లూకా సువార్త 1 : 1 (ERVTE)
{యేసు జీవన చరిత్రను లూకా వ్రాయటం} [PS] గౌరవనీయులైన థెయొఫిలాకు: [PE][PS] మనలో జరిగిన సంఘటల్ని మొదటి నుండి కండ్లారా చూసి, దైవ సందేశాన్ని బోధించిన వాళ్ళు మనకు వాటిని అందించారు.
లూకా సువార్త 1 : 2 (ERVTE)
(2-3) వీటన్నిటినీ నేను మొదట నుండి క్షుణ్ణంగా పరిశోధించాను కనుక నాకు కూడా వీటన్నిటిని క్రమపద్ధతిలో వ్రాసి మీకు అందించటం ఉత్తమమనిపిం చింది.
లూకా సువార్త 1 : 3 (ERVTE)
లూకా సువార్త 1 : 4 (ERVTE)
మీరు నేర్చు కొన్నవి నిజమని మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ గ్రంథం మీకోసం వ్రాస్తున్నాను. [PS]
లూకా సువార్త 1 : 5 (ERVTE)
{జెకర్యా మరియు ఎలీసబేతు} [PS] హేరోదు [*హేరోదు యూదయకు రాజైన హేరోదు, క్రి.పూ. 40-4.] రాజు యూదయను పాలించే కాలంలో జెకర్యా అనే ఒక యాజకుడు ఉండేవాడు. ఇతడు అబీయా [†అబీయా యూదా యాజకుల 24 శాఖలలో ఒకటి ఇది. 1 దినవృ. 24 చూడండి.] అనబడే యాజక శాఖకు చెందినవాడు. ఇతని భార్య అహారోను శాఖకు చెందినది. ఆమె పేరు ఎలీసబెతు.
లూకా సువార్త 1 : 6 (ERVTE)
ఈ దంపతులు యధార్థంగా, దేవునికి ప్రీతికరంగా నుడుచుకుంటూ ప్రభువు ఆజ్ఞల్ని పాటిస్తూ ఏ అపకీర్తి లేకుండా నిష్టాపరులై జీవించే వాళ్ళు,
లూకా సువార్త 1 : 7 (ERVTE)
ఎలీసబెతు గొడ్రాలు. పైగా వాళ్ళిద్దరూ వయస్సు మళ్ళిన వాళ్ళు. వాళ్ళకు సంతానం కలుగలేదు. [PE][PS]
లూకా సువార్త 1 : 8 (ERVTE)
తన శాఖకు చెందిన వాళ్ళు చేయవలసిన వంతు రావటంవల్ల జెకర్యా యాజక పనులు చేస్తూ ఉన్నాడు.
లూకా సువార్త 1 : 9 (ERVTE)
దేవాలయంలో దేవునికి ధూపం వేయటానికి వాడుక ప్రకారం చీట్లు వేసి జెకర్యాను ఎన్నుకున్నారు.
లూకా సువార్త 1 : 10 (ERVTE)
అతడు ధూపం వేస్తుండగా బయట సమావేశమైన భక్తులు ప్రార్థిస్తున్నారు. [PE][PS]
లూకా సువార్త 1 : 11 (ERVTE)
ధూపవేదికకు కుడివైపున జెకర్యాకు ఒక దేవదూత ప్రత్యక్షం అయ్యాడు.
లూకా సువార్త 1 : 12 (ERVTE)
జెకర్యా అతణ్ణి చూడగానే ఉలిక్కి పడ్డాడు. అతనికి భయం వేసింది.
లూకా సువార్త 1 : 13 (ERVTE)
దేవదూత అతనితో, “జెకర్యా భయపడకు. దేవుడు నీ ప్రార్థనలు విన్నాడు. నీ భార్య ఎలీసబెతు ఒక మగశిశువును కంటుంది. ఆ పిల్లవానికి యోహాను అని నామకరణం చెయ్యి.
లూకా సువార్త 1 : 14 (ERVTE)
ఇతని పుట్టుక వల్ల నీవు చాలా ఆనందిస్తావు. నీవేకాక ప్రజలందరూ ఆనందిస్తారు.
లూకా సువార్త 1 : 15 (ERVTE)
అతడు ఆధ్యాత్మికతతో గొప్పవాడౌతాడు. దేవుడతని గొప్పతనం చూసి ఆనందిస్తాడు. అతడు ద్రాక్షారసం కాని, లేక యితర రకములైన మద్యపానాల్ని కాని ముట్టడు. పుట్టినప్పటి నుండే అతనిలో పవిత్రాత్మ [‡పవిత్రాత్మ ఈయన దైవత్వంలో మూడవ వ్యక్తి. ఈయన్ని దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ, ఆదరణ కర్త అని కూడా అంటారు. ఈయన లోకంలో జనులు మధ్య దైవ కార్యాన్ని చేస్తాడు.] ఉంటాడు. [PE][PS]
లూకా సువార్త 1 : 16 (ERVTE)
“ఇశ్రాయేలు ప్రజల ప్రభువైన దేవుని దగ్గరకు యితడు చాలా మంది ప్రజల్ని తీసుకు వస్తాడు.
లూకా సువార్త 1 : 17 (ERVTE)
తండ్రుల హృదయాలను పిల్లల వైపు మళ్ళించటానికి, దేవుణ్ణి నమ్మని వాళ్ళను నీతిమంతుల జ్ఞానం సంపాదించేటట్లు చెయ్యటానికి, ప్రభువు రాకకు ప్రజల్ని సిద్ధపరచటానికి ఇతడు ఏలియాలో [§ఏలీయా క్రి.పూ. 850 లో జీవించిన ప్రవక్త.] ఉన్న ఆత్మ బలంతో ప్రభువు కన్నా ముందుగా వెళ్తాడు” అని అన్నాడు. [PE][PS]
లూకా సువార్త 1 : 18 (ERVTE)
జెకర్యా దేవదూతతో, “మీరన్న విధంగా జరుగుతుందన్నదానికి నిదర్శన మేమిటి? నేను ముసలి వాణ్ణి. నా భార్యకు కూడా వయస్సు మళ్ళింది” అని అన్నాడు. [PE][PS]
లూకా సువార్త 1 : 19 (ERVTE)
దేవదూత ఈ విధంగా సమాధానం చెప్పాడు: “నా పేరు గాబ్రియేలు. నేను దేవుని దూతను. నీతో మాట్లాడి నీకి సువార్త చెప్పుమని దేవుడు నన్ను పంపాడు.
లూకా సువార్త 1 : 20 (ERVTE)
జాగ్రత్త! నీవు నా మాటలు నమ్మటం లేదు కనుక మూగవాడవై పోతావు. తగిన సమయం వచ్చాక నా మాటలు నిజమౌతాయి. అంతవరకు నీకు మాటలు రావు.” [PE][PS]
లూకా సువార్త 1 : 21 (ERVTE)
బయట ప్రజా సమూహం జెకర్యా దేవాలయంలో యింతవరకు ఎందుకున్నాడో అని ఆశ్చర్యంతో అతని కోసం కాచుకొని ఉన్నారు.
లూకా సువార్త 1 : 22 (ERVTE)
జెకర్యా వెలుపలికి వచ్చాడు. కాని వాళ్ళతో మాట్లాడలేక పోయాడు. ఏమీ మాట్లాడలేక సంజ్ఞలు చెయ్యటం వల్ల దేవాలయంలో అతనికి దివ్య దర్శనం కలిగినదని అక్కడున్న వాళ్ళు గ్రహించారు.
లూకా సువార్త 1 : 23 (ERVTE)
సేవా దినములు ముగిసాక అతడు తన యింటికి వెళ్ళిపోయాడు. [PE][PS]
లూకా సువార్త 1 : 24 (ERVTE)
కొన్ని రోజుల తర్వాత అతని భార్య ఎలీసబెతు గర్భవతి అయింది. ఐదు నెలల దాకా ఆమె గడపదాటలేదు.
లూకా సువార్త 1 : 25 (ERVTE)
“ప్రభువు ఈ దశలో నాకీ గర్భం యిచ్చి నన్ను అనుగ్రహించాడు; నలుగురిలో నాకున్న అవమానం తొలగించాడు” అని ఆమె అన్నది. [PS]
లూకా సువార్త 1 : 26 (ERVTE)
{యేసు జన్మిస్తాడని ప్రవచనం} [PS] ఎలీసబెతు ఆరు నెలల గర్భంతో ఉంది. అప్పుడు దేవుడు గాబ్రియేలు అనే దేవదూతను గలిలయలోని నజరేతు అనే పట్టణంలో ఉన్న ఒక కన్య దగ్గరకు పంపాడు.
లూకా సువార్త 1 : 27 (ERVTE)
దావీదు వంశస్థుడైన యోసేపు అనే వ్యక్తితో ఈ కన్యకు పెళ్ళి నిశ్చయమైంది. ఈ కన్య పేరు మరియ.
లూకా సువార్త 1 : 28 (ERVTE)
ఈ దేవదూత ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెతో, “నీకు శుభం కలుగుగాక! ప్రభువు నిన్ను అనుగ్రహించాడు. ఆయన నీతో ఉన్నాడు” అని అన్నాడు. [PE][PS]
లూకా సువార్త 1 : 29 (ERVTE)
దేవదూత మాటలు విని మరియ కంగారు పడి ఇతని దీవెనకు అర్థమేమిటా అని ఆశ్చర్యపడింది. [PE][PS]
లూకా సువార్త 1 : 30 (ERVTE)
ఇది చూసి దేవదూత ఆమెతో యిలా అన్నాడు: “భయపడకు మరియా! దేవుడు నిన్ను అనుగ్రహించాడు.
లూకా సువార్త 1 : 31 (ERVTE)
నీవు గర్భం దాల్చి మగ శిశువును కంటావు. ఆయనకు యేసు అని పేరు పెట్టు.
లూకా సువార్త 1 : 32 (ERVTE)
ఆయన చాలా గొప్ప వాడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడని పిలువబడతాడు. ప్రభువైన దేవుడు ఆయన పూర్వికుడైన దావీదు సింహాసనాన్ని ఆయనకు యిస్తాడు.
లూకా సువార్త 1 : 33 (ERVTE)
యాకోబు వంశానికి చెందిన వాళ్ళందర్ని ఈయన చిరకాలం పాలిస్తాడు. ఆయన రాజ్యం ఎన్నటికీ అంతరించదు.” [PE][PS]
లూకా సువార్త 1 : 34 (ERVTE)
“నా కింకా పెండ్లి కాలేదే! ఇది ఎట్లా సాధ్యమవుతుంది?” అని మరియ దేవదూతను అడిగింది. [PE][PS]
లూకా సువార్త 1 : 35 (ERVTE)
ఆ దేవదూత ఈ విధంగా సమాధానం చెప్పాడు: “పవిత్రాత్మ నీ మీదికి వచ్చునప్పుడు సర్వోన్నతుడైన దేవుని శక్తి నిన్ను ఆవరిస్తుంది. అందువలన నీకు పుట్టబోయే శిశువు పవిత్రంగా ఉంటాడు. ఆ శిశువు దేవుని కుమారుడని పిలువబడతాడు.
లూకా సువార్త 1 : 36 (ERVTE)
నీ బంధువు ఎలీసబెతు తన వృద్ధాప్యంలో తల్లి కాబోతోంది. గొడ్రాలని పిలవబడే ఆమె యిప్పుడు ఆరు నెలల గర్భంతో ఉంది.
లూకా సువార్త 1 : 37 (ERVTE)
దేవునికి సాధ్యం కానిది ఏదీ లేదు.” [PE][PS]
లూకా సువార్త 1 : 38 (ERVTE)
మరియ, “నేను దేవుని సేవకురాలను. మీరన్న విధంగానే జరుగనీ!” అని సమాధానం చెప్పింది. ఆ తర్వాత దేవదూత వెళ్ళిపోయాడు. [PS]
లూకా సువార్త 1 : 39 (ERVTE)
{మరియ ఎలీసబెతును కలుసుకోవటం} [PS] మరియ వెంటనే యూదా పర్వత ప్రాంతం లోని ఒక గ్రామానికి వెళ్ళటానికి ప్రయాణమైంది.
లూకా సువార్త 1 : 40 (ERVTE)
ఆ గ్రామంలోనున్న జెకర్యా యింటికి వెళ్ళి ఎలీసబెతును కలుసుకొని ఆమె క్షేమ సమాచారాలు అడిగింది.
లూకా సువార్త 1 : 41 (ERVTE)
ఎలీసబెతు ఆమె మాటలు విన్న తక్షణమే, ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసాడు. ఎలీసబెతు పవిత్రాత్మతో నిండిపోయింది. [PE][PS]
లూకా సువార్త 1 : 42 (ERVTE)
ఆమె బిగ్గరగా, “దేవుడు ఏ స్త్రీని దీవించనంతగా నిన్ను దీవించాడు. అదే విధంగా నీ గర్భంలో నున్న శిశువు కూడా ధన్యుడు.
లూకా సువార్త 1 : 43 (ERVTE)
కాని దేవుడు నా మీద యింత దయ ఎందుకు చూపుతున్నాడు. నా ప్రభువు తల్లి నా దగ్గరకు రావటమా?
లూకా సువార్త 1 : 44 (ERVTE)
నీ మాటలు నా చెవిలో పడగానే నా గర్భంలో ఉన్న శిశువు ఆనందంతో గంతులు వేశాడు.
లూకా సువార్త 1 : 45 (ERVTE)
ప్రభువు చెప్పినట్లు జరుగుతుందని విశ్వసించావు. ధన్యురాలవు” అని అన్నది. [PS]
లూకా సువార్త 1 : 46 (ERVTE)
{మరియ పాడిన భక్తి గీతం} [PS] మరియ ఈ విధంగా అన్నది:
లూకా సువార్త 1 : 47 (ERVTE)
“నా ఆత్మ ప్రభువును కొలిచింది. [QBR2] దేవుడు చేసిన ఈ మంచికి నా మనస్సు ఆనందం పొందింది. ఆయనే నా రక్షకుడు. [QBR]
లూకా సువార్త 1 : 48 (ERVTE)
దీనురాల్ని నేను! [QBR2] ఆయన దాసీని నేను, నన్ను కరుణించాడు! [QBR] ఇకనుండి అందరూ [QBR2] నన్ను ధన్యురాలంటారు! [QBR]
లూకా సువార్త 1 : 49 (ERVTE)
దేవుడు సర్వశక్తి సంపన్నుడు. [QBR2] ఆయన నాకు ఎంతో మంచి చేశాడు! ఆయన నామం పవిత్రం! [QBR]
లూకా సువార్త 1 : 50 (ERVTE)
తనంటే భయపడే వాళ్ళపై తరతరాలు దయ చూపుతాడు. [QBR]
లూకా సువార్త 1 : 51 (ERVTE)
తన బలమైన హస్తాన్ని జాపి [QBR2] గర్వించే వాళ్ళను వాళ్ళ ఆలోచనల్ని అణిచి వేస్తాడు. [QBR]
లూకా సువార్త 1 : 52 (ERVTE)
రాజుల్ని, వాళ్ళ సింహాసనాల నుండి దింపి వేస్తాడు. [QBR2] దీనులకు గొప్ప స్థానాలిస్తాడు. [QBR]
లూకా సువార్త 1 : 53 (ERVTE)
పేదవాళ్ళ అవసరాలన్నీ తీరుస్తాడు. [QBR2] ధనవంతుల్ని వట్టి చేతుల్తో పంపేస్తాడు. [QBR]
లూకా సువార్త 1 : 54 (ERVTE)
తరతరాల నుండి మన పూర్వీకులతో, అబ్రాహాముతో, [QBR2] అతని సంతతితో చెప్పినట్లు [QBR]
లూకా సువార్త 1 : 55 (ERVTE)
దేవుని ఇష్టానుసారం జీవించిన ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేశాడు. మరవకుండా వాళ్ళపై దయ చూపాడు.” [PS]
లూకా సువార్త 1 : 56 (ERVTE)
మరియ ఎలీసబెతు యింట్లో మూడు నెలలుండి, ఆ తర్వాత యింటికి తిరిగి వెళ్ళిపోయింది. [PS]
లూకా సువార్త 1 : 57 (ERVTE)
{యోహాను జన్మ వృత్తాంతం} [PS] ఎలీసబేతుకు నెలలు నిండి మగశిశువును ప్రసవించింది.
లూకా సువార్త 1 : 58 (ERVTE)
బంధువులు మరియు ఇరుగు పొరుగు వాళ్ళు ప్రభువు ఆమెను కనికరించినందుకు ఆనందించారు. [PE][PS]
లూకా సువార్త 1 : 59 (ERVTE)
ఎనిమిదవ రోజు వాళ్ళు పిల్లవానికి సున్నతి చేయటానికి వచ్చి అతనికి జెకర్యా అని అతని తండ్రి పేరే పెట్టబోయారు.
లూకా సువార్త 1 : 60 (ERVTE)
కాని తల్లి వారిస్తూ, “ఆ పేరు వద్దు! యోహాను అని పేరు పెట్టండి” అని అన్నది. [PE][PS]
లూకా సువార్త 1 : 61 (ERVTE)
వాళ్ళు, “మీ బంధువుల్లో ఆ పేరున్న వాళ్ళు ఎవ్వరూ లేరే?” అని అన్నారు.
లూకా సువార్త 1 : 62 (ERVTE)
ఆ పిల్లవాని తండ్రికి సంజ్ఞలు చేసి అతడే పేరు పెట్టదలచాడో అని అడిగారు. [PE][PS]
లూకా సువార్త 1 : 63 (ERVTE)
అతడు వ్రాయటానికి ఒక పలక నివ్వమని అడిగి దానిపై, “అతనికి యోహాను అని పేరు పెట్టండి” అని వ్రాసాడు. ఇది చూసి అంతా ఆశ్చర్యపోయారు.
లూకా సువార్త 1 : 64 (ERVTE)
వెంటనే అతని నోరు, నాలుక కదిలి బాగైపోయింది. అతడు దేవుణ్ణి స్తుతిస్తూ మాట్లాడటం మొదలు పెట్టాడు.
లూకా సువార్త 1 : 65 (ERVTE)
ఇరుగు పొరుగు వాళ్ళలో భక్తి, భయమూ నిండుకుపొయ్యాయి. యూదయ పర్వత ప్రాంతమంతా ఈ వార్త వ్యాపించింది.
లూకా సువార్త 1 : 66 (ERVTE)
ఈ విషయం విన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడి, “ఈ పసివాడు ఎంతగొప్పవాడౌతాడో కదా!” అని అన్నారు. ఆ బాలునికి ప్రభువు హస్తం తోడుగా ఉంది. [PS]
లూకా సువార్త 1 : 67 (ERVTE)
{జెకర్యా చెప్పిన భవిష్యం} [PS] ఆ బాలుని తండ్రి జెకర్యా పవిత్రాత్మతో నింపబడి దేవుని సందేశాన్ని ఈ విధంగా చెప్పాడు:
లూకా సువార్త 1 : 68 (ERVTE)
“తన ప్రజలకు స్వేచ్ఛ కలిగించి, రక్షించ వచ్చిన ప్రభువును స్తుతించండి! [QBR2] ఇశ్రాయేలు ప్రజల దేవుణ్ణి స్తుతించండి! [QBR]
లూకా సువార్త 1 : 69 (ERVTE)
మహాశక్తిగల రక్షకుణ్ణి తన సేవకుడైన దావీదు వంశం నుండి [QBR2] మనకోసం పంపాడు. [QBR]
లూకా సువార్త 1 : 70 (ERVTE)
గతంలో మహాత్ములైన ప్రవక్తల ద్వారా [QBR2] ఈ విషయం చెప్పాడు. [QBR]
లూకా సువార్త 1 : 71 (ERVTE)
దేవుడు శత్రువుల బారినుండి, [QBR2] మనలను ద్వేషించేవారినుండి మనల్ని రక్షిస్తాడు. [QBR]
లూకా సువార్త 1 : 72 (ERVTE)
మన తండ్రులను, తాత ముత్తాతలను కరుణిస్తానన్నాడు. [QBR2] పవిత్రమైన ఒడంబడిక మరిచి పోనన్నాడు! [QBR]
లూకా సువార్త 1 : 73 (ERVTE)
శత్రువుల బారినుండి రక్షిస్తానని మన తండ్రి అబ్రాహాముతో ప్రమాణం చేశాడు. [QBR2]
లూకా సువార్త 1 : 74 (ERVTE)
మనం ఏ భయం లేకుండా తనను సేవించాలి. [QBR2]
లూకా సువార్త 1 : 75 (ERVTE)
జీవితాంతం పవిత్రంగా, ధర్మంగా, తన కోసం జీవించాలని ఆయన ఉద్దేశ్యం!
లూకా సువార్త 1 : 76 (ERVTE)
“ఓ శిశువా! నీవు సర్వోన్నతుని ప్రవక్తవని పిలువబడతావు! [QBR2] ప్రభువు కన్నా ముందు వెళ్ళి ప్రభువు రాకకు మార్గం వేస్తావు! [QBR]
లూకా సువార్త 1 : 77 (ERVTE)
పాపక్షమాపణ ద్వారా రక్షణ కలుగుతుందన్న జ్ఞానాన్ని ఆయన ప్రజలకు బోధిస్తావు!
లూకా సువార్త 1 : 78 (ERVTE)
“మన దేవుడు తన కనికరంవల్ల పరలోకం నుండి [QBR2] ఒక నీతిసూర్యుణ్ణి పంపించి, [QBR]
లూకా సువార్త 1 : 79 (ERVTE)
మరణమనే చీకటి నీడలో నివసించే మనపై ప్రకాశించునట్లు చేసి [QBR] మనల్ని శాంతి మార్గంలో నడిపిస్తాడు!” [PS]
లూకా సువార్త 1 : 80 (ERVTE)
ఆ బాలుడు పెరిగి పెద్దవాడై ఆత్మలో బలం పొందాడు. ఇశ్రాయేలు ప్రజలకు బోధించే సమయం వచ్చే దాకా యోహాను ఎడారుల్లో జీవించాడు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80

BG:

Opacity:

Color:


Size:


Font: