
“ముందుకు మీరు మీ దేశంలో ప్రవేశిస్తారు. ఆ సమయంలో ఆహారంకోసం మీరు ఎన్నో రకాల చెట్లు నాటుతారు. ఒక చెట్టును నాటిన తర్వాత మూడు సంవత్సరాలవరకు ఆ చెట్టు ఫలం ఏదీ మీరు తినకూడదు. ఆ ఫలాన్ని మీరు ఉపయోగించకూడదు.
లేవీయకాండము 19 : 24 (ERVTE)
నాలుగో సంవత్సరం ఆ చెట్టు ఫలం యెహోవాదే అవుతుంది. అది యెహోవాకు పవిత్ర స్తుతి అర్పణ.
లేవీయకాండము 19 : 25 (ERVTE)
అప్పుడు అయిదో సంవత్సరం ఆ చెట్టు ఫలం మీరు తినవచ్చు. మరియు ఆ చెట్టు మీకు విస్తార ఫలాన్ని యిస్తుంది. నేను మీ దేవుడైన యెహోవాను.
లేవీయకాండము 19 : 26 (ERVTE)
“ఇంకా, రక్తం ఉన్నది. ఏదీ మీరు తినకూడదు. “భవిష్యత్తుగూర్చి ముందుగా చెప్పటానికి మంత్ర తంత్రాలు ఏవీ మీరు ఉపయోగించకూడదు.
లేవీయకాండము 19 : 27 (ERVTE)
“మీ తల చుట్టూ పెరిగే వెంట్రుకలను గుండ్రంగా క్షౌరం చేయకూడదు. మీ గడ్డం కొనలు కత్తిరించి వేయకూడదు.
లేవీయకాండము 19 : 28 (ERVTE)
చనిపోయిన వాళ్ల జ్ఞాపకార్థం మీరు మీ దేహాలను కోసుకోగూడదు. మీరు మీ ఒంటి మీద పచ్చలు పొడిపించుకోగూడదు. నేను మీ దేవుడైన యోహోవాను.”
లేవీయకాండము 19 : 29 (ERVTE)
“మీ కుమార్తెను వేశ్యగా మార్చవద్దు. అలా చేయటం ఆమెపై మీకు గౌరవం లేదని వ్యక్తం చేస్తుంది. మీ దేశంలో ప్రజల్ని వేశ్యలు కానీయవద్దు. అలాంటి పాపంతో మీ దేశాన్ని నిండనీయవద్దు.”
లేవీయకాండము 19 : 30 (ERVTE)
“నా ప్రత్యేక విశ్రాంతి దినాల్లో మీరు పని చేయకూడదు. నా పవిత్రస్థలాన్ని మీరు ఘనంగా చూడాలి. నేను యెహోవాను.”
లేవీయకాండము 19 : 31 (ERVTE)
“సలహాకోసం కర్ణపిశాచులు, సోదెగాళ్ల దగ్గరకు వెళ్లకూడదు. వాళ్ల దగ్గరకు వెళ్ళొద్దు, వారు మిమ్మల్ని అపవిత్రం చేస్తారు. నేను యెహోవాను, మీ దేవుణ్ణి.”
లేవీయకాండము 19 : 32 (ERVTE)
“వృద్ధులను గౌరవించండి. వారు గదిలోనికి వచ్చినప్పుడు లేచి నిలబడండి. మీ దేవునికి గౌరవం చూపెట్టండి. నేను యోహోవాను.
లేవీయకాండము 19 : 33 (ERVTE)
“మీ దేశంలో నివసిస్తున్న విదేశీయులకు కీడు చేయకండి.
లేవీయకాండము 19 : 34 (ERVTE)
మీ స్వంత పౌరులను గౌరవించినట్టే, విదేశీయుల్ని కూడా మీరు గౌరవించాలి. మిమ్మల్ని మీరు ఎలా ప్రేమించుకొంటారో విదేశీయుల్ని కూడా అలా ప్రేమించాలి. ఎందుచేతనంటే ఒకప్పుడు మీరూ ఈజిప్టులో విదేశీయులే. నేను మీ దేవుడైన యెహోవాను.”
లేవీయకాండము 19 : 35 (ERVTE)
“ప్రజలు తీర్పు తీర్చేటప్పుడు మీరు న్యాయంగా ఉండాలి. అలానే వస్తువుల్ని తూచేటప్పుడు, కొలిచేటప్పుడ మీరు న్యాయంగా ఉండాలి.
లేవీయకాండము 19 : 36 (ERVTE)
మీ తక్కెడలు సమానంగా ఉండాలి. మీ మొగ్గులు ద్రావకాలను సరిగ్గా నింపేవిగా ఉండాలి. మీ త్రాసులు, తూనికరాళ్లు వస్తువుల్ని సరిగ్గా తూచేవిగా ఉండాలి. నేను మీ దేవుడైన యెహోవాను. నేనే మిమ్మన్ని ఈజిప్టు దేశంనుండి బయటకు తీసుకొనివచ్చాను!
లేవీయకాండము 19 : 37 (ERVTE)
“నా ఆజ్ఞలు, నియమాలు అన్నీ మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. వాటికి మీరు విధేయులు కావాలి. నేను యెహోవాను!”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37

BG:

Opacity:

Color:


Size:


Font: